Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

మణిపూర్‌ మంటలకు సంఫ్‌ు కారణం

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

మణిపూర్‌ 60 రోజులుగా మండుతోంది. మణిపూర్‌పై ప్రధాని మౌనం వహించారని ప్రతిపక్షాల, సామాజిక ఉద్యమకారుల విమర్శ. మణిపూర్‌ గురించి ప్రధాని రోజూ చర్చిస్తున్నారని కేంద్ర గృహమంత్రి అమిత్‌ షా, మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్‌ అన్నారు. జర్మన్‌ నియంత హిట్లర్‌ కూడా మౌనమునే. గృహమంత్రి హీన్రిచ్‌ హిమ్లర్‌, చైతన్య ప్రచార మంత్రి జోసెఫ్‌ గోబెల్స్‌, ఆర్మీ ఛీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఎర్విన్‌ రోమెల్‌, శాఖా రహిత మంత్రి జర్మన్‌ వాయుసేన అధిపతి హెర్మన్‌ గోరింగ్‌లతో మాత్రమే హిట్లర్‌ మంతనాలాడేవారు. కశ్మీర్‌, లక్షద్వీప్‌ ఘటనలతో మణిపూర్‌ మంటలకు సారూప్యముంది. రాజ్యాంగ అధికరణలు 370, 35ఏ కశ్మీర్‌ ప్రజలకు భూమిపై హక్కులనిచ్చాయి. వీటి రద్దుతో కశ్మీర్‌ భూములను ఆశ్రిత కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పారు. లక్షద్వీప్‌లో కేంద్ర కార్యనిర్వహణాశాఖ రాజ్యాంగ పరిమితినిదాటి చట్టాలు చేశారు. ప్రకృతి వనరులను, సుందర సముద్ర తీరాలను, జనులులేని ద్వీపాలను కార్పొరేట్లకు పంచారు. నేటి మణిపూర్‌ అల్లర్లకు పాలకవర్గాల తాజా చర్యలే కారణం.
2017లో 21 సీట్లతో ఎత్తుగళ్ళతో బీజేపీి మణిపూర్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైదిక మతవాద అధిక సంఖ్యాక మెయితీలను, సనమహిలను సంఫ్‌ు సంస్థలు సంఘటితపర్చి గిరిజన కుకీలపై దాడి చేశాయి. కుకీలతో ఆస్తులు, ఆవాసాలు, పొరుగు పంచుకోవద్దని గతేడాది ఎన్నికల్లో బీరేన్‌సింగ్‌ మెయితీలకు చెప్పారు. ఈ గుజరాత్‌ హిందుత్వ నమూనాను మెయితీలు పాటించారు. క్రైస్తవులుగా మారిన మెయితీలనూ తరిమేశారు. కుకీలు, నాగాలు మణిపూర్‌ లోయలో పిల్లలను చదివించు కుంటారు. చిన్న పనులతో అద్దె ఇళ్ళలో బతుకుతారు. మెయితీల చర్యలతో పిల్లల చదువు, పెద్దల బతుకుదెరువు ఆగాయి. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే శాంతి భద్రతలు, జీవన ప్రమాణాలు పెంచుతామని ప్రధాని ప్రచారం చేశారు. 36 వేర్పాటువాద సంస్థల్లో ప్రభుత్వంలో భాగస్వాములైన మెయితీల తీవ్రవాద సంస్థల నిర్వహణ ఆంక్షలను 2022 ఏప్రిల్‌లో ఎత్తివేశారు. అవి విజృంభించాయి. మెయితీలకు షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ హోదా ఇస్తామని ప్రధాని వాగ్దానం చేశారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతో రాజకీయ ప్రాతినిధ్యం సాధించలేని మారుమూల ప్రాంతాల గిరిజనులకు రాజ్యాంగం షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ హోదాను ఇచ్చింది. ఈ అర్హతలేని మెయితీలకు ఈ హోదా ఎలా ఇస్తారు? ఆ హోదా కోసం మెయితీలు ఉద్యమించారు. మెయితీ తీవ్రవాద సంస్థలు, సంఫ్‌ు వత్తాసు పలికాయి. దీనికి గిరిజనులు నిరసన తెలిపారు. దీన్ని అడ్డుకునేందుకు మెయితీలు హింసకు పాల్పడ్డారు.
మణిపూర్‌లో మైన్మార్‌ వలసదార్లు చొరబడ్డారని సంఫ్‌ు ప్రచారం. మణిపూర్‌లో విదేశీయుల ప్రవేశానికి నియంత్రిత ప్రాంత అనుమతి కావాలి. ఇది 10రోజులకే ఇస్తారు. అక్రమ వలసదారులు రాలేరు. మైన్మార్చిన్‌ తెగ వలసదార్లు, అధికారుల నిర్లిప్తతతో మణిపుర్‌లో చొరబడ్డారు. మైన్మార్‌ రోహింగ్య ముస్లింలను అడ్డుకున్న కేంద్రం వీరిని ఆపలేదు. 2013లో బీజేపీి ప్రభుత్వాలు గుజరాత్‌, రాజస్థాన్‌, హరియాణాలకు వైదిక మతస్తులను రానిచ్చాయి. వారికి పౌరసత్వం, ఓటు హక్కు ఇచ్చాయి. సాధారణ ఎన్నికల్లో సీట్లు పొందారు. ఇదే ప్రయోజనాన్ని ఆశించి కేంద్ర, రాష్ట్ర పాలకులే మణిపూర్‌లోకి బర్మీయులను రానిచ్చారని అనుమానం.
కుకీలు నివసించే మణిపూర్‌ పర్వత ప్రాంతాల్లో బొగ్గు నిలువలున్నాయి. ఇటీవల పెట్రోలియంనిక్షేపాలు బైటపడ్డాయి. వాటిని తమకార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టాలని బీజేపీి పాలకుల పన్నాగం. రక్షిత, వన్యప్రాణ అభయారణ్య అడవుల సాకుతో కుకీల భూములను ఆక్రమించారు. వారిని అక్కడి నుండి తరిమేశారు. కుకీలలో మాదకద్రవ్యాల అలవాటు, ఎయిడ్స్‌ వ్యాధి ఎక్కువ. యువత నిర్వీర్యమైంది. కుకీలు నల్లమందు పండిస్తున్నారని నేరాలు మోపారు. నల్లమందు తోటలను ధ్వంసం చేశారు. నల్లమందు పండిరచడం నేరం కాదు. మత్తు పదార్థాల, మాదక ద్రవ్యాల తయారీ నేరం. మెయితీలు వాణిజ్యవేత్తలే ఈ పని చేస్తారు. పాలకవర్గ మెయితీలు డ్రగ్‌ సిండికేట్‌లు. కుకీల నుండి నల్లమందు పంటను నామమాత్రపు ధరకు కొంటారు. పంటతో సహా నల్లమందు వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలని డ్రగ్‌ సిండికేట్‌ల పథకం. ఇటీవల పోలీసులు నల్లమందు ముఠాలను అరెస్టు చేశారు. వారిలో ముఖ్యమంత్రి బంధువులున్నారు. ఆర్థిక అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, జాతుల వైషమ్యాలు కుకీలను నల్లమందు పంటవైపుకు, గిరిజన స్త్రీలను వ్యభిచారంవైపుకు నెట్టాయి. బీజేపీి పాలకులు ఈ సమస్యలను పరిష్కరిస్తే కుకీలు నల్లమందు జోలికి పోరు. ఎయిడ్స్‌ వ్యాధి తగ్గుతుంది.
మణిపుర్‌లో క్రైస్తవ జనాభా పెరిగిందని, వారు మెయితీలను దాటిపోతారని సంఫ్‌ు ప్రచారం. దేశంలో ముస్లింలు పెరిగి హిందువులను అపాయంలో ముంచుతారన్న ప్రచారం లాంటిది. 1961-2011 మధ్య 50 ఏళ్ళలో క్రైస్తవులు 5 లక్షలు పెరిగారు. వైదిక మతస్తులూ పెరిగారు. కాలక్రమంలో పెరిగిన జనాభా, ఓట్ల కోసం పాలకులు అనుమతించిన వలసలు, వైదికమత వివక్షను భరించలేక క్రైస్తవం పుచ్చుకున్నవారు ఈ పెరుగుదలకు కారణం. రూపాయికి రూపాయి కలిపితే 100శాతం పెరుగుదల. 1,000కి 100 కలిపితే పెరిగేది 10శాతం. 100 కంటే రూపాయి తక్కువ. క్రైస్తవమత పెరుగుదలను అరికట్టడానికి జాతీయ పౌరసత్వ, జాతీయ జనాభా జాబితాలను తయారు చేయమని, 1951 జనాభా ప్రకారం పౌరసత్వాన్ని సవరించమని సంఫ్‌ు డిమాండ్‌ చేసింది. 1961 జనాభా ప్రకారం పౌరసత్వాన్ని సవరిస్తే 80శాతం కుకీలు పౌరసత్వం కోల్పోతారు. 1951 ఆధారంగా సవరిస్తే 95శాతం కుకీిలు, నాగాలు పౌరసత్వం కోల్పోయి రాష్ట్రాన్ని వదలాలి. అల్లర్లలో 6,000 ఆయుధాలు భాండాగారాల నుండి చోరీ అయ్యాయి. ఒక్కటీ పట్టుబడలేదు. 1,000 ఆయుధాలే పోయాయని, 200 రికవరి చేశామని ముఖ్యమంత్రి అన్నారు. అల్లర్లు జరిగిన చురాచందపుర్‌ ప్రాంతంలోనే కాక రాష్ట్రమంతా చోరీలు జరిగాయి. చిన్న కారణాలకే సామాన్యులను చంపే పోలీసులు వీరిని ఎందుకు కాల్చలేదు? అన్ని స్టేషన్లలో భద్రతారాహిత్యం, నిర్లిప్తత ఎలా వచ్చాయి? కేంద్ర, సైనిక, ప్రత్యేక దళాల భాండాగారాల జోలికి పోకుండా రాష్ట్ర రక్షణదళాల భాండాగారాల నుంచే చోరీ జరిగింది. పాలకుల, అధికారుల మద్దతు లేనిదే ఇలా జరుగుతుందా? దోపిడీ ఆయుధాలు సంఫ్‌ు సంస్థలకు చేరాయని అనుమానం.
మణిపూర్‌ కాలుతున్నప్పటి నుండి మణిపూర్‌ పాలక వర్గాలు 45 ట్వీట్లు చేశాయి. వాటిలో 13 మాత్రమే మణిపూర్‌కు సంబంధించినవి. మిగిలినవి కేంద్ర పాలకుల ట్వీట్ల రిట్వీట్లే. రాహుల్‌ గాంధీని ఎగతాళి చేసేవి, ఇందిర ఎమర్జెన్సీ, 1984 సిక్కుల ఊచకోత, 1985 షా బానో కేసు లింగ వివక్షతల గురించిన విమర్శలే. రోమ్‌ కాలుతుంటే ఫిడేల్‌ వాయిస్తూ నీరో చక్రవర్తి వినోదించారు. నేటి ఇండియాలో సామంతులూ నీరోలే. చనిపోయిన వారిలో 98శాతం, పారిపోయిన వారిలో 70శాతం కుకీలు. 120 మంది చనిపోగా, 500 మంది గాయపడ్డారు. 20,000 ఇళ్ళు కూలాయి. 6,500 మంది పారిపోయారు. కుకీల ఆస్తులు, వాహనాలే బూడిదయ్యాయి. కుకీలను తీవ్రవాదులుగా చిత్రించి పాలకవర్గ అధికారులే చంపారు. 200 చర్చిలు, 17 గుళ్ళు, 124 గిరిజన గ్రామాలు,1700ల కుకీల ఇళ్ళు నేలమట్టమయ్యాయి. వీరు తిరిగి రావడానికి సైన్య సహాయం కోరుతున్నారు. ఒకప్పుడు వీరు సైనికులను అసహ్యించుకున్నారు. గిరిజనులు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నారు. ఈ అవకాశాలను దొరకపుచ్చుకొని మైన్మార్‌ సైనిక రaుంఠా మణిపూర్‌లో చొరబడగలదు.
ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి
సంచారవాణి: 9490 20 4545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img