Monday, June 5, 2023
Monday, June 5, 2023

మరో పోరుకు రైతులు సిద్ధం కావాలి

రావుల వెంకయ్య

దేశంలో సంవత్సర కాలానికి పైగా నడిచిన చారిత్రాత్మక రైతు పోరాటం ఫలితంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగివచ్చి మూడు రైతు వ్యతిరేక నల్లచట్టాలను పార్లమెంటు సాక్షిగా ఉపసంహరించు కొని యావత్‌ రైతు జాతికి కన్నీటితో క్షమాపణలు చెప్పారు. ఇది భారతదేశంలో రైతులు సాధించిన ఘనవిజయం. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేసిన ఏ చట్టాలను ఉపసంహరించుకొన్న ఆనవాళ్లు లేవు. ఉదా 1000, 500 రూపాయల నోట్లు రద్దుచేసి దాని వల్ల దేశ ప్రజలంతా ఎనలేని కష్టాలు పడినప్పటికీ అది తప్పేనని అంగీకరించలేదు. ఇప్పటికీ దాన్ని సమర్థించుకుంటున్నారు. విదేశాల నుంచి నల్లధనం తెచ్చి ప్రతి భారతీయుని ఎకౌంటులో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. కోటీశ్వరులవద్ద నున్న నల్లడబ్బు వెలికి తీస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా పేదల ఎకౌంటులో వెయ్యకపోగా కోటీశ్వరులవద్ద నున్న నల్లడబ్బును వైట్‌ మనీగా మార్చుకోవడానికి ఈ నోట్ల రద్దు ఉపయోగపడిరది. సామాన్య ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేశారు. దానిపై దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరిపినా నరేంద్ర మోదీని ఏ మాత్రం కదపలేకపోయారు.
అలాగే అనేక ఇబ్బందులకు గురిచేసే జి.ఎస్‌.టి. పన్నుల విధానం వల్ల సామాన్య ప్రజలు వాడే బట్టలు, వివిధ సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. చివరకు ప్రజలు తినే ఆహారంపై కూడా జిఎస్‌టి పన్నులు విధించారు. దీనిపై దేశవ్యాప్తంగా వ్యాపారవర్గాలు, వారికి మద్దతుగా ప్రజలు ఆందోళనలు చేశారు. అయినా నరేంద్ర మోదీని కదిలించలేకపోయారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జమ్మూ` కాశ్మీర్‌లో మైనార్టీలను రక్షించటానికి ఆర్టికల్‌ 370 తెచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కలంపోటుతో ఆ ఆర్టికల్‌ను రద్దు చెయ్యటం జరిగింది. దానిపై దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు, వారికి మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కు తగ్గలేదు.
దేశంలో కార్మికవర్గం సాధించుకున్న చట్టాలను, హక్కులను కాలరాస్తూ కొత్త చట్టాలను తీసుకువచ్చారు. పోరాడి సాధించుకున్న నలభై చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్‌లుగా కుదించారు. దానిపై దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా బంద్‌లు, సమ్మెలు, హర్తాళ్లు నిర్వహించినా నరేంద్ర మోదీ దిగిరాలేదు.
నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చిన ప్రతి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌మోహన్‌రెడి ్డప్రభుత్వం బేషరతుగా మద్దతు తెలియ చెయ్యడం జరిగింది. రైతువ్యతిరేక నల్లచట్టాలబిల్లును అందరికన్నా ముందుగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బలపర్చింది. రైతుకు వ్యతిరేకమైన విద్యుత్‌ బిల్లును జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ముందువరసలో ఉండి బలపర్చడమే కాకుండా రైతులకు వ్యతిరేకంగా స్మార్ట్‌మీటర్లు బిగించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. విద్యుత్‌బిల్లును బిజెపికి అనుకూలంగాఉన్న రాష్ట్రప్రభుత్వాలు వ్యతి రేకించాయి. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రప్రభుత్వాలు ఏకోన్ముఖంగా విద్యుత్‌ బిల్లును వ్యతిరేకించాయి. రాష్ట్రంలోని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాలుగువేల కోట్ల రుణంకోసం ఆగమేఘాలమీద విద్యుత్‌చట్టం అమలుకు చర్యలు చేపట్టారు.
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత చారిత్రాత్మకంగా జరిగిన రైతు ఉద్యమం ప్రధానమంత్రి మెడలు వంచగలిగింది. ఈ పోరాటంలో 750 మందికి పైగా రైతులు అమరులయ్యారు. ఇప్పటికీ వేలాదిమంది రైతులపై పెట్టినకేసులు పెండిరగ్‌లోనే ఉన్నాయి. నల్లచట్టాలను ఉపసంహరించు కున్నారు కానీ వాటిని దొడ్డిదారిలో తిరిగి ప్రవేశపెట్టడానికి శతవిధాలుగా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. చట్టాలు ఉపసంహరించుకునే సందర్భంలో రైతులకు, రైతు సంఘాలకు ప్రధానమంత్రి రాతపూర్వకంగా ఇచ్చిన ఏ ఒక్కహామీ అమలుకు నోచుకోలేదు. రైతుకు మద్దతు ధరల హామీ అలాగే ఉన్నది. కేరళ తరహా రుణ విమోచన చట్టబద్ద హక్కుగా కావాలనే డిమాండుకు కార్యాచరణ జరగలేదు. రైతులకు నష్టం కలిగించే విద్యుత్‌ బిల్లు అలాగే ఉన్నది. చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వనేలేదు. ఈ వాగ్దానాలు చేసి సంవత్సరం దాటినా ప్రధాని నుండి ఉలుకూ పలుకూ లేదు. దానిపై మార్చి20న ఢల్లీి రామలీలామైదాన్‌లో జరిగినసభకు దేశ వ్యాప్తంగా లక్ష మందికి పైగా రైతులు హాజరయ్యారు. ఆ సభలో ఇచ్చిన హామీల అమలుకు మరో పోరాటానికి సిద్ధం కావాలని సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపివ్వటం జరిగింది. కిసాన్‌మోర్చా దిల్లీలో సమావేశమై కార్యా చరణ ప్రకటించనున్నది. త్వరలో చేపట్టనున్న ఉద్యమంలో దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు విరివిగా పాల్గొని నరేంద్ర మోదీకి తగిన గుణపాఠం నేర్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దానికోసం రైతాంగం అంతా సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాము.
రచయిత ఏఐకెఎస్‌ అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img