Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

రాష్ట్రంలో రెండు మహోద్యమాలు ` భిన్న కోణాలు

జి.ఓబులేసు

ప్రత్యేక తరగతి హోదాను రాని, ఇవ్వని ప్రత్యేక ప్యాకేజీకి తాకట్టు పెట్టినపుడే రాష్ట్రం జుట్టు కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయింది. బి.జె.పి. దుర్మార్గాలపైన వై.సి.పి, టి.డి.పి, జనసేనలు పోరాడకుండా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి మేమూ మద్దతు అంటూ ఇక్కడ పరస్పరం తగవులాడుతూ అంతా కేంద్రానికి ప్రత్య క్ష్యంగా, పరోక్షంగా మద్దతిస్తున్నవారే. ఫ్యాక్టరీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు ఈ వాస్తవాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. అందుకే ఇప్పుడు జనం తెగించి పోరుసల్పుతున్నారు.

సామాజిక, రాజకీయ రంగాల్లో ఇప్పుడు రాష్ట్రంలో దీర్ఘకాలికంగా రెండు ఉద్యమాలు సాగు తున్నాయి. ఒకటి రాజధాని అమరావతి కోసం 685 రోజులుగా సాగుతుండగా మరొకటి విశాఖపట్టణం స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 267 రోజు లుగా జరుగుతున్నది. ఇంతటి దీర్ఘకాల ఉద్యమాలు ఈ మధ్యకాలంలో జరగలేదు. ఈ రెండిరటిలో కొన్ని సామీప్యతలు, కొన్ని భిన్న కోణాలు ఉన్నాయి.
‘‘ఆల్‌ రోడ్స్‌ లీడ్స్‌ టు రోమ్‌’’ అన్నట్లు రెండిరటిలోనూ కేంద్ర ప్రభుత్వమే ప్రథమ నేరస్థురాలు. రెండో నేరస్థుడు రాష్ట్ర ప్రభుత్వం. మూడో ముద్దాయి తెలుగుదేశం పార్టీ. అమరావతి భూమి పూజకు స్వయాన ప్రధానమంత్రి హాజరైనారు. అమరావతిని అత్యుత్తమ రాజధానిగా నిర్మించడానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని వేలాదిమంది పాల్గొన్న బహిరంగ సభలో వాగ్దానం చేసారు. తర్వాత మొహం చాటేసారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి ఆర్థికంగా సహాయం చేయాలనే చట్ట నిబంధనను పూర్తిగా విస్మరించారు. ఇవ్వవలసిన మేరకు కూడా నిధులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న నేటి ముఖ్యమంత్రి అమరావతి రాజధానిని సంపూర్ణంగా బలపర్చుతున్నామని 30 వేల ఎకరాల భూమి అవసరం అని చెప్పారు. అధికారం చేజిక్కించుకొన్న తర్వాత మెదడును ఏమి పురుగులు తొలిచాయో మూడు రాజధానులుంటే తప్పేముం దని మాట మార్చి మడమ తిప్పారు. నాయకుడి నోటి నుండి మాట రాగానే వేద మంత్రంగా భావించి శాసన సభలో ఏకంగా తీర్మానం చేసారు. మంచి చెడుల గురించి ఆలోచించే పరిస్థితి ప్రాంతీయ పార్టీల్లో అందునా ఏకవ్యక్తి స్వామ్యంలో ఉండదు అనడానికి ఇది ప్రబల నిదర్శనం.
తెలుగుదేశం అధినేత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను త్రోసిరాజని తుళ్ళూరులో తాత్కాలిక రాజధాని అని చెప్పి నిర్మాణాలు మొదలు పెట్టారు. రైతుల దగ్గర భూములు సేకరించారు. 5 సంవత్సరాల కాల వ్యవధిలో శాసన సభా భవనం, సచి వాలయం, హైకోర్టును నిర్మించి ఉండవచ్చు. అందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరితూగదనుకుంటే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున వారిపై ఒత్తిడిని పెంచి అవసరమైన మేర నిధులను రాబట్టి ఉండవచ్చు అట్టి ప్రయత్నమే జరగలేదు. అందుకే ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది.
ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ‘‘తిలాపాపం తలా పిడికెడు’’ అన్నట్లు 35 వేల ఎకరాల భూములిచ్చిన రైతులు 685 రోజులుగా ఆందోళన బాట పట్టాల్సి వచ్చినందుకు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు అమరావతినే రాజధాని కావాలని కోరుకుంటున్నా ప్రస్తుత ప్రభుత్వం పెడచెవిన పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా భూమి పూజ చేసిన వ్యక్తి రాజధానిని మార్చడం ఎత్తి వేయటం సరైంది కాదని ఒక్క మాటా చెప్పడు. దివంగత రాజశేఖర్‌ రెడ్డి మెజార్టీ ప్రజల విశ్వాసాలను, ఆకాంక్షలను గౌరవించేవారు. ప్రజల కోర్కె మేరకు విధానాలు రూపొందించి అమలు చేసేవారు. ఆయన సుపుత్రుడు మన ముఖ్యమంత్రి నేను చెప్పిందే అందరూ వినాలి. ఆచరించాలి. నేను ఎవ్వరు చెప్పేది విననుగాక వినను అంటున్నారు. ఇది హఠయోగమో? ధ్వంస రచనో? మౌనముద్రలో ఉంటూ అయినదానికి, కానిదానికి ముసి ముసి నవ్వులు చిందిస్తూ పాలన చేస్తున్న ముఖ్యమంత్రిని గురించి ఏమనుకోవాలో? 685 వ రోజున న్యాయస్థానం నుండి దేవస్థానానికి మహా పాదయాత్రకు పిలుపిచ్చి ప్రారంభించారు. ఆశావహ ధృక్పథంతో జనం ముఖ్యంగా స్త్రీలు, వృద్ధులు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొనడం చూస్తే ఇది ప్రజా ఉద్యమంగా రూపుదాల్చి జగన్‌కు ముచ్చెమటలు పుట్టిస్తుందనుటలో సందేహం లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా మూడు ప్రాంతాలకు అనువుగా, అనుకూలంగా ఉన్న ప్రాంతాన్ని కాదని, వేలకోట్ల రూపాయల ఖర్చును, పెట్టుబడిని వృధా చేసి ఎక్కడికి వెళ్ళాలో? ఎప్పుడు వెళ్ళాలో ఎక్కడ ఏమి ఉంటుందో తెలియని అయోమయ స్థితికి రాష్ట్ర ప్రజలను, అధికారులను, ఉద్యోగులను గురి చేయడం నిజంగానే మూర్ఖత్వం, మంకు పట్టుదల అవుతుంది. ఇప్పటికైనా ప్రజాభీష్టాన్ని అంగీకరించడం విజ్ఞత అనిపించుకుంటుంది. అమరావతి రాజధాని ఉద్యమం జగన్‌ మోహన్‌ రెడ్డి అనాలోచిత, స్వయం కృతాపరాధం అయితే విశాఖపట్టణం స్టీల్‌ ప్లాంట్‌ను కార్పొరేటు కంపెనీలకు కట్టబెట్టే పాపం మోదీ సర్కార్‌దే. 2000ల సంవత్సరం నుండి 2021 వరకూ మధ్యలో 3 సంవత్సరాలు మినహా మిగతా అన్ని సంవత్సరాలు ప్లాంట్‌కు సొంత గనులు లేకపోయినా లాభాల్లో నడిచింది. మరి ఎందుకు ప్రైవేటు వారికి ఇవ్వా లనుకుంటున్నారు అని అడిగితే మా ప్రభుత్వం వ్యాపారం చేయదు. 100 ప్రభుత్వ రంగ సంస్థలను గుర్తించి వాటిలో కొన్ని అమ్మివేయడం, కొన్ని మూసి వేయడం, మరికొన్ని ప్రైవేటు రంగానికి ఇవ్వటం చేయాలని మా ప్రభుత్వం నిర్ణ యించింది. అందువల్ల విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహ రణ పేరుతో విక్రయిస్తాం అని నిస్సిగ్గుగా పార్లమెంట్‌లోనే ప్రకటిస్తున్నారు. 29 వేల ఎకరాల భూమిని 65 గ్రామాల ప్రజలు నాడు ఎకరానికి 5 వేలు, 8 వేలు చొప్పున ఇచ్చారు. భూములు కోల్పోయిన నిర్వాసితులు ఇంకా 8500 మంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. 18 వేల మంది పర్మినెంటు, 16 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ప్రత్యక్ష్యంగా ఉపాధి కల్పిస్తున్న ఏకైక పెద్ద పరిశ్రమ రాష్ట్రంలో విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీనే. ఇందులో 450 మంది ఎస్‌.సి., ఎస్‌.టి, ఇతర సామాజిక వర్గాలకు చెందినవారు రిజర్వేషన్‌ కోటా క్రింద ఉద్యో గాలు చేస్తున్నారు. విశాఖ ఉక్కు రవాణా కొరకు రోజుకు 2 వేల లారీలు, ట్రక్కు లకు పని దొరకుతున్నది. వీటిలో పనిచేస్తున్న 4, 5 వేల మందికి ఉపాధి లభిస్తు న్నది. స్టీల్‌ ప్లాంట్‌ ఆవిర్భావంతో చేపల పట్టణంగా ఉన్న విశాఖ నగరం నేడు పారిశ్రామిక వాడగా పెరిగి ఎంతోమందికి ఎన్నో రకాలుగా భుక్తిని చూపిస్తున్నది. నాడు 5 వేల కోట్లు ప్రభుత్వం పెట్టుబడి పెడితే నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 43 వేల కోట్లు పన్నులు, డివిడెండ్ల రూపంలో చెల్లించింది. 3.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి నుండి నేడు 8.5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకొంది. 11 వేల కోట్లు విస్తరణ కొరకు పెట్టుబడి పెట్టింది. విస్తరణ పూర్తి అయితే 20 మిలియన్‌ టన్నుల ఉత్పత్తితో దేశంలోనే అతి పెద్ద కర్మాగారంగా రూపుదాల్చుతుంది. 32 మంది ప్రాణ త్యాగాలతో, 7 గురు పార్ల మెంట్‌ సభ్యులు, 65 మంది శాసన సభ్యుల రాజీనామాలు, అసమాన త్యాగాలు, వీరోచిత పోరాటాల వల్ల సిద్ధించిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. సొంత గనులు కేటాయించాలని 40 వేల ఉద్యోగుల కుటుం బాలు, వేలాది నిర్వాసిత కుటుంబాలు, వారికి బాసటగా ప్రధానంగా వామపక్ష కార్మిక సంఘాలు (ఎ.ఐ.టి.యు.సి, సి.ఐ.టి.యు., ఐ.ఎఫ్‌.టి.యు), వామపక్ష పార్టీలు ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. బి.జె.పి మినహా ఉద్యమా నికి కాంగ్రెసు, టి.డి.పి, వై.సి.పి, జనసేన పార్టీలు సంఫీుభావం, మద్దతు ప్రకటిం చాయి. ఈ సమస్య పైనే రాష్ట్రమంతా రెండు సార్లు బంద్‌ జరిగింది. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా దిల్లీ కేంద్రంగా మహాధర్నా జరిగింది. రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కార్పొరేట్లకు వూడిగం చేస్తూ వారి లాభాల కొరకే పాలన చేస్తున్న మోదీ ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు. కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాపితంగా జనం ఆర్థిక ఇబ్బందులతో అతలాకుతలమైతే మోదీషాల ఏలుబడిలో ఆదానికి గంటకు రూ. 249 కోట్లు, రోజుకు రూ.1002 కోట్లు ఆదాయం వస్తున్నది. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి ఆదాని 5 ప్రాజెక్టులకు పరిమితమై ఉంటే నేడు 195 ప్రాజెక్టులు 260 నగరాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. ఇదంతా మోదీ చేతి చలువే. ‘‘ సబ్‌ కా సాత్‌ సబ్‌ కా విశ్వాస్‌, సబ్‌ కా వికాష్‌ ’’ నినాదం మాటున మోదీ చేస్తున్న కార్పొరేటు అనుకూల పాలన ఇది. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థను, దాదాపు 3 లక్షల కోట్లు విలువ చేసే పరిశ్రమను, దాని ఆస్థులను కేవలం 35 వేల కోట్లకు అమ్ముతూ ఉంటే మేం తీర్మానం చేసాం, కేంద్రానికి పంపాం అని చేతులు దులుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. కేంద్రం రాష్ట్రానికి మోసం, దగా చేస్తూ ఉంటే మిన్నకుండడం దానికి వంత పాడినట్లే. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నేరస్థురాలే. ప్రత్యేక తరగతి హోదాను రాని, ఇవ్వని ప్రత్యేక ప్యాకేజీకి తాకట్టు పెట్టినపుడే రాష్ట్రం జుట్టు కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయింది. బి.జె.పి. దుర్మార్గాలపైన వై.సి.పి, టి.డి.పి, జనసేనలు పోరాడకుండా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి మేమూ మద్దతు అంటూ ఇక్కడ పరస్పరం తగవులాడుతూ అంతా కేంద్రానికి ప్రత్య క్ష్యంగా, పరోక్షంగా మద్దతిస్తున్నవారే. ఫ్యాక్టరీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు ఈ వాస్తవాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. అందుకే ఇప్పుడు జనం తెగించి పోరుసల్పుతున్నారు. పోయిన సంవత్సరం నవంబరు 26 నుండి ఢల్లీి సరిహద్దుల్లో రైతాంగ పోరాటం 750 మంది చనిపోయినా, ప్రభుత్వం నిర్బంధకాండ ప్రయోగించినా కడకు మంత్రులే తమ బిడ్డల ద్వారా కార్లతో తొక్కించి చంపినా చలించకుండా చేస్తున్న ఉద్యమం రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నది. ఉద్యమాలు ఎలా మార్పులు తెస్తాయో రవిగాంచనిచో కవిగాంచు అన్న గజ్జెల మల్లారెడ్డి ‘‘ వంట ఇల్లే ఖైదుకొట్టై పడకటిల్లే పంజరం కొట్టై అందరికి తలవంచి బ్రతికే అబల, సబలగా మారితే మారిపోతుందోయ్‌! కాలం మారిపోతుంది’’ కూలీ నాలీలు ఏకమై కోబలీ అని తిరగబడితే మారిపోతుందోయ్‌ కాలం మారిపోతుంది’’ అన్న కవి వాక్కు ఇవాళ రాజధాని అమరావతి ఉద్యమంలో మహిళలు చూపిస్తున్న తెగువకు నిదర్శనం.
రైతులు, కార్మికులు దేశ వ్యాపితంగా ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక, జాతి వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐక్య పోరాటాలు నిర్వహిస్తున్న పరిస్థితిని చూస్తే రాజ్యాంగాన్నిఉల్లంఘించే పాలకవర్గాలు ప్రజలను ఇబ్బందులపాలు చేయటానికి ఆ రాజ్యాంగాన్నే అడ్డుపెట్టుకొనిలాటీలు, తూటాలు, తప్పుడు కేసులతో, జైళ్ళ పాలుచేస్తున్నారు. దీన్ని కూడా బద్దలుకొట్టాల్సిన అవసరం ఉంది. ‘‘ విడని గొలుసు లంకెల ముడి మడత పేచి రాజ్యాంగం కొరమాలిన పాలనలో సురిగి పోవు ఈ దేశం మారిపోవు తథ్యం నవ మానవుడే నిత్యం ’’
అన్న నార్ల చిరంజీవి ఉద్బోధ పోరు బాటన నడిచే శక్తులకు ఉత్తేజాన్ని ఇస్తూనే వుంటుంది. పాలకులు ఇప్పటికైనా కండ్లు తెరచి ప్రజల అభీష్టాన్ని మన్నించి పాలన చేయాలి. లేదా ఉద్యమాలతో జనం గుణపాఠం నేర్పుతారు.
వ్యాస రచయిత సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img