Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

మణిపూర్‌పై సంఘపరివార్‌ కొత్త భాష్యం

మణిపూర్‌లో చాలాకాలంగా మంటలు చెలరేగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన హింసాకాండను పురస్కరించుకొని అక్కడి నుండి భిన్న కథనాలు వస్తున్నాయి. ఈ కథనాలకు భిన్నమైనకోణంలో ఆర్‌ఎస్‌ ఎస్‌ కొత్తభాష్యం చెప్తోంది. ఈ కథనం మణిపూర్‌లో హిందువులుగా పరిగణిస్తున్న మెయిటీలకు బాసటగా నిలిచింది. వలసపాలనాకాలంలో కొండలు, మైదానప్రాంతాలను విభజిస్తూ నిర్మాణం జరిగిందని ఆర్‌ఎస్‌ఎస్‌ ఇంగ్లీషు పత్రిక ‘ఆర్గనైజర్‌’ గత వారం తన సంపాదకీయంలో పేర్కొంది. మెయిటీలు, కుకీల మధ్య జరిగిన సంఘర్షణలపై ఈ పత్రిక వ్యాఖ్యా నించింది. అత్యధిక మెయిటీలు రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌ లోయ ప్రాంతంలో, అనేక గిరిజనతెగలో ఒకటైన కుకీలు కొండలప్రాంతాల్లో నివసిస్తున్నారు. బ్రిటీషు పాలకులు అనుసరించిన విధానాలు ప్రజలను విభజించాయని, కొనసాగుతున్న ఘర్షణలకు మూలకారణమని చెప్తోంది. అక్కడి రాజ్యం భారతదేశంలో విలీనమైన తర్వాతకూడా బ్రిటీషు పాలననాటి విధానాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. 1949లో మణిపూర్‌ భారతదేశంలో విలీనమైంది. అనంతరం మణిపూర్‌ కొండప్రాంతాల్లో నివసిస్తున్న కుకీలు, నాగాలకు ప్రస్తుతం మైన్మార్‌గా పిలుస్తున్న ప్రాంతంతో ఆనాడు వీరికి సంబంధాలున్నాయి. అప్పుడు వీరికి ఎస్‌టీ హోదా దక్కింది. మెయిటీలు మణిపూర్‌ మూలవాసులని వారికి ఎస్‌టీ హోదో దక్కలేదని, ఇప్పటికైనా వారికి ఎస్‌టీ హోదా ఇవ్వాలని ఆర్గనైజర్‌ రాసింది. అలాగే విహెచ్‌పీ పత్రిక ‘హిందూ విశ్వ’ దాదాపు ఇదే రకమైన వ్యాఖ్య చేసింది. కుకీలు, మెయిటీలపై దాడులుచేశారని, వారి దేవాలయాలను కూలగొట్టారని విహెచ్‌పి ప్రధానకార్యదర్శి మిళింద్‌పాండే వ్యాఖ్యానించారు. కుకీలంతా క్రైస్తవులని వీరే హిందువుల ఆలయాలను కూల్చివేశారని పాండే ఆ పత్రికలో రాశారు. ఈ విధంగా చేసిన వ్యాఖ్యానం రెండువర్గాల మధ్య విభజన సృష్టించడానికి దోహదం చేయదా? దేశంలో ప్రధానంగా హిందువులను సమీక్షిస్తూ మైనారిటీలు, క్రైస్తవులపై విద్వేషం ప్రదర్శిస్తున్నారు మరో ఎన్నికల్లో గెలవడానికి ఈ రెండుమతాల ప్రజల ఓట్లుకోసం వెంపర్లాడుతున్న విషయం స్పష్టమవు తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్‌ తాజా హింసాకాండకు కారణమని స్పష్టం కావడంలేదా..!
మణిపూర్‌లో ఈ నెల ప్రారంభంలో జరిగిన హింసాకాండ, గృహదహనాల కారణంగా 45 వేల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. వీరిలో ఘర్షణపడిన మెయిటీలు, కుకీలు ఉన్నారు. కుకీలు ఇతర గిరిజనులు కొండల్లో, మెయిటీలు లోయల్లోని మైదానప్రాంతాల్లో ఉన్నారు. మెయిటీలు హిందువుల్లో 50 శాతానికిపైగా ఉన్నారు. కుకీ మిలిటెంట్లు, సైనికదళాల మధ్య 1990లో సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్‌ (ఎస్‌ఓఓతీవ్రవాద కార్యకలాపాలు తాత్కాలిక రద్దు) ఒప్పందం కుదిరింది. ఫలితంగా మిలిటెంట్లు తమ ఆయుధాలను నిర్దేశిత కేంద్రాల్లో అస్సాం రైఫిల్స్‌ సంరక్షణలో ఉంచారు. కెఎన్‌ఓ, యుపిఎఫ్‌ మిలిటెంటు గ్రూపులు ప్రధానమైనవి. ఆయుధాలు అప్పగించిన వారికి నెలకు రూ.500 ఇచ్చారు. 1990లో కుదిరిన అవగాహన ఒప్పందం తర్వాత కూడా నాగాలుకుకీల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఎస్‌ఓఓ తర్వాత 2008లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కుకీ మిలిటెంట్ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఇది కూడా పెద్దగా పనిచేయదని కొందరు అభిప్రాయపడినట్లుగానే మళ్లీ రక్తపాతం జరిగింది. చొరబాటు దారులను నిలువరించే ఒప్పందం జరిగింది. తాజా అల్లర్లలో మెయిటీ చొరబాటు దారులు పాల్గొనలేదన్న వార్తలు ఉన్నాయి. అంతా ప్రశాంతంగా ఉందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. మణిపూర్‌ సమాజంలో చీలికలు సృష్టించాలన్న నాటకం అమలు చేయడానికి పూనుకున్నారన్న అరోపణలున్నాయి.
తాజాగా పదిమంది కుకీ ఎంఎల్‌ఏలు రాష్ట్రం వెలుపలనుండి కుకీలకు ప్రత్యేకరాష్ట్రం కావాలని డిమాండ్‌చేశారు. మెయిటీలతోకలిసి ఒకేరాష్ట్రంలో ఉండలేమన్నది కుకీలవాదన. మెయిటీలకు చెందిన ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యుడు లెక్షింబ సంజోబ్‌లు కలిసి రెండు మెయిటీల గ్రూపులను రెచ్చగొట్టి మేనెలలో జరిగిన, జరుగుతున్న హింసాకాండకు అవసరమైన వ్యూహం పన్నారన్న అభియోగాలున్నాయి. కుకీలు ఇతర గిరిజనులు ఎక్కువగాఉన్న చురం చంద్‌పూర్‌ జిల్లాలోనే ముందుగా దాడులు ప్రారంభ మయ్యాయని వార్తలున్నాయి. మెయిటీలకు ఎస్‌టీ హోదా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని హైకోర్టు తీర్పు సూచించడంతో ర్యాలీలు, దాడులు, దోపిడీలు, గృహదహనాలు జరిగాయి. చురం చందూర్‌ పట్టణానికి వెలుపల కుకీల యుద్ధస్మారక చిహ్నాన్ని కాల్చివేశారన్న వార్తలు వ్యాపించి అల్లరిమూకలు రెచ్చిపోయాయి. స్మారక చిహ్నం దహనంకాలేదన్న వార్తలు ఆ తర్వాత వచ్చాయి. అయినప్పటికీ కుకీలు ఆగ్రహోదగ్రులై తమ ప్రతాపం చూపారు. మెయిటీలు కుకీలున్న ప్రాంతాలకు గొడవలు విస్తరించడంతో కల్లోల వాతావరణం ఏర్పడిరది. ఈ సారి నాగాలు హింసాకాండలో జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. నాగాల చొరబాటు గ్రూపు ఎన్‌ఎస్‌సిఎస్‌ (ఐఎం) నాయకుడు తుయింగ లెంగ్‌ముయ్‌నాప్‌ాను మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
ఇటీవల కుకీలు సంచార జాతులని, మణిపూర్‌ స్థానిక వాసులు కాదన్న ప్రచారం సాగిస్తున్నారు. ఇక కుకీలు, మెయిటీల మధ్య అప నమ్మకాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం నిస్పాక్షికంగా వ్యవహరించక పోవడం అగ్నికి ఆజ్యం పోసింది. మెయిటీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవడం ఎస్‌టీ హోదా కల్పిస్తామన్న హామీ మిలిటెంట్లతో చేసుకున్న ఒప్పందం నుంచి వెనక్కుతగ్గడం లాంటి పరిస్థితిని అదుపులోకి రాకుండా చేశారు. కేంద్ర నాయకులు ఎన్నికల్లో ప్రయెజనం పొందడానికి వేస్తున్న ఎత్తుగడలు అనేక రాష్ట్రాల్లో ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.
`ఎడిట్‌ పేజి డెస్క్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img