Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

అమెరికాకు మేలు-మన రైతులకు నష్టం

ఇటీవల జి-20 సదస్సులో పాల్గొనడానికి భారత దేశానికి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మన ప్రధాని మోదీ అమెరికా నుండి కోడికాళ్లు, గుడ్లు, యాపిల్‌ పళ్లు, శనగలు ఇతర ఫలాల దిగుమతిపై వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. విశేషమేమంటే దిగుబడి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై విధించే సుంకాన్ని గణనీయంగా తగ్గించారు. ఉదాహరణకు యాపిల్‌పళ్లు, శనగల దిగుమతలపై ప్రస్తుతమున్న సుంకాన్ని 70శాతం నుండి 15శాతం కనిష్టస్థాయికి వడ్డింపబడిరది. కోడిమాంసం సైతం దేశంలో ఉత్పత్తికి అయ్యే ఖర్చు కంటే చౌకగా అమెరికా మాంసం లభ్యమయ్యే అవకాశాలుండటంతో రైతాంగం, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
కోడిమాంసం: మన దేశం సాలీనా 18కోట్ల కిలోల కోడిమాంసం, దాదాపు 1,29 వందల కోట్ల కోడిగుడ్లను ఉత్పత్తి చేస్తూ స్వయంసమృద్ధిని సాధించింది. మనకు దిగుమతులు ఏమాత్రం అవసరం లేకపోగా ఈ ఉత్పత్తులను పొరుగు, అరబ్‌ దేశాలకు సైతం దిగుమతి చేస్తున్నాము. ముఖ్యంగా 95శాతం జనాభా అవసరాలను కోడిగుడ్లు తీరుస్తున్నాయి. దేశంలో దాదాపు నాలుగున్నర కోట్లమంది రైతులకు ముఖ్యంగా రైతు మహిళలు, వ్యాపారస్థులు, కార్మికులకు కోళ్ల పరిశ్రమలున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో, బ్రాయిలరు కోడిమాంసాన్ని సరఫరాచేసే ‘వెంకీస్‌’ (వెంకటేశ్వర హేచరీస్‌), గాడ్రెజ్‌ తదితర పెద్దకోళ్ల ఉత్పత్తి పరిశ్రమలు అనేక లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
అమెరికాలో కోళ్ల పరిశ్రమకు ప్రభుత్వ విరివిగా 70 నుండి 90 శాతం వరకు ఉచిత సబ్సిడీనిచ్చి, అనేక ఎగుమతి ప్రోత్సాహకాలను అందిస్తుంది. కాగా మన దేశంలో మొక్కజొన్న, సోయాచిక్కుడు ఉత్పత్తి అంతంత మాత్రం పంటల సేద్యపు ఖర్చుల ప్రతీ ఏటా పెరుగుతున్న కారణంగా కోళ్ల మేత ధరలకు కూడా సాలీనా 12 నుండి 15శాతం వరకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో కోడిమాంసం ధర రూ.240 వరకు ఉంది. అమెరికా నుండి దిగుమతియ్యే కోడిమాంసం ఖరీదు రూ.140 వరకు ఉండగలదని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. అంటే ధర సగానికి సగం తగ్గి చౌకగా లభించ గలిగే అవకాశాలుండటంతో కోళ్ల పరిశ్రమలోని వ్యాపారులు, చిన్న రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
అమెరికా ప్రజలు కోడి ఉదరభాగాన్నే ఇష్టంగా భుజిస్తారు. ఎక్కువ కొవ్వు కలిగిన కాళ్లు, రెక్కలను ఇష్టపడరు. ఈ భాగాలను చైనా, కొరియా, భారత్‌ వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. మన దేశంలో కోడికాళ్లు, చైనీయులు కోడి పాదాలను ఇష్టంగా తింటారు. కోడిమాంసపు దిగుబడిని గత దశాబ్దకాలంగా అమెరికా వత్తిడిచేస్తున్నా భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ) ఆంక్షలను బర్డుఫ్లూ వంటి కారణాలుచూపి దాటవేస్తూ వస్తున్నది. శనగలుసైతం ప్రస్తుతం మద్దతు ధర టన్నుకు రూ.5,335 దిగమతి చేసుకొనే శనగలను 40శాతం అధికంగా అమెరికా నుండి మనం కొనుగోలు చేయబోతున్నాము.
యాపిల్‌పళ్లు: కశ్మీరులోయలో (70శాతం), హిమాచల్‌ ప్రదేశ్‌లలో యాపిల్‌ పళ్లు విరివిగా సాగవుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌, అమెరికా, టర్కీ, తదితర దేశాలనుండి దిగుమతి అవుతున్న యాపిల్‌పళ్లపై 70శాతం టారిఫ్‌ సుంకం విధిస్తున్నది. కాగా ప్రస్తుతం దిగుమతి ఒప్పందం ప్రకారం దిగుమతి సుంకం టన్నుకు 70శాతం నుండి 20శాతానికి తగ్గించివేయడంతో దేశంలో యాపిల్‌పళ్ల ధరలు తగ్గి కాశ్మీరు, హిమాచల్‌ రైతాంగం తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయి. అమెరికాలో యాపిల్‌ పళ్ల సాగును ‘‘స్ట్రే మూల్ట్‌’’ ‘‘ఐవాన్స్‌’’ వంటి బడా అగ్రిబిజినెస్‌ కంపెనీలే ఉత్పత్తిచేసి, అమ్మకాలను, ఎగుమతులను చేస్తాయి. డబ్ల్యుటీఓ (ప్రపంచ వాణిజ్యసంస్థ) నిబంధనలకు వ్యతిరేకంగా ఈ కంపెనీలకు 90శాతం వరకు ఉత్పత్తి సబ్సిడీ ప్రోత్సాహకాలను అమెరికా ప్రభుత్వం ఇస్తున్నది. బహుశా..డబ్ల్యుటీఓ సబ్సిడీ నిబంధనలు భారత్‌, ఆఫ్రికా వంటి తరుణ దేశాలకే వర్తిస్తాయి తప్ప, ధనిక దేశాలకు వర్తించవనుకుంటాను. కాగా మన దేశంలో ప్రతీ ఏటా పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, వాతావరణ మార్పుల కారణంగాను, తరచు హైవే రహదారుల దిగ్బంధంతో కాశ్మీరు రైతలు అనేక ఇబ్బందులును ఎదుర్కొంటున్నారు.
దిగుమతి సుంకాలను తగ్గించి వేయటంతో ధరల విపరీతంగా తగ్గి, పంటలు గిట్టుబాటుకాక, మన దేశ రైతాంగం విపరీతంగా నష్టపోగలదు. మరోపక్క అమెరికా రైతుల ప్రయోజనాలకై దేశంలో రైతుల ప్రయోజనాలను బలిపెట్టటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. సామ్రాజ్యవాద దేశాలను మెప్పించే ఉదారవాద ఆర్థిక విధానలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం ముఖ్యంగా పోరాడాల్సి ఉంది.
డా. సోమ మర్ల

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img