Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

దేశాన్ని అబద్దాల ప్రచార కేంద్రంగా మార్చకండి

డాక్టర్‌ దేవరాజు మహారాజు

కేంద్రంలో బీజేపీ మోదీ నాయకత్వంలో అధి కారంలోకి వచ్చిన తర్వాత ‘అబద్దాల ప్రచారం పెరి గింది’ అని జనంలో ఒక అభిప్రాయం ఉంది. అది నిజమే అయినా, మనువాదులు కొన్ని శతాబ్దాల క్రితమే ఆ పని ప్రారంభించారు. బౌద్ధ, జైన ఆలోచనా విధానాల్ని నాశనం చేసే క్రమంలో దేశంలో ఎన్నెన్ని అఘాయిత్యాలు చేశారో, ఎన్నెన్ని అబద్దాల్ని పురాణా లుగా మలిచారో నిశితంగా విశ్లేషించుకుంటే అర్థ మవుతుంది. వారు ప్రచారం చేసిన అబద్దాల సుడిలో కొట్టుకుపోతే ఏవీ అర్థం కావు. ఆ ప్రవాహానికి ఎదురు నిలిచి, అవగాహన పెంచు కుని, ఒక విహంగ వీక్షణంలా అన్ని విషయాలు ఆకళింపు చేసుకుని గమనిస్తే గాని.. విషయం బోధపడదు. గడుస్తున్న ఇప్పటికాలం మరీ మరీ గడ్డు కాలం. కరోనా వైరస్‌ ఎలాగయితే వీరవిహారం చేస్తోందో, అంతకుమించి అధికార పార్టీ నిర్వహిస్తున్న ఐటీ సెల్‌ ఎన్నెన్నో అబద్దపు వైరస్‌లని సమాజం పైకి పంపుతోంది. పైన నిర్ణయాలు తీసుకునేవారు ఎలాగుంటే, కిందున్న మామూలు జనం కూడా అలాగే ఉంటారు. పైన ఉన్నవారిని అనుకరిస్తుంటారు. నిజాయితీ, నిబద్దత లేక తమ పని జరిగితే చాలునన్నట్లు తయారవుతుంటారు. సమాజంలో వీరి సంఖ్య పెరుగుతూ ఉండడం మనం గమనిస్తున్నాం.
ఎవరెవరో తాగి బండ్లు నడుపుతున్నారు. ప్రమాదాలు జరిగి సంబంధం లేనివారు చనిపోతున్నారు. చట్టాల్లో లోపాలు, లాలూచీ పడే అధికారులు, లిక్కర్‌ అమ్మకాలతోనే నిలబడుతున్న ప్రభుత్వ ఖజానాలు. అమాయకుల చావులకు బాధ్యు లెవరూ? అని ప్రశ్నిస్తే సమాధానం సూటిగా రాదు. ఇదీ అలాంటిదే. అసత్య ప్రచారాలతో జనం ఆలోచనల్ని భ్రష్టు పట్టిస్తున్నవారు దేశ ప్రతిష్ఠ, దేశ ప్రజల ప్రతిష్ఠ దిగజారిపోతున్న విషయం పట్టించుకోరు. స్విచ్‌ ఎక్కడో వేస్తే లైటు ఎక్కడో వెలిగినట్టు వీళ్ళు చేసే అబద్ద ప్రచారాల ఫలితం భవిష్యత్‌ తరాల మీద బలంగా ఉండబోతోంది. అందుకని సత్వరం జాగ్రత్త వహించాల్సి ఉంది. అబద్దాన్ని అబద్ద మని విసుగు లేకుండా చెప్పాల్సి ఉంది. తప్పదు! ఇలాంటి వారని ఎవరూ అడ్డు కోక వదిలేస్తే భవిష్యత్తు అంధకారమౌతుంది. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి సామాన్య పౌరులు తమ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. ప్రజా సంకల్పం ముందు, ప్రజా బలం ముందు ఏ ప్రభుత్వాలూ నిలవవు. ప్రతిఘటిస్తూ, ప్రపంచానికి ఉద్యమ స్ఫూర్తిని తెలియజెప్పిన మన రైతు ఉద్యమకారుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరికి వారు వారి వారి లక్ష్యసాధన దిశగా సాగిపోవాలి. ప్రజల్లో మార్పు వస్తే వ్యవస్థలు, ప్రభుత్వాలు అవే మారతాయి.
భారతీయ బ్రాహ్మణ సంస్కృత పండితుడు శివకర్‌ బాపూజీ తల్‌పడే (18641916) మహారాష్ట్ర పౌరుడు. 1895లో అతను మానవ రహిత విమానాన్ని మెర్క్యూరీ ఇంజన్‌తో 1500 ఫీట్ల ఎత్తులో నడిపించాడని ప్రచారం చేశారు. ఇది రైట్‌బ్రదర్స్‌ కనిపెట్టిన దానికన్నా ఎనిమి దేండ్లు ముందని ఢంకా బజాయించారు. దానికి తల్‌పడే ‘మారుతి సఖా’ అని పేరు పెట్టాడని చెపుతారు. మారుతి అంటే గాలి. సఖా అంటే స్నేహితుడు. ఆ విమా నాన్ని ఆయన రుగ్వేదం 96.2లోని విష యాల ఆధారంగా తయారు చేశాడని చెపుతారు. ముంబయిలో బరోడా మహా రాజు తన ఆస్థాన సభ్యులతో కొలువుదీరి ఉండగా తల్‌పడే తన విమానాన్ని గాల్లో నడిపించాడని, మళ్ళీ సురక్షితంగా నేల పైకి తీసుకొచ్చాడనీ చెప్పుకుంటారు. దుర దృష్టవశాత్తు బ్రిటిష్‌వారు ఆ కుటుంబాన్ని వేరు వేరు కేసులలో ఇరికించి చంపే శారనీ, దాంతో ఆ విమాన పరిజ్ఞానం మనకు దక్కలేదని ఎస్పీహెచ్‌ నిత్యానంద పరమ శివం వివరణ ఇచ్చారు. ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ల కలయికతో నీరు ఏర్పడిర దన్న ప్రాథమిక సమాచారమే వేదాలలో లేనప్పుడు, విమాన తయారీ గూర్చి ఉందని అంటే ఎలా నమ్మడం? తల్‌పడే గొప్పదనాన్ని భరించలేక ఆ కుటుంబాన్ని, ఆ పరిజ్ఞానాన్ని బ్రిటీషు వారు నాశనం చేసిందే నిజమయితే బ్రిటిష్‌ పాలనలోనే సి.వి.రామన్‌, విశ్వ కవి టాగూర్‌ నోబెల్‌ సాధించారు కదా? ఎంతోమంది వైజ్ఞాని కులు బ్రిటన్‌ వెళ్ళి పరిశోధనలు చేశారు. గాంధీ, నెహ్రూలతో సహా ఎంతోమంది బారిస్టర్‌లయ్యారు. వీరందరికన్నా తల్‌పడే గొప్పోడని అనుకునే వీరి కహానీలు నమ్మాలా? మైక్రోస్కోపు ఆవిష్కరించక పూర్వమే ఫలదీకరణ, పిండోత్పత్తిపై ప్రాచీన భారతదేశంలో అవగాహన ఉందని ఒక అబద్దానికి తెరలేపారు. ఆ విషయాలకు సంబంధించిన శిల్పాలు తమిళనాడులోని కాలభైరవనాథ ఆలయంలో లభించా యని, అవి సుమారు వెయ్యేండ్ల క్రితంవి అని చెప్తారు. అయితే వెయ్యేళ్ళ క్రితం అంటే 1021 సి.ఇ.లో భారతదేశ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనించాలి. కామన్‌ ఎరా 10011027 మధ్యకాలంలో వరుసగా మహ్మద్‌ గజనీ భారత దేశంపై దండయాత్రలు చేస్తున్నాడు. అప్పటికి 500 ఏళ్ళకు ముందే అంటే 500 సి.ఇ. వరకే గుప్తరాజులు పూర్తిగా పతనమైపోయారు. ఉత్తరాన పశ్చిమ దిశ నుండి దండెత్తి వస్తున్న ఆ ముస్లిం చొరబాటుదారులను ఎదుర్కొనే స్వతంత్ర ప్రతి పత్తి గల రాజు ఆ కాలంలో ఎవరూ లేరు. ఇక దక్షిణాన పల్లవులు, చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు పరిపాలన సాగిస్తూ ఉండేవారు. ఎంతసేపటికి తమ రాజ్యాన్ని ఇతరుల నుండి కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారేగానీ, వైజ్ఞానికంగా అభివృద్ధి చెంది, పురుషుల వీర్యకణాల గూర్చి, స్త్రీల అండాల గూర్చి, ఫలదీకరణ గూర్చి, పిండ దశ పరిణామాల గూర్చి ఏ భారతీయులు అధ్యయనం చేశారూ? మైక్రోస్కోపు లేనిది అలాంటి అధ్యయ నాలకు వీలే లేదు. అప్పటికి సూక్ష్మదర్శిని ప్రపంచంలోనే లేదు. అయితే, సూక్ష్మంగా ఉండే ఆ జీవకణాల్ని నాటి రుషులు తమ దివ్యదృష్టితో చూశారా? ఏమో చెవిలో పువ్వు పెట్టుకున్నవాళ్ళు ఏమైనా చెప్ప గలరు. మూఢ విశ్వాసంలో మునిగి ఉన్న వారు దేనినైనా నమ్మగలరు.
మైక్రోస్కోపునకు రూపకల్పన చేసిన అంటన్‌ వాన్‌ లీవెన్‌ హాక్‌, డచ్‌ శాస్త్రవేత్త జీవించిన కాలం 16321723 సి.ఇ. అయినప్పుడు భారతీయులకు వెయ్యేళ్ళ క్రితమే సూక్ష్మదర్శిని ఎక్కడిది? ఆలోచిస్తే పొయ్యేదేముంది అజ్ఞానం తప్ప? ఇదే కాదు, ఇలాంటివి ఇంకెన్నో అద్భుతాలు కేవలం భారతదేశంలోనే జరుగుతాయి. ప్రపంచంలో మొదటి సైకిల్‌ ఇక్కడే తయారయ్యిందని, శివపార్వతులు ‘లొడో’ ఆట ఇక్కడే ఆడారని వాటి తాలూకూ శిల్పాలు పలానా, పలానా ఆలయాల గోడల మీద చెక్కి ఉన్నాయని మనువాదులు దేశ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అలాగే గెలీలియో టెలిస్కోపు 1609లో కనిపెడితే, దానికంటే ముందే 12వ శతాబ్దంలో దేశంలో టెలిస్కోపు ఉందనీ, దాని శిల్పాలు కర్నాటక హళైబీడు ఆలయంలో ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. అలాంటిదే మరొకటి 4 వేల ఏళ్ళ క్రితం ఆగ త్స్యుడు విద్యుత్తును కనిపెట్టాడని చెప్పే దేశభక్తులున్నారు. సరే ఒక్క క్షణం ఒప్పుకుందాం. కానీ, ఆ కాలంలో విద్యుత్‌ ఏయే ప్రాంతాలకు సరఫరా చేశారో చెప్పాలి! పైగా ఆ విద్యుత్‌ తీగలు ఎలా తయారు చేశారో కూడా చెప్పాలి. జంతు వుల్ని బలి ఇచ్చినపుడు ఆ జంతువుల మెడ నరాలో లేక తోక నరాలో తీసి వాటితో విద్యుత్‌ తీగలు తయారు చేశారా? ఇప్పుడు మనం వాడుతున్న విద్యుత్‌కు సంబం ధించి సమాచారమంతా మన దగ్గరుంది. తీగలు ఏయే లోహాలతో తయారవు తున్నాయో కూడా తెలుసు. ఏది ఎంత ఓల్టేజో తెలుసు. మరి అప్పటి వివరాలు ప్రకటించాలి కదా? వాస్తవానికి ఆధారాలుంటాయి కానీ, అబద్దాలకెక్కడ? శ్రీకృష్ణుడి ‘కాళీయ మర్ధనం’ గురించి కల్పిత కథల్లో వినడమే తప్ప అందుకు ఆధారాలు ప్రాచీన శిల్పాల్లో, కట్టడాల్లో ఏ ఆధారాలూ లేవు. ఆధునిక చిత్రకారులు గీసిన చిత్రాలలో మాత్రం నాగుపాము పడగ మీద శ్రీకృష్ణుడు నిలబడి వేణువు ఊదుతూ ఉండడం.. చుట్టూ గోపికలు ఆయనను స్తుతిస్తూ నమస్కరిస్తూ నిల బడడం కనిపిస్తుంది. అది మార్పులు చేర్పులు చేసుకున్న ఊహా చిత్రం అని తెలుస్తూ ఉంది. అయితే బార్‌హుత్‌ప్రసేన్‌ జిత్‌ స్తంభంపై చెక్కిన ‘కాళీయ దమన్‌’ వెలుగులోకి వచ్చింది. అందులో ధర్మబోధ చేస్తున్న బుద్దుడు ఒక నాగు పాము పడగ మీద కొంచెం ఎత్తులో నిలబడి ఉంటాడు. రాజ వంశీయులు, పుర ప్రముఖులు అందరూ ఆయనకు నమస్కరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక పెద్ద వృక్షం, పెద్ద పెద్ద ఆకులూ చెక్కి ఉంటాయి. బుద్ధుడు రాజ్యాన్ని వదిలేసినా, ప్రజలు ఆయనను నాగ వంశీయుల మహా నాయకుడిగా ఆరాధించుకున్నారు. అత్యున్నత స్థానంలో నిలుపుకున్నారు. ఆ శిల్పం ఆ విషయాన్నే ప్రతిబింబించింది. శ్రీకృష్ణుడు కూడా నాగ వంశీయుల మహా నాయకుడే అని వేద సంస్కృతిలో భాగమైన కల్పిత కావ్యాల్లో రాసుకున్నారు. కృష్ణుడు కల్పిత పాత్ర అయితే బుద్ధుడు చారిత్రక పురుషుడు. ఆ తేడాను మనం అర్థం చేసుకోవాలి.
శ్రీకృష్ణుడు మరెవరో కాదు, మనువాదులు మార్చుకున్న బుద్ధుడే అని మథుర తవ్వకాల్లో బయటపడిరది. అక్కడి తవ్వకాల్లో సుమారు నాలుగు వేల బౌద్ధ ప్రతిమలు, ద్దమ్మ చక్రాలు మొదలైనవి లభించాయి. మధుర, కనిష్కుడు పరిపాలిం చిన ప్రాంతం. అతడు బౌద్ధం స్వీకరించిన సమ్రాట్టు. అందువల్ల, లభించిన ఆధారాలన్నీ బౌద్ధానికి సంబంధించినవే కావడంలో ఆశ్చర్యం లేదు. అయితే బుద్ధుణ్ణి శ్రీకృష్ణుడిగా మార్చుకుని కథలల్లుకున్నది మాత్రం తర్వాతి కాలంలోని బ్రాహ్మణ పండితులు. బుద్ధుడి ధమ్మ చక్రాన్ని మార్చి, కృష్ణుడికి సుదర్శన చక్రం చేశారు. బుద్ధుడి ధమ్మచక్రం శాంతి, అహింస, నైతికతల ప్రచారానికైతే` మార్చు కున్న శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం శత్రు సంహారానికని కథల్లో రాసుకున్నారు. బుద్ధుడు నాగవంశానికి తలమానికవాడు అని గుర్తించుకున్నవారికి విషయం బోద óపడుతుంది. బంకించంద్ర చటోపాధ్యాయ తన ‘రచన బోలి కి సమ్య’లో బ్రాహ్మ ణులు ఎన్నో తప్పుడు కథనాలు, కావ్యాలు, మహా కావ్యాలుగా రాసి, ప్రచారం చేసి బ్రాహ్మణేతరులను ఇక్కట్లపాలు చేసినట్లు రాశారు. పండిత్‌ రాహుల్‌ సాంకృత్యా యన్‌ కూడా తన ‘ఓల్గా సె గంగా’లో ఈ విషయాలు చాలా వివరంగా రాశారు. మనువాదులు ప్రచారం చేసిన తప్పుడు విషయాలనే మనం ఇంకా సంస్కృతి సంప్రదాయాల పేరుతో నెత్తిన మోస్తున్నాం.
ఇలా సంస్కృతీ సంప్రదాయాల పేరు మీద ఇంగిత జ్ఞానాన్ని నాశనం చేసు కుంటున్నాం. వైజ్ఞానిక అవగాహనను చంపుకుంటున్నాం. మట్టి బొమ్మల్ని, టెర్ర కోట ప్రతిమల్ని లేదా ఇటీవల కాలంలో చెక్కిన శిల్పాల్ని చూపుతూ అవి బిసిఎ కాలం నాటివనో లేదా కామన్‌ ఎరా మొదటి శతాబ్దం కాలం నాటివనో చెప్పుకోవ డంలో అర్థం లేదు. ఆత్మద్రోహానికీ, అబద్దాలకూ అలవాటు పడితే నిజాలు రుచించవు. వాస్తవాలు తెలుసుకుని వాస్తవాలు మాట్లాడితేనే ఎదుటివారి దగ్గరైనా, ఇతర దేశాల్లోనైనా గౌరవం దక్కుతుంది. అబద్దాలతో మన హుందాతనాన్ని మనమే చిదిమేసుకుంటున్నామన్న విషయం దేశ ప్రధాని నుండి సామాన్య పౌరుడి దాకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త,
జీవ శాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img