Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ప్రతిపక్షాన్ని అప్రతిష్ఠపాలు చేసే కుట్ర

డా॥ జ్ఞాన్‌ పాఠక్‌

దిల్లీ ఆప్‌ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా రూపొందించిన ఎక్సైజ్‌ విధానం ద్వార అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణతో ఫిబ్రవరి 26 న సిబిఐ అరెస్టు చేసింది. ఈ విషయంలో ప్రతిపక్షం కలిసికట్టుగా ప్రతిఘటించవలసి ఉన్నప్పటికీ అలాంటి యత్నం జరగలేదని కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యానించారు. కేవలం అరెస్టును మాత్రమే ఖండిరచారు. ఖండిస్తూ మాట్లాడటం, ప్రకటనలు చేయటం వల్ల ప్రతిక్షం అంతా ఒకటిగా నిలిచిందన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చే అవకాశమే ఉండదు. ఇలాంటి సంఘటనలను ఇప్పటికైనా గుర్తించి ప్రతిపక్షం ఒక్కతాటిపైకి వచ్చి అసెంబ్లీలకు, లోక్‌సభకు జరగనున్న ఎన్నికలను ఎదుర్కోవాలి.

క్రీడా పోటీల్లో ప్రత్యర్థి టీములు ఒకదానిపై ఒకటి గెలిచేందుకు సాధారణంగా రకరకాల వ్యూహాలు పన్నుతుంటాయి. అయితే రాజకీయాల్లో కేవలం ఇలాంటి వ్యూహాలు ఉపయోగపడవని మోదీఅమిత్‌షా ధ్వయం కుట్రపూరిత వ్యూహాలు, ఎత్తుగడలు పన్నడం సాదారణమైపోతోంది. 2023లో చాలా రాష్ట్రాల అసెంబ్లీలకు, 2024 లో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలు కుట్రపూరిత వ్యూహాలే పన్నుతున్నారు. ముందుగా ప్రతిపక్షాలను అప్రతిష్ఠపాలు చేసేందుకు ఈ వ్యూహాలను ప్రయోగించనున్నారు. మరిన్ని ఆర్థిక వనరులను నిల్వ చేసుకోవటం, ప్రతిపక్ష నాయకులపై కేసులు బనాయించి అరెస్టులు చేయించటం ఆయా రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించటం లాంటి వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఈ అంశాలపై నిపుణులు రెండు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మోదీషా ధ్వయం వ్యూహం 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బీజేపీకి అధికారాన్ని కట్టబెడుతుందని చెప్తున్నారు. మరికొందరు వీరిద్దరి వ్యూహాలను నిలువరించేందుకు ప్రతిపక్షమంతా ఒక్కటవుతుందని వీరిద్దరిని విలన్‌లుగా ప్రజలకు వివరించి చివరికి బీజేపీ పాలనకు చరమగీతం పాడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు అభిప్రాయాల్లో ఏది నిజమవుతుందనేది కాలమే చెప్పగలదు.
ఈ సంవత్సరం 9 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు 2024 లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు. అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు భిన్నంగా కూడ ఉండవచ్చు. ఏమైనా ఈ ఎన్నికలు భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైనవిగా ఉండనున్నాయి. అంతేకాదు భారతదేశ భవిష్యత్‌ స్వరూపాన్ని నిర్ణయించేవిగా కూడ ఉంటాయి. దేశం ఫెడరల్‌, సెక్యులర్‌ రాజ్యంగా మిగులుతుందా! లేక నియంతృత్వ దేశంగా మారుతుందా! అన్న విషయాలను తెలియజేస్తాయి. గత తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దర్యాప్తు సంస్థల ద్వారా అనేకమంది ప్రతిపక్ష నాయకులను, మేధావులను అరెస్టు చేయించి జైళ్లలో పెట్టారు. ఆయా రాజకీయ పార్టీల మధ్య తంపులు పెట్టి చీల్చారు. రాజకీయ పార్టీల ఆర్థిక శక్తిస్థోమతలను గణనీయంగా బలహీన పర్చారు. ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టి ప్రతిపక్షాల ఆర్థిక వనరుల సమీకరణ మీద చావుదెబ్బ కొట్టారు. బాండ్ల ద్వార బీజేపీ మాత్రం వేలకోట్ల రూపాయలను సమీకరిస్తోంది. ఇవే కాకుండా రహస్య విరాళాలు అపారంగా వచ్చి చేరుతున్నాయి. సమకాలీన రాజకీయాలలో ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టే కొత్త వ్యూహం ఇది. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసే వారిలో అత్యధికులు నల్లధనులే. నల్ల ధనాన్ని నిర్మూలిస్తాననే మోదీ పలికిన బీరాలన్నీ ఈ పథకం ద్వార డొల్లని తేలింది. ఈ పథకాన్ని ప్రతిపక్షం ఐక్యంగా వ్యతిరేకించి బీజేపీ ఎత్తుగడలను తిప్పి కొట్టలేకపోయింది.
దిల్లీ ఆప్‌ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా రూపొం దించిన ఎక్సైజ్‌ విధానం ద్వార అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణతో ఫిబ్రవరి 26 న సిబిఐ అరెస్టు చేసింది. ఈ విషయంలో ప్రతిపక్షం కలిసికట్టుగా ప్రతిఘటించవలసి ఉన్నప్పటికీ అలాంటి యత్నం జరగలేదని కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యానించారు. కేవలం అరెస్టును మాత్రమే ఖండిరచారు. ఖండిస్తూ మాట్లాడటం, ప్రకటనలు చేయటం వల్ల ప్రతిక్షం అంతా ఒకటిగా నిలిచిందన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చే అవకాశమే ఉండదు. ఇలాంటి సంఘటనలను ఇప్పటికైనా గుర్తించి ప్రతిపక్షం ఒక్కతాటిపైకి వచ్చి అసెంబ్లీలకు, లోక్‌సభకు జరగనున్న ఎన్నికలను ఎదుర్కోవాలి. సీబీఐ ద్వార సిసోడియాను అరెస్టు చేయించటమే కాక చత్తీస్‌ఘర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాల నిర్వాహాకులను బెదిరించినట్లు వార్తలు అందాయి. ప్లీనరీకి విరాళాలు ఇచ్చి సహకరించిన వ్యాపారవేత్తలపై దాడులు జరిపి బీజేపీ ప్రభుత్వం హద్దులు దాటిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ భగల్‌ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లీనరీ సమావేశాలు జరగకుండా భయోత్పాతం సృష్టించి ఈడి అధికారుల ద్వార వ్యాపారాలతోసంబంధాలు కలిగిన వారిఇళ్లపై దాడులు చేయించారు. ప్రస్తుతానికి ప్రతిపక్షం ఐక్యత సాధించలేకపోయినప్పటికీ భవిష్యత్‌లో రానున్న ప్రమాదాన్ని గుర్తించి ఏకం కావల్సిన తరుణం ఇదే. 2012 లో అన్నాహజారే నాయకత్వంలో జరిగిన అవినీతివ్యతిరేక ఉద్యమంఫలితంగా దిల్లీలో ఆనాటి కాంగ్రెస్‌ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచీ ఆప్‌ప్రతి ఎన్నికలోను గెలిచి అధికారాన్ని పదిలపరుచుకుంది. ఆప్‌ కూడ తమకు కలిగిన అనుభవాన్నే ఎదుర్కొంటుందని కాంగ్రెస్‌ ఆనాడు ఖండిరచింది.
మోదీప్రభుత్వం రాజకీయకక్షతో ఎంపికచేసుకున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టుచేసి హింసించేందుకు ఈడి, సీబీఐ, ఐటి శాఖలను తన పనిముట్లుగా చేసుకుంటుందని కాంగ్రెస్‌ నాయకుడు జైరామ్‌ రమేశ్‌ ట్వీట్‌చేశారు. ఈ దర్యాప్తుసంస్థలు వృత్తినైపుణ్యాన్ని పూర్తిగా కోల్పో యాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆప్‌, కాంగ్రెస్‌ల మధ్య విభేదాలు సృష్టించడంలో మోదీషాల వ్యూహం విజయం సాధించింది. 2024 ఎన్నికల్లోపు ఆప్‌ , బిఆర్‌ఎస్‌ మధ్య అగాధాన్ని సృష్టించే పనిలో ఈ ద్వయం ఉన్నారు. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌తో కలవకూడదన్న వీరి ఎత్తుగడ కూడ ఫలించిందనే చెప్పాలి. ఈ పార్టీల మధ్య ఓట్లు చీలిపోతే అది బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుంది. మరోవైపు ఆప్‌ కాంగ్రెస్‌ బలంగా ఉన్న అన్ని రాష్ట్రాలను లక్ష్యంగా పెట్టుకొని ఎన్నికల బరిలో దిగి ఓట్లను చీల్చి కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తోంది. పంజాబ్‌లో మోదీ అమిత్‌షాల వ్యూహం కూడ ఫలించి కాంగ్రెస్‌ నుండి ఆప్‌ అధికారాన్ని దక్కించు కున్నది. గుజరాత్‌లోను ఆప్‌ ప్రవేశించడంతో కాంగ్రెస్‌ 50 సీట్ల వరకు కోల్పోయింది. ఆప్‌ వల్ల బీజేపీకే మేలుజరిగింది. తెలంగాణలో బిఆర్‌ఎస్‌, బెంగాల్‌లో టిఎంసీ తమతమ రాష్ట్రాల్లో తమ పార్టీలే గెలుస్తాయని ఆశిస్తూ ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు దూరంగానే ఉన్నాయి. రానున్న నెలల్లో ప్రతిపక్షాలను, ఆయా పార్టీల నాయకులను మరింత అప్రతిష్ఠ పాలుచేసి వీరి మధ్య చీలికలు తీసుకొచ్చే వ్యూహాన్ని మోదీ`షాలు అనుసరించ నున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, ఆప్‌, బిఆర్‌ఎస్‌, జెడియు, జెడిఎస్‌, జెఎన్‌ఎం, ఆర్‌జెడి, టిఎంసీ, వామపక్షాలు ఎదురుకానున్న ప్రమాదాన్ని గ్రహించి తమ మధ్య ఉన్న చిన్న చిన్న తగాదాలను పక్కనపెట్టి బలమైన ఐక్యతను సాధించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img