Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

బూటకపు రాజకీయ పార్టీలతో పెద్ద చిక్కు!

ముంబైలో మరో సంఘటన కూడా ఉదహరిస్తాను. చున్నభట్టి ప్రాంతంలో స్వదేశీ మిల్స్‌రోడ్డులో జనవాది కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఉంది. అక్కడ రెండు అంతస్థుల భవనం బాల్కనీలో మూడురంగులు జెండాను పెట్టిఉంటారు. ఈ పార్టీ జాతీయ కార్యాలయం చిరునామా ఈ భవనమేనని రిజిస్టర్‌ చేశారు. అనంత్‌ స్వాంత్‌ అనే సీనియర్‌ పౌరుడికి చెందిన భవనం ఇది. దాన్ని జనవాది కాంగ్రెస్‌ పార్టీ అద్దెకు తీసుకుంది. ఈపార్టీ వివిధ అక్రమాలకు పాల్పడిరదని తెలిసిన తర్వాత భవనాన్ని ఖాళీ చేయవలసిందిగా పార్టీ అధ్యక్షుడు సంతోష్‌ ఎం.కట్కేను కోరానని అనంత్‌ స్వాంత్‌ వెల్లడిరచారు. ఈ ప్రాంతానికి కిలోమీటర్ల దూరంలో వడాల  మురికివాడ ఉంది. ఎన్నికల కమిషన్‌కి జనవాది కాంగ్రెస్‌పార్టీతో సంప్రదింపులు జరిపేందుకు శాంతి డబుల్స్‌ అనే చిరునామా ఇచ్చారు. ఈ చిరునామాలో కట్కే ఆయన భార్య, ఇద్దరు పిల్లలు నివసిస్తుంటారు. ఆయన కూడా అనేక కోట్ల రూపాయాల కుంభకోణానికి పాల్పడ్డారని ఆదాయపు పన్ను శాఖాధికారులు వెల్లడిరచారు. చుట్టుపక్కల నివసించేవారంతా ఈ విషయం తెలుసుకుని తీవ్ర విభ్రాంతికి గురయ్యారు.
దేశంలో దాదాపు మూడువేల రిజిస్టర్‌ అయిన రాజ కీయ పార్టీలున్నాయి. వీటిల్లో అత్యధికభాగం బూటకపు రాజకీయ పార్టీలే. ఇది ఎలాంటి ప్రజాస్వామిక కార్య కలాపాలు నిర్వహించవు. చట్టపరంగా ఉన్న మినహాయింపులను ఉపయోగించుకుని కేవలం ఎన్నికల కమిషన్‌ పార్టీపేరు రిజిస్టర్‌చేసి సొంత ప్రయోజనాలకోసం మాత్రమే పనిచేస్తుం టాయి. ఈ బూటకపు కంపెనీలు భారీ కుంభకోణాలకు పాల్పడుతుంటాయి. గౌతమ్‌ అదానీ కూడా విదేశాల్లో ఇలాంటి బూటకపు కంపెనీలను నెలకొల్పి వాటి ద్వారా డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయపార్టీలకు చెందినవారు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పన్నుల ఎగవేత నుంచి డబ్బు దుర్విని యోగం చేసుకున్నారు. 
   ఈ విధంగా వేలదికోట్ల రూపాయాలు అక్రమంగా సంపాదిస్తున్న పార్టీలున్నాయి. ఉదాహరణకు ముంబైలోని బొరివలి ప్రాంతంలో దత్తపడ రోడ్డు ఏరియాల్లో ఎక్కువగా మధ్యతరగతి జనాభా నివసిస్తుంటారు. అక్కడ ఒక వాణిజ్య స్థలం ఉంది. అయితే అక్కడ భవనంబైట సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ పార్టీ అన్నబోర్డు కనిపిస్తుంటుంది. భవనం లోపల వ్యాపార కార్యకలాపాలు ఉంటాయి. భవపంలోని ఒక చిన్న గదిలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ అధ్యక్షుడు అయినా, దశరథ్‌ భాయ్‌ పరేఖ్‌ ఒక ప్లాస్టిక్‌ స్టూలుమీద కూర్చుని ఉంటారు. ఆయన పెద్ద వయసువారు. ఆయన అక్కడ కట్టలు కట్టలు గాలిపటాలు తయారుచేస్తుంటారు. గాలిపటాలు సరఫరా చేసే వ్యాపారం అయనది. రాజకీయ పార్టీ అంటే ఆయనదృష్టిలో సామాజిక సేవ అంటారు. తాను మొరార్జీ దేశాయ్‌, శరద్‌పవర్‌, మాయావతిలాంటి రాజకీయ నాయకులతో కలిసి పనిచేశానని, ఆ తరువాత 2006లో రాజకీయపార్టీ ఏర్పాటుచేశానని అంటారు. అయితే ఇటీవల ఆ పార్టీ ఎన్నికల కమిషన్‌ దృష్టిలో పడిరది. ఆ తరువాత ఆదాయపన్ను అధికారులు కలుగజేసుకున్నారు. కోట్లాది రూపాయాల ఆర్థిక అక్రమాలకు పార్టీని అడ్డుపెట్టుకుని పాల్పడ్డారని ఆదాయపు పన్నుశాఖ అధికారులు వెల్లడిరచారు. అయితే ఆయన ఇవన్నీ ఒట్టి ఆరోపణలని దాతలు, వివిధ సంస్థలు, వాణిజ్య సంస్థలు, జౌళి, డైమండ్‌ పరిశ్రమాధిపతులు అలాగే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇంకా అనేకమంది తనకు ఇచ్చే విరాళాలు ఇవని చెబుతారు. 2022 సెప్టెంబరులో ఆదాయపు పన్నుశాఖ అధికారులు పార్టీ భవనంపై దాడులుచేసి సంబంధింత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే కట్కే  ఉదయం బైటకు వెళ్లిపోయి తిరిగి సాయంకాలమే ఇంటికి చేరుకుంటారు. అందువల్ల ఆయన కార్యకలాపాలు ఎవరికీ తెలియదు. గత సంవత్సరం ఆ చిన్న ఇంటిపై ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు చేసినప్పుడే ఆయనగుట్టు బైటపడిరది. దాదాపు ఆరుకోట్ల రూపాయలకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు వెల్లడిరచారు. ఆయనకు పెద్దపెద్ద వాళ్లతో సంబంధాలు ఉన్నాయని ఎన్నికల కమిషన్‌ వెల్లడిరచింది.
	ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటిదే మరొకటి వెలుగు చూసింది. లక్నో నుంచి రెండున్నర గంటల ప్రయాణ దూరంలోఉన్న సుల్తాన్‌పూర్‌ మార్కెట్‌ లోతట్టుప్రాంతంలో గడియారాలు బాగుచేసే షాప్‌ ఉంది. అప్నాదేశ్‌ పార్టీ చిరునామా ఈ షాపే. షాపు ఉన్న గదిలో చిన్న వ్యాపారం, అలాగే రాజకీయ పార్టీ కార్యాలయం ఉందని రిజిస్టర్‌ అయింది. అయితే ఈ గదిలో జరిగే కార్యకలాపాలు భారీ కుంభకోణానికి సంబంధించినది. అబ్దుల్‌ మబూద్‌ ఈ షాపు యజమాని. ఆయనే పార్టీ అధ్యక్షుడు కూడా. 
	పార్టీ పేరుతోఈయన వసూలుచేసే విరాళాలకు ఆదాయపుపన్ను మినహాయింపు ఉంది. అయితే తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని గుజరాత్‌ రాష్ట్ర పార్టీ యూనిట్‌ అధ్యక్షుడిగా నియమించిన రజాక్‌ మోసాలకు పాల్పడగా తనమీద అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని మబూద్‌ అన్నారు. అంతేకాదు పార్టీ పాన్‌ కార్డును కూడా తనకు తెలియకుండా నిధుల వసూళ్లకు వాడుకున్నాడని గుజరాత్‌లో బ్యాంకు ఎకౌంట్‌ కూడా ఏర్పాటుచేసి నిధులు వసూలు చేశాడని మబూద్‌ చెప్పారు. 
	అయితే ఎన్నికల కమిషన్‌ చెప్పింది వేరే ఉంది. ఈ పార్టీకి ఇరువురు అధ్యక్షులు ఉన్నారని, ఇది చాలా వింతగా ఉందని, చిన్నగదిలోఉన్న రాజకీయ పార్టీకి వందకోట్లకుపైగా విరాళాలు వచ్చినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందని కమిషన్‌ వ్యాఖ్యానించింది. అలాగే కాన్పూర్‌ పారిశ్రామిక ప్రాంతంలో ఇరుకుసందుల్లో జనరాజ్యపార్టీ ఉన్నట్లు రిజిస్టర్‌ అయింది. పార్టీ చిరునామా ప్రయాగ్‌ రాజ్‌ అని కమిషన్‌ వద్ద రిజిస్టర్‌ అయిఉంది. రిజిస్టర్‌ చేసిన రికార్డుల్లో రవిశంకర్‌యాదవ్‌ రికార్డు చేసినట్లుగా ఉంది. 2022 సెప్టెంబరులో రవిశంకర్‌ యాదవ్‌ నివాసాలపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడి చేశారు. ఆదాయపుపన్ను శాఖ నియమనిబంధనలను ఈ పార్టీ పూర్తిగా ఉల్లంఘించింది. సందులోఉన్న ఒక చిన్నపార్టీకి కోట్లాదిరూపాయలు విరాళాలుగా రావడమేంటని ఎన్నికల కమిషన్‌ సందేహించింది. ఆదాయపుపన్ను శాఖ అదికారులు కూడా ఇదే సందేహంతో దాడులుచేయగా, అసలు గుట్టు రట్టయింది. ఇలాంటి బూటకపు రాజకీయ పార్టీలు అనేక వందలు ఉన్నాయనేది ఈ ఘటనలను చూస్తే అర్థమవుతుంది.             
` హరిహర్‌ స్వరూప్‌
	

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img