Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ప్రాణాలు హరించవచ్చు, ప్రజావాణిని అణచలేం..!

నిలోఫర్‌ సుహ్రావర్ది, ప్రముఖ జర్నలిస్టు

తమ హక్కులు, శాంతి కోసం పోరాడిన లక్షలమంది ప్రాణాలు కోల్పోవచ్చుగానీ వారి గొంతులను మాత్రం అణచలేం అనేది స్పష్టం. 2002లో గుజరాత్‌లో జరిగిన మారణకాండలో వేలాదిమందిపై అత్యాచారాలుచేసి హత్య చేశారు. గుజరాత్‌-మారణహోమంపై బీబీసీ డాక్యుమెంటరీ మళ్లీ ప్రధానంగా తెరమీదకు వచ్చింది. ఆసక్తి ఉన్నవారు వ్యక్తిగతంగా,సామూహికంగా వీక్షించారు. ఈ సందర్భంలో భారత జాతీయ మీడియా రెండు అంశాలకు గణనీయమైన ప్రాముఖ్యత ఇచ్చింది. స్క్రీనింగ్‌ను నిరోధించే చర్యలు ప్రభుత్వం చేపట్టినప్పటికీ నిషేధించిన సినిమాను చూసేందుకు ముఖ్యంగా యువత, విద్యార్థులు ఉత్సుకత కనబరచారు. 2002లో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో గుజరాత్‌ మారణహోమం భారతీయ లౌకికవాదానికి పెద్దమచ్చగా పేర్కొనవచ్చు. ఈ సంఘటన జరిగి రెండు దశాబ్దాలు పూర్తయింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ(బిజెపి) ఆధ్వర్యంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా అధికారంలో ఉన్నారు. ముస్లింలు లక్ష్యంగా జరిగిన గుజరాత్‌ మారణకాండ 2004 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీి ఓటమికి ప్రధాన కారణం. ఆ తర్వాత కేంద్రంలో ఏర్పడిన రెండు యూపీఏ ప్రభుత్వాలు మన్మోహన్‌సింగ్‌ ప్రధానమంత్రిగా ఏర్పడ్డాయి.
అసలు విషయానికొస్తే, గుజరాత్‌-మారణహోమం గురించి బీబీసీ డాక్యుమెంటరీ ఏమి చెబుతుందో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్న యువకులు బహుశా అప్పటికి పుట్టి ఉండరు. పుట్టినా చాలా చిన్నపిల్లలు అయిఉండాలి. దీనికి తోడు మోదీ అప్పుడు జాతీయ నాయకుడు కూడా కాదు. బీజేపీి జాతీయ ప్రతిష్ట వాజ్‌పేయి, ఎల్‌కె అద్వానీ వంటి కొంతమంది ప్రముఖులతో ముడిపడి ఉంది. ఈ డాక్యుమెంటరీ ప్రసారం నిలిపివేయకపోతే, గుజరాత్‌-మారణహోమంపై యువతకు ఆ సంఘటన గురించి అప్పటివరకు తాము తెలుసుకున్న దానికే పరిమితమై ఉండేవారు. బీబీసీ డాక్యుమెంటరీ ఏమి చెబుతుందో తెలుసుకోవడంపై వారికి ఆసక్తి ఉండేది కాదు. అయితే కొన్ని విశ్వవిద్యాలయాలలో దాన్నిచూపకుండా నిరోధించడానికి లేదా నిషేధించడానికి కఠినమైన చర్యలు తీసుకోకపోతే, దీని గురించి ఎటువంటి ‘‘వార్తలు’’ ప్రసారం చేయకపోతే ఇతర విద్యాసంస్థల్లోని విద్యార్థులు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి ముందుకు కూడా వెళ్లేవారు కాదు. ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని చర్యలు నూతన యువతరాన్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా ఉద్దేశపూర్వకంగా ఉండటంతో, ప్రభుత్వ ఆంక్షలనువారు ఖాతరుచేయని పరిస్థితి ఎదురైంది. ఈ ధోరణి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యువతలో ఆచరణాత్మకంగా ప్రబలంగా ఉంది. అయితే కొన్ని దేశాలలో ఈ నిరసనలు స్వల్పంగానే ఉన్నాయి. ఉక్రెయిన్‌-సంక్షోభానికి సంబంధించి శాంతి కోసం చేపట్టిన పిలుపు, పలస్తీనియన్ల హక్కుల కోసం ప్రపంచవ్యాప్త మద్దతు, బ్రిటన్‌లో నర్సుల సమ్మె, ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరిగే అందోళనలో యువతదే పైచేయిగా ఉంది. వివిధ కారణలతో మనదేశంలో కూడా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనల్లోయువత పెద్ద ఎత్తున పాల్గొంటూనేఉంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనల్లో వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. తాజాగా రైతుల నిరసన ఉద్యమంలో వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆగస్టు 2020 నుండి సంవత్సరానికి పైగా రైతు నిరసనోద్యమం కొనసాగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. షాహీన్‌ బాగ్‌ నిరసనలో (డిసెంబర్‌ 2019 నుండి మార్చి 2020 వరకు) వృద్ధ ముస్లిం మహిళలు ముందంజలో ఉన్నారు.
కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు ఆకర్షితులైన యువకులు మార్చ్‌ విజయానికి కారణమయ్యారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ఆయన ధ్వజమెత్తారు. దక్షిణ భారత్‌లోని కన్యాకుమారి నుండి సెప్టెంబర్‌ 7న ప్రారంభమైన భారత్‌ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చింది. సుమారు 4,000 కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని కవర్‌ చేస్తూ, జనవరి 30న శ్రీనగర్‌ (ఉత్తర భారతదేశం)లో ముగింపునకు ముందు లాల్‌చౌక్‌ వద్ద రాహుల్‌ జాతీయ జెండాను ఆవిష్కరించడంతో యాత్రకు ముగింపు పలికారు. తీవ్రవాదం, రైతుల సమస్యలు, దేశంలోని ఇతర ప్రాంతాలలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య రాహుల్‌ పాదయాత్ర బహుశా చాలా మంది భారతీయులకు, ముఖ్యంగా యువకులు, వృద్ధులకు రాజకీయ ‘‘హీరో’’గా ఉద్భవించేలా చేసింది. ఈ సంఘటన రాహుల్‌ను ‘‘బలహీనమైన’’ నాయకుడిగా ప్రచారం చేయడానికి ప్రత్యర్థి పార్టీలు ముందుగా పన్నిన వ్యూహాన్ని తలక్రిందులు చేసింది. సగటు భారతీయులు ఇప్పుడు రాహుల్‌ను వక్ర చూపులతో చూడకుండా ఆయనపై సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. ప్రత్యేకించి యువతరం, ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాలను గుడ్డిగా పాటించడానికి ఇష్టపడరు అనేది ఈ యాత్ర రుజువు చేస్తుందని చెప్పవచ్చు.
తాజాగా మన దేశ చలనచిత్రం ‘‘పఠాన్‌’’ విజయం ద్వారా ఈ విషయం మరింత రుజువైంది. దీని విడుదలను అడ్డుకోవడానికి మితవాదశక్తులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పటికీ కొన్ని చిల్లరమల్లర శక్తులు తాము చెప్పింది సరైందని వాదిస్తున్నాయి. అంతేకాదు..హింసకు పాల్పడే అవకాశం లేకపోలేదు. ఈ పంథాను అనుసరించే శక్తులు దేశంలో మిక్కుటంగానే ఉన్నాయి. పఠాన్‌ సినిమాను ఆపివేయాలని చెప్పడానికి కేవలం మతపరమైన అంశాన్ని మితవాదశక్తులు తీసుకున్నాయి. ఈ ప్రయత్నం ద్వారా విస్తృతంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు చిల్లరమల్లర గ్యాంగులు ప్రయత్నిస్తాయి. గుజరాత్‌ మారణహోమంపై తీసిన బీబీసీ డాక్యుమెంటరీని కూడా నిరోధించేందుకు ఈ శక్తులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే ఈ డాక్యుమెంటరీ ద్వారా మతప్రచారాన్ని, సినిమా ప్రచారాన్ని, నాయకులు ఫొటోలను వార్తలుగా మలిచి లేదా మరో విధంగా తమ ఇష్టానుసారం ప్రచారం చేస్తారు. తమ సొంత అభిప్రాయాలను అందరూ అనుసరించాలని ఈ శక్తులు కోరుకుంటున్నాయి. పైనపేర్కొన్నట్లుగా ఈ ధోరణి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూనేఉంది. అయితేదీన్ని అంతటా ఆమోదించడంలేదు. బీబీసీ డాక్యుమెంటరీని దేశంలో నిషేధించకపోతే న్యాయమైన చర్యలను చేపట్టడంద్వారా యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో శాంతికోసం ప్రయత్నించవచ్చు. గత ఏడాదిగా ఉక్రెయిన్‌ పౌరులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటుండగా పలస్తీనా ప్రజలు అనేక దశాబ్దాలుగా ఎనలేని బాధలు పడుతున్నారు. భారతదేశంలో బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం పెట్టాలన్న అంశం ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నార్థకమైంది. ఈ చిత్రాన్ని చూడకుండా నిరోధించేందుకు తీవ్రవాద చర్యలు చేపట్టడానికి పూనుకున్నారు. దేశంలో మితవాద శక్తుల ప్రభావానికి ప్రజలు లోనుకాలేదు. అలాగే తీవ్రవాద గ్రూపులుకూడా. రాహుల్‌ యాత్ర పట్ల కూడా పఠాన్‌ చిత్రం వలే ఈ శక్తులు లక్ష్యం చేసుకున్నాయి. ఉక్రెయిన్‌లో శాంతికోసం, పలస్తీనాలో హక్కులకోసం రచనలు చేసేవారు, మాట్లాడేవారు కొంచెం భిన్నగా భారతదేశంలో వలెనే ఉన్నారు. విశాలమైన ప్రజాస్వామ్యదేశంలో వక్రచూపులుచూసే వారు కూడా మతవాదశక్తుల వలెనే ఉన్నారు. అమెరికా, భారతదేశంలో ప్రజాస్వామ్యం ముప్పును ఎదుర్కొంటోందని చెప్పడం పొరపాటుకావచ్చు.. భారతదేశం, పలస్తీనా ఇంకా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఆయుధాలు ప్రజల ప్రాణాలు తీయవచ్చు. అయితే ప్రజావాణిని అణచివేయడం మాత్రం జరిగేదికాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img