Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

బి.జె.పి.ది జన ఆశీర్వాదం కాదు జన వంచన యాత్ర

జి. ఓబులేసు

ఆంధ్రప్రదేశ్‌లో బి.జె.పి నాయకులు, కేంద్ర మంత్రులు ప్రజల వద్దకు రావటానికి కనీస నైతిక అర్హతే లేదు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న దాని ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వకుండా మోసం చేసారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తామన్న ప్రత్యేక ఆర్ధిక పాకేజి ఎగరగొట్టారు. విశాఖ రైల్వేజోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌లకు ఎగనామం పెట్టారు. అనంతపూర్‌, అమరావతి రోడ్డు విస్తరణ ఎత్తి వేశారు. పోలవరం నిర్వాసితుల రీషెడ్యూల్‌, రీసెటిల్‌మెంట్‌ ( ఆర్‌.Ê ఆర్‌) పాకేజితో మాకు సంబంధం లేదని చేతులెత్తేసినారు. సవరించిన అంచనాల ప్రకారం 55 వేల కోట్లు మాకు సంబంధం లేదంటున్నారు. ఇస్తామని చెప్పిన వాటిని యివ్వకపోగా విశాఖ స్టీల్‌ ప్లాంటును అమ్మివేయడానికి తెగబడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీ మొన్న విస్తరించిన మంత్రి వర్గంలోని కొత్త మంత్రులను పార్లమెంటులో పరిచయం చేయనీయకుండ ప్రతిపక్షాలు అడ్డుతగిలాయి గనుక ప్రజల వద్దకే వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకోవాలని నిర్ణయించి జన ఆశీర్వాదయాత్ర చేస్తున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పుకుంటూ తిరుగుతున్నారు. 18వ తేదీ తిరుపతి వెంకన్నను 19వ తేదీన విజయవాడ దుర్గాంబను దర్శించుకొన్న తర్వాత పత్రికల వారితో మాట్లాడుతూ జన ఆశీర్వాదయాత్ర ఎందుకో వివరించారు. బి.జె.పి ఆంధ్రప్రదేశ్‌లో జన ఆశీర్వాదయాత్రకు బదులుగా జన వంచన యాత్ర అనిపెట్టుకుంటే సముచితంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ బి.జె.పిని జనం ఆశీర్వదించాల్సినంత ఘనకార్యాలు ఏమి లేవు. అడుగడుగునా ప్రజావంచనకు పాల్పడటం ప్రజలపై విపరీతమైన భారాలు మోపడం తప్ప వీరి వల్ల ఒక్క కార్పొరేటు రంగం మినహా దేశంలోని అన్ని రంగాలు, విభాగాలు చతికిలపడి ప్రజలంతా కష్టాల్లో మునిగి తేలుతున్నారు. నరేంద్రమోదీ 2014లో అధికారంలోకి వచ్చేటప్పటికి రూ. 62/ ఉన్న పెట్రోలు ధర ప్రస్తుతం రూ. 112/అయింది. డీజిల్‌ రూ. 50/ల నుండి రూ.100/అయింది. వంట గ్యాసు సిలెండరు ధర రూ. 410/ ల నుండి 2021 జనవరి 1వ తేదీకి రూ. 694/కు చేరి 17 ఆగస్టు నాటికి రూ. 859/ అయి కూర్చుంది. అంటే 8 నెలల్లో 23.77 శాతం గ్యాసు పైన రేటు పెరిగింది. ప్రధాని ఆర్భాటంగా చేపట్టిన ఉజ్వల యోజన క్రింద 8 కోట్ల గ్యాసు కనెక్షన్లుంటే నేడు విపరీతంగా పెరిగిన రేట్లతో కేవలం 3.2 కోట్లమంది అనగా 40 శాతం వినియోగదారులు ఒక సిలెండరు కూడా తీసుకోలేకపోయినారు. ఈ దోపిడీని, లూటీని భరించి దేశప్రజలు బి.జె.పి పార్టీని కేంద్రంలో కొత్తగా కొలువు తీరిన అనామక మంత్రులను ఆశీర్వదించాలని ప్రభుత్వం చెప్తున్నది. పెట్రోలు, డీసెల్‌ ధరలు పెరిగితే అనివార్యంగా నిత్యజీవితావసర వస్తువుల ధరలు అన్నీ పెరుగుతాయి. పప్పులు 60 70 నుండి రూ. 190 నుండి రూ. 220 వరకు, వరకు రైల్వే ఫ్లాట్‌ఫాం టిక్కెట్‌ రూ. 5 నుండి రూ. 50 ల వరకు, రైల్వే టికెట్‌ చార్జీలు 1/2 నుండి రెండిరతలు పెంచారు. నిరుద్యోగ శాతం 45 ఏళ్లలో గరిష్ఠ స్థాయికి చేరింది. 7.4 శాతం నుండి 8.3 శాతానికి పెరిగింది. 74 శాతం మంది ప్రజలు రోజుకు 300 రూ. లోపు జీతంతో బతుకు లీడిస్తున్నారు. 3 ట్రిలియన్ల నుండి 5 ట్రిలియన్ల వృద్ధి రేటుతో ఆర్ధికవ్యవస్థను నిలబెడతామని చెప్పుకొనే దుర్మార్గమైన పాలన ఇది. కరోనా మొదటి విడత, రెండో విడతల లాక్‌డౌన్‌ కారణంగా మొత్తం పారిశ్రామిక,ఆర్థిక రంగాలు కుదేలైనాయి. 45 కోట్ల మంది ప్రజలు ఉపాధి దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మొదటి విడత కరోనా లాక్‌డౌన్‌ వల్ల 20 కోట్ల మంది వలస కార్మికులు చెప్ప నలవి కాని ఇక్కట్లకు గురైనారు. దేశ వ్యాపితంగా 6 కోట్ల 30 లక్షల చిన్న, సూక్ష్మ పరిశ్రమల్లో 33% అంతరించిన పరిశ్రమల జాబితాలో చేరిపోయాయి. రెండో విడతలో 3 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నికృష్ఠ పాలనకు ప్రజల మద్దతు ఆశీర్వాదం కావాలని ఊరూర తిరగడం ఎంత బరితెగింపు. అంతర్జాతీయ కార్మికసంస్థ సర్వే ప్రకారం దాదాపు 5 కోట్ల మంది విద్యార్ధులు ఆర్ధిక స్థోమత లేక అర్ధాంతరంగా తమ చదువులు చాలించి బాల కార్మికులుగా మారిపోయారని తేల్చింది. అదే సంస్థ ఇంకో సర్వే ప్రకారం 40 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన చస్తూ బతుకుతున్నారని తెలిపింది. పెద్దనోట్ల రద్దు, జి.యస్‌.టి ల వల్ల ఆర్ధిక వ్యవస్థ కునారిల్లి అప్పుల్లోకి కూరుకుపోయింది. 20192020 ఆర్ధిక సం॥లో 1,19,53,758 కోట్ల అప్పుల వూబిలోకి దిగబడిపోయింది. జి.డి.పిలో 60.5% అప్పులున్నాయి. ఈ అప్పులు, అప్పులకు వడ్డీలు తీర్చటానికి ప్రజలపై అధిక ధరలు, పన్నులు, సర్‌చార్జీలు, విద్యుత్‌ టారిఫ్‌ల పెంపకం లాంటివి చేస్తూ ప్రజలపై భారాలు మోపి కార్పొరేటు కంపెనీలకు వూడిగం చేస్తూ వారికి లాభాల పంట పండిరచి పెడుతున్నారు. ఇందుకు సజీవ ఉదాహరణ 2020 నుండి 2021 సం॥లో అత్యంత సంపన్నులైన బిలియనీర్లు 100 మంది నుండి మోదీ షాల ఏలుబడిలో 140 మందికి పెరిగారు. ఒక సంవత్సర కాలంలో 140 కుటుంబాల సంపద 13 లక్షల కోట్లకు పెరగడం అంటే మోదీ ప్రభుత్వ పాలన సంపన్నులకే గానీ, పేదసాదలకు, మధ్యతరగతి వారికి కానేకాదు అని పసిపిల్లోడికి సైతం అర్ధము అవుతుంది. మరి కిషన్‌ రెడ్డికి, మిగతా బి.జె.పి నాయకులకు ఎందుకు అర్ధం కాలేదో వారి ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుడికే తెలియాలి. ప్రజలంతా తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే ఆదాని ఆస్తుల విలువ 480% రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబాని ఆస్తుల విలువ 128 % పెరిగిందట. ఆంధ్రప్రదేశ్‌లో బి.జె.పి నాయకులు, కేంద్ర మంత్రులు ప్రజల వద్దకు రావటానికి కనీస నైతిక అర్హతే లేదు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న దాని ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వకుండా మోసం చేసారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తామన్న ప్రత్యేక ఆర్ధిక పాకేజి ఎగరగొట్టారు. విశాఖ రైల్వేజోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌లకు ఎగనామం పెట్టారు. అనంతపూర్‌, అమరావతి రోడ్డు విస్తరణ ఎత్తి వేశారు. పోలవరం నిర్వాసితుల రీషెడ్యూల్‌, రీసెటిల్‌మెంట్‌ ( ఆర్‌.Ê ఆర్‌) పాకేజితో మాకు సంబంధం లేదని చేతులెత్తేసినారు. సవరించిన అంచనాల ప్రకారం 55 వేల కోట్లు మాకు సంబంధం లేదంటున్నారు. ఇస్తామని చెప్పిన వాటిని యివ్వకపోగా విశాఖ స్టీల్‌ ప్లాంటును అమ్మివేయడానికి తెగబడ్డారు.
పోస్కో వద్దు అంటే టాటా గ్రూపు వస్తానంటున్నది. కేంద్రం దానికి గ్రీన్‌ సిగ్నల్‌ అంటున్నది. విభజన చట్టం ప్రకారం నదీ జలాల వివాద పరిష్కారానికి యాజమాన్య బోర్డుల ఏర్పాటు సకాలంలో చేసి అంతర్రాష్ట్ర తగాదాలను అరికట్టవలసిన పెద్దన్నయ్య పాత్రలో ఉన్న కేంద్రం ఉద్దేశ పూర్వకంగానే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలమధ్య చిచ్చు రాజేసింది.
ఇన్ని ఆగడాలు, అనర్ధాలు చేసి రాష్ట్రంలో ఆశీర్వాద యాత్ర చేయడానికి ఉన్న నైతిక హక్కు ఏమిటి అని ప్రజలు బి.జె.పిని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇది ప్రజా ఆశీర్వాద యాత్రకాదు ప్రజా వంచన యాత్ర అని తెలియజెప్పాలి. 75వ స్వాతర్రత్య దినవేడుకల అమృతోత్సవ ప్రసంగంలో దేశ విభజన గాయాల స్మరణ అని చెప్పి మతోన్మాదాన్ని ప్రేరేపించడానికి చేసిన ప్రయత్నం మాదిరిగానే ఆశీర్వాద యాత్రల ద్వారా హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలనే దుష్ఠతలంపు దాగింది.
వ్యాస రచయిత సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img