Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

మోదీ పాలనలో రెట్టింపైన బ్యాంకు మోసాలు

డాక్టర్‌ జ్ఞాన్‌పాఠక్‌

బీజేపీ నాయకత్వంలో నరేంద్రమోదీ ప్రభుత్వం మొదటి ఎనిమిదేళ్ల కాలంలో అనేక బ్యాంకుల్లో మోసాలు రెట్టింపయ్యాయి. ఇక తొమ్మిదవ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో అంతక్రితం కంటే వేగంగా మరిన్ని మోసాలు వెలుగుచూశాయి. మోదీ పాలన పదవ సంవత్సరంలోకి ప్రవేశించింది. మరో పదినెలల్లో లోకసభఎన్నికలు జరుగుతాయి. బ్యాంకులను మోసగించిన వారితో రాజీ పరిష్కారానికి ప్రభుత్వం అనుమతించింది. ఇది సామాన్యులకు వర్తించదు. బ్యాంకులను, ఇతర ఆర్థిక సంస్థల్లో మోసాలుచేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. వీళ్లకే మళ్లీ కొత్తగా బ్యాంకులు రుణాలిస్తాయి. ఇలాంటి మోసకారులు, బ్యాంకుల్లో పనిచేస్తూ అక్రమంగా డబ్బు కావాలనుకునే అధికారులు కలిసి బ్యాంకులను దివాలా తీయిస్తున్నారు. పాలకులకు వీరు రహస్య ముడుపులు చెల్లించుకుంటారు. ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నా ఈ ప్రభుత్వం మౌనంగానే ఉంటుందని మోసకారులకు బాగాతెలుసు. అధికారంలోకి వచ్చే ముందు మోదీ తన ప్రచారంలో బ్యాంకుల్లో మోసాలను పూర్తిగా అరికడతామని వాగ్దానం చేశారు. ఆచరణలో మాత్రం అంతక్రితం ప్రభుత్వాల హయాంలో కంటే ఎక్కువ మోసాలు జరిగాయి. 201314 నుంచి బ్యాంకులను మోసగించినవారి సంఖ్యను పరిశీలిద్దాం. ఈ సంవత్సరం 4306 మంది ఎగవేతదారులు నమోదయ్యారు. అంతక్రితం ఉన్నది వారు గాకుండా కొత్తగా ఎగవేతదారుల జాబితాలో చేరినవారు వీరు. వీరి సంఖ్య 202122వ ఆర్థికసంవత్సరంలో 9,103మంది మోసకారులు నమోదయ్యారు. ఈ గణాంకాలను రిజర్వు బ్యాంకు ఆరునెలల క్రితం విడుదల చేసింది. 2022 తర్వాత మోసాల సంఖ్య మరింతగా పెరిగింది. 2022`23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల కాలంలో ఎగవేత దారుల సంఖ్య 5,406గా నమోదైంది. ఈ ఎగవేతలన్నీ బ్యాంకుల్లో మోసాలను అరికడతానని దేశ ప్రజలందరికీ వాగ్దానం చేసిన మోదీ పాలనలో జరిగినవే. ఇలాంటి వాగ్దానాలను మరిచి మోదీ ప్రభుత్వం దేశంలో కల్లోల, అసహన, మత విద్వేష ఘర్షణ వాతా వరణాన్ని సృష్టించింది. ఈ ధనమంతా ప్రజలు కష్టపడి బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో దాచుకున్నారు. బహుశా పాలకుల ఆశ్రితపక్షపాతంవల్లే దోచు కున్నవని భావించాలి. ఇలాంటి ఎగవేతదారులే దేశ అభివృద్ధికి కారకులని మోదీ ప్రచారం చేస్తూ మనల్ని కూడా నమ్మమంటారు. ఈ విషయాన్ని సామాన్య జనం గ్రహిస్తే ఈ ‘గొప్ప పాలకులను’ సహించడం సాధ్యంకాదు. ఆయినప్పటికీ మోసకారులు ‘రాజీ పరిష్కారం’ చేసుకోవడానికి అర్‌బీఐ 2023, జూన్‌ 8న విడుదల చేసిన సర్క్యులర్‌లో అనుమతించింది. అంతేకాదు ఎగవేత దారులు (మోసకారులు) మళ్లీ రుణాలు తీసుకోవడానికి కూడా అను మతించింది. తాను చేసే పనులన్నీ ప్రజాప్రయోజనాల కోసమని మోదీ ప్రచారం చేసుకుంటున్నారు. అప్పులు తీసుకున్న మోసకారులు కావాలని తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించనివారే. ఏలినవారికి వీరంతా బాగాకావలసిన వారేనని అనడంలో ఏమీ అనౌచిత్యం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కావాలని రుణాలు ఎగ్గొట్టిన వారు కాగా, మోసాలకు పాల్పడిన బడా చోర్లు పన్నులు కూడా సరిగా కట్టరు. చివరకి కరెంటు బిల్లులు కట్టనివారిని సైతం ప్రభుత్వం ఏమీ పట్టించుకోదు. రాజీ పరిష్కారం చేసుకునే మోసకారులు, కంపెనీల రుణమొత్తాలను రద్దుచేసినట్టు కూడా ప్రకటిస్తారు. బ్యాంకులకు అవసరమైన ధనాన్ని ప్రభుత్వం కొత్తగా నోట్లు ముద్రించి బ్యాంకులకు ఇస్తుంది.
2022 డిసెంబరులో పార్లమెంటులో ఆర్థికమంత్రిత్వశాఖ మోసకారులు ఎగవేసిన 11.7 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసినట్లు తెలియజేసింది. బ్యాంకులు తమ పుస్తకాల నుంచి ఇలాంటి మోసాకారుల అప్పుల జాబితాను తొలగించి మళ్లీ రుణాలుఇవ్వడం మామూలే. ఇలాంటిదొంగలకు బహుమతిగా అప్పులు రద్దుచేసి సామాన్యుల జీవితాలను అధోగతిపాలు చేస్తున్నారు. మరో వైపు పేదరికాన్ని, నిరుద్యోగాన్ని పెంచుతూ ‘అభివృద్ధి’ డప్పు మోగిస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం బ్యాంకులను లూటీచేస్తూ ప్రభుత్వం మోసకారులకు మోదీ అండగా ఉండటం ఘోరమైన నేరంగా పరిగణించాలి. అప్పులు వసూలు చేయకపోగా కావాలని అప్పులు ఎగ్గొడుతున్న వారిపై నేర పూరితమైన కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు? ఈ దేశప్రజాధనాన్ని దొంగలకు సహ కరిస్తున్న బ్యాంకుల్లో అధికారులను గుర్తించి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాజీ పరిష్కారాలద్వారా రద్దుచేసిస ధనం లక్షకోట్లరూపాయలే ఉండ వచ్చు. ప్రతిఏటా మోసకారులు విదేశాల్లో స్థిరపడుతున్నవారు వేల సంఖ్యంలో ఉన్నారు. ఈ సంవత్సరం బ్యాంకులను, ప్రజలను మోసగించి విదేశాలకు తరలివెళుతున్న నల్ల కుబేరులు 5,600 మంది ఉండవచ్చునని ఒక సర్వే తెలియజేసింది. నిత్యం వెలిగిపోతున్న మోసకారులుపై అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా పాలకును ఆర్‌బీఐ హెచ్చరిస్తున్నది. ఇది తిరోగమన చర్య అని, మోసకారులతో రాజీ ఏమిటని ఆర్థిక నిపుణులే కాదు, పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం, ఆర్‌బీఐ మోసకారులు అప్పులకోసం రాజీ పరష్కారానికి పూనుకోవడం న్యాయసూత్రాలను, జవాబుదారీని కాలదన్నడమేనని అఖిల భారత బ్యాంకు అధికారుల అసోసియేషన్‌ (ఏఐబీఓసి) అఖిల భారత బ్యాంకు ఉద్యోగులు అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) తీవ్రంగా విమర్శించాయి. చిత్తశుద్ధి, నిజాయితీలేని మోసకారులకు ఇది బహుమతి అని పేర్కొన్నాయి. ఆర్థికరంగ పార్లమెంటుస్థాయి సంఘానికి సంబంధించిన విభాగం బ్యాంకుల బోర్డులలో నామినేట్‌చేసే డైరెక్టర్లు జవాబుదారీగా ఉండే వారిని నియమించాలని సిఫారసు చేసింది. అయినప్పటికీ ఇబ్బడి ముబ్బడిగా జరిగిపోతున్నా పట్టించుకున్నవారు కరువయ్యారు. కోటి రూపాయలు అప్పుచేసి ఎగవేస్తున్నప్పటికీ రుణాలు తీసుకున్నవారి పేర్లు సైతం ప్రభుత్వం చెప్పడంలేదు. ఎందుకని?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img