Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

లాటిన్‌ అమెరికాలో విస్తరిస్తున్న వామపక్షం

బి. లలితానంద ప్రసాద్‌

ఇప్పుడు అందరి కళ్లు బ్రెజిల్‌పై ఉన్నాయి. ఇది లాటిన్‌ అమెరికాలో అతి పెద్ద దేశం. అక్కడ పూర్వ అధ్యక్షుడు లులా డి సిల్వ ప్రస్తుత అధ్యక్షుడు జిమ్‌ బాసినరోతో వచ్చే అక్టోబర్‌ ఎన్నికల్లో పోటీ పడు తున్నాడు. లులా ఎన్నికైతే మెక్సికో, అర్జెంటీనాలతో సహా లాటిన్‌ అమెరికాలోని అన్ని పెద్ద దేశాలు వామపక్షం చేతిలోకి వచ్చినట్లు అవుతుంది. వీరి విజయం ఈ కేథలిక్‌ ప్రాంతంలో సామాజిక మార్పు లకు పరావర్తనంలా ఉంది.


దాదాపు రెండు దశాబ్దాలకు పైగా లాటిన్‌ అమెరికా లోని కొలంబియా మితవాదుల అధీనంలో ఉంది. ఈ ప్రాంతంలో చాలా దేశాల్లో వామపక్ష ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి. మిత, మధ్యేవాదుల దేశంగా కొలంబియా… అమెరికాతో మంచి సంబంధాలు కలిగి ఉంది. గత నెల19న వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఇదంతా తారుమారైంది. అక్కడ అధికారం వామపక్షాల కైవసం అయింది. అర్బన్‌ గెరిల్లాకు చెందిన సెనేటర్‌ గుస్తావ్‌ పెట్రో వామపక్షం తరఫున అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. లక్షలాది పేదలకు, యువతకు, అస్తిత్వానికై పోరాడే వారికి ప్రత్యామ్నాయంగా ఎన్నికయ్యాడు. ఈ విజయం ఒక తరా నికి ముందు ఏ మాత్రం ఊహకందనిది. ఆరోగ్యం, ఆర్థికంపైనే కాక రాజకీయ అధికారంపైనా కోవిడ్‌ ఎంతటి ప్రభావం చూపగలదో నిరూపించిందిక్కడ. మహమ్మారి ఈ ప్రాంతంలో ఎక్కడా లేనంత ఎక్కువ దుష్ప్రభావం చూపింది. ఇంచుమించు కోటి 20 లక్షల మంది ప్రజలు మధ్య తరగతి నుండి క్రిందికి దిగజారి పోయారు. లాటిన్‌ అమెరికా ప్రజలను అధికారంలో ఉన్నవారు ఆదుకోవడంలో విఫలమయ్యారు. దీంతో అనేక దేశాల్లో వామపక్షాలు విజయం పొందాయి. ప్రతీ ఎన్నిక ల్లోనూ మితవాదులు కమ్యూనిస్టులని భూతాలుగా చిత్రించి భయపెడుతూ ఉండేవారు. ఇదే పెరూలోనూ జరి గింది. అక్కడ గత సంవత్సరం మార్క్సిస్టు స్కూల్‌ టీచర్‌ పెడ్రో కాస్టిల్లో గెలుపొందారు. చిలీలో విద్యార్థి నాయకుడు గారియల్‌ బోరిక్‌ వామపక్షాన్ని అధికారంలోకి తెచ్చాడు. ఇప్పుడది కొలంబియాకు విస్తరించింది. ఇక్కడ దశాబ్దా లుగా కొనసాగుతున్న గెరిల్లా పోరాటాల, అంతఃసంఘ ర్షణల అనంతరం పోటీకి తలపడ్డ వామపక్షాల నేతలు హత్యలకు గురైన ఉదంతాలు ఉన్నాయి. ఈసారి ఎన్ని కలలో అలాంటివి సాగలేదు.
ఇప్పుడు అందరి కళ్లు బ్రెజిల్‌పై ఉన్నాయి. ఇది లాటిన్‌ అమెరికాలో అతి పెద్ద దేశం. అక్కడ పూర్వ అధ్య క్షుడు లులా డి సిల్వ ప్రస్తుత అధ్యక్షుడు జిమ్‌ బాసినరోతో వచ్చే అక్టోబర్‌ ఎన్నికల్లో పోటీ పడుతున్నాడు. లులా ఎన్ని కైతే మెక్సికో, అర్జెంటీనాలతో సహా లాటిన్‌ అమెరికాలోని అన్ని పెద్ద దేశాలు వామపక్షం చేతిలోకి వచ్చినట్లు అవుతుంది. వీరి విజయం ఈ కేథలిక్‌ ప్రాంతంలో సామా జిక మార్పులకు పరావర్తనంలా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలాంటి చోట ‘అబార్షన్‌’ హక్కులను హరిస్తు న్నారు. స్వేచ్ఛకు మారుపేరుగా చెప్పుకుంటున్న అమెరి కాలో ‘మహిళ గర్భాన్నీ’ ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తున్నారు. ఈ ప్రాంతంలో కొలంబియా, అర్జెంటీనా, మెక్సికోలలో ఈ హక్కులకై మహిళా ఉద్యమాలు తలెత్తాయి. కొలం బియాలో హోమో సెక్సువల్‌ వివాహాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం తొలినాళ్లలో చేసిన ప్రసంగంలో పెట్రో తాను చిలీ, బ్రెజిల్‌లతో ప్రగతిశీల పొత్తును ఆశిస్తున్నాను అన్నారు. లులా గెలిచి పెట్రో ఆశాభావం సఫలీకృతమైతే ఈ వ్యవస్థ శక్తివంతం, కీలకం అవుతుంది. అమెరికా పెత్తందారీతనాన్ని పక్కన పెట్టొచ్చు. బుష్‌, క్లింటన్ల కాలంలో లాటిన్‌ అమెరికాలో ఉన్నత దౌత్యవేత్తగా పని చేసిన బెర్నార్డ్‌ ఆరోన్సన్‌ మాటల్లో ‘ఇది ఒకప్పటి లాటిన్‌ అమెరికన్‌ ఆధిక్యతను గుర్తుకు తెస్తుంది’. కొలంబియా శాంతి ప్రక్రియలో ప్రత్యేక దూతగా ఉన్న ఇతను పెట్రో విజయాన్ని ‘కొలంబియాలో ఇదో భూకంపం’ గా అభి వర్ణించారు. తన విజయానంతరం ప్రసంగంలో పెట్రో తమ విదేశీ విధానంలో వాతావరణ మార్పుపై పోరా టంలో కొలంబియా అందరికన్నా ముందు ఉంటుం దన్నారు. కర్భనపు వాయువుల విడుదలపై అమెరికాతో కూర్చుని చర్చించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇలా అమెరికా లాటిన్‌ అమెరికాలో తన ప్రభావం నానా టికీ కోల్పోతోందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌ యుద్ధం, ఇరాన్‌, ఉత్తర కొరియా పరిణామాలతో అమెరికా తలమునకలవుతోంది.
ఎన్నికల ద్వారా అధికార మార్పిడి ఓ నిశ్శబ్ద విప్లవం. పాలకుల పట్ల తీవ్ర వ్యతిరేకతకు, అసంతృప్తి, అసహ నానికి ఓట్ల రూపంలో మౌన వ్యక్తీకరణ. ఆయా ప్రాంతా ల్లో, దేశాల్లో నెలకొన్న దారుణ పరిస్థితుల్లో మంచి మార్పు కొరకు సామూహికంగా ప్రజలు ప్రదర్శించిన పరిణతి, విజ్ఞత. నూతనంగా అధికారాన్ని అందుకున్న వారిపై గల అపార ఆకాంక్షలకు, ఆశలకు ప్రత్యక్ష నిదర్శనం.
వ్యాస రచయిత రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, 9247499715

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img