Monday, August 15, 2022
Monday, August 15, 2022

పాలకుల దోపిడీ, అప్పుల వల్లే లంక సంక్షోభం

బొల్లిముంత సాంబశివరావు
శ్రీలంకలో సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. మేలో విక్రమ సింఘే నాయ కత్వాన కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఏ మాత్రం తగ్గకపోగా మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆహార ధాన్యాలతో పాటు, నిత్యా వసర సరుకుల కొరత ఇంకా తీవ్ర రూపం దాల్చి వాటి ధరలు ఆకాశాన్నంటి ప్రజ లకు కొనుగోలు చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఊహ కందని విధంగా పెరిగాయి. దేశీయ కరెన్సీ విలువ పెద్దఎత్తున పడిపోయింది. సామాన్య ప్రజల పరిస్థితి భయానకంగా మారింది. ఆహారం కోసం అలమటిస్తున్నారు.
శ్రీలంక ఇలాంటి పరిస్థితులకు కారణం, పాలకులు అనుసరించిన సామ్రాజ్య వాద, గుత్త పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలే . ఫలితంగా దేశంలో నిరుద్యోగం, పేదరికం, ఆహార ధాన్యాల కొరత,ధరలు అదుపులేకుండా పెరగటం, విదేశీ అప్పుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ కూరుకు పోవటం జరిగింది. మహిందా రాజపక్స ప్రభుత్వానికి వ్యతిరేకంగా మే 9న ప్రజా నిరసన వెల్లువ వెత్తింది. ఆందోలనలతో దేశం అట్టుడికి పోయింది. ప్రజా ఉద్యమ దాటికి రాజపక్స ప్రభుత్వం రాజీనామా చేసింది .
శ్రీలంక సంక్షోభం అకస్మాత్తుగా వచ్చింది కాదు. 1977 నుండి సామ్రాజ్య వాదుల కనుసన్నల్లో ఎల్‌టిటీ తో సాగిన అతర్యుద్ధం ముగిసిన తర్వాత 2009 నుండి తీవ్రంగా అమలు జరుగుతున్న స్వేచ్చా వాణిజ్య, సరళీకరణ విధానాల ఫలితమే ఈ సంక్షోభం. ఫలితంగా శ్రీలంక ఆర్ధిక నిర్మాణంలో అవకతవకలు, పరాధీనత స్థిర పడిరది. స్వావలంబన అంతరించింది. శ్రీలంక సంక్షోభాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న గ్లోబల్‌ మీడియా, భారత ప్రచార సాధనాలు వీటిని ప్రస్తావించకపోవడం పెట్టుబడిదారీ దోపిడీ విధాల సమర్ధనలో భాగమే. కోవిడ్‌ విపత్తుల కాలంలో ఆదాయం కోల్పోయిన ప్రజలకు ఊరటనివ్వటానికి ప్రజల మీద భారం పడకుండా వ్యాట్‌ పరోక్ష పన్నును తగ్గించటం, ఫలితంగా ప్రభుత్వ,రాబడి తగ్గి ఆర్ధిక లోటు పెరగటం వల్ల ఆర్ధిక సంక్షోభం ఏర్పడిరదని గుత్త పెట్టుబడిదారుల గుప్పిట్లో ఉన్న మీడియాలు ప్రచారం చేస్తున్నాయి. మరో వైపున గుత్త పెట్టుబడిదారులకు ఇస్తున్న పన్ను ప్రోత్సాహకాలు, రాయితీల వలన శ్రీలంక మౌలిక సదుపాయాల, దేశాభివృద్ధి కోసమంటూ అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి 2022 వరకు 17 సార్లు రుణం తీసుకుని వారు పెట్టే కఠినమైన షరతు లకు ఆమోదించి, సంస్కరణలను కఠినంగా అమలు హామీ ఇచ్చింది. ఏషియన్‌ డవలప్‌మెంట్‌ బ్యాంక్‌, చైనా, జపాన్‌, యూరప్‌ దేశాల నుండి రుణాలు తీసుకుంది.
శ్రీలంక ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ధిక విధానాలు ప్రజల మౌలిక సదు పాయాలు పెంచటానికి, దేశాభివృద్ధకి దోహదపడలేదని, 2013 నుండే ప్రభుత్వ అంచనాలు తారుమారు అయినాయని ప్రపంచ బ్యాంక్‌ నివేదికలు తెలియ చేస్తు న్నాయి. 2003-2012 మధ్య కాలంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.4% ఉండగా 2018 నాటికి 33%కి, 2019 నాటికి 2 3% తగ్గింది. స్థూల దేశీయో త్పత్తిలో ప్రభుత్వ రుణం వాటా 2017లో 77.8% ఉండగా 2020 నాటికి 101% పెరిగింది. శ్రీలంక ప్రభుత్వం విదేశీ రుణ సహాయం లేకుండా పరిపాలన చేయలేని స్థితికి చేరింది. 2016లో ప్రపంచ బ్యాంక్‌ నుంచి 100 మిలియన్‌ అమెరికా డాలర్లు, జపాన్‌ అంతర్జాతీయ సహకార ఏజన్సీ నుండి 100 మిలియన్ల అమెరికా డాలర్లు, అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి 162.2 మిలియన్‌ అమెరికా డాలర్లు రుణంగా తీసుకుంది. వాటి షరతులను ఆమోదిస్తూ వివిధ రంగాలలో సంస్కర ణలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ విధానాల ఫలితంగా ఏర్పడిన సంక్షోభం తీవ్రమౌతూ ఉండటంతో రుణాలను నిరంతరం తీసుకోవాల్సిన పరిస్థితికి శ్రీలంక చేరింది. 2018లో చైనా నుండి 1.25 బిలియన్‌ డాలర్లు, బంగ్లాదేశ్‌ నుండి 200 మిలియన్‌ అమెరికా డాలర్లు కరెన్సీ స్వాప్‌ కింద తీసుకున్నది. తిరిగి చెల్లించే పరిస్థితి లేదు. విదేశ మారక ద్రవ్యాన్ని ఆర్జించటానికి శ్రీలంకకు ఉన్న మార్గాలు ఎగుమతులు, టూరిజం, విదేశాల్లో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు దేశానికి జమ చేసే సంపాదన.
తేయాకు, రబ్బరు, మొదలైన ప్రాథమిక వస్తువులనే శ్రీలంక ఎగుమతి చేస్తున్నది. ప్రపంచ మార్కెట్‌ వీటి ధరలు 2013 నుండి తగ్గుతూనే ఉన్నాయి. శ్రీలంక కరెన్సీ మారకపు విలువ తగ్గటం వలన ఎగుమతుల ద్వారా వచ్చే మార కపు ఆదాయం తగ్గి పోతున్నది. 2020లో ఈ తగ్గుదల 750 మిలియన్ల అమెరికా డాలర్లుగా ఉంది. దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెట్టేది టూరిజం. కోవిడ్‌ విపత్తు వల్ల అన్ని దేశాల్లో ప్రయాణాలపై నిషేధంతో ఈ రంగం కుప్ప కూలింది. టూరిజం వలన లభించే విదేశీ మారక రాబడులు ఆగిపోయాయి. కోవిడ్‌ వల్ల విదేశాలు వెళ్లిన యువత ఉపాధి కోల్పోయి తిరిగి దేశానికి రావ టంతో, వారి ద్వారా వచ్చే ఆదాయం పోయింది. ఈ విధంగా ఆదాయ వనరుల దారులు మూసుకు పోయాయి. శ్రీలంక ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గ్లోబల్‌ మీడియా ప్రచారం చేస్తున్న మరో కారణం ఏమిటంటే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉపయోగించని సేంద్రియ సాగుకు మారాలని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించటం. దీని మంచి చెడ్డలు ఎలా ఉన్నా, అసలు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఏటా 100 బిలియన్‌ రూపాయల టర్నోవర్‌ ఉన్న రసాయనిక ఎరువుల మాఫియా శ్రీలంకలో బలంగా ఉండి రసాయనిక ఎరువులను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించి సమస్యను పక్కదారి పట్టించింది.
విదేశీ రుణాల ఊబిలో చిక్కుకున్న శ్రీలంక వాటి రుణాలు తీర్చటం సాధ్యం కాని పరిస్థితికి నెట్టబడిరది. ఈ సంవత్సరం చెల్లించాల్సిన విదేశీ అప్పులు 609 బిలియన్ల అమెరికా డాలర్లు. 2020లో స్థూల జాతీయోత్పత్తిలో విదేశీ రుణాల వాటా 60.9% కాగా, 2021 సెప్టెంబర్‌ నాటికి విదేశీ మారక చెల్లింపులలో కరెంట్‌ అకౌంట్‌లో లోటు 740.8 మిలియన్‌ అమెరికా డాలర్లు. దేశంలో విదేశీ మారక నిధులు అంతరించాయి. మార్కెట్‌ శక్తులు నిర్ణయించే శ్రీలంక కరెన్సీ మారకపు విలువ మరింత దిగజారింది.
వ్యాస రచయిత సెల్‌: 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img