Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

పడిపోయిన పెట్టుబడులు

సుబ్రత మజుందార్‌

భారతదేశంలో పెట్టుబడులు దారుణంగా పడిపోయాయి. ఫలితంగా 1290 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఉపసంహరించుకున్నారు. 202021లో అంతక్రితం సంవత్సరం కంటే మూడిరట రెండు వంతులకు పైగా పెట్టుబడులు తరిగిపోయాయి. అదే సమయంలో విదేశీ పెట్టుబడులు 19 శాతం పెరిగాయి. ప్రపంచంలో విదేశీ పెట్టుబడులు 42.7 శాతం తగ్గిపోయాయి. మనదేశంలో అమెరికా నుంచి పెట్టుబడులు బాగా పెరిగాయి. 2020లో 29.7 శాతం విదేశీ పెట్టుబడులు పెరిగాయి. కొవిడ్‌ మహమ్మారి దేశ ఆర్థిక పరిస్థితులను, ప్రజల జీవనాన్ని తల్లకిందులు చేసింది. ఈ కాలంలోనే విదేశీ పెట్టుబడులు అధికం కావటం విశేషం. సింగపూర్‌ నుంచి మన దేశానికి పెట్టుబడులు 25.6 శాతం రాగా నెదర్లాండ్స్‌ నుంచి 21.3 శాతం పెట్టుబడులు పెరిగాయి. అయితే ఈ కాలంలోనే జీడీపీ 7.3 శాతానికి పడిపోవటం, దేశీయ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాకపోవటం ఆందోళన కలిగించే అంశాలు. 201920లలో ప్రపంచ దేశాలలో పెట్టుబడులు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో పెట్టుబడులు ఎక్కువగా తగ్గిపోయాయి. ఒక్క అమెరికాలోనే 49 శాతం పెట్టుబడులు పడిపోయాయి.
మనదేశంలో వ్యవస్థీకృతమార్పులు పెట్టుబడిదారులకు అనుకూలంగా చోటు చేసుకోవటంతో విదేశీ పెట్టుబడులు పెరిగాయి. యజమానులకు అనుకూలంగా కార్మిక కోడ్‌లను రూపొందించటం, రైతులను నష్టపరిచే మూడు వ్యవసాయ చట్టాలను చేయటం తదితర మార్పులు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే మొబైల్‌ ఫోన్‌లు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌లు బాగా విస్తరించాయి. దేశంలో ఐటి నిపుణుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ప్రపంచ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలలో మనదేశం ఆరవస్థానంలో ఉన్నది. జపాన్‌కంటే మనదేశం పై స్థానానికి చేరుకొన్నది. అలాగే ఫార్మసీ రంగంలోను గణనీయంగా వృద్ధి సాధించింది. కొవిడ్‌`19 మహమ్మారి నియంత్రణ కోసం టీకాలు ఉత్పత్తి చేయటంలో అమెరికా, చైనాతో పాటు భారతదేశం కూడా ఉన్నది.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో విదేశీ పెట్టుబడులు కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తుంది. ఉద్యోగాలు పెరగటానికి అవకాశాలు ఉన్నాయి. దేశంలో డిజిటల్‌ వ్యవస్థ విస్తరించటానికి అమెరికా పెట్టుబడులు దోహదం చేశాయి. అయితే పెట్టుబడిదారుల ఎంపికలతో నిమిత్తం లేకుండా విదేశీ పెట్టుబడుల విధానాన్ని రూపొందించారని విమర్శలు ఉన్నాయి. ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో కంటే భారతదేశంలో పెట్టుబడుల రిస్కు ఎక్కువనే అభిప్రాయం ఉంది. తాజా పరిస్థితులకు అనుగుణంగా విదేశీ పెట్టుబడుల విధానంలో మార్పు రావాలని కోరుతున్నారు. 1991 తర్వాతనే దేశంలో సంస్కరణలు ప్రారంభమై విదేశీ పెట్టుబడులు ఆకర్షణీయంగా నిలిచాయి.
అనేక వస్తువుల చిల్లర వ్యాపారంలోను విదేశీ పెట్టుబడులను అనుమతించారు. రిటైల్‌ రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించాలని చాలాకాలంగా విదేశీ పెట్టుబడిదారులు కోరుతున్నారు. విదేశీ పెట్టుబడులు చిల్లర వ్యాపారంలో చొరబడితే స్వదేశీ చిల్లర వ్యాపారులు గణనీయంగా దెబ్బతింటారన్న ఆందోళన నెలకొని ఉంది. అయినప్పటికీ రిటైల్‌ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను అనుమతించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే బహుళ బ్రాండ్‌ రిటైల్‌ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను అనుమతించారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో పిల్లలు విరివిగా తినే అనేక వస్తువుల వ్యాపారానికి కూడ విదేశీ పెట్టుబడులను అనుమతించారు. కొవిడ్‌ మహమ్మారి కాలంలో రిటైల్‌ రంగంలో ఆన్‌లైన్‌ ఖాతాదారుల సంఖ్య పదిశాతం పెరిగిందని మెకిన్సీ కంపెనీ చేసిన సర్వేలో వెల్లడయ్యింది. ఆన్‌లైన్‌ వ్యాపారం ఇటీవల కాలంలో పెరిగింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కూడ ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. పాప్‌ అండ్‌ మామ్‌ షాపులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ బహుళ బ్రాండ్‌ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను ప్రవేశపెట్టారు. రిటైల్‌ పరిశ్రమ అమెరికాలో 1.2 లక్షల కోట్ల డాలర్లు వ్యాపారం పెరిగిందని అంచనా వేశారు. 2026 నాటికి ఇది 1.7 లక్ష కోట్ల డాలర్లకు పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. భవనాల నిర్మాణ రంగంలోను విదేశీ పెట్టుబడులను 100 శాతం అనుమతించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. సరళీకరణలో భాగంగా అనేక ప్రజా వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వం రూపొందిస్తున్నదన్న ఆందోళన ఎక్కువగా ఉంది. బహుళ జాతి కంపెనీలకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img