Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

మూడేళ్లలో 1.12 లక్షల రోజు కూలీల ఆత్మహత్యలు

డాక్టర్‌ జ్ఞాన్‌పాఠక్‌

దేశంలో కార్మికవర్గానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకించి కరోనా కాలంలో గొప్ప సేవలు అందించారని ఆయన వందిమాగధులు ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి ఈ నెల 13న లోక్‌సభలో వెల్లడిరచిన విషయాలు కళ్లుఉంటే వందిమాగధులు చదవవచ్చు. మూడేళ్ల కాలంలో(20192021) మొత్తం 1.12 లక్షలమంది రోజువారీ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ రోజువారీ కూలీలతో సహా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతను కల్పించాలని అసంఘటితరంగ కార్మికుల సామాజిక భద్రతాచట్టం 2008 ఆదేశిస్తున్నది వాస్తవమేనని మంత్రి వెల్లడిరచారు. జీవనానికి, పనిచేయ లేని వారికి తగిన సామాజిక సంక్షేమ పథకాలను రూపొం దించాలని కూడా ఈ చట్టం ఆదేశిస్తున్నది. అలాగే ప్రసూతి ప్రయోజనాలు, వృద్ధుల రక్షణ, ఆరోగ్యం కల్పన తదితర ప్రయోజనాలను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చట్టం కోరుతున్నది. కరోనా కాలంలో బీజేపీ ప్రభుత్వం చట్ట ప్రకారం తన బాధ్యతను నిర్వహించడంలో దారుణంగా విఫలమైందన్నది మంత్రి ప్రకటనతో స్పష్టమైంది. ఇదే కాలంలో 66,912 మంది గృహిణులు, 53,661 మంది స్వయం ఉపాధి పొందుతున్నవారు, 43,420 మంది వేతన ఉద్యోగులు, 43,380 మంది నిరుద్యోగులు కూడా ప్రభుత్వ సహాయం లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే 35,950 మంది విద్యార్థులు, వ్యవసాయరంగంలో ఉన్న రైతులు, వ్యవసాయ కార్మికులు 31,839 మంది 2019, 2020, 2021లలో ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణమేమీ కాదనిచెప్పేందుకు మంత్రి చేసిన ప్రయత్నం దుర్మార్గమైంది. ప్రభుత్వ గణాంకాలకంటే అనేక వేలమంది ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారని అనధికార సర్వేలు చెబుతున్నాయి. కరోనాకాలంలో ప్రజలు ఎక్కువభాగం ఇళ్లకే పరిమితమయ్యారు. చేసేందుకు పనులు లేవు. మోదీ ప్రభుత్వం సహాయం చేయకపోవడంతో ఆత్మహత్యలుతప్ప మరో గత్యంతరం లేకపోయింది. ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలను జీవనభృతి కల్పించేందుకు, అంగవైకలులకు సహాయ పడేందుకే ఏర్పాటు చేశారని మంత్రి గొప్పలు చెప్పుకునేందుకు ప్రయత్నించారు. ఈ పథకాల ద్వారా వీరికి సహాయంచేసిఉంటే ఆత్మహత్యలు ఉండేవికావుగదా. కరోనా నియంత్రణకే జ్యోతులు వెలిగించండి, చప్పట్లుచరచండి అంటూ విన్యాసాలుచేసిన ప్రధాని ఎందుకు సహాయం చేయలేదో మంత్రి చెప్పాలి. వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా బాధితులు దారుణ పరిస్థితుల్లోకి చేరకముందే అవసరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యతవహించి ఇప్పటికైనా వారి కుటుంబాలకు సహాయం చేయవలసిన అవసరంఉంది. సహాయంకోసం ఎదురుచూసి అది లభించకపోవడంతో ప్రాణాలు తీసుకున్నారనే అంశాన్ని కూడా ప్రభుత్వం విస్మరించింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సంవత్సరం 2,227మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2015లో ఈ సంఖ్య 2023కు పెరిగింది. 20182020 మధ్యకాలంలో 16,091 మంది నిరుద్యోగులు ప్రాణాలు తీసుకున్నారు. ఆదాయంలేక చేసిన అప్పులు తీర్చే మార్గంలేక వీరు బలవన్మరణాలు చెందారు. పెద్దనోట్ల రద్దు సమయంలోనూ కొన్ని వేల ఆత్మహత్యలు జరిగాయి. అందువల్ల బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయేగానీ, తరగలేదు. ఆత్మహత్యలకు కరోనా మాత్రమే పూర్తి కారణంకాదు. బీజేపీ ప్రభుత్వం అనుసరించిన తిరోగమన విధానాలు నిరుద్యోగులు, కార్మికులు ఆయా ఆదాయాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. 2023`24 ఆర్థిక బడ్జెట్‌ లోనూ ప్రభుత్వం కార్మికులకు, నిరుద్యోగులకు ద్రోహం చేసింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి క్రమంగా మంగళంపాడే దిశగా కేటాయింపులను 33శాతం తగ్గించింది. చట్టం అండగా ఉన్నప్పటికీ గ్రామీణ ఉపాధి పథకం కింద పనిచేసే కార్మికులకు వేతనాలు కూడా సక్రమంగా అందడంలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img