Friday, June 2, 2023
Friday, June 2, 2023

నల్లధనం-కుంభకోణాల భారత్‌!

ఆసియాలోనే అత్యంత అవినీతి దేశంగా భారత్‌ నిలిచింది. 69శాతం అవినీతితో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 65శాతంతో వియత్నాం ఉంది. భారతదేశంలో ప్రతి పదిమందిలో ఏడుగురు ఏదో ఒక సందర్భంలో అవినీతికి పాల్పడ్డారని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న పౌరసమాజ సంస్థ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ నిర్వహించిన తాజా సర్వేల్లో వెలుగు చూశాయి. నల్లధనం జాతీయఉత్పత్తిలో (జీడీపీ) 18శాతం నుంచి 20శాతం వరకు ఉంది. ప్రతి రోజు 240 కోట్ల రూపాయలు దేశం సరిహద్దులు దాటి పోతున్నాయి. 1948`2008 మధ్యకాలంలో 46,200 కోట్ల డాలర్ల సొమ్ము విదేశాలకు తరలిపోయింది. స్విస్‌బ్యాంక్‌లో 89లక్షల కోట్ల భారతదేశ డబ్బులు మూలుగుతున్నాయి. ఈ నల్లధనం 100లక్షల కోట్లకు పైగా ఉందని కొన్ని నివేదికలు వెల్లడిరచాయి.

పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక, రాజకీయ విధానాలు ఏ వర్గాల ప్రయోజనాలు కాపాడుతున్నాయన్న దానిపై ఆ దేశ ఆర్థిక విధానాలతో పాటు, సంపద కేంద్రీకరణ, వికేంద్రీకరణ, అవినీతి,నల్లధనం వెల్లడౌతుంది. తొలినుంచి ప్రభుత్వాలన్నీ భూస్వాముల, బడా పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలు కాపాడే విధానాలు అమలు జరుపుతున్నందున ఆర్థికవ్యవస్థ అవినీతికి, భారీ కుంభకోణాలకు నిలయంగా మారింది. ఫలితంగా ఒకవైపు సంపద పోగుపడటం, మరోపక్క దారిద్య్రం సమానాంతరంగా కొనసాగుతున్నది. దేశంలో వందమంది కుబేరులు ఉంటే, 23.6 బిలియన్‌ డాలర్లతో ముఖేశ్‌ అంబాని మొదటి స్థానంలో ఉన్నాడు. ఒక శాతం అతి ధనవంతులు 90శాతంపైగా దేశ సంపద కలిగి ఉన్నారు. మిగిలిన వారందరూ 10శాతం మాత్రమే కలిగి ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకివస్తే అవినీతిరహిత పాలనతోపాటు, వందరోజుల్లో విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బు దేశానికి రప్పించి ప్రతివ్యక్తికి 15లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనాన్ని వెలికితీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని మోదీ ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బృందం ఏమిచేస్తున్నదీ, ఏమి చేసింది మోదీకి మాత్రమే తెలుసు. దర్యాప్తుబృందం గురించి, నల్లడబ్బు గురించి నేడు మోదీ ప్రభుత్వం ఎందుకుమౌనం వహిస్తున్నది. నల్లధనం యదేచ్ఛగా విదేశాలకు తరలి పోతున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు.
ఆసియాలోనే అత్యంత అవినీతి దేశంగా భారత్‌ నిలిచింది. 69శాతం అవినీతితో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 65శాతంతో వియత్నాం ఉంది. భారతదేశంలో ప్రతి పదిమందిలో ఏడుగురు ఏదో ఒక సందర్భంలో అవినీతికి పాల్పడ్డారని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న పౌరసమాజ సంస్థ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ నిర్వహించిన తాజా సర్వేల్లో వెలుగు చూశాయి. నల్లధనం జాతీయఉత్పత్తిలో(జీడీపీ) 18శాతం నుంచి 20శాతం వరకు ఉంది. ప్రతి రోజు 240 కోట్ల రూపాయలు దేశం సరిహద్దులు దాటి పోతున్నాయి. 1948`2008 మధ్యకాలంలో 46,200 కోట్ల డాలర్ల సొమ్ము విదేశాలకు తరలిపోయింది. స్విస్‌బ్యాంక్‌లో 89లక్షల కోట్ల భారతదేశ డబ్బులు మూలుగుతున్నాయి. ఈ నల్లధనం 100లక్షల కోట్లకు పైగా ఉందని కొన్ని నివేదికలు వెల్లడిరచాయి.
దేశంలో నల్లధనం కథ ఇప్పటిది కాదు. జాతీయోద్యమకాలంలోనే నల్లధనం పోగడటం ప్రారంభమైంది. 1955లో నికోలాస్‌ కల్టోర్‌ జరిపిన పరిశోధనలో 600కోట్ల నల్లధనం ఉన్నట్లు తేలింది. ఇది ఆనాటి దేశ స్థూలఉత్పత్తిలో 4.5శాతంగా ఉంది. 1969లో జస్టిస్‌ వాంచూ కమిటీ పన్నులవిధానంపై సూచనలుచేస్తూ పోగుబడిన నల్లధనం 7వేల కోట్లని చెప్పింది. 1980-81లో రాజ చల్లయ్య నేతృత్వంలోని పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ ప్రకారం పోగైన నల్లధనం 15లక్షల కోట్లు. ఇది జీడీపీలో 20శాతం.1992లో ఎస్‌బి గుప్తా పరిశీలన ప్రకారం అది 42శాతం. 1987-88లో జీడీపీలో నల్లధనం 51శాతంగా నమోదైంది. జవహర్‌లాల్‌ విశ్వవిద్యాలయం ఆర్థికశాఖ ప్రొఫెసర్‌ అరుణ కుమార్‌ 2005-06లో రాసిన బ్లాక్‌ ఎకానమీ ఇన్‌ ఇండియా అనే పుస్తకంలో జీడీపీలో 50శాతం ఉన్న నల్లధనం విలువ 39 లక్షల కోట్లగా పేర్కొంది. ఒక్క 2012 సంవత్సరంలోనే 95 బిలియన్‌ డాలర్లు (6లక్షల కోట్లు) ధనం దేశంనుంచి దాటించడమైంది. ఇది 2022 సంవత్సరం నాటికి 89 లక్షల కోట్ల నల్లధనంగా అంచనా.
మోదీలాగానే, నెహ్రు కూడా బినామి పేర్లతో విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తానని ప్రకటించి, స్వచ్ఛందంగా నల్లధనాన్ని ప్రకటించిన వారికి రాయితీలు ప్రకటించాడు. ఈ ప్రకటన తర్వాత 1961లో గుర్తించిన 20,912 కేసులకు గాను ప్రకటించిన డబ్బు 10కోట్ల 90 లక్షలు మాత్రమే. నెహ్రు ప్రవేశపెట్టిన ఈ పథకానికి 1975లో చట్టబద్దత కల్పించారు. అయినా ప్రభుత్వానికి ఆదాయపుపన్ను ద్వారా 248 కోట్లు, సంపద పన్ను ద్వారా 7కోట్ల 7లక్షలు మాత్రమే వచ్చింది. దీన్ని గమనిస్తే నల్లధనాన్ని బడా కుబేరులెవ్వరూ డబ్బును బైటకుతీయలేదని వెల్లడౌతున్నది. నల్లధనం వెలికితీతకు మోదీ ప్రభుత్వం కనీసం ఇలాంటి చర్యలకు కూడా సాహసించలేదు. నల్లధనానికి, కుంభకోణాలకు అవినావభావ సంబంధం ఉంది. నల్లడబ్బు, అవినీతి కుంభకోణాలకు మూలం. దేశంలో జరిగిన కుంభకోణాలన్నీ లెక్కించటం చాలా కష్టం. వెలుగుచూసిన కొన్ని ప్రధాన కుంభకోణాలను గమనిద్దాం. నెహ్రు కాలంలో దమానియా, ముంద్రా కుంభకోణాలు బయటపడ్డాయి. వీటిల్లో చిక్కుకున్న అప్పటి ఆర్థికమంత్రి టి.టి.కృష్ణమాచారి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1986లో భోపోర్స్‌ ఆయుధాల కుంభకోణం దేశాన్ని కుదిపివేసింది. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఫ్రాన్స్‌ నుంచి 1990లో ఎయిర్‌ బస్‌ ఎ320 కొనుగోలు ఒప్పందానికి సంబంధించి 2,500 కోట్ల కుంభకోణం జరిగింది. 1993లో 3వేల కోట్ల హర్షద్‌ మెహతా సెక్యూరిటీ స్కామ్‌, 1992లో ప్రధానమంత్రి పదవి కాపాడుకునేందుకు కోటి రూపాయల లంచంతో పి.వి.నరసింహరావు సూట్‌కేస్‌ కుంభకోణం, 2011లో జరిగిన హవాలా కుంభకోణం దేశంలో పెనుసంచలనంగా మారింది. దీన్ని జైన్‌ డైరీస్‌ కేసు అని కూడా అంటారు. రాజకీయ నాయకులు, నలుగురు హవాలా బ్రోకర్లు జైన్‌ సోదరుల ద్వారా నడిపిన కుంభకోణం. ఇది 18మిలియన్‌ డాలర్ల కుంభకోణం. ఇందులో ఎల్‌కే అద్వాని, వీసీ శుక్లా, దేవీలాల్‌, శరద్‌యాదవ్‌ లాంటి బడా నాయకులు ఉన్నారు. కోర్టు విచారణలో సాక్ష్యాలు తారుమారుతో వీరు కేసునుంచి బైటపడ్డారు. యూరియా కుంభకోణం: ఇది 1996లో నమోదై 1997లో రిజిస్టర్‌ అయింది. 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం.: ఇది టెలికాం కుంభకోణం. సత్యం కంప్యూటర్ల ఆడిటింగ్‌ కుంభకోణం, నాఫెడ్‌ కుంభకోణం, లలిత్‌ మోడి ఐపిఎల్‌ కుంభకోణం, కేరళ పామాయిల్‌ కుంభకోణం, జార్ఖండ్‌ మధుకోడా ఆక్రమాస్తుల కుంభకోణం, నితిన్‌ గడ్కరీ అవినీతి లాంటివి అనేకం జరిగాయి. 2022 సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో జరిగిన మోసాల్లో ఎగ్గొట్టిన డబ్బుల లెక్కలపై ఆర్‌బిఐ నివేదిక తయారుచేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 81,922 కోట్లు, 2021-22లో 40,295 కోట్లు మోసాలు జరిగినట్లు పేర్కొంది. దోపిడీ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాలు ఉన్నంతకాలం ఇటువంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ప్రజలసొమ్ము దోపిడీ వర్గాల పరమౌతూనే ఉంటుంది.
బొల్లిముంత సాంబశివరావు, సెల్‌: 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img