Monday, September 26, 2022
Monday, September 26, 2022

మోసం భాయీ మహా మోసం

టి.వి.సుబ్బయ్య

పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడాన్ని 291 జిల్లాల్లో జరిగిన సర్వేలో 89 శాతం మంది వ్యతిరేకిస్తూనే కేంద్రంపై మండిపడుతున్నారు. బెంగాల్‌లో ఎన్నికల సమయంలో 20 రోజులు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచకపోవడం కేంద్ర పాలకుల కుటిల నీతికి నిదర్శనం కాదా? ఏడేళ్ల పాలనలో ఒక్కొక్క కుటుంబంపైన నెలకు కనీసం రూ.3 వేలు నుండి 5 వేలు వ్యయం పెరిగింది. ఇదీ మోదీ సాధించిన విజయం.

ప్రజలకు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను నెరవేర్చని పాలకులను మోసగాళ్లుగానే భావిస్తారు. ఈ కోవలోకే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని అత్యధిక ప్రజానీకం భావిస్తున్నదని సర్వేలు తెలియజేస్తున్నాయి. మోదీ 2014 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోగా తీసుకున్న విధాన నిర్ణయాలు, చేసినచట్టాలు అన్ని తరగతుల ప్రజలకు హాని కలిగించేవే. విదేశాల్లో ఉన్న 80 లక్షల కోట్ల రూపాయలు వెనక్కి తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు వారి ఖాతాల్లో వేస్తానని ఇచ్చిన వాగ్దానం మొదలుకొని, పాలనా కాలంలో చేసినవాగ్దానాలను నెరవేర్చలేదు. పైగా పెద్దనోట్లరద్దు నుండి తాజాగా పెద్దనోట్ల సేకరణ (6 లక్షల కోట్ల రూపాయలు సమీకరణ) దాకా అన్ని విధానాలు లోపభూయిష్టం, ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు హాని కలిగిస్తాయని ఆయా రంగాల నిపుణుల విశ్లేషణలు స్పష్టం చేశాయి. పెద్దనోట్ల రద్దుతో నల్ల ధనులు తెల్లధనులయ్యారు. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. జీఎస్టీ హడావిడిగా, రాష్ట్రాల పూర్తి ఆమోదం లేకుండా తీసుకువచ్చి నేటికీ ఆర్థిక వ్యవస్థను కోలుకోకుండా చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం మొదలైనరంగాలలో రాష్ట్రాలహక్కులను హరించారు.
అత్యధిక ప్రజానీకంపై అధిక ధరల భారం మోయలేనంతగా ఉంది. ముఖ్యంగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. అలాగే వంట గ్యాస్‌, వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు, వంటనూనెల, అన్ని రకాల పప్పులు తదితర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశంవైపు చూస్తున్నాయి. పెట్రోలు, డీజీలు ధరలు పెరగడానికి గల కారణాలను కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా వక్రీకరించి, వాస్తవాలను మరుగుపరిచి చెప్తోంది. పెట్రో ఉత్పత్తుల పంపిణీని ప్రైవేటు రంగానికి అప్పగించినపప్పుడే, ఇది వినియోగదారులకు పెనుభారం కలిగిస్తుందని వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా హెచ్చరించాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు ఒకే విధంగా వ్యవహరించాయి. 2014లో మోదీ అధికారం చేపట్టే నాటికి పెట్రోలు లీటరు ధర రూ.71లు ఉండగా ఇప్పుడు ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యలననుసరించి గరిష్టంగా రూ.104 దాకా పలుకుతోంది. 2014లో డీజీలు లీటరుకు రూ.57 ఉండగా ఇప్పుడు రూ.9095 మధ్య ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు ప్రచారం కోసం ఏర్పాటు చేసిన సాంకేతిక దళాలు పెట్రోలు, డీజిల్‌ ధరలపైన కూడా అసత్య ప్రచారం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో 2003లో అమెరికా ఇరాక్‌పై దాడి చేసినప్పుడు గరిష్టంగా ముడి చమురు బ్యారెల్‌ ధర దాదాపు 165 డాలర్లు అయింది. అప్పుడు కూడా దేశంలో పెట్రోలు లీటరు దాదాపు రూ.4055 మధ్య ఉంది. ఇటీవల వరకు అంత ర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు 4050 డాలర్ల మధ్య ఉండగా తాజాగా 7080 డాలర్ల మధ్య ఉంది. ఇప్పుడు ఇంతగా పెరగడానికి కారణం మోదీ ప్రభుత్వం ముడి చమురు దిగుమతి పైన పదేపదే ఎక్సైజ్‌ సుంకం పెంచడం. అలాగే రాష్ట్రాలు సైతం పన్ను వేసి వినియోగదారులపై భారం మోపాయి. 202021లో పెట్రోలు డీజీలు దిగుమతులపై పన్ను రూ.3.35 లక్షల కోట్లు సమీకరించింది. 201920లో రూ.1.78 లక్షల కోట్లు ఆదాయం పొందింది. 201819లో లీటరు పెట్రోలుపై రూ.19.98 సుంకం ఉండగా గతేడాది ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.32.9కి పెంచారు. పైగా ధరల పెరుగుదల పాపం యూపీఏ ప్రభుత్వానిదేనని ప్రచారం చేసి తమ తప్పును కప్పిపుచ్చుకొనేందుకే మోదీ ప్రభుత్వం పూనుకుంది. ఈ విధంగా గత ఆరేడేళ్ల కాలంలో రూ.36 లక్షల కోట్లు పెట్రో ఉత్పత్తుల దిగుమతిపై సంపాదించిందని అంచనా. పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడాన్ని 291 జిల్లాల్లో జరిగిన సర్వేలో 89 శాతం మంది వ్యతిరేకిస్తూనే కేంద్రంపై మండిపడుతున్నారు. బెంగాల్‌లో ఎన్నికల సమయంలో 20 రోజులు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచకపోవడం కేంద్ర పాలకుల కుటిల నీతికి నిదర్శనం కాదా. ప్రజలపై గ్యాస్‌ ‘బండ’ మోదీ ప్రభుత్వం వంటగ్యాస్‌ సిలిండర్లను కోటి మందికి ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. సిలిండర్లు తీసుకున్న వారిలో అధికులు పెరిగిన గ్యాస్‌ ధర పెట్టి కొనలేక తిరిగి కట్టెలతో లేదా పిడకలతో వంట చేసుకుంటున్నారని తాజా సర్వే అంచనా. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.410 ఉంది. సిలిండరు ధర క్రమంగా పెరుగుతూ ఇప్పుడు దాదాపు రూ.900కు చేరింది. ఇప్పుడు సబ్సిడీ రూ.40 ఉందని చెప్తున్నారు. ఇటీవల కాలంలో తమకేమీ సబ్సిడీ ఇవ్వడం లేదని వినియోగదారులు చెప్తున్నారు. ఏడేళ్ల కాలంలో ప్రజలపై గ్యాస్‌ భారం దాదాపు రూ.500 పెరిగింది. దీనిపైన వచ్చే ఆదాయం ప్రైవేటు పంపిణీ సంస్థలకు, పన్నుల రూపంలో ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు చేరుతోంది. పప్పు ధాన్యాలు, వంట నూనెల ధరల భీతి పప్పు ధాన్యాల, వంటనూనెల ధరలు చూసి వినియోగదారులు బెంబేలెత్తు తున్నారు. అధికార గణాంకాల ప్రకారమే 11 ఏళ్ల కాలంలో ఏనాడు లేనంతగా గరిష్ట స్థాయికి వంటనూనెల ధరలు చేరాయి. 2014లో కిలో కందిపప్పు రూ.6070 మధ్య ఉండగా నేడు దాదాపు రూ.140కిపైగా ఉంది. ఇలా పెసలు, అలసందలు, పెసరపప్పు, వేరుశనగగుళ్లు, నువ్వుల ధరలు 2014 నాటికి నేటికి కొన్ని రెండు రెట్లు మరికొన్ని రెట్టింపు పెరిగాయి. ఏడేళ్ల పాలనలో ఒక్కొక్క కుటుంబంపైన నెలకు కనీసం రూ.3 వేలు నుండి 5 వేలు వ్యయం పెరిగింది. ఇదీ మోదీ సాధించిన విజయం.అలాగే నూనెల ధరలు 2014 నుండి పెరుగుతూనే ఉన్నాయి. అప్పుడు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కిలో రూ.60`70 మధ్య ఉండగా ఇప్పుడు రూ.180కి చేరింది. ఈ విధంగా వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనెల ధరలు బాగా పెరిగాయి. ఇక పామాయిల్‌తో సహా వివిధ రకాల నూనెల దిగుమతిపై ఎక్సైజ్‌ సుంకాలను నామమాత్రం చేయడంతో దేశంలో ఉత్పత్తి అయ్యే నూనెల కంటే దిగుమతి నూనెల ధరలు తక్కువగా ఉన్నాయి. దీంతో దేశీయ ఉత్పత్తి దారులు ఆయా పంటల నుండి వైదొలిగారు. ఆ తర్వాత దిగుమతిదారులు రేట్లను అపారంగా పెంచారు. దేశీయ ఉత్పత్తులను పెంచాలని చెప్పే కేంద్ర పాలకులు వేరుశనగ, కొబ్బరి ఉత్పత్తులను ప్రోత్సహించకుండా నిరుత్సాహ పరిచారు. పంటలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు నూనెగింజలకూ ఇచ్చి, దేశీయ ఉత్పత్తులు పెంచితే ‘‘ఆత్మనిర్బర్‌’’ నినాదానికి అర్థం ఉంటుంది. ఆరోగ్యానికి హాని కలిగించే పామాయిల్‌ ఉత్పత్తికి మాత్రం రూ.11 వేల కోట్లు కేటా యించారు. ఇలాంటి అపసవ్య విధానాలతో ప్రజలను కష్టాల పాలు చేస్తున్న కేంద్ర పాలకులు ఇప్పటికీ అసత్యాల ప్రచారంలోనే మునిగి తేలుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img