Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

ప్రజాదరణ చూరగొన్న జన ఆందోళన్‌

టి.వి.సుబ్బయ్య

ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చిన రీతిలో పాలనా విధానాలు రూపొందిస్తూ, ప్రజలను అన్ని విధాలుగా కష్టాలకు గురి చేస్తున్నప్పుడు వామపక్షాలు మినహా ఇతర పార్టీలు అంతగా స్పందించవు. ఆయా పార్టీలు తమ ప్రయోజనాలు పరిరక్షించుకొనేందుకే ప్రాధాన్యత నిస్తున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకొనేందుకు జరుగుతున్న పోరాటంలో, మోదీ ప్రభుత్వం చేసిన వినాశకర చట్టాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న ఉద్యమాల విషయంలోనూ ఇతర ప్రతిపక్షాల వైఖరిని మనం చూడవచ్చు. సీపీఐ రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా జన సంక్షేమం కోసం ప్రజలకు సమస్యలను వివరించేందుకు జనాందోళన్‌ను చేపట్టింది.

ప్రజలకు హాని కలిగించే పాలక విధానాలను నిరసిస్తూ పోరాటాలు చేస్తూ సీపీఐ ప్రజాదరణను చూరగొంటోంది. తాజాగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ హించిన జన ఆందోళన్‌ పాదయాత్రలకు విస్తృతంగా ప్రజాదరణ లభించింది. పోరాడి, ప్రాణాలర్పించి సాధించుకొన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా పరిపాలన సాగిస్తూ, కార్పొరేట్లకు అన్ని ప్రభుత్వ సంస్థలను అప్పగించాలని నిర్ణయించడం దేశానికి తీవ్ర హానికరం. అలాగే వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేందుకు, రైతులను కూలీలుగా మార్చేందుకు దోహదం చేసే మూడు దుష్ట చట్టాలను మోదీ ప్రభుత్వం చేసింది. కార్మికుల హక్కులను హరించి వారిని అర్ధ బానిసలుగా తయారుచేసే కార్మిక కోడ్స్‌ను దేశంపై రుద్దడానికి మోదీ పూనుకున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా జన సంక్షేమం కోసం ప్రజలకు ఈ సమస్యలను వివరించేందుకు జనాందోళన్‌ను చేపట్టింది. అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, తణుకు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని వివిధ చోట్ల, చివరిగా విశాఖ పట్నంలో జన ఆందోళన్‌ పాదయాత్రలు విజయవంతంగా జరిగాయి. సీపీఐ రాష్ట్ర, జిల్లాల నాయకత్వం ఈ ఆందోళనలో భాగంగా పాదయాత్రలను విజయ వంతంగా నిర్వహించింది. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని కార్యకర్తలలో ఉత్సాహం కలిగించింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పార్టీ చేపట్టిన ఈ ఆందోళన 27 సోమవారం జరగనున్న భారత్‌ బంద్‌కు ప్రజలను సమా యత్తం చేసేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది.
ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చిన రీతిలో పాలనా విధానాలు రూపొందిస్తూ, ప్రజలను అన్ని విధాలుగా కష్టాలకు గురి చేస్తున్నప్పుడు వామపక్షాలు మినహా ఇతర పార్టీలు అంతగా స్పందించవు. ఆయా పార్టీలు తమ ప్రయోజనాలు పరిరక్షించుకొనేందుకే ప్రాధాన్యత నిస్తున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడు కొనేందుకు జరుగుతున్న పోరాటంలో, మోదీ ప్రభుత్వం చేసిన వినాశకర చట్టా లను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న ఉద్యమాల విషయంలోనూ ఇతర ప్రతిపక్షాల వైఖరిని మనం చూడవచ్చు. మూడు వ్యవసాయ చట్టాలను ఎవరితోనూ, కనీసం రైతులతోనైనా చర్చించకుండా నిరంకుశంగా మంది బలంతో పార్లమెంటు ఆమోదాన్ని బీజేపీ ప్రభుత్వం పొందింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు 500 రైతు సంఘాలు కలిసి సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వంలో దాదాపు పది నెలలుగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఈ మహత్తర రైతు పోరాటానికి దేశ, విదేశాల నుండి మద్దతు లభిస్తోంది. పోరాటం చేస్తున్న రైతులతో చిత్తశుద్ధితో చర్చించకుండా ప్రధాని మోదీ విస్మరిస్తున్నారు. పైగా పోరాటాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అనేక మాయోపాయాలు పన్నినప్పటికీ, దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే రైతులు నిశ్చయించుకున్నారు. కార్మిక కోడ్‌లకు వ్యతిరేకంగా ఏఐటియూసీ, సీఐటీయూ, ఐఎన్‌టియూసీ తదితర కేంద్ర ట్రేడ్‌ యూనియన్ల నాయకత్వంలో దేశ వ్యాప్త బంద్‌ జరిగినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. కరోనా కల్లోలం సృష్టించిన కాలంలో మోదీ ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, బాధ్యతారాహిత్యం బట్టబయలైంది. వైద్య, ఆరోగ్య వ్యవస్థను ప్రభుత్వ రంగంలో బలోపేతం చేయకపోవడమే ఈ దుస్థితికి కారణం.
కులాల, మతాల మధ్య విభజనకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి ప్రయత్నిస్తున్నాయి. చివరికి పాఠ్యపుస్తకాల ద్వారా చిన్నతనంలోనే పిల్లల్లో మత భావనలు ప్రోది చేసేందుకు ప్రభుత్వం పూనుకున్నది. రాజ్యాంగం పేర్కొన్న లౌకిక వ్యవస్థ అన్న స్పృహ కూడా మోదీ ప్రభుత్వానికి లేదు. రాజ్యాంగాన్ని, కోర్టులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని 370 అధికరణ రద్దు నాటి నుండి అనేక అంశాలలో తేటతెల్లమైంది. ప్రత్యర్థులు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారిపైన, జర్నలిస్టులపైన చివరకు సొంత మంత్రులపైన మోదీ ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌ నిఘాను ఏర్పాటు చేయడం దారుణం. పెగాసస్‌ వివరాలు చెప్పాలని సుప్రీంకోర్టు అడిగినప్పటికీ మోదీ ప్రభుత్వం నిరాకరించింది. ప్రజల కష్టంతో నిర్మించుకొన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను తమ ఆశ్రిత కార్పొరేట్ల పాలు చేసేందుకు మోదీ ప్రభుత్వం పూనుకొని ప్రజలను వంచిస్తున్నదని భావించాలి. మోదీ వచ్చాక అన్ని రకాల వస్తువుల ధరలు అపారంగా పెరిగాయి. పెట్రోలు, డీజిలు, ఇళ్లలో వాడుకొనే వంటగ్యాస్‌ సిలిండరు ధరలను అపారంగా పెంచి వినియోగదారులపై మోయ లేని భారం మోపింది.
మోదీ ప్రజలకు చేసిన అన్యాయాలు లెక్కకు మించి ఉన్నాయి. కరోనా నియంత్రణకు వ్యాక్సిన్‌ పంపిణీ, కరోనా వల్ల చనిపోయిన వారిపట్ల అను సరించిన విధానం ప్రభుత్వం మరింత అన్యాయంగా వ్యవహరించింది. ఇలాంటివి అనేక అన్యాయాలను అరికట్టడానికి, రాజ్యాంగం, దేశ స్వాతంత్య్రం పరిరక్షణకు ప్రజలు మరో మహత్తర పోరాటం చేయవలసిన తరుణం ఆసన్నమైంది. ఇందుకోసం ఉద్యమాలు నిర్వహిస్తోన్న వామపక్ష, ప్రజాతంత్ర శక్తులకు ప్రజల మద్దతు, తోడ్పాటు, భాగస్వామ్యం ఎంతైనా అవసరం. ఈ దిశలో చేపట్టిన భారత్‌ బంద్‌ ఆందోళనలో అన్ని తరగతుల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి. అప్పుడే ప్రభుత్వాలు కళ్లు తెరిచే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img