నంటూ బెనర్జీ
స్పైవేర్ మార్కెట్ ఎక్కువగా నియంత్రణలేని, అత్యంత రహస్యంగా జరిగే వ్యవహారం. ఇందువల్ల అర్థ వంతమైన నియంత్రణ ఈ రంగంలో అధిక ప్రాధాన్యత కావాలి. రహస్యంగా జరిపే కార్య కలాపాలకు సాంకేతికతలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. టెలి కమ్యూనికేషన్‌ల ద్వారానే ఎన్‌ఎస్‌ఓ, జీరోక్లిక్ ఎటాక్స్ అధికంగా ఖర్చు అయ్యే అత్యాధునిక నిఘా స్పైవేర్‌లను కలిగి ఉన్నవి. అసమ్మతివాదుల నోళ్లు మూయించేందుకు అవసరమైన అత్యంత తీవ్రమైన సాధనాలను నియంతృత్వ ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి. ఈ కంపెనీలు నేరపూరితమైన స్పైవేర్‌లను అవసరమైన ప్రభుత్వాలకు విక్రయిస్తూ కూడా మొండిగా తమకు తెలియదని తిరస్కరిస్తున్నాయి. ఈ విధంగా ఈ సంస్థలు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా స్పైవేర్ మార్కెట్ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ అనేక బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఇటీవల భారతదేశంలో పెగాసస్ స్పైవేర్ జాబితాలో అనేక మంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, అధికారులు, వాణిజ్యవేత్తలు, లాయర్లు తదితర ఎంతోమంది ప్రముఖుల పేర్లు ఉన్నాయని తెలిసి బెంబేలెత్తుతున్నారు. డిజిటల్ విప్లవం అనేక సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎన్నో అనర్థాలను కూడా సృష్టించింది. మన దేశంలో సంస్థల, వ్యక్తుల గోప్యతను వారి హక్కులను హరించి వేయటానికి కారణమైంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లింది. బలమైన నియంత్రణ వ్యవస్థలు లేకపోవటం వలన స్పైవేర్ నిఘా ద్వారా వ్యక్తుల సంభాషణలు వినేందుకు, వీడియోలో చూసేందుకు వీలు కలిగింది. ప్రాథమిక హక్కులలో భాగమైన మానవ హక్కులను చట్ట విరుద్ధమైన, నిరంకుశమైన నిఘా కొనసాగుతూనే ఉన్నది. రహస్యం అనేది లేకుండా పోతోంది. స్పైవేర్‌ను స్మార్ట్‌ఫోన్లలోకి చొప్పించటం ద్వారా వ్యక్తిగత సమాచారం అంతటినిసేకరించి వారిని అనేకవిధాలుగా హింసించటానికి, రాజకీయ ప్రయోజనాలనుపొందేందుకు పాలకులు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు.
స్పైవేర్ మార్కెట్ 75 శాతం వరకు యూరోపియన్ యూనియన్, అమెరికా, ఇజ్రాయిల్ నియంత్రణలో ఉన్నది. చైనా ప్రభుత్వ పరంగా భారీ నిఘా వ్యవస్థను కలిగి ఉన్నది. ఈ నిఘా వ్యవస్థను దేశ, విదేశాలలో వినియోగించటం పరిపాటి. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా సొంత నిఘా వ్యవస్థను కలిగి ఉంది. డార్క్ మేటర్ పేరుతో స్పైవేర్‌ను వినియోగించి వ్యక్తుల, సంస్థలసమాచారాన్ని దొంగలించి తమ ప్రయోజనాలకు వినియోగించు కుంటున్నారు. 2015 నుండి 73 దేశాలలో ప్రభుత్వాల ఆధ్వర్యంలోని నిఘా వ్యవస్థ జాబితాలోకి మూడు వేల మంది ప్రముఖులను చేర్చి వారి రహస్యాలను తెలుసుకున్నట్టు ప్రపంచ స్పైవేర్ మార్కెట్ సూచీ తెలియజేస్తోంది. ఈ స్పైవేర్ సాంకేతికతను ఆయా కంపెనీలు ఐరోపా, అమెరికా, ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తయారు చేస్తున్నాయి. ఐరోపా, అమెరికా, ఇజ్రాయిల్ ప్రపంచ మార్కెట్‌లో మూడు వంతుల వాటాను కలిగి ఉన్నాయి. ఐరోపా, అమెరికా కలిసి 50 శాతం వాటాలు చేజిక్కించుకున్నాయి. ప్రముఖంగా వినిపిస్తున్న స్పైవేర్ నిఘా సంస్థలలో ఫిన్ ఫిషర్ జిఎమ్‌బిహెచ్ ఒకటి. జర్మన్ గ్రూపు పునాదులు జర్మనీ బ్రిటన్‌లలో ఉన్నాయి. సర్కిల్స్, ఎన్‌ఎస్‌ఓ గ్రూపులు రెండూ ఇజ్రాయిల్‌కి చెందినవి. హ్యాకింగ్ టీమ్ అనే సంస్థ ఇటలీకి చెందింది. దీని శాఖలు అమెరికా, సింగపూర్‌లలో ఉన్నాయి. పెగాసస్ స్పైవేర్ మన దేశంలో తీవ్రమైన అలజడి సృష్టించింది. దీని ద్వారా అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకుల, జర్నలిస్టుల, సామాజిక కార్యకర్తల, అసమ్మతివాదుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి రాజకీయ ప్రయోజనాలను పొందుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ పేరు కూడా ఎన్‌ఎస్‌ఓ గ్రూపునకు చెందిన స్పైవేర్ జాబితాలో ఉన్నట్లు తెలిసిన వెంటనే ఎన్‌ఎస్‌ఓపై దర్యాప్తునకు ఆదేశించారు. పదిమంది ప్రధానమంత్రులు, ముగ్గురు దేశాధ్యక్షులు, ఒక దేశ రాజు పేర్లు పెగాసస్ స్పైవేర్ నిఘాలో ఉన్నట్లుగా వాషింగ్టన్ పోస్టు పత్రిక వెల్లడిరచింది.
స్పైవేర్, ఫోన్ల హ్యాకింగ్ లక్ష్యంగా పని చేస్తున్న వ్యవహారాలపై ఐక్యరాజ్యసమితితో సహా అనేక విజ్ఞత కలిగిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సర్వే నిర్వహిస్తున్నాయి. ఇటువంటి నేరపూరితమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు, సంస్థలపై నిషేధం విధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మొబైల్‌ఫోన్లవ్యవస ్థద్వారా తేలికగా స్పైవేర్‌ను వినియోగించటానికి వీలు కలుగుతోంది. ఇటీవల కాలంలో యాంటీ మాల్‌వేర్‌మొబైల్ మార్కెట్ విస్తరిస్తోంది. ఈ మార్కెట్ విలువను 2020లో 4.50 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఇది 2026 నాటికి 12.40 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్లలో ఉన్న సాధనాలు హాని చేసే మాల్‌వేర్‌ను అడ్డుకుంటాయి. అడ్వేర్, స్పైవేర్, ట్రోజన్స్ లాంటి మాల్‌వేర్‌లను చొరబడనివ్వకుండా అడ్డుకునే ఫోన్ల ఉత్పత్తి పెరుగుతోంది. చైనాకు చెందిన హువెయ్ 5జి ఫోను ద్వారా నిఘా పెట్టేందుకు వీలు కలుగుతుందని అమెరికా తదితర దేశాలు ఆరోపిస్తున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్ ఫోన్లలో నిఘా లేదా సమాచార వ్యవస్థను అడ్డుకోవడం లాంటి సాధనాలు ఉన్నాయని చెప్తున్నారు.
స్పైవేర్ మార్కెట్ ఎక్కువగా నియంత్రణలేని, అత్యంత రహస్యంగా జరిగే వ్యవహారం. ఇందువల్ల అర్థవంతమైన నియంత్రణ ఈ రంగంలో అధిక ప్రాధాన్యత కావాలి. రహస్యంగా జరిపే కార్యకలాపాలకు సాంకేతికతలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. టెలి కమ్యూనికేషన్‌ల ద్వారానే ఎన్‌ఎస్‌ఓ, జీరోక్లిక్ ఎటాక్స్ అధికంగా ఖర్చు అయ్యే అత్యాధునిక నిఘా స్పైవేర్‌లను కలిగి ఉన్నవి. అసమ్మతివాదుల నోళ్లు మూయించేందుకు అవసరమైన అత్యంత తీవ్రమైన సాధనాలను నియంతృత్వ ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి. ఈ కంపెనీలు నేరపూరితమైన స్పైవేర్‌లను అవసరమైన ప్రభుత్వాలకు విక్రయిస్తూకూడా మొండిగా తమకు తెలియదని తిరస్కరిస్తున్నాయి. ఈ విధంగా ఈ సంస్థలు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. ఇటీవల వెల్లడైన సమాచారంలో ఎన్‌ఎస్‌ఓ గ్రూపు స్పైవేర్ జాబితాలో 50 వేల మంది వ్యక్తుల ఫోన్ నెంబర్లు ఉన్నట్టుగా గుర్తించారు. 2016 నుంచి ఈ సంస్థ స్పైవేర్‌ను ప్రభుత్వాలకు, అవి నియమించిన సంస్థలకు విక్రయిస్తూ అపారంగా సంపాదిస్తున్నది. ఈ సంస్థ జాబితాలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలే కాక డాక్టర్లు, విద్యావేత్తలు కూడా ఉన్నారు. డిజిటల్ వ్యవస్థ నిఘా ద్వారా మానవ హక్కులను ఉల్లంఘించటం ఇటీవల కాలంలో అపారంగా పెరిగింది. ఇప్పటికైనా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సమగ్ర నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసి నిఘా కార్యకలాపాలను నిర్వహించే సంస్థలను కఠినంగా శిక్షించాలి.