Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

తెలంగాణలో నరహంతకుడు ఖాసిం రజ్వీ

డాక్టర్‌ దేవరాజు మహారాజు

హడావుడిగా పాకిస్థాన్‌కు పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉండగాఖాసీం రజ్వీ భారత ప్రభుత్వానికి దొరికిపోయాడు. అరాచకాలు చేయమని ఉసిగొల్పిన నిజాం, భారత ప్రభుత్వరాజ్‌ ప్రముఖ్‌ అయిపోతే ఇక అతనికి సహాయపడే వారెవరు? సుమారు తొమ్మిదేళ్లకు పైగా ఖాసిం రజ్వీ జైల్లో మగ్గాడు. జైలు నుండి విడుదలైన తర్వాత 1957లో మళ్లీ అదే సెప్టెంబర్‌ 17న పాకిస్థాన్‌ వెళ్లిపోయాడు. ఆ రకంగా తెలంగాణకు ఒక నర హంతకుడి నుండి రెండోసారి విముక్తి లభించింది.

సెప్టెంబర్‌ 17 వచ్చిందంటే తెలంగాణ గాయా లన్నీ జ్ఞాపకానికొస్తాయి. ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న కిరాతకాలు తెలంగాణ డెబ్బయ్యేళ్ల క్రితమే అనుభవించింది. 1940లలో హైదరాబాదు సంస్థానంలో నిజాం రాజు అండ చూసుకుని రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ బల వంతంగా పన్నులు వసూలు చేసేవాడు. చెల్లించని వారి గోర్ల కింద మాంసం కత్తిరించి గోర్లు ఊడ బెరికించేవాడు. భర్తల ముందు భార్యలపై అత్యా చారాలు చేయడం, భార్యల కళ్లెదుటే భర్తల్ని నరికి చంపడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉండేవి. ఈ బాధలు పడలేక ఎవరైనా పారిపోతే వారి పిల్లల్ని దొరికించుకునివారిని ఎగరేసి కత్తికి గుచ్చి చంపేవారు. తన రాజ్యంలో అలాంటి కిరాతకాలు జరిపించిన నిజాం రాజు మంచోడని, సెక్యులర్‌ రాజు అని పొగిడేవారు పిచ్చోళ్లు, మూర్ఖులు మాత్రమే అయి ఉంటారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చొరవ వల్ల 1948లో సెప్టెంబర్‌ 17న భారత ప్రభుత్వం హైదరాబాదు సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేసుకుంది. వల్లభాయ్‌ పటేల్‌ భారత సైన్యానికి చెప్పిన మాట ఏమిటంటే నిజాంను అరెస్ట్‌ చేయమని, ఖాసి రజ్వీని చంపేయమని. కానీ, జవహర్‌లాల్‌ నెహ్రూ జోక్యం చేసుకుని, నిజాంను ఏమీ చేయకుండా ఖాసిం రజ్వీని మాత్రం అరెస్ట్‌ చేయమన్నారు. పాకిస్థాన్‌కు వెళ్లిపోదలచిన వారికి ఉదారంగా అనుమతు లివ్వాలని చెప్పారు. ఆ మాట ఎంతోమందికి ఉపయోగపడిరది. నెహ్రూ దయాగుణం వల్ల నిజాం రాజ్‌ ప్రముఖ్‌ (గవర్నర్‌ హోదా) అయ్యాడు. అప్పటి దాకా నిజాం దగ్గర పనిచేసిన దీవాన్‌, మేజర్‌ జనరల్‌, ఇతర ఉన్నతో ద్యోగులంతా ముందే మేల్కొని పాకిస్థాన్‌ పారిపోయారు. ఇక్కడ హైదరాబాదులో దొరికిన రజాకార్లను దొరికినట్లుగా భారత సైన్యం చంపేసింది. తెలివిగా తప్పించుకున్న వాళ్లు ఉన్న ఫళంగా గడ్డాలు, మీసాలు తీయించుకుని మామూలు పౌరుల్లో కలిసిపోయి, ప్రాణాలు దక్కించుకున్నారు.
సంస్థానంలో అన్ని కిరాతకాలకు కారకుడైన ఖాసిం రజ్వీ చివరి నిముషంలో విషయం అర్థం చేసుకున్నాడు. ఇక్కడే ఉంటే జనం నిట్ట నిలువునా తనని చీల్చి చంపుతారని భయపడ్డాడు. అయితే పాకిస్థాన్‌కు పారిపోయే ముందు యం.ఐ.యం పార్టీ బాధ్యతలు ఎవరికైనా అప్పగించి వెళ్లాలని అనుకున్నాడు. పార్టీ సభ్యులందరికీ వర్తమానం పంపాడు. సంస్థానంలోని అనిశ్చితి పరిస్థితి కారణంగా ఎక్కువ మంది రాలేదు. కేవలం 3040 మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. హాజరైన వారిలో పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. పాకిస్థాన్‌కు వెళ్లిపోయే తొందరలో ఉన్న ఖాసిం రజ్వీ మరో ప్రకటన చేశాడు. పన్నెండేళ్లు దాటిన బాలుడైనా, నవ యువకుడైనా ఎవరైనా సరే ధైర్యంగా ముందుకొస్తే ఈ యం.ఐ.యంపార్టీ పగ్గాలు అప్పజెప్పుతానని మళ్లీ మళ్లీ ప్రకటించాడు. ఆ ప్రకటనకు స్పందించి అబ్దుల్‌ వహీద్‌ ఒవైసి అనే పద్దెనిమిదేళ్ల నవ యువకుడు ముందుకొచ్చాడు. అప్పటికి అతనికి ఆ పార్టీతో సంబంధంగాని, రాజకీయ పరిజ్ఞానం గానీ లేవు. వహీద్‌ ఒవైసి ధైర్యాన్ని చూసి నిజాం రాజు యం.ఐ.యం పార్టీ అధినేతగా అతని పేరు ప్రస్తావించాడు. ఖాసిం రజ్వీ దాన్ని బలపరిచాడు. అంతే ఎన్నిక జరిగిపోయింది. పార్టీ పగ్గాలు వహీద్‌ ఒవైసి చేతుల్లోకి వచ్చాయి. అయితే, భారత ప్రభుత్వం అంతకు ముందే ఆ పార్టీని నిషేధించింది. నిషేధించిన రాజకీయ పార్టీకి నాయకుడైన నేరానికి అతనికి పదకొండు నెలల జైలు శిక్ష పడిరది. (జైలు జీవితం ముగిశాక వహీద్‌ అడ్వొకేట్‌ అయ్యాడు. పూర్తి సమయం పార్టీని బలోపేతం చేయడానికి వెచ్చించాడు. యం.ఐ.యంను ఎ.ఐ.యం. ఐ.యంగా మార్చాడు. అంటే ఆల్‌ ఇండియా మజ్లిస్‌ఇత్తెహాదుల్‌ముస్లి మీన్‌. ఇస్లామిక్‌ ప్రజాస్వామ్యం స్థాపించడమన్నది ఆ రాజకీయ పార్టీ ధ్యేయం. 1975లో అబ్దుల్‌ వహీద్‌ ఒవైసి కొడుకు సలావుద్దీన్‌ ఒవైసీ పార్టీ నాయకత్వాన్ని తీసుకున్నాడు. తర్వాత ఆయన కొడుకు అసదుద్దీన్‌ ఒవైసీ నాయకుడయ్యాడు. అసదుద్దీన్‌ తమ్ముడు అక్బరుద్దీన్‌ కూడా ఎ.ఐ.యం.ఐ.యం పార్టీలో బలమైన నాయకుడు.) యం.ఐ.యం పార్టీ బాధ్యతలు వహీద్‌ ఒవైసీకి అప్పగించి, హడావుడిగా పాకిస్థాన్‌కు పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఖాసీం రజ్వీ భారత ప్రభుత్వానికి దొరికిపోయాడు. అరాచకాలు చేయమని ఉసిగొల్పిన నిజాం, భారత ప్రభుత్వ`రాజ్‌ ప్రముఖ్‌ అయిపోతే ఇక అతనికి సహాయపడే వారెవరు? సుమారు తొమ్మిదేళ్లకు పైగా ఖాసిం రజ్వీ జైల్లో మగ్గాడు. జైలు నుండి విడుదలైన తర్వాత 1957లో మళ్లీ అదే సెప్టెంబర్‌ 17న పాకిస్థాన్‌ వెళ్లిపోయాడు. ఆ రకంగా తెలంగాణకు ఒక నర హంతకుడి నుండి రెండోసారి విముక్తి లభించింది. పాకిస్థాన్‌ వెళ్లిపోయిన ఖాసిం రజ్వీని అక్కడ కరాచిలో ఎవరూ గుర్తుపట్టలేదు. ఎవరూ ఏ సహాయమూ అందించలేదు. హీనాతి హీనమైన పరిస్థితుల్లో చనిపోయాడు. మనిషి మనిషిగా ప్రవర్తించనప్పుడు దొరికే ఫలితం అలాగే ఉంటుంది. మనిషి మిగలడు కానీ, అతను చేసిన మంచో, చెడో తప్పకుండా మిగులుతుంది!
వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త,
జీవశాస్త్రవేత్త, 9908633949

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img