Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

నేతన్నలకు నిజమైన నేస్తం.. వైఎస్సార్ నేతన్న నేస్తం..

బి రామదండు

చేనేత అంటే కేవలం శరీరానికి ధరించే వస్త్రాలు మాత్రమే కాదు.. భరత జాతి సంస్కృతి.. సంప్రదాయం.. వారసత్వం మిళితమై ఉన్న కళారంగం.. అంతటి గొప్ప వారసత్వాన్ని, వారి నైపుణ్యతను భవిష్య తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది… ఇందుకనుగుణంగా స్వయం సమృద్ధితో కూడిన గ్రామీణ కుటీర పరిశ్రమలను బలోపేతం చేయాలనే దిశగా జగనన్న ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు సమాజంలో ఎంతో గౌరవంగా చేనేత వృత్తిని చేపట్టిన నేతన్నలు.. గత ప్రభుత్వాల్లో పూటగడవక ఆకలితో అలమటించే పరిస్థితి.. ప్రభుత్వాలు మారిన వారి జీవితాల్లో ఇసుమంత మార్పు కూడా తీసుకురాలేకపోయింది. మగ్గం ఒడికిన చేతులు, మరో వృత్తిని చేపట్టేందుకు మనస్సు రాకా, మరోవైపు ఇదే వృత్తి నమ్ముకుంటే, కన్నబిడ్డల కడుపు కూడా నింపలేని నిస్సహాయ స్థితికి వెళ్లిపోతున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ‘ వైఎస్సార్ నేతన్న నేస్తం ’ వారి పాలిట వరమైంది..

ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు, వారి కుటుంబాలు పడుతున్న కష్టాలు స్వయంగా చూశారు. నేతన్నల ఆకలి చావులు, కష్టనష్టాలు, ఆత్మభిమానం.. చేనేత అక్కచెల్లెమ్మల గుండె చప్పుడు జగనన్నకు వినపడింది. తన స్వీయానుభవంతో నేతన్నల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పాదయాత్రలోనే ఆయన నిర్ణయించుకున్నారు. చేనేతలకు నెలకు రూ. 24 వేల ఆర్ధిక సాయం అందించడంతో ఆయా కుటుంబాల్లో గుణాత్మక మార్పు సాధించవచ్చని గుర్తించారు. దీనికి అనుగుణంగా, ఎన్నికల మానిఫెస్టోలో చేనేతలకు ఏడాదికి రూ. 24 వేలు అందిస్తామంటూ, నేతన్న బతుకుల్లో వెలుగులు నింపే సంక్షేమ వరం ప్రకటించారు. ఇందులో భాగంగానే చేనేత కార్మికుల స్థితిగతులను మార్చి… మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యంగా ఈ అపూర్వ పథకానికి జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైఎస్సార్ నేతన్ననేస్తం పథకం ద్వారా నేడు స్వంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబం కూడా ప్రభుత్వం అందించే సాయంను పొందుతోంది. ఇప్పటికే రెండు విడతలు పాటు విజయవంతంగా లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వ విడత ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా, అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా, అర్హతే కొలమానంగా ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ పథకం కింద అర్హతగల ప్రతి చేనేత కుటుంబానికి ప్రభుత్వం సాయం అందనుంది. ఇంకా ఎవరికైనా అర్హత ఉండి. పొరపాటున పేరు జాబితాలో లేకపోతే, గ్రామ సచివాలయానికి వెళ్ళి మరోసారి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. అదే సమయంలో ఈ ఆర్థిక సహాయం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు బదిలీ ద్వారా జమ చేయబడుతుంది. ఈ సొమ్మును లబ్ధిదారుల పాత అప్పులకు కింద జమ చేయరాదని ఇప్పటికే బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 81,783 మంది నేతన్నలకు రూ.196.28 కోట్లను, రెండో విడతగా 78,211 మంది లబ్ధిదారులకు రూ. 187.71 కోట్లు మొత్తం రూ. 383.99 కోట్ల ఆర్ధిక సహయాన్ని ఈ రెండేళ్లలో నేతన్నల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వ విడత ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా, అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా, అర్హతే కొలమానంగా ప్రభుత్వం పూర్తి చేసి, ఈ పథకం కింద అర్హతగల చేనేత కుటుంబాలకు ఈ నెల 10 న ముఖ్యమంత్రి వైఎఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి 69,225 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి, నేరుగా, రూ. 166.14 కోట్ల మొత్తాన్ని అందజేయనున్నారు. మొత్తంగా ఈ రెండేళ్ల వ్యవధిలో 3 విడతలుగా చేనేతలకు రూ. 550.13 కోట్ల ఆర్దిక సహాయం ఈ ప్రభుత్వం నేతన్నలకు అందింస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో చేనేతలకు కనీసం రూ. 200 కోట్లు కూడా ఆర్దికసాయం అందించని పరిస్థితి. కరోనా కష్టకాలంలో చేనేత కార్మికుల కష్టాలను, ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం 6 నెలలు ముందుగానే రెండో విడత నేతన్న నేస్తం కింద ఆర్థిక సాయం అందించిందంటే నేతన్నల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది సంకేతం.. వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద 2 ఏళ్ల స్వల్ప వ్యవధిలో దాదాపు రూ. 5.50 కోట్లు చేనేత కార్మికుల అందిస్తోన్న ఘనత మాత్రం ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అలాగే గతంలో చేనేత సహకార సంఘాలకు గత ప్రభుత్వం బకాయిలు రూ. 103 కోట్లు కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. అదే సమయంలో ప్రభుత్వం కరోనా వైరస్ నివారణకై ప్రజలందరికీ అందించే మాస్కుల తయారీకి రూ. 109 కోట్ల విలువ గల ఆర్డర్ ను సైతం చేనేత సహకార సంఘాలకు అందించింది. మొత్తంగా ఈ రెండేళ్లలో ప్రభుత్వం చేనేతల అభివృద్ధి కోసం దాదాపుగా రూ. 760 కోట్లకుపైగా ఖర్చు చేయడమంటే చేనేతల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం ఎంతగా తోడ్పాటు అందిస్తుందో అర్ధమవుతోంది.

చేనేత సోదరుల కష్టం ఎరిగిన వైసీపీ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమంతో పాటు మరోవైపు వృత్తి నైపుణ్యంపై కూడా దృష్టిసారించింది. చేనేత రంగంలో విశేష నైపుణ్యం, ప్రావీణ్యం ఉన్న నేతన్నల ద్వారా భావి తరాలకు శిక్షణ అందించేందుకు ప్రణాళికలు రూపొందించిస్తోంది. ఖాదీ, చేనేత, పొందూరు వంటి వస్త్ర పరిశ్రమల ద్వారా తయారైన వస్త్రాలను నవతరానికి చేరువ చేసేందుకు కార్యాచరణ రూపొందింస్తోంది.. జగనన్న ప్రభుత్వం. ప్రభుత్వం ప్రణాళికలు కార్యరూపం దాల్చితే, నేతన్నల జీవితాల్లో నిజమైన వెలుగులు వస్తాయి..

గత ప్రభుత్వాల్లో చాలా మంది చేనేత కార్మికులు పూట గడవక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేది.. నేడు ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక చేయూతతో, వారి కుటుంబ అవసరాలు తీరడమే కాక, వారి పెట్టుబడి సామర్ధ్యం పెరిగి, వ్యక్తిగతంగానే కాకుండా, వృత్తిపరంగా, ఆర్ధికంగా ఎదుగుదలకు ఉపయోగపడుతోంది. నేడు చేనేతలకు ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రోత్సాహంతో, గతంలో చేనేతను వదిలేసిన వారు మళ్లీ తిరిగి వచ్చి మగ్గాన్ని చేపడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఆకాంక్ష నేరవేరినట్లే.. చరిత్రలో చేనేత కుటుంబాలకు ఇంత భారీ మొత్తంలో ఏ ప్రభుత్వం కూడా ఆర్థిక లబ్ధి చేకూర్చలేదని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.. ఈ ప్రభుత్వ హాయాంలో 5 ఏళ్ల కాలంలో, ప్రతి చేనేత కుటుంబానికి లక్షా 20 వేలు సాయం చేయడం వెనుక చేనేతల పట్ల ప్రభుత్వానికి ఉన్న ధృడ సంకల్పం కనిపిస్తుంది. మూడో విడత సాయంతో కలిపి, ఒక్కో చేనేత కుటుంబానికి రెండేళ్లలో ప్రభుత్వం ప్రత్యక్ష్యంగా రూ.72 వేల సాయం అందించనట్లవుతుంది. ఇలా మొత్తంగా, 5 ఏళ్లలో మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు దాదాపు రూ. 1000 కోట్ల లబ్ధి చేకూరడం ద్వారా నేతన్నల జీవితాల్లోకి తిరిగి ఈ ప్రభుత్వం వెలుగులు నింపుతోంది. బి. రామదండు. కొత్తపల్లి
జర్నలిస్ట్..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img