Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

దిల్లీలో బుల్‌డోజర్‌ దాడి

గురుసిమ్రాన్‌ కౌర్‌ బక్షి

దిల్లీలో మళ్లీ బుల్‌ డోజర్‌ విధ్వంసం మొదలైంది. ఆక్రమణల పేరుతో వందలాది పేదల పాకలు, పెద్దపెద్ద భవనాలతో సహా కూలగొడుతున్నారు. దక్షిణ దిల్లీలో మెహ్రౌలీ ఆర్కియలాజికల్‌ పార్క్‌(పురావస్తు పరిశోధన సంస్థ) ప్రాంతంలో ఉన్న బహుళ అంతస్థుల భవనాలను కూడా విడవడంలేదు. ఈ నెల 10వ తేదీనుంచే మెహ్రౌలీ ప్రాంతంలోనే లద్దాక్‌ సరై గ్రామంలో పేదల ఇళ్లన్నింటినీ కూలగొట్టి వారిని నిర్వాసితులను చేశారు. దిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) గత డిసెంబరులోనే ఇళ్లను ఖాళీ చేయవలసిందిగా తాము నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు. ఈ పురావస్తు పరిశోధనాసంస్థ సమీపంలో అనేక అపురూపమైన కళా ఖండాలున్నాయి. ఇవి ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, దిల్లీ ఆర్కియలాజికల్‌ విభాగం రక్షణలో ఉన్నాయి. ఆక్రమణలపేరుతో కూలగొడుతున్న పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రత్యామ్నాయ నివాసాలను చూపించకుండానే కూలగొడుతున్నారు. అనేక సంవత్సరాలుగా ఆక్రమణల తొలగింపు కార్యమ్రాలు వాయిదా పడుతున్నాయని అధికారులు నమ్మబలుకుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ వచ్చినప్పుడు కూడా ఆయన పర్యటించిన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాన్నే చేపట్టారు.
అధికారుల దౌర్జన్యకాండను నిరసిస్తూ నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సైతం అధికారులు లెక్కచేయకుండా ఇళ్లను కూలగొట్టే పని కొనసాగిస్తున్నారు. దిల్లీ హైకోర్టు జస్టిస్‌ మన్‌మీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ నాయకత్వంలోని ఏకసభ్య ధర్మాసనం కూలగొట్టడాన్ని నిలిపివేసి యధాస్థితిని కొనసాగించాలని గత శుక్రవారం ఉత్తర్వు చేశారు. ఇళ్లను కూల్చివేయకుండా నివారించాలని గోసియా కాలనీ సేవా సమితి దిల్లీ అభివృద్ధి సంస్థను ఆదేశించాలని కోర్టుకు వెళ్లింది. గోసియా మురికివాడ ప్రాంతాల నివాసితులు కలిసి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. మెహ్రౌలి మురికివాడ ప్రాంతాల్లో 400కుపైగా పేదల క్లస్టర్లు ఉన్నాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది అనుప్రద సింగ్‌ కేసును వాదించారు. ఆమె తన వాదనలలో దిల్లీ పట్టణ నిర్వాస అభివృద్ధి బోర్డు ప్రచురించిన జబితాలో ఈ కాలనీ వరుసనెంబర్లు 18లో ఉన్నవని, ఈ అంశాన్ని 2018లో బోర్డు వెబ్‌సైట్‌లో కూడా ఉంచారని తెలిపారు. మురికవాడల్లో నివసిస్తున్నవారెవరకీ ఇళ్లు ఖాళీచేయాలని నోటీసులు ఇవ్వలేదని, ఈ ప్రాంతంలో ఇళ్లను చట్టవిరుద్దంగా కూలగొట్టారరని ఆమె తన వాదనలో వినిపించారు.
మెహ్రౌలిలో ఉన్న పేదల బస్తీని కోడ్‌ నం.769 కింద కేటాయించి 400 మురికివాడలను రికార్డు చేసిన జాబితాలో పేర్కొన్నట్లు ఆమె వెల్లడిరచారు. అందువల్ల ఈ కాలనీల్లో ఇళ్లను కూల్చివేయడం చట్టవిరుద్దమని ఆమె కోర్టుకు విన్నవించారు. అవసరమైతే ఇళ్లను ఖాళీచేయించడానికి ముందే అక్కడ నివసిస్తున్నవారికి ఆ ప్రాంత భూమిపై అధికారం కలిగిన డీడీఏ హామీ ఇచ్చిందని కూడా న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్లు ఉండటం ప్రాథమిక హక్కు అని, దిల్లీ పట్టణ నివాసాల అభివృద్ధిబోర్డు స్పష్టంగా తెలిపిందని, ఆ విధంగా కూడా ఇక్కడి ఇళ్లను కూలగొట్టడం దుర్మార్గమని ఆమె పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వును సైతం లెక్కించకుండా అనేక దుర్మార్గాలకు పాల్పడుతున్న అధికార వర్గాలు దిల్లీ ప్రభుత్వ సూచనలను సైతం పట్టించుకోవని గతంలోనే రుజువైంది. ఈ కేసుపై మంగళవారం కోర్టు విచారణ జరిపింది. అయితే ఇంకా కోర్టు తన అభిప్రాయాన్ని ప్రకటించవలసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img