Friday, February 3, 2023
Friday, February 3, 2023

ఫేస్‌బుక్‌ పత్రాల వెనుక?

సామాజిక మాధ్యమాలు అవతరించిన తర్వాత భావస్వేచ్ఛకు మరికాస్త స్వేచ్ఛ లభించినట్లయింది. ఇది ఇంకొన్ని హక్కులకు ఊపిరిపోసినట్లయింది. అయితే కొన్ని నెలల క్రితం ఉత్తరప్రదేశ్‌లో ఒక ఫేస్‌బుక్‌ పోస్టు ఊహించని రీతిలో రెండు మతాల మధ్య చిచ్చుకు దారితీసింది. అయితే అక్కడి బీజేపీ ప్రభుత్వం ఈ పరిణామాన్ని ‘మస్తు’గా ఆనందించింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌ పోస్టులు కొన్ని ఘర్షణలకు కారణమయ్యాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే వున్నాయి. ఒక రోజుతో పోయే రాజకీయ విమర్శలు, ఆరోపణలు సామాజిక మాధ్యమాల కారణంగా నెలల తరబడి రాజకీయ విద్వేషాలుగా, కార్యాలయాలపై దాడులకు కారకాలుగా, సాకులుగా మారిపోతున్నాయి. ఈ తరహా మాధ్యమాల వల్ల మంచిచెడూ రెండూ ఒకే వరుసలో పరుగులు పెడుతున్నాయి. మంచిని ఆస్వాదించాలే తప్ప చెడును ఎట్టి పరిస్థితుల్లోనూ కనికరించకూడదు. కానీ ఇలాంటి పరిస్థితులు తలెత్తిన ప్రతిసారీ సామాజిక మాధ్యమాలను వీలైనంత ఎక్కువగా తొక్కేయాలని ప్రభు త్వాలు భావిస్తూ వుంటాయి. ‘మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ’ అనే ముతక సామెత ఒకటుండేది. కానీ మోదీలాంటి ప్రభుత్వాలు రెంటినీ ఒకేగాటన కడుతూ ‘మాట’ను మర్చిపోయి ‘దెబ్బ’కే ప్రాధాన్యతనిస్తూ వుంటాయి. అసలు మనిషైనా, గొడ్డు అయినా జీవమే కదా! ఎందుకింత హింస అనే భావనలో ప్రభుత్వాలు ఉండాలి. సోషల్‌ మీడియానే స్వీయనియంత్రణ పాటించేలా, విద్వేషపూరిత ప్రకటనలను అడ్డుకోవడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేలా అవకాశం ఇవ్వాలి, ఆ దిశగా ప్రయత్నం చేయాలి. అంతే తప్ప భావస్వేచ్ఛకు సంకెళ్లు వేయకూడదు.
ఇటీవల అమెరికాలో బయటపడ్డ ఫేస్‌బుక్‌ పత్రాలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ఫేస్‌బుక్‌ తననుతాను మెరుగుపర్చుకునేందుకు, వ్యాపారాన్ని పెంచు కునేందుకు పలు సందర్భాల్లో నిర్వహించిన అంతర్గత పరిశోధనలకు సంబం ధించిన వేలకొద్దీ పత్రాలు ఆ సంస్థ మాజీ ప్రొడక్ట్‌ మేనేజర్‌ ఫ్రాన్సెస్‌ హాగెన్‌ వద్ద ఉన్నాయి. పదవీ విరమణ తర్వాత ఆమె హక్కుల కార్యకర్తగా, ప్రజా వేగుగా మారిపోయి, తన వద్ద ఉన్న రహస్య పత్రాలను బయటపెట్టారు. అమె రికా చట్టసభ కాంగ్రెస్‌కు కూడా సమర్పించారు. ఇప్పుడు ది అసోసియేట్‌ ప్రెస్‌ సహా అమెరికాకు చెందిన 17 వార్తాసంస్థలు పరస్పర సహకారంతో ఈ పత్రాలను సేకరించి, వాటిపై వరుస కథనాలను ప్రచురిస్తున్నాయి. ఫేస్‌బుక్‌ సంస్థ ప్రజా ప్రయోజనాల కంటే లాభార్జనకే ప్రాధాన్యతనిచ్చిందని, ఈ సంస్థ వ్యవహార శైలి మత విద్వేషాలకు, కుల, వర్గాల మధ్య చిచ్చుకు దారితీసిందని ఈ రహస్య పత్రాలు వెల్లడిరచాయి. భారత్‌లో మోదీ సర్కారుకు ఫేస్‌బుక్‌ అను కూలంగా వ్యవహరించిందన్న నిజంకూడా ఈ పత్రాలతో బయటకు పొక్కింది. మోదీ, అతని సైన్యం చేసిన విద్వేష ప్రసంగాలు, బూటకపు సమాచారానికి సంబం ధించి ఎంపిక చేసిన కొన్ని పోస్టులపై మాత్రమే ఆంక్షలు విధించిందని, చాలా వరకు ఈ తరహా పోస్టులను చూసీచూడనట్లు వదిలేసిందని, తద్వారా భారత్‌లో అశాంతికి బీజం వేసిందని తేలింది. ముఖ్యంగా ఓ వర్గంపై వ్యతి రేకతను పెంచే అభ్యంతరకర పోస్టుల తొలగింపులో ఫేస్‌బుక్‌ విఫలమైందని, బీజేపీకి సంబంధ మున్న వ్యవహారాల్లో తలెత్తిన చిక్కులు, సమస్యలను ఈ సంస్థ పరిష్కరించలేక పోయిందని, పైగా ప్రజా ప్రయోజానాలకు విరుద్ధంగా వ్యవ హరించిందని నిరా ్ధరణయింది. ఎన్ని రకాల తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, అపసవ్య విధానాలు అనుసరించినా, ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ తనదైన శైలిలో ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలను విపరీతంగా వాడు కున్నదని ఈ ఫేస్‌బుక్‌ పత్రాల లీకేజీతో రూఢ అయింది. మధ్యప్రాచ్యంలో ఘర్షణలకూ ఫేస్‌బుక్‌ ఆజ్యం పోసిందని రుజువైంది.
ఫేస్‌బుక్‌ సంస్థ ప్రపంచంలో నెంబర్‌వన్‌ స్థానాన్ని ఆక్రమించిన సామాజిక మాధ్యమం. పోర్టల్స్‌ పరంగా చూస్తే రెండవస్థానంలో నిలిచింది. 17 ఏళ్ల క్రితం మార్క్‌ జ్యుకర్‌బర్గ్‌ దీన్ని స్థాపించిన తర్వాత ఆరు మాసాల క్రితం నాటికి ఫేస్‌బుక్‌ నెలవారీ క్రియాశీల వినియోగదారుల సంఖ్య (యూజర్లు) 285 కోట్ల మంది. అంటే ప్రపంచ జనాభాలో చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, సిరి యా, పాకిస్థాన్‌, ఇరాన్‌ లాంటి దేశాలను, వెనుకబడిన ప్రాంతాలను వదిలేస్తే సగానికిపైగా జనం ఫేస్‌బుక్‌ను వాడుతున్నారని అర్థం. దాని వార్షికాదాయం దాదాపు 1000 కోట్ల డాలర్లు. నెంబరవన్‌ ధనవంతుని పోటీలో జ్యుకర్‌బర్గ్‌ నిలుస్తూ వుంటారు. ఈ స్థాయిలో ఉన్న ఫేస్‌బుక్‌ ప్రజాప్రయోజనాల గురించి ఆలోచించి, తన ఆదాయంలో 1 శాతం ఉపయోగించినా, ప్రపంచంలో ఎన్నో అల్లర్లు ఆగిపోయేవి. 111 భాషల్లో ఫేస్‌బుక్‌ అందుబాటులో వుందని చెపు తున్నప్పటికీ, సరైన భాషా నిపుణులు ఈ సంస్థలో లేనేలేరు. ప్రమాదకర, రెచ్చగొట్టే పదాలను గుర్తించగలిగే కృత్రిమమేథ (ఎఐ)ను అభివృద్ధి చేయ డంలో, అల్గోరిథమ్‌లను ఉపయోగించుకోవడంలో విఫలమైంది. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఫేస్‌బుక్‌ ఉంది. దీంతో ప్రజల విశ్వసనీయతను కోల్పోయిన ఈ సంస్థ రాజకీయ ప్రత్యర్థుల మధ్య, మతాల మధ్య ట్రోల్స్‌కు, విద్వేష ప్రకటనలకు వేదికగా మారింది. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులు సైతం తమ హక్కులను కోల్పోయినట్లుగా మెయిల్స్‌ ద్వారా బయటపెట్టారు. సామాజిక మాధ్యమాలు బీజేపీ వంటి మత పార్టీలకు సాధనాలుగా మారకుండా తామే మారాల్సిన అవసరం వుంది. లేకుంటే భారత్‌కు అతిపెద్ద ముప్పు వెన్నంటి ఉన్నట్టే!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img