Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

భయం వల్లనే భక్తి

అంజనీ పుత్ర నమోస్తుతే శ్రీ రామ భక్తునికి నమోస్తుతే… రావయ్యా బావ పార్వతి మీ అన్నయ భక్తితో పరవశుడై వస్తున్నాడు వేడివేడి కాఫీ పట్టుకురా. ఇప్పుడు చెప్పు అ మధ్య శ్రీ రామ నీనామ మెంతోరుచిరా అంటూ వచ్చావు ఈ రోజేమో ఆయన భక్తుడు అంజనేయ జపం చేస్తూ వస్తున్నావు ఏమిటి కథ. ఏముంది బావ నవమికి రామ జపం ఇప్పుడు వాయుపుత్రుడి జయంతి కొలవాలిగదా. అది సరే ఇంత మందిని కొలిచే మీ వార్డు ఎప్పుడూ ఏదో ఉపద్రవాలకు లోనవుతూ ఉంటుంది. ఎంతోమంది దేవుళ్లను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచినా ఆ దేవుళ్లు కరుణించడం లేదు ఎందుకని..ఏముంది పాపం పెరిగిపోతోంది పక్కవాడ్ని పాపభీతిలేకుండా దోచుకోవడం అవసరమైతే ప్రాణాలు తీయడం లాంటి దుర్మార్గపు పనులుచేసి దేముడికి నామజపంచేస్తే ఆ రాముడు కరుణిస్తాడా. అది సరే మంచివాళ్లను సంహరించడం భగవంతుని బాధ్యత కదా అందుకే కదా అన్ని అవతారాలెత్తింది. ఏమోకాని అందరూ ప్రార్థిస్తుంటే మనం చేయకుంటే మనల్ని శిక్షిస్తాడు కదా. అసలు భగవంతుడు ఉన్నాడంటావా. అదేంటి అంత మాట అనేశావు. పాపం మూటకట్టుకుంటున్నావు. నీవన్నట్లు దుష్టశిక్షణ శిష్టరక్షణా ఆయన బాధ్యత అయినపుడు ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం ధర్మమా. అసలు దేముడు అంటున్నాం. వేదాంతులేమో నిరాకారుడు, నిర్వికల్పుడు, నిర్గుణుడు అంటారు. అంటే దేముడని మనం భ్రమించేవారికి ఒక ఆకారం గాని, గుణంకాని, కోరికగాని లేవని చెబుతారు. అలా ఏ ఆకారం లేనివారిని ‘డు’ అని ఎలా పిలుస్తారు. ఆగు అక్కడే ఆగు బావ. దానికి నేను విన్న సమాధానం చెబుతా. నిరాకారుడంటే కరెక్టుగ ఒక ఆకారంలో ఉండడు. నీవన్నట్లు దుష్టులను శిక్షించే టప్పుడు ఒక ఆకారం, శిష్టులను రక్షించేటపుడు ఒక ఆకారంలోను ఉంటాడు. అందుకే ఆయన దశావతారాలతో కనిపించ డానికి కారణం. అలాగే నిర్గుణుడు అంటే ఎప్పుడూ ఒకే గుణం కలిగి ఉండడు. దుష్టులను శిక్షించేటపుడు శిష్టులను రక్షించేటపుడు ఒక్కో గుణంతో ప్రవర్తిస్తాడు. నిర్వికల్పుడు అంటే ఆయనకు ఏ కోరికలూ ఉండవు. భక్తుల కోరికలు తీర్చడమే ఆయన కోరిక. బాగానే నేర్చు కున్నావు. మరి వార్డులోని దుర్మార్గులను సంహరించడానికి ఏదో ఒక అవతారంతో రావచ్చుకదా. ఆగు చెబుతా ఆ దుర్మార్గులు చెడ్డపనులు మాని మంచి వారుగ మారతారేమోనని వేచిచూచి దుర్మార్గం ముదిరిన తరువాత ఆయనవేసే శిక్ష మనముందే జరుగుతుంది. అలా ఎంతమంది మన కళ్లముందు ఎంత ఘోరంగా దుర్మరణం పాలయ్యారో మన కళ్లతో మనం చూశాం కదా. బాగానే ఒంట పట్టించుకున్నావు. నాకు తెలియక అడుగుతాను కొంతమందితో అన్ని దుర్మార్గాలు చేయించి మంచివాళ్లను బాధపెట్టి ఆ తరువాత చంపడం దేనికి? ఆదిలోనే అంతం చేస్తే ఇంత మంది ఇన్ని రకాలుగ ఇక్కట్లు పాలవరుకదా. అదీ చెబుతా ప్రతి వ్యక్తికి గత జన్మలో చేసిందాన్ని బట్టి ఉంటుంది. ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదుకదా అందుకేమంచి వాళ్లు, చెడ్డవాళ్లుగ పుట్టి గత జన్మను బట్టి ఈ జన్మలో అనుభవిస్తారు. అది సరే పునర్జన్మ అనేది ఉన్నదంటావా భలేవాడివి లేకపోతే కొంతమంది పుట్టిన నెలరోజులకే గత జన్మ గురించి చెబుతున్నారుకదా. మరుజన్మఉంటే చనిపోయేవారి కంటే పుట్టేవారే ఎక్కువకదా. ఎలా జనాభా పెరుగుతోంది. అందుకే కదా ఫ్యామిలి ప్లానింగ్‌. మరి ఒకరుపోతే పదిమంది పుడితే మిగతావారికి గత జన్మలోని ఆత్మలు ఏమవుతున్నాయి. ఆ వస్తున్నా అందుకే ఈ జన్మతో మంచి పనులు చేసినవారికి జన్మరాహిత్యంతో మరుజన్మ లేకుండా చేస్తున్నాడు ఆ భగవంతుడు.
అది సరే ప్రస్తుతం మన రాజకీయ నాయకులు ప్రజాధనం వేలకోట్లు దోచుకుతింటున్నారు. మనకళ్లముందే అనుభవిస్తారన్నావు. మన కళ్లముందు నీవన్నట్లు శిక్షకాదు అనుభవించేది, విలాసవంతమైన భోగాలు మరి వారి పట్ల నీవు నమ్మిన భగవంతుడు ఏమీ తెలియనట్లు మిన్నకున్నాడు. పేద ప్రజలు ఆకలితో అలమటించినా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నాకుతెలియక అడుగుతాను. లక్షలకోట్లు విదేశీ బ్యాంకులో దాచి సంతృప్తి పడటం తప్పవారు అనుభవించలేరు. దాని కంటే ఆ సొమ్ము సమాజపరం చేసి పేదలను ఆదుకునేట్లు మీ దేముడు వారి మనసు మార్చలేడా. నీకొక సంగతి చెబుతా విను. కొందరికి సంపాదించడంలో తృప్తి మరికొందరికి పేదలకు అన్నంపెట్టి వాళ్ల కళ్లల్లో వెలుగునుచూస్తే సంతృప్తి వాళ్లు అభిరుచిని బట్టి వారు వ్యవహరిస్తారు అది సరే వారంతా సంఘజీవులే కదా. సమాజానికి అతీతంగా బతకడంలేదు కదా. మరి సమాజం తీరు తెన్నులు గమనించి అందరికీ న్యాయం చెయ్యవలసిన బాధ్యత ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి ఉన్నది కదా. భలే అమాయకుడివి. ఏలేవారు సంపదకోసం పరుగులు పెడుతుంటే ఇంకా వీళ్లమీద చర్యలు తీసుకొనేదెవరు అంటే నీవు నమ్మే భగవంతుడిని కూడా వాళ్లు కొనేశారా. అంతలోతుగ చర్చ ఎందుకుగాని నమ్మినోడికి ఉన్నాడు లేని వాడికి లేడు అంతే భయంవల్ల భక్తి అనుకో.
వ్యాస రచయిత సెల్‌:9886569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img