Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

తిరగబడనున్న మోదీ`షాల బండి

అరుణ్‌ శ్రీ వాస్తవ

ప్రధాని నరేంద్ర మోదీ ఆకర్షణశక్తి వేగంగా పడిపోతోందని ప్రజలు భావిస్తున్నారు. గతంలో బీజేపీలో చేరాలని తహతహలాడిన అనేకమంది నాయకులు ఇప్పుడు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. 2024లో లోకసభకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్‌లో చేరేందుకు చాలామంది నాయకులు సిద్ధపడుతున్నారు. దీంతో మోదీషాల బండి తిరగబడేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. తమ రాజకీయ భవిష్యత్‌ కాంగ్రెస్‌తో ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు. దీంతో మోదీషాల ప్రణాళిక బోల్తా పడనున్నది. బీజేపీలోనే కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్‌ గోవిందా అని అనేకమంది ఆందోళన చెందుతున్నారు. ఏదో మాయచేసి మోదీ తిరిగి అధికారానికి వస్తారా అని కొందరు సందేహపడుతున్నారు. ఇదే జరిగితే అప్పుడు కొత్తగా భక్తులబృందం తయారుకావచ్చు. జనసంఫ్‌ు 1980లో బీజేపీగా అవతరించిన తర్వాత మొదటిసారిగా పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లిపోనున్నారని అంచనా. గతంలో ఏనాడు ఇలాంటి పరిస్థితిని పార్టీ ఎదుర్కోలేదని భావిస్తున్నారు. ఇప్పటి పరిస్థితిపై సీనియరు నాయకులు నోరువిప్పే సాహసం చేయడంలేదు. వీరి సలహాలను ఎవరూ కోరడంలేదు. ఉన్నతస్థాయిలో నిర్ణయాలు తీసుకునేవారు చేస్తున్న తప్పులను కూడా సీనియర్లు ప్రస్తావించకుండా మౌన ప్రేక్షకులుగా ఉన్నారు. ఒకనాటి కాంగ్రెస్‌లో నెలకొన్న పార్టీ గ్రూపులు, తగాదాలు, గొడవలు నేడు బీజేపీలో బలపడడానికి మోదీషాలే కారణమన్న అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ నాయకత్వాన్ని మోదీషాలు స్వీకరించడానికి ముందు అంతర్గత ప్రజాస్వామ్యం ఉండేది. ఇప్పుడీపదానికి విలువ లేకుండా పోయింది. అసలు ఆచరణేలేదు. తాము ఉన్న పార్టీలకు ద్రోహంచేసి బీజేపీలో చేరినవారు దాదాపు అన్ని రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వాన్ని చేజిక్కించుకున్నారన్న అభిప్రాయం, నిరసన ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌, బిహార్‌, అసోం, కర్ణాటక, యూపీ, మహారాష్ట్రలలో కొంతమేరకు బయటివాళ్లు కీలకస్థానాలు దక్కించుకున్నారని అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. సీనియరు నాయకులు, పార్టీకి కట్టుబడి ఉన్న వాళ్లకు ప్రాధాన్యతలేదు. వీళ్లమాట వినేవారులేరు.
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యర్తలు, పార్టీ నాయకుల పరిస్థితి ఏమీ బాగాలేదంటున్నారు. అంతేకాదు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో విశ్వసించదగిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను పక్కకుపెట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్లు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. బీజేపీతో సమన్వయం దెబ్బతినిపోయింది. రాష్ట్రస్థాయి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు కూడా మోహన్‌ భగవత్‌ మౌనంగా ఉండటంపై ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మోదీషాల చర్యలను భగవత్‌ సానుకూలంగా చూస్తూ ఉన్నారని అభిప్రాయ పడుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఈ ప్రశ్న చర్చనీయాంశంగా ఉంది. మోదీషాలంటే భగవత్‌ భయపడుతున్నారన్న అభిప్రాయం కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియరు నాయకులలో ఉంది. భయంగాకపోతే సంఫ్‌ు నియమాలు పాటించాలని మోదీషాలను ఎందుకు ఆదేశించడంలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. మౌనంగా ఉంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను దెబ్బతీస్తుందని కూడా అనుకుంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను దెబ్బతీస్తుందని కూడా అనుకుంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కోరిక హిందూరాష్ట్ర ఏర్పాటుకు, మోదీ ప్రణాళికను ముందుకు తీసుకువెళుతున్నారని, అయితే ఆయన అనుసరించే ప్రతీకార రాజకీయాలు బీజేపీ పునాదిని క్షీణిస్తోందని అంటున్నారు. ఈ ఏడాది చివరకు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో బీజేపీ అంతర్గత తగాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మోదీషాలు కలిసి నష్టనివారణకు కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ తిరుగుబాటు దారులు మాటవినడంలేదు. తలెత్తుతున్న పరిస్థితులు బాగా ఆందోళన పరుస్తున్నాయి. భక్తులు, విధేయులు బహిరంగంగా విమర్శించకపోయినా టెలివిజన్‌లలో ఇచ్చే సూచనలు పెద్దగా పనిచేయడం లేదు. తిరుగుబాటు దారులపై చర్యలు తీసుకోవడం కూడా క్లిష్టంగా మారింది. భగవత్‌ తోడ్పాటున్నందున సిద్ధాంతపరమైన భావజాలానికి గుర్తింపు గురించి ఆలోచించవలసిన పనిలేదని మోదీ`షాలు భావిస్తున్నారు. ఎన్నికలు కొన్నినెలల్లో జరగనున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌లలో సంస్థాగత సమస్యలు, గ్రూపులు మధ్య తగాదాలు మరింత పెరిగాయి. మధ్యప్రదేశ్‌ ఇప్పటికే అనేకమంది ప్రముఖ నాయకులు, బీజేపీ విధేయులు పార్టీనుండి బైటకు వెళ్లిపోయారు. జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో కాంగ్రెస్‌ను విడిచిపెట్టినవారిలో అత్యధికులు తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయారు. మధ్యప్రదేశ్‌ బీజేపీ కనీసం మూడు గ్రూపులు తగాదా పడుతున్నాయి. ఈ గ్రూపులకు సింధియా, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, మోదీ భక్తులు నాయకత్వం వహిస్తున్నారు.
ఎన్నికల కమిషన్‌ షెడ్యూలు విడుదల చేయకముందే మధ్యప్రదేశ్‌లో బీజేపీ పోటీచేసే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాో విధేయులను పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యతనిచ్చారు. దీంతో అనేకమంది భక్తులుసైతం నెలక్రితమే పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్‌లో చేరిపోయారు. మోదీని లెక్కచేయకుండా విధేయులు పార్టీని విడిచిపెడుతున్నారు. రాజస్థాన్‌లో వసుంధర రాజే సింధియా ప్రత్యర్థులు మోదీయే గ్రూపులకు కారణమని ఆరోపిస్తున్నారు. ఆయన విధేయులైన గజేంద్రసింగ్‌ షెకావత్‌, లోకసభ స్పీకరు ఓం బిర్లా, కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ కొత్త నాయకులుగా ముందుకువచ్చారు. వీరంతా విజయరాజే సింధియా తిరిగి ప్రముఖ నాయకురాలిగా రాజకీయ రంగంలోకి రాకూడదని గట్టిగా భావిస్తున్నారు. కొంతమంది మాత్రం విజయరాజేసింధియా ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలని కోరుతున్నారు. ఇతర గ్రూపులు ఆమెను వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీలో ఆమె పేరులేదు. బిహార్‌లో పూర్వపు విధేయులపై ఆధారపడకుండా ఒక బృందాన్ని ఏర్పాటుచేశారు. తరచుగా పార్టీలుమారే సామ్రాట్‌ చౌదరిపై ఆధారపడాలని కేంద్రనాయకత్వం భావిస్తోంది. పాతతరం నాయకులు వీరికి వ్యతిరేకంగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. చత్తీస్‌ఘడ్‌లో పరిస్థితి భిన్నంగాలేదు. మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను కాదని కొత్తవాళ్లకు బాధ్యత అప్పగించారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు 77ఏళ్ల గల నందసాయి 1980 నుంచి బీజేపీలో ఉన్నారు. ఆయన గిరిజన నాయకుడిగా ఉన్నారు. ఆయన నాలుగురోజుల క్రితమే ఇక పశ్చిమబెంగాల్‌లో విధేయులను పక్కనపెట్టి, పార్టీ మాజీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌కు ఎన్నికల బాధ్యత అప్పగించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి వచ్చిన సువేందుపై అవినీతిపరుడన్న పేరుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img