మనరాష్ట్రం అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు ఉంది. అంటే దాదాపు 1100 కిలోమీటర్లు ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ముఖ్య కార్యాలయాలు, జిల్లాలకు మధ్యలో ఉంటే రాకపోకలకు అనుకూలంగాఉంటుంది. ఉదాహరణకి లోకాయుక్త మొదట హైదరాబాద్‌లో ఉండేది. తరువాత విజయవాడలో పెడతామన్నారు. ఒక్కరోజు మాత్రం విజయవాడలో పెట్టి సాయంత్రానికి మరల హైదరబాద్ మార్చారు. ఇప్పుడు అక్కడనుండి కర్నూల్‌కి మార్చారు. అదీ అద్దెభవనంలో. బాడుగ నెలకి సుమారు 6 లక్షలు ఉంటుంది. అమరావతిలో అన్ని భవనాలు ఉండగా, అద్దె భవనంలో కర్నూలులో పెట్టటం ఏమిటి? శ్రీకాకుళం నుండి కర్నూలు రావాలంటే రెండురోజులు ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఎంత ఖర్చు ? పక్కనే వున్న ఒంగోలు నుండి కర్నూలుపోవాలన్నా ఒకపూర్తి రాత్రి ప్రయాణం చెయ్యాలి. ఎవరికోసం కర్నూలులో లోకాయుక్త పెట్టినట్లు? అద్దె భవనం ఓనరు కోసమా? కనుక రాష్ట్రప్రజల క్షేమంకోరే ప్రభుత్వం వెంటనే లోకాయుక్తను విజయవాడకు మార్చాలి. అమరావతిలో ప్రభుత్వం నిర్మించిన భవనాలు ఉన్నాయి. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. అలాగే ముఖ్య కార్యాలయాలు చీఫ్ కమిషనర్ కార్యాలయము వంటి ముఖ్యమైన కార్యాలయా లన్నింటినీ లక్షలు లక్షలు పెట్టి అద్దె భవనాలలో పెట్టారు. వాటిని కూడా అమరావతిలో ప్రభుత్వ భవనాలలోపెడితే కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి మిగులుతాయి. ఆ డబ్బు ఇంకొక సంక్షేమ కార్యక్రమానికి ఉపయోగించవచ్చు.
నార్నెవెంకటసుబ్బయ్య