Friday, August 12, 2022
Friday, August 12, 2022

మకిలి రాజకీయాలతో చట్టాలు వెలవెల

ఆర్‌.జగన్నాధన్‌
భారతదేశంలో రాజకీయం మురికిపట్టి చట్టాలు, శాసన వ్యవస్థలు వెలవెలపోతున్నాయి. అనైతిక పొత్తులు, వ్యక్తిగత వెన్నుపోట్లు రాజకీయాలను మరింతగా మకిలపరుస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ మహారాష్ట్ర. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోక ముందే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుకున్నది. మహా వికాస్‌ అఘాడి (శివసేన కాంగ్రెస్‌, ఎన్‌సిపి) కోర్కెను సుప్రీంకోర్టు తిరస్కరించి అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు అనుమతించింది. డిప్యూటీ స్పీకరు ప్రభుత్వం వైపు, గవర్నరు… షిందే` బీజేపీకి అండగా ఉన్నారన్న విమర్శలు వచ్చాయి. పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఉంది. మూడిరట రెండు వంతుల మంది ఉంటే దాన్ని చీలికగా భావిస్తారు. ఫిరాయింపులను కప్పదాట్లను ఆపలేకపోయారు. చీలికగా గుర్తించడానికి అవసరమైనంత మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ అలా ప్రకటించలేదు. ఎందుకంటే బాధిత పార్టీ మరో చర్య తీసుకోవచ్చునని షిందే గ్రూపు, బీజేపీ భావించాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కొద్దిమంది తగ్గితే ఇతర పార్టీ నుంచి ఫిరాయించ దలచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, తిరిగి పోటీలో నిలిచి గెలిచాక పాలక పార్టీలో చేరాలి. కర్నా టకలో ఇలా జరిగింది. స్పీకర్లు, (డిప్యూటి స్పీకర్లు) గవర్నర్లు తట స్థంగా ఉండకుండా రాజకీయ నాటకం వెనుక ఉండి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫలితంగా న్యాయం కోసం కోర్టులను ఆశ్ర యిస్తున్నారు. దీనివల్ల ముఖ్యమైన రాజ్యాంగ బద్ద గవర్నరు, స్పీకరు పదవులను దిగజారుస్తున్నారు. రాజకీయ నాటకం, వ్యక్తిగత ప్రతీకారాలు పరిస్థితు లను మరింత అధ్వానంగా తయారు చేస్తున్నాయి. మహారాష్ట్రలో ఈ రెండూ జరిగాయి.
2014లో ఎన్‌సిపి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతిపాదించగా బీజేపీ ఉచ్చులో పడిరది. దాదాపు 25 ఏళ్లుగా కలిసిమెలిసి ఉన్న శివసేనను బీజేపీ నిర్లక్ష్యం చేసింది. అయినప్పటికీ శివసేన దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వంలో ద్వితీయ శ్రేణిగా ఉండేందుకు అంగీకరించింది. అయితే ఉద్దవ్‌ థాకరే సమయం కోసం ఎదురు చూశాడు. 2019లో ముఖ్య మంత్రి పదవిని డిమాండ్‌ చేయగా ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్య లేకపోయినా బీజేపీ తిరస్కరించింది. దీంతో సూత్రబద్దత లేని కాంగ్రెస్‌, ఎన్‌సిపి, శివసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇది బీజేపీకి గిట్టలేదు. సమయం కోసం ఎదురు చూసిన బీజేపీ ఇప్పుడు తన నాటకానికి తెరతీసి విజయవంతమైంది. ఇలాంటి ఘటనలు మహారాష్ట్రకే పరిమితం కాలేదు. రాజకీయ వర్గం చట్టాలను నిర్వీర్యం చేయాలని మాయోపాయాలు పన్నినప్పుడు ఏ చట్టం పని చేయదు. బీజేపీ లాంటి పెద్ద పార్టీలు తమ అవసరం మేరకు చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని పని జరుపుకుంటాయి. ఆ తర్వాత వాటిని నాశనం చేయడానికి పెద్ద పార్టీలు వెనుకాడవు. ఒకవేళ శివసేనతో తిరిగి సఖ్యతగా ఉండాలని భావిస్తే బీజేపీ ఉదారంగా వ్యవహరించ వలసి ఉంటుంది. జాతీయంగా కూడా ఇది వర్తిస్తుంది. బీజేపీ తన అజెండాను అమలు చేస్తూ ప్రతిపక్షాలతో నిమిత్తం లేదని భావిస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వ విధానాలను చట్టసభల్లో ఓడిరచాలనుకున్న ప్పుడు అవి వీధుల్లోకి వస్తాయి. సంస్కరణ చట్టాలు, పౌరసత్వ సవరణ (చట్టం) తదితరాలు వీధుల్లోకి వచ్చాయి. అందువల్ల బలం ఉంది కదా అనుకొని ముందుకు వెళ్లాలనుకున్న ప్పుడు కూడా ఏకాభిప్రాయం సాధిం చడం సరైన పద్ధతి. అన్నిటికంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేయా లన్నా లేదా పడగొట్టాలన్నా ధన ప్రభావం కీలకంగా నిలిచింది. అయితే దీన్ని కోర్టులో రుజువు చేయ లేరు. సమూలంగా ఎన్నికల సంస్క రణలు అమలు చేయకుండా దొంగ డబ్బు ప్రభావాన్ని నిరోధిం చడం కష్టం. ఎన్నికల బాండ్లు నల్లధనాన్ని పెంచుతాయేగాని తగ్గించలేవు. డబ్బు ప్రభావం ఎన్నికలపై తీవ్రంగా ఉంది. అన్పి పార్టీలతో ఏకాభిప్రాయం సాధించి ఎన్నికల సంస్కరణ లను చేయడం ఒక్క ప్రధానమంత్రి మాత్రమే చేయగలడు. ప్రధాని చొరవ తీసుకుంటే ప్రతి పక్షాలు ముందుకు వస్తాయి. ఇది జరగకపోతే రాజకీయాలు చట్ట సభల్లో న్యాయబద్దంగా ఉండవు, అవి వీధుల్లో న్యాయబద్దమవుతాయి.
వ్యాసకర్త స్వరాజ్య పత్రిక ఎడిటోరియల్‌ డైరెక్టరు
(టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సౌజన్యం)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img