Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

మాట బహు గొప్పది

రా బావ మళ్లీ ఈ రోజు ఏమైంది. ఏం కావాలి నోరు ఉంది కదా అని ఎలా బడితే అలా మాట్లాడకూడదు. అది సరే అసలేమైంది. మా పక్కింట్లో రెండు పోర్షన్లు ఉన్నాయి. వారిద్దరికీ ఏదో గొడవైంది. అందులో ఒకతను నన్ను పిలిచాడు. వెంటనే నన్ను చూచి వీడొక పెద్ద మనిషా అన్నాడు. అసలు ఆ పోర్షన్లోకి నిన్నుకాక మొన్న వచ్చాడు. నా గురించి ఏమి తెలుసని నన్ను వాడు, వీడు అంటాడు. చూడు బావ నువు చాలా సెన్సిటివ్‌. అసలు నోటితో చెప్పలేని బూతులు మన నాయకులు మాట్లాడుతున్నారు. మన తెలుగుభాష చాలా గొప్పది. అందుకే శ్రీ కృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అటువంటి భాషను ఇష్టమొచ్చినట్లు మాట్లాడి చెడగొడుతున్నారు. అసలు మాట చాలా గొప్పది. మంచిచేసినా చెడుచేసినా మాట వలనే. మాటలురాని పసిబిడ్డ చాలాఅదృష్టవంతుడు. అందరూ ప్రేమతోలాలించి ముద్దాడతారు. అటువంటి బిడ్డ ముద్దుముద్దు మాటలతో అందరినీ అలరిస్తాడు. పెద్దయి నాక సమాజ పోకడ వాడిని మార్చివేస్తోంది. ఒక మంచి మాటతో ఎదైనా సాధించవచ్చు. వినయంతో మంచిమాటతో ఎన్నో ఘనకార్యాలు సాధించవచ్చునని మనపెద్దలు ఎన్నో అనుభవాలు మనముందు ఉంచారు. ఒక మంచిమాటతో అనుకున్నది సాధించి ఉన్నత శిఖరాలు అందుకున్న వారున్నారు. ఒక చెడు మాటతో ఉన్న పదవులు, ఉద్యోగాలు కోల్పోయినవారున్నారు. సుభాషితాల గురించి తెలుసుగ ‘సు’ అంటే మంచి అని సుభాషణ అంటే మంచి మాటలతో సంభాషణ చేయడం. ఇవన్నీ గతంలో మనకుతెలిసినవే. మైకు అందుకోగానే కొందరు పూనకం వచ్చినట్లు ఏవేవో మాట్లాడి ప్రాణం మీదకు తెచ్చుకుంటారు. అసలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. జర్నలిజంలో కూడా నాల్గు పేజీల్లో రాసేది క్లుప్తంగా విషయం మరుగున పడకుండా ఒక్క పేరాలో రాయగల్గినవారు మంచి జర్నలిస్టు అనేవాడు నార్ల. ఏమైనా నోరు అదుపులో పెట్టుకోవడం ఎవరికైనా చాలా మంచిది. నిజమే బావ చట్ట సభలలో నోరుజారి ఒక చెడుమాట మాట్లాడి అల్లరైన వారు చాలామంది ఉన్నారు. ఆ తరువాత ఆ పార్టీ అధినాయకుడికి దాన్ని సమర్థించుకోవ డానికి తలప్రాణం తోక కొస్తోంది. నిజమే హరిశ్చండ్రుదు మాటకోసం రాజ్యాన్ని త్యజించి చివరకు భార్యను కాటికాపరికి అమ్మేశాడు.
అది నిజమేగాని తాను సర్వస్వం కోల్పోవచ్చుగాని భార్యను ఒక వస్తువుగ పరిగణించి అమ్మడం తప్పు కాదా బావ. అది సరే యిందులో మనకిచ్చే సందేశం ఆడినమాట తప్పరాదని. అలాగే రైల్వే యాక్సిడెంట్లు, అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కాని బాధ్యతవహించి లాల్‌బహదూర్‌ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశాడు. నిజమే మితభాషి కూడ. నిజమే కాని మన నాయకులు చట్టసభలలో ప్రవేశించేటప్పుడు స్పీకరు ప్రమాణం చేయిస్తాడుగద. ఆ తరువాత ఆ ప్రమాణాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కాని అలా మాట తప్పి ప్రవర్తించేవారిపై ఎవరు చర్య తీసుకుంటారు? భలేవాడివి రాజే దొంగైయినపుడు ప్రజలు ఎవరికీ చెప్పకుంటారు. పాత సామెత లాంటిది ఒకటుంది గద ధనం పోతే సంపాదించకోవచ్చుగాని మాటజారితే వెనక్కు తీసుకోలేమని. నిజమే బావ గతంలో మనం మాటలకు విలువిచ్చేవారు. అందుకే వాడు మాట తప్పడు మంచి మనిషని. కాని ప్రస్తుతం మన ఏలికలు ఎన్నికలలో చేసిన వాగ్దానాలు ఎన్నికలవగానే గాలికి వదిలేసి మేం మర్చిపోయాం వారు కూడా మర్చిపొమ్మని ప్రజలకు హితవు పలుకుతున్నారు. అంతెందుకు మన మాటల మాంత్రికుడు ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలు ఎనిమిదిన్నరేళ్లలో ఒకటీి అమలు పరచలేదు. నిజమే బావ పైగా ప్రజలసొమ్ము అదానీకి లక్షల కోట్లు దోచిపెట్టిన విధంగా వ్యవహరించాడు. వెయ్యినోట్లు రద్డుచేసి సామాన్య ప్రజలను బ్యాంకుల ముందు ఎండలో క్యూలో నిలబెట్టాడు. వికేంద్రీకరణ వద్దని వామపక్ష నాయకులు మొత్తుకున్నా వాళ్ల మాటలు పట్టించుకోలేదు. మోదీ, షాలు కల్సి ప్రజల్ని భ్రమల్లో ముంచుతున్నారు. నిజమే ఈసారి గెలుస్తే వారికి తిరుగులేదని భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేస్తారు. నిన్నగాక మొన్న ఒక బీజేపీ నాయకుడంటాడు. సనాతన ధర్మాలు అప్పటి ఆచారాలనే ఇప్పుడు సమాజం పాటించాలట. కమ్యూనిస్టులు, నాస్తికులు వారిమాట వినవద్దని గతంలో అన్నారు.
అయినా సమాజంలో వివిధ మతస్థులు వారి వారి మతానుసారం నడుస్తారు అది వ్యక్తిగతం. నాస్తికులు ఈ సమాజంలో ఉండకూడదా బావ. మరి పరమనాస్తికుడైన గోరాని మహాత్మాగాంధీ, నెహ్రూ గౌర వించారు కద. నిజమే ఈ బీజేపీ వారికే మతాలు, కులాల పట్టింపులు. ఏది ఏమైనా ఒక మంచి మాట బహు గొప్పది. ఒక మంచి మాటతో ఏదైనా సాధించవచ్చు. అటువంటి మంచి మాటలకోసమే ప్రవక్తల వద్దకు, స్వాములవద్దకు వెదతారు. అంతెందుకు మనవాళ్లు వృద్ధాప్యంలో మంచి మాటల కోసమే భగవద్గీత చదువుతారు. నిజమే బావ మనిషికి ఓర్పు, నేర్పు, మంచిమాట చాలాఅవసరం. వినయంతో, మంచి మాటలతో వెళ్లిన పని సాధించుకురావచ్చు. చిరునవ్వుతో స్వాగతంవేరు.. ముఖం చిట్లించుకుని స్వాగతం పలకడం వేరు. ఒక రోగిని మందుల కంటే మంచిమాటలతో స్వస్థత చేకూర్చవచ్చు. అంతేగాక ఒక వ్యక్తి ఏదైనా సాధిస్తే వాడిని మంచి మాటకారని, మాటలతో ఏదైనా సాధిస్తాడని అంటుంటాం. అందుకె మంచి మనిషికి ఒక మాట మంచి గొడ్డుకు ఒక దెబ్బ అంటారు మన పెద్దలు.
సెల్‌: 9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img