ఒక అంచనా ప్రకారం దేశంలో 20 లక్షల విద్యుత్ వాహనాలకు చార్జింగ్ సేవలందించాలంటే 2026 నాటికి 4,00,000 చార్జింగ్ కేంద్రాలుండాలి. ప్రస్తుతం ఇవి కేవలం వేల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటి అమ్మకాలతో బాటు ఇవి కూడా పెరుగుతాయి. పెద్ద నగరాల్లోని కొన్ని సంస్థలు గేటెడ్ కాలనీల్లోని ‘‘రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల’’ తో తమ కాలనీలలో బ్యాటరీ మార్పిడి కేంద్రాల స్థాపనకు సంప్రదింపులు జరుపుతున్నాయి. దిల్లీ ప్రభుత్వం తమ కార్యాలయాల దగ్గర ఇట్టి కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అంతర్జాతీయ సంస్థలైన Aదీదీ, పానసోనిక్‌లు కూడా భారీ ప్రణాళికలతో వీటి ఏర్పాటుకు ప్రయత్నంలో ఉన్నాయి.
వాతావరణ కాలుష్యం తగ్గించడానికి ఉపయోగపడే విద్యుత్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. వీటిలో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలున్నాయి. మన దేశంలో వాడుకలో ఉన్న విద్యుత్ వాహనాల్లో అత్యధికం ద్విచక్రవాహనాలే. వీటికి బ్యాటరీ మార్పిడితో అవసరముండదు. యజమానులు వారి ఇంటివద్దే రాత్రి సమయంలో బ్యాటరీని చార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది. కేవలం వ్యాపారనిమిత్తం వాడుతున్న వాహనాలకు మాత్రమే బ్యాటరీ మార్పిడి అవసరముంటుంది. కేంద్రం కల్పిస్తున్న రాయితీలతో బాటు రాష్ట్రాలు కూడా అదనంగా మరికొన్ని రాయితీలు వీటికి కల్పించడంతో ముఖ్యంగా ద్విచక్రవాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయి. కాని వీటి చార్జింగు కోసం ప్రస్తుతం తగినన్ని మౌలికవసతులు కల్పించకపోవడంతో భవిష్యత్తులో ఈ అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది. చార్జింగ్ స్టేషన్ల నిర్మాణం చాలా వ్యవధితో కూడుకున్న ప్రక్రియ. వీటి నిర్మాణం కోసం కేంద్రం సానుకూలంగానే ఉంది. ఈ స్టేషన్ల ముఖ్యమైన పని ఖాళీ అయిన బ్యాటరీ స్థానంలో కొత్త బ్యాటరీని అమర్చడం. ఇందుకై కొంత పైకాన్ని వాహనదారుడు చెల్లించాలి. ఈ పైకాన్ని వాహనాల అమ్మకాలను ప్రోత్సహించడం కోసం, వాహనాన్ని తక్కువ ధరకు వినియోగదారునికి అందించడం కోసం బ్యాటరీలు లేకుండా వీటిని అమ్మవచ్చని కేంద్రం కంపెనీలకు వెసులుబాటు కల్పించింది. వాహన కొనుగోలుదారులు వీటి బ్యాటరీలను బయట మార్కెట్లో తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. సాధారణంగా వీటి ధర వాహనం ధరలో 40శాతం కన్నా ఎక్కువ ఉండదు.
2030 నాటికి మొత్తం ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాల్లో 80 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు, నాలుగచక్రాల వాహన అమ్మకాల్లో 50 శాతం, బస్సుల అమ్మకాల్లో 40 శాతం నమోదవ్వాలని నీతిఅయోగ్ లక్ష్యం. దీనికిగాను భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా చార్జింగు వసతి కల్పించవలసిన అవసరం ఉంది. 2021లో ముఖ్యంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. 2021లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాలు 2020 లో నమోదైన 1,19,652 నుండి 3,11,350 లకు అంటే 160 శాతం పెరిగాయి. 2021 డిశంబరులో ఒక్క ద్విచక్ర వాహనాలు అమ్మకాలే 24,725. ఇది గత నెల నవంబరుతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువ. జనవరి 2022లో ఈ రెండిరటి అమ్మకాలూ సుమారు 9.66 లక్షలు. దేశవ్యాప్తంగా సుమారు 55 సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి. బడా ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు హీరో, బజాజ్, టివిఎస్, ఓలా ఎలక్ట్రిక్ వంటివి భారీ స్థాయిలో తయారీకి ప్రణాళికలు రూపొందించాయి. ఓలా ఎలక్ట్రిక్ ఏటా 20 లక్షల వాహనాలను తయారుచేసే సామర్ధ్యంతో ఉంది. భవిష్యత్తులో కోటి వాహనాల తయారీకి లక్ష్యంతో ఉంది. ఆటోమొబైల్స్ విషయానికొస్తే, విద్యుత్ వాహనాల డిమాండ్ పెరుగుదల నత్త నడకలో ఉన్నా, టాటాస్ నెక్సన్ మోడల్, టైగర్ మోడల్ వీG ్గూజుప (రూ.21 లక్షలు) వంటివి వాహన యజమానుల మన్ననలను పొందగలిగాయి. మహేంద్ర సంస్థ కూడా త్వరలో వీటి ఉత్పత్తిని ప్రారంభించనుంది. అత్యంత ఖరీదైన కార్ల అమ్మకాల్లో పేరుగాంచిన మెర్సిడెస్, ఆడి, దీవీలు కూడా ఇట్టి కార్లను ఇండియన్ విపణిలోకి తెచ్చాయి గాని వాటి ధరను బట్టి కొనడానికి భారీ సంఖ్యలో వస్తారని ఆ కంపెనీలు కూడా ఆశించటం లేదు. ఒక్క ఆడి కారు మోడలే కోటి రూపాయిలు.
ఒక అంచనా ప్రకారం దేశంలో 20 లక్షల విద్యుత్ వాహనాలకు చార్జింగ్ సేవలందించాలంటే 2026 నాటికి 4,00,000 చార్జింగ్ కేంద్రాలుండాలి. ప్రస్తుతం ఇవి కేవలం వేల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటి అమ్మకాలతో బాటు ఇవి కూడా పెరుగుతాయి. పెద్ద నగరాల్లోని కొన్ని సంస్థలు గేటెడ్ కాలనీల్లోని ‘‘రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల’’ తో తమ కాలనీలలో బ్యాటరీ మార్పిడి కేంద్రాల స్థాపనకు సంప్రదింపులు జరుపుతున్నాయి. దిల్లీ ప్రభుత్వం తమ కార్యాలయాల దగ్గర ఇట్టి కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అంతర్జాతీయ సంస్థలైన Aదీదీ, పానసోనిక్‌లు కూడా భారీ ప్రణాళికలతో వీటి ఏర్పాటుకు ప్రయత్నంలో ఉన్నాయి.
టాటా పవర్ సంస్థ సుమారు 1,000 స్టేషన్లు ఏర్పాటు చేసి త్వరలో వీటిని 10,000కు పెంచదలచింది. గృహసముదాయాలు, దుకాణాలు, కార్యాలయాల సముదాయాలున్న ప్రదేశాల్లో చార్జింగ్ మార్పిడి కేంద్రాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. వీటి నిర్మాణం ప్రారంభ దశలోనే బిల్డర్లు మిగతా సదుపాయాల తరహాలో చార్జింగు కేంద్రాలను కూడా తమ బిల్టింగ్ ప్లానులో ఒక భాగంగా చేర్చాలి. వీటివలన సంబంధిత వ్యక్తులకు, శాఖలకు ఆదాయం కూడా లభిస్తుంది. జాతీయ రహదారులపై కూడా ఇట్టి స్టేషన్లను ఏర్పాటు చేస్తే, వాణిజ్య, విద్యుత్ వాహనాల గిరాకీ మరింత ఊపందుకుంటుంది. ఇప్పటికే రైల్వేవాహనాలు విద్యుత్‌తోనే చాలా ఏళ్ళ నుండి నడుస్తున్నాయి. వాణిజ్య వాహనాలు కూడా పెట్రోలు, డీజిలు రహిత ఇంధనాలవైపు మొగ్గుచూపాయి. 2030 నాటికి పెట్రోలియం ఉత్పత్తుల మొత్తం వినియోగంలో ఈ రెండిరటి వాటా ఇపుడున్న 50 శాతం నుంచి 44 శాతానికి దిగుతుందని క్రిసిల్ రిసెర్చి సంస్థ పేర్కొంది. 2030 నాటికి కాలుష్య తీవ్రతను 45 శాతానికి తగ్గిస్తామని భారత్ హామీ ఇచ్చింది. ఈ ప్రక్రియలో రవాణా వాహనాల పాత్ర కీలకం. దేశీయ చమురు వినియోగంలో అత్యంత భారీగా వినియోగించేది రవాణా రంగమే. ప్రపంచ వ్యాప్తంగా మూడోవంతు చమురు వినియోగంతో అతి పెద్ద కాలుష్య విడుదల దేశంగా భారత్ నమోదైంది. చమురు దేశీయ వినియోగంలో 80 శాతం కేవలం రోడ్డు రవాణాయే వినియోగిస్తోంది. విద్యుత్ వాహనాల వాడకం దేశంలో ఆశించిన స్థాయిలో పెరగడంలేదు.
దీనికి ముఖ్యమైన కారణాలు: వాహనాలు ధరలు అధికంగా ఉండటం. ఓలా ద్విచక్ర వాహనం ప్రారంభ వెల రూ. 1.3 లక్షలు. వీటిని కొన్నాళ్ళు వాడిన తర్వాత తిరిగి అమ్మాలంటే ఎవరూ కొనరు ఒక వేళ కొన్నా చాలా తక్కువ ధరకే కొంటారు. వాహనానికి బ్యాటరీ కీలకం. బ్యాటరీ లేకుండా వాహనం వ్యర్ధం. ఈ ఒక్క అంశంతో బ్యాటరీ అమ్మకపుదారులు ఏకమై వాటి ధరలను విపరీతంగా పెంచవచ్చు. కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ సందర్భాల్లో ఈ వాహనాలు అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయన్న వార్తలు వ్యాపించాయి. కమర్షిÛయల్ వాహనాల బ్యాటరీ మార్పిడి కేంద్రాలు తక్కువ సంఖ్యలో ఉండడం. దీని వలన సుదీర్ఘ ప్రయాణాలు చేయలేరు. నాలుగు నెలల్లో ఈ స్టేషన్ల ఏర్పాటుకు విధి విధానాలను రూపొందించాలని నీతి అయోగ్ నిర్ణయించింది. వాణిజ్య వాహనాలకు ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్ రాయితీలు కాగితాలకే పరిమితమయ్యాయి. భారత్ తన చమురు అవసరాలకు 85 శాతం ఇతర దేశాలపై ఆధారపడుతూ వస్తోంది. అంతర్జాతీయ క్రూడ్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో అంతు పట్టని విషయం. గతంలో రికార్డు స్థాయిలో బేరల్ చమురు ధర 147శాతానికి కెళ్ళింది. అంతర్జాతీయంగా భవిష్యత్తులో ముడిచమురు ధర పెరిగితే రిటైలు స్థాయి చమురు ధరలు లీటరు రూ.200 లకు చేరవచ్చు. ఇప్పటికే శ్రీలంకలో లీటరు పెట్రోలు రూ.250లకు చేరింది. వాహన యజమానులు ప్రత్యామ్నయ మార్గాలవైపు దృష్టి సారించడం మంచిది. ఈ విషయంలో విద్యుత్ వాహనాలే ఇటు వినియోగదారులకు, అటు ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయం.
డా.యస్.వై.విష్ణు, సెల్. 9963217252