Thursday, March 30, 2023
Thursday, March 30, 2023

మోదీ హామీల్లో అమలుకానివే ఎక్కువ

చిన్మే బెండ్రి

నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో అమలు చేయని హామీలే ఎక్కువ. గత ప్రభుత్వాలతో పోలిస్తే నరేంద్ర మోదీ వందల హామీలు గుప్పించారు. అయితే వీటి అమలు అంతంత మాత్రమే. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రజలపైన విధించవలసిన పన్నుల విధానాలే ప్రథమస్థానం వహించాయి. ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన సమాచారం అత్యధికంగా చేసుకునే అవకాశం ఉంటుంది. పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు వేయవచ్చు, వివిధ అంశాలపై చర్చల్లోనూ పాల్గొనవచ్చు. అయితే మోదీ ప్రభుత్వంలో ఎన్నికైన సభ్యులు అత్యధికంగా మౌనంగానే ఉన్నారు. హామీలకు సంబంధించి గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, అమలు చేసినవి, చేయనవి తెలుసుకోవలసిన అవసరం ఉంది. 1953లో ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి వివరాలు సేకరించడానికి సంస్థాగతమైన నిర్మాణంలేదు. 1953 డిసెంబరు 1న, ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి మొదటిసారిగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పార్లమెంటుకు హామీలిచ్చిన ప్రభుత్వం జవాబుదారిగా ఉండాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇదొక మంచి సంప్రదాయం. దాన్ని పరిరక్షించాలి. లోక్‌సభ కమిటీలో 15 మంది సభ్యులు, రాజ్యసభ కమిటీలో 10మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ హామీలను జాగ్రత్తగా పరిశీలించడం ఆయా మంత్రులు సభలో చర్చకు తీసుకునే అంశాలను నమోదుచేస్తుంది. సభలో ఇచ్చిన హామీల అమలుకు మూడు నెలల గడువుఉంటుంది.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ హామీల అజమాయిషీని ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తుంది. 14వ లోక్‌సభనాటికి(200409) హామీల అమలు పెండిరగ్‌లో లేదు. ఆ తరువాత పెండిరగ్‌ ప్రారంభ మైంది. 15వ లోక్‌సభలో(200914) 54 హామీలు పెండిరగ్‌లో ఉన్నాయని, 429 హామీలు ఉపసంహరించారని 2023 జనవరి 20నాటికి లభించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి.16వ లోక్‌సభలో (2014`19) 168 హామీలు పెండిరగ్‌లో ఉండగా, 391 హామీలను విరమించుకున్నారు. 17వ లోక్‌సభ(2019) 551 హామీలు పెండిరగ్‌లో ఉండగా, 122 హామీలు విరమించారు. రాజ్యసభకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో పరిష్కారంకానివి ఎక్కువ గానే ఉన్నాయి. రాజ్యసభ 198వ సెషన్‌లో (2003 ఫిబ్రవరి నుండి మే వరకు) 40 హామీలను ఉపసంహరించారు. అలాగే 2005 ఫిబ్రవరి నుంచి మే వరకు జరిగిన 204వ సెషన్‌నాటికి దీర్ఘకాలంగా పెండిరగ్‌లో వస్తున్న హామీలు ఎక్కువే. 16వ లోక్‌సభ, రాజ్యసభ 17సెషన్‌లు జరిగింది. ఈ సెషన్‌లలో 203 హామీలు పెండిరగ్‌లో ఉండగా, 140హామీలు విరమించారు. 249 నుంచి 258 వరకు జరిగిన సెషన్‌లలో మొత్తం 251 హామీలను ఇవ్వగా, 10 హామీలను విరమించగా 251 హామీలు పెండిరగ్‌లోఉన్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి 3నెలలు గడువు ఉన్నప్పటికీ, వాటిపైన ప్రభుత్వం శ్రద్ధ వహించకపోవడమే ఎక్కువగా జరుగుతున్నది. తగినంతమంది
వ్యవహారాల నిర్వహణ సిబ్బంది సక్రమంగా హాజరుకాకపోవడం వల్ల పెండిరగ్‌ హామీలు ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. గత ఏడాది డిసెంబరు 22నాటికి అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ లోక్‌సభకు ఇచ్చిన హామీల అమలుకు అసాధారణ జాప్యం నెలకొంది.
మరిన్ని ఎక్కువ హామీలను ఉపసంహరించడమే ప్రజలపై ప్రభుత్వానికున్న శ్రద్ధను తెలియజేస్తున్నది. రైల్వేమంత్రిత్వశాఖ 2016, మార్చి 16న ఇచ్చిన హామీని 2021, అక్టోబరు 11 నాటికి కూడా నెరవేర్చలేదు. 1957నాటి రైల్వే భద్రతా చట్టం సవరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర, న్యాయశాఖ, హోంమంత్రిత్వశాఖ కూడా కీలకపాత్ర వహించాయి. దీనికి సంబంధించిన హామీ ఇంతవరకు పూర్తిగా అమలు జరగలేదు. కేసులు పెండిరగ్‌లో ఉండటానికి మరో కారణం ఆయా మంత్రిత్వశాఖలపై అనేక హామీల అమలుకు దీర్ఘకాలం వాయిదా పడుతుండటం. ఉదా హరణకు 15లోక్‌సభలో ఆరు పెండిరగ్‌ హామీలు, 16వ లోక్‌సభకు వచ్చిన 20కేసుల పెండిరగ్‌ను గమనించవచ్చు. ముఖ్యంగా విధానాలు, వివాదాస్పదమైన అంశాలు, హామీల అమలులో ఇతర మంత్రిత్వశాఖలు, డిపార్ట్‌మెంట్‌లు, ఏజన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాలు సవాలుగా తీసుకుని పరిష్కరించవలసిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img