Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

దివాలా దిశగా పాకిస్థాన్‌

పతకం దామోదరప్రసాద్‌

మన దాయాది దేశం, ఇస్లామిక్‌ మత రాజ్యం పాకిస్థాన్‌ ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయి దివాలా దిశలో ఉంది. భారత స్వాతంత్య్ర పోరాటం ఉధృతం కాగా బ్రిటీష్‌ సామ్రాజ్య వాదులు వలస పాలనను వదులుకోక తప్పలేదు. స్వాతంత్య్ర ప్రకటన చేసినా మతప్రాతిపదికగా దేశాన్ని ముస్లిం పాకిస్థాన్‌, హిందుస్థాన్‌లుగా చీల్చి రెండుదేశాల మధ్య ఆరని వైషమ్యజ్వాలను రగిలించారు. స్వాతంత్య్రానంతరం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్ని లొసుగులున్నా చల్లబద్ధపాలన కొససాగిస్తూ రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక రంగా లలో గణనీయమైన ప్రగతి సాధించి పురోగమిస్తుండగా, పాకిస్థాన్‌ తీవ్ర మత విద్వేష భావనలు, ఇస్లామిక్‌ ఉగ్రవాద శక్తుల హింసా కాండ, అంతఃకలహాలతో కొట్టుమిట్టాడుతూ కునారిల్లుతోంది. భారత వ్యతిరేకతే ప్రధానంగా సైన్యం నీడలో ప్రజాస్వామ్య పునాదులు బలహీనపడి ప్రస్తుతం కుప్పకూలే స్థితికి చేరుతోంది.
ఒకవైపు బెలూచిస్థాన్‌ను ప్రత్యేకదేశంగా చేయాలని ఆందోళనలు, మరోవైపు వాయవ్య సరిహద్దు రాష్ట్రం ఇస్లామిక్‌ మత తీవ్రవాద శక్తులకు నెలవై షియా, సున్నీ తెగల వైషమ్యాలకు ఆజ్యం పోసింది. తరచు తీవ్రవాద శక్తుల బాంబు దాడుల, హింసాకాండలో వందలాది మంది హతులవుతూనే ఉన్నారు. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో అమెరికా పాక్‌ను చేరదీసి ఆయుధ, ఆర్థికసాయంఅందించి భారత వ్యతిరేకతను పెంచి పోషించి అనేక యుద్ధాలకు కారణమైంది. సౌదీ అరేబియా, యుఎఇ తదితర ముస్లిం దేశాలు పాక్‌కు అవసరమైనపుడల్లా ఆర్థిక సాయం అందించి ఇస్లామిక్‌ అణుబాంబు తయారీకి కూడా తోడ్పడ్డాయి. తాజాగా చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌, ఆర్థిక కారిడార్‌ల పేరుతో పాకిస్థాన్‌ను మచ్చిక చేసుకొని తమ ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చుకుంటూ అరేబియాసముద్రం ద్వారా ఆఫ్రికా తదితర దేశాలకు దగ్గరి మార్గాలను ఏర్పరుచుకుంటోంది. చైనాతో గల సంబంధాలతో పాక్‌ భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోంది. విఫల మతరాజ్యం పాకిస్థాన్‌ ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్వహణలో విఫలమై అనేక అంతర్జాతీయ వేదికలలో కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత వ్యతరేక విషాన్ని విరజిమ్ముతూ సొంత ప్రజలనే పక్కదోవ పట్టిస్తోంది.
అనేక చిన్నదేశాలు సైతం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పురోగమిస్తుండగా, పాకిస్థాన్‌ మాత్రం ఇస్లామిక్‌ మతరాజ్యంగా భారత వ్యతిరేకతే ధ్యేయంగా తన సైనిక, రక్షణ వ్యయాన్ని భారీగా పెంచి, ప్రజల సమస్యలను పరిష్కరించటంలో విఫలమై ఆర్థిక పతనావస్థకు చేరడం విచారకరం. పాక్‌ సైనిక నాయకత్వం గత పార్లమెంటు ఎన్నికలలో ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ముస్లింలీగ్‌ను కట్టడి చేయడానికి, ఎన్నికలలో రిగ్గింగ్‌కు తోడ్పడి ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ తెహ్రిక్‌పాకిస్థాన్‌ పార్టీకి కృత్రిమ మెజారిటీ వచ్చేలా కుతంత్రాలు పన్ని, ఖాన్‌కు పాక్‌ ప్రధాని పదవి కట్టబెట్టింది. కొన్నాళ్లు సైనిక నాయకత్వంఇమ్రాన్‌ఖాన్‌ల మధ్య సయోధ్య కొనసాగింది. సైనిక నేతలు పరి పాలనలో తలదూర్చి ఆజ్ఞలు జారీ చేస్తుండటం గిట్టని ఇమ్రాన్‌ఖాన్‌ స్వతంత్ర వైఖరి నవలంబించడంతో పాక్‌ సైనిక నాయకత్వం ఈసారి పిటి పీపుల్స్‌ పార్టీ కూటమికి మద్దతు ఇచ్చి నవాజ్‌షరీఫ్‌ సోదరుడు షాబాజ్‌ షరీఫ్‌ను ప్రధానిగా చేసింది.
అయితే ఇమ్రాన్‌ఖాన్‌కు పరి పాలన ఆర్థికపరిస్థితి మెరుగు పరచడంపై తగినపట్టులేక గత నాలుగేళ్లుగా పాక్‌ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది.అయితే ఈ పాపం తాజాగా ప్రధాని బాధ్యతలు చేపట్టిన షాబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వంపై పడి ప్రజల్లో ఆగ్రహం రగులుకొంది. ద్రవ్యోల్బణం, అధికధరలు, నిరుద్యోగం ఆర్థిక అసమానతలు పెచ్చు పెరగడం, జీవన ప్రమాణాలు క్షీణించడంతో పాక్‌ప్రజల్లో దారిత్య్రంపెరిగి బతుకు దుర్భరమవు తోంది. ఇందుకు ఇమ్రాన్‌ఖాన్‌ అసమర్ధ పాలనే ప్రధాన కారణం. ఇమ్రాన్‌ పేరుకే ప్రధాని. అధికారం చెలాయించేది సైనిక నేతలే. కొన్ని విషయాలలో ఇమ్రాన్‌ స్వతంత్రించడం నచ్చక ఆయనను గద్దెదించి, షాబాజ్‌ షరీఫ్‌ని ప్రధానిగా చేశారు. ఎవరైనా పాక్‌ ప్రధానులు కీలుబొమ్మలుగా ఉండాల్సిందే తప్ప, స్వతంత్రంగా విధాననిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదు. జియావుల్‌హక్‌, ముషారఫ్‌ వంటి సైనికనియంతలు స్వయంగా తామే దేశాధ్యక్షులై ప్రజాస్వామ్యం చేస్తూ నియంతృత్వ పాలన చేశారు.
సీనియరు జర్నలిస్టు, సెల్‌: 9440990381

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img