Friday, February 3, 2023
Friday, February 3, 2023

మరుగుతున్న నడిసంద్రంలో మానవ నౌక

టి.వి.సుబ్బయ్య

2070 నాటికి కాలుష్యం విడుదలను పూర్తిగా అదుపు చేస్తామని మోదీ చేసిన ప్రకటనకు, శిలాజ ఇంధనాల ఉత్పత్తి ప్రణాళికలకు ఏమాత్రం పొంతన లేదు. 2030 నాటికి సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పత్తిని 500 గిగావాట్లకు, పునర్వినియోగ ఇంధనాల వినియోగాన్ని 50 శాతానికి, కలుషిత వాయువుల విడుదలను వంద టన్నుల తగ్గింపు, కలుషిత వాయువుల విడుదల తీవ్రతను 40 శాతం లోపు లక్ష్యాలను భారత్‌ ప్రకటించింది. మీథేన్‌ గ్యాస్‌ అత్యంత ప్రమాదకరమైంది. అడవుల నరికివేత ఈ గ్యాస్‌ విడుదలను మరింత పెంచుతుంది.

మానవాళి నౌక నేడు సలసల మరుగుతున్న నడి సముద్రంలో ప్రయాణిస్తోంది. రంధ్రం పడి వేడినీరు నౌకలోకి వచ్చి 7080 శాతం నిండిరది. నౌక ఎప్పుడైనా మునిగి పోవచ్చు. ఈ పరిస్థితిని వందల సంవత్సరాల క్రితమే గుర్తించిన అనేకమంది శాస్త్రవేత్తలు హెచ్చరించారు. పాలకులు, ప్రజలు గుర్తించకపోవడం వల్ల నేడు పర్యావరణ (జీవావరణం) బాగుచేయలేనంతగా కలుషితమైందని, భూతాపం వేగంగా పెరిగిపోతూ మానవాళికి మహా విపత్తు పొంచి ఉందని అనేక శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 1972 లో రియో డిజనిరియో నగరంలో జరిగిన ధరిత్రి రక్షణ సదస్సు నుండి నేడు గ్లాస్గోలో జరుగుతున్న కాప్‌26 వ (వివిధ పక్షాల) సదస్సు వరకూ దాదాపు అన్ని దేశాల నేతలూ పాల్గొని చర్చించి భూతాపం పారిశ్రామికీకరణకు ముందున్న ఉష్ణోగ్రతలకు మించకుండా 1.5 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఈ శతాబ్ది చివరి నాటికి పరిమితం చేసి మానవాళి మనుగడకు ముప్పు రాకుండా చూడాలని ప్రకటించాయి.1997 నాటి క్యోటో సదస్సు, 2006 నాటి కోపెన్‌ హెగెన్‌ సదస్సు ఒప్పందాలు ఇలాంటి నిర్ణయాలే చేశాయి. ఈ దిశలో అన్ని దేశాల కంటే ఎక్కువగా కాలుష్యం వెదజల్లుతున్న అమెరికా , చైనా, భారత్‌లు గణనీయమైన చర్యలు తీసుకోలేదు. కనీసం ప్రజలను చైతన్యం చేయలేదు. దీంతో ప్రకృతి విపత్తులు ఈ దశాబ్దిలో అమితంగా పెరిగాయి. 2021 అత్యంత కాలుష్య వత్సరంగా నమోదైంది ఈ నేపథ్యంలో గ్లాస్గో సదస్సుకు ముందు వెల్లడైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
బొగ్గు, ముడిచమురు, గ్యాస్‌ ఉత్పత్తులను రెట్టింపు చేయాలని ప్రపంచ దేశాలు ప్రణాళికలు వేసుకున్నాయని కాప్‌26 వ సదస్సుకు పదిరోజుల ముందు అక్టోబరు20 న ఐక్యరాజ్య సమితి ప్రకటన చేసింది. దీని అర్థం 1.5 డిగ్రీల సెల్సియస్‌ భూతాపానికి మించకుండా పరిమితం చేయాలన్న లక్ష్యం సాధ్యమేనా! పారిస్‌ ఒప్పందం ప్రకారం శిలాజ ఇంధనాల ఉత్పత్తిని 2030 నాటికే 50 శాతం తగ్గించాలన్న తీర్మానం అమలుకు ఏ ఒక్క దేశం చర్యలు తీసుకున్నట్టు కనిపించదు. అత్యధికంగా బొగ్గును ఉపయోగించే భారతదేశం, చైనాలు ఈ దిశగా ప్రణాళికలు ఇంతవరకు రూపొందించలేదు. కొవిడ్‌19 మహమ్మారి విజృంభించిన కాలంలోనే ప్రధాని మోదీ కొత్తగా 14 బొగ్గుగనుల తవ్వకానికి వేలంపాట ద్వారా మంజూరు చేశారు. దీని అర్థం బొగ్గు వినియోగం తగ్గదనే భావించాలి. ఆయా దేశాల అభివృద్ధి ప్రణాళికలు ఈ దశాబ్దిలో అదనంగా 110 శాతం శిలాజ ఇంధనాలు ఉత్పత్తి చేయనున్నాయని, ఈ శతాబ్ది చివరి నాటికి భూతాపాన్ని పరిమితం చేయటం సాధ్యం కాదని ఐరాస అంచనా వేసింది. ఇప్పటికే పారిశ్రామికీకరణకు ముందున్న భూతాపానికి కంటే 1.1 డిగ్రీల సెల్సియస్‌ భూతాపం పెరిగిందని, కరోనా ప్రారంభమయ్యాక బొగ్గు ఉత్పత్తి మరింత పెరిగిందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఎ) అక్టోబరులో వెల్లడిరచింది. ఇటీవల మన దేశంలోను ఇతర అనేక దేశాలలో సీజన్‌ కాని సమయంలో దశాబ్ది కాలంలో లేని అతి భారీ వర్షాలు, వరదలు, ఎండలు మండిపోవటం చోటు చేసుకున్నాయి. 2050 నాటికి ఊహించలేనన్ని విపత్కర పరిణామాలు జరుగుతాయని ఇటీవల అంతర్‌ ప్రభుత్వ కమిటీ తన నివేదికలో హెచ్చరించింది. అత్యధికంగా కర్బనపు వాయువులను విడుదల చేస్తున్న సంపన్న దేశాలు పేద దేశాలు కూడా తమతో సమంగా కర్బనపు వాయువులను తగ్గించాలని కోరుతున్నాయి. పర్యావరణం అపరిమితంగా కలుషితం కావడానికి సంపన్న దేశాలు, ధనిక వర్గాలు ఎక్కువ కారణం. 2030 నాటికి 240 శాతం అదనంగా బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రపణాళికలు రూపొందించుకున్నాయని ఐఈఎ ప్రకటించింది. 2030 నాటికే అత్యధికంగా కలుషిత వాయువుల విడుదలను తగ్గిస్తామని 2060 నాటికి ముందే 65 శాతం ఈ వాయువుల విడుదలను అదుపు చేస్తామని గ్లాస్గో సదస్సుకు మూడు రోజుల ముందే చైనా ప్రకటించింది. ఈ అంశాన్ని న్యూ సైంటిస్ట్‌ పత్రిక అందించింది. 2070 నాటికి కాలుష్యం విడుదలను పూర్తిగా అదుపు చేస్తామని మోదీ చేసిన ప్రకటనకు, శిలాజ ఇంధనాల ఉత్పత్తి ప్రణాళికలకు ఏమాత్రం పొంతన లేదు. 2030 నాటికి సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పత్తిని 500 గిగావాట్లకు, పునర్వినియోగ ఇంధనాల వినియోగాన్ని 50 శాతానికి, కలుషిత వాయువుల విడుదలను వంద టన్నుల తగ్గింపు, కలుషిత వాయువుల విడుదల తీవ్రతను 40 శాతం లోపు లక్ష్యాలను భారత్‌ ప్రకటించింది. మీథేన్‌ గ్యాస్‌ అత్యంత ప్రమాదకరమైంది. అడవుల నరికివేత ఈ గ్యాస్‌ విడుదలను మరింత పెంచుతుంది. 2030 నాటికి అడవుల నరికివేతను పూర్తిగా నిలిపివేస్తామని దాదాపు 50కి పైగా దేశాలు విడుదల చేసిన ప్రకటనపై భారత్‌ సంతకం చేయలేదు. మన దేశం కాకుండా చైనా, రష్యాలు కూడ సంతకం చేయలేదు. ఈయూ అమెరికా నాయకత్వంలో రూపొందించిన వాగ్దాన పత్రం ఇది. 2014 లోనే 2030 నాటికి అడవుల నరికివేత పూర్తిగా నిలిపివేస్తామన్న వాగ్దానం ఇంతవరకు అమలు జరగలేదు. 2015 లో కుదిరిన పారిస్‌ ఒప్పందంపై సంతకం చేయని అమెరికా కాలుష్యం విడుదలను ఇంతవరకు తగ్గించలేదు. పైగా ట్రంప్‌, బొల్సొనొరొ లాంటి దేశాధినేతలు వాతావరణ కాలుష్యమే లేదని అపహస్యం చేశారు.
భారత్‌ 70 శాతం, చైనా 62 శాతం విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. చాలా ఎక్కువ మంది బొగ్గును ఆహార అవసరాలకు మన దేశంలో వినియోగిస్తున్నారు. పేద దేశాలు కాలుష్యం తగ్గింపు చర్యలు తీసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వంద బిలియన్‌ డాలర్లు సహాయాన్ని అందించాలని పారిస్‌ సదస్సు నిర్ణయించింది. అయితే 2019 లో అభివృద్ధి చెందిన దేశాలు 16.7 బిలియన్‌ డాలర్ల సహాయాన్ని మాత్రమే చేశాయి. గ్లాస్గో సదస్సును బ్రిటన్‌ ప్రధాని బొరిస్‌జాన్సన్‌ ప్రారంభిస్తూ వాతావరణ కాలుష్యం అపరిమితంగా పెరగటం యుగాంతానికి సూచికగా ఉందన్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటొనియోగుటెర్రెస్‌ మాట్లాడుతూ ‘‘ ప్రజలు తమ గోతులను తామే తవ్వుకుంటున్నారు.’’ అని తీవ్ర వ్యాఖ్య చేశారు. అత్యధికంగా కాలుష్యం విడుదల చేస్తున్న చైనా, అమెరికా, భారత్‌, ఈయూ దేశాలు అభివృద్ధి పేరుతో ఇప్పటికీ విధ్వంసకర ప్రణాళికలు రూపొందించి అమలు చేయటమే నేటి ఈ దుస్థితికి ప్రధాన కారణం. గ్లాస్గో సదస్సు గొప్ప గొప్ప నిర్ణయాలు చేస్తుందని వాటి అమలు వేగంగా జరుగుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. పారిస్‌ సదస్సు నాడు ఇలాంటి ప్రచారమే సాగింది. కరోనా మహమ్మారి లక్షలాది ప్రజల ప్రాణాలు హరించి వేసింది. ఈ సందర్భంలోను ప్రపంచ నేతలంతా ఒక్కటై నియంత్రణ చర్యలకు పూనుకోలేదు. కాలుష్యం తగ్గించి మానవాళి మనుగడను కొనసాగించవలసిన కర్తవ్యం అన్ని దేశాలపైన ఉంది. విధ్వంసకర విధానాలను వదిలి వేయటమే ఉత్తమమైన పరిష్కారం. గ్లాస్గో సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ నేతలు ప్రయాణించిన విమానాలు దాదాపు 500 టన్నుల కాలుష్యాన్ని వెదజల్లాయని అంచనా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img