Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

నెహ్రూ ఆత్మకథకు పొంగిపోయిన రవీంద్రుడు

డాక్టర్‌ దేవరాజు మహారాజు

జవహర్‌లాల్‌ నెహ్రూ స్వాతం త్రోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడుపుతున్న దశలో 193435 మధ్యకాలంలో ఆయన తన ఆత్మకథ (ుశీషaతీసం ఖీతీవవసశీఎ) రాసు కున్నారు. బానిస సంకెళ్ళు తెంచు కుని, దేశం స్వేచ్ఛ కోసం తపిస్తున్న దశలో ఆయన అందులో తన అనుభవాల్ని నమోదు చేసుకున్నారు. నెహ్రూజీ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య కమలా నెహ్రూ అనారోగ్యంతో మంచాన పడి ఉన్నారు. కూతురు ఇందిర అప్పటికి చిన్నపిల్ల. ఆమె ఆలనా పాలనా చూసేవారు ఎవరూ లేకపోవడం వల్ల, ఆమెను తరచూ రవీంద్రుడి శాంతినికేతన్‌కు పంపుతుండే వారు. రవీంద్రుడి పర్యవేక్షణలో ఆమె అక్కడ గడుపుతూ ఉండేది. అందరినీ, అన్నింటినీ ప్రేమగా చూసే లక్షణం ఆ బాలికలో ఉందని గ్రహించి రవీంద్రనాథ్‌ టాగూర్‌ ఆమెను ‘ప్రియదర్శిని’ అని అన్నారు. అప్పటి నుండి ఆమె ఇందిర ప్రియదర్శిని అయ్యింది. పండిట్‌ నెహ్రూకు సాహిత్యం, కళలపై ఉన్న అవ్యాజ్యమైన ప్రేమ జగద్విదితం! ఆయన ఆత్మకథను చదివి విశ్వకవి ఆశ్చర్యచకితులైపోయారు. ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉత్తరం రాశారు. అప్పటికి నెహ్రూ భారతదేశానికి తొలి ప్రధాని కాలేదు. స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొంటున్న దేశభక్తుడు, యోధుడు మాత్రమే. భార్య అనారోగ్యాన్ని, కుటుంబాన్ని పక్కన పెట్టి పూర్తి సమయం దేశం కోసం వెచ్చించడం, మానవీయ విలువల కోసం తపించడం విశ్వకవి రవీంద్రుడికి బాగా నచ్చింది. 31 మే, 1936న తన నివాసం శాంతినికేతన్‌ నుండి రవీంద్రుడు రాసిన ఉత్తరం ఇలా ఉంది.
‘‘ప్రియమైన జవహర్‌లాల్‌,
మీ పుస్తకం చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. నిజంగా అది చాలా గొప్ప పుస్తకం! చదువుతూ ఎంతో చలించిపోయాను. మీరు సాధించిన విజయాలు తెలుసుకుని గర్వపడుతున్నాను. అన్నింటినీ మించి అట్టడుగున ప్రవహించే లోతైన మీ మానవత్వపు దృక్కోణం, సంక్లిష్టమైన చిక్కుముడులనన్నింటినీ విప్పుతూ ఉంది. వాస్తవాల్ని నిబ్బరంగా బహిర్గతం చేస్తూ ఉంది. ఇంతవరకు సాధించిన విజయాలకు మించిన మహోన్నతమైన వ్యక్తిత్వం మీది అనే విషయం తెలిసిపోతూ ఉంది. సమకాలీన స్థితిగతుల నుంచి నిజాయితీ అయిన ఒక నిఖార్సయిన మీ వ్యక్తిత్వం గోచరిస్తూ ఉంది ’’ అని కితాబిచ్చారు రవీంద్రనాథ్‌ టాగూర్‌ !
సాహిత్య ప్రేమికుడు, సాహిత్య కారుడు అయిన భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు, విశ్వకవి రవీంద్రుడు, అమృతా షేర్‌ గిల్‌, కవయిత్రి సరోజినీ నాయుడు, ఫ్రెంచ్‌ సాహిత్యకారుడు, నోబెల్‌ గ్రహీత రోమైన్‌ రొల్లాండ్‌ వంటి దిగ్గజాల నుండి ఉత్తరాలు వస్తుండేవి. సమయం చూసుకుని వారికి నెహ్రూజీ సమాధానాలు రాస్తుండేవారు. ఆ రోజుల్లో లేఖలు రాయడం కూడా ఒక కళగా పరిగణించేవారు. జైలు నుండి నెహ్రూజీ తన కూతురు ఇందిరా ప్రియదర్శినికి రాసిన ఉత్తరాలు ఎంతో ప్రాముఖ్యం సంతరించు కున్నాయి. ఆ ఉత్తరాల్లో సాహిత్య, సామాజిక, చారిత్రక, స్వాతం త్రోద్యమ అంశాలు, అలాగే దేశ, కాల పరిస్థితుల గురించిన ఇతర అంశాలు ఎన్నో చర్చకు వచ్చేవి. తరవాత కాలంలో ఆ లేఖలన్నీ పుస్తకరూపంలో వెలువడ్డాయి!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img