Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

వామపక్షాల ఆశాజ్యోతి లాటిన్‌ అమెరికా

కిలసాంకి

మొదటిసారి వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడిన దేశాలు సామా జిక ఉద్యమాల నిర్వహణకు భిన్నమైన పద్ధతులను అనుసరిం చాయి. 1990లలో, 2000లలో జరిగిన తీవ్రవాద పోరా టాలు నయా ఉదార ప్రభుత్వాలను అదుపులో పెట్టగలి గాయి. ఈ పరిణామమే వామపక్ష ప్రభుత్వాల ఏర్పాటుకు దారి తీసింది. చిలీలో విద్యార్థుల నిరసనలు, ఉపాధ్యాయుల సమ్మెలు, పింఛనుదారుల, మహిళా ఉద్యమాలు ఒక దశాబ్దిలో బలోపేతమయ్యాయి. ఇందుకు వామపక్షాలు ప్రజా సమూహా లను సమీకరించే ప్రాథమిక బాధ్యతను సమర్ధంగా నిర్వహించాయి. అలాగే కొలంబియాలో దాదాపు దశాబ్ది పాటు అంటే 2011 నుంచి 2018 వరకు విద్యార్థి ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగాయి. 2013, 2016లో రైతు ఉద్యమాలు తీవ్ర స్థాయిలో జరిగాయి. అనంతరం 2019 2021లలో జాతీయ స్థాయి సమ్మెలు ప్రజలను ఆలోచింపజేశాయి.


ఇటీవల వరకు వామపక్షాల ప్రభావం తగ్గిపోతోందని విశ్లేషకులు వ్యాఖ్యా నించేవారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది. లాటిన్‌ అమెరికాలో చాలా దేశాలలో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. పదేళ్లకు పైగా మితవాద ప్రభు త్వాలు చేసిన పాలనలో తీవ్రమైన వైఫల్యాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యం లోనే ప్రజలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. మళ్లీ వామపక్షాల పైపు ప్రజ లు మొగ్గు చూపారు. గతంలో వివిధ రూపాలలో పశ్చిమ దేశాలు వామపక్ష ప్రభుత్వాలలో తిరుగుబాట్లను ప్రోత్సహించాయి. అర్జైంటైనాలో ఎన్నికల ద్వారా, బ్రెజిల్‌లో పార్టమెంటు ద్వారా, ఈక్వెడార్‌లో ఎలాంటి అలజడి లేకుండా, బొలీ వియాలో సైనిక పరంగా తిరుగుబాట్లను ప్రోత్సహించారు. అనంతరం మితవాద ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫల మయ్యాయి. ఈ దేశాలు పశ్చిమరాజ్యాలకు అనుకూలంగా పని చేశాయి. ఆర్థి కంగా, సామాజికంగా దిగజారిపోయాయి. అనంతరం చాలాదేశాలలో వామపక్ష శక్తులు క్రమంగా పుంజుకుంటూ వచ్చి తాజాగా ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. వాస్తవంగా అనేక ఆదర్శనీయమైన సంస్కరణలు అమలు చేసి నప్పటికీ పశ్చిమ దేశాలు సాధించిన దుష్ప్రచారం ప్రజలలో మార్పు తీసుకు వచ్చింది.
తాజాగా కొలంబియాలో వామపక్ష నేత గుస్తావ్‌ పెట్రొ ఘన విజయం సాధించారు. బ్రెజిల్‌లో అక్టోబరులో జరగనున్న ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు లులా తప్పనిసరిగా గెలవనున్నారని బలమైన సంకేతాలు ఉన్నాయి. లాటిన్‌ అమెరికా చరిత్రలో మొదటిసారిగా ఆరు ముఖ్యమైన దేశాలుఅర్జైంటైనా, బ్రెజిల్‌, చిలీ, మెక్సికో, పెరూ దేశాలలో కొన్ని తేడాలు ఉన్నప్పటికీ వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దీంతో లాటిన్‌ అమెరికాలో వామపక్ష భావజాలం విస్త రిస్తోందని అనేక మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదట నికరాగ్వా, వెనిజులాలో వామపక్ష ప్రభుత్వాల వైపు ప్రజలు ఆలోచించి ఎన్నుకున్నారు. ఇటీవల కాలంలో అర్జైంటైనా, బొలీవియాలలో వామపక్షాలను ప్రజలు ఆదరించి అధికారాన్ని కట్టబెట్టారు. బ్రెజిల్‌లోను వామపక్ష ప్రభుత్వం ఏర్పడనున్నదని సర్వేలన్నీ తెలిపాయి. అలాగే కొలంబియా, హోండూరస్‌, మెక్సికో, పెరూ, చిలీ దేశాలలోనూ వామపక్ష ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలమైన విధానాలను అవలంభిస్తూ వారి ఆదరణను చూరగొంటున్నాయి. అమెరికాకు సన్నిహితంగా ఉన్న ఈ ప్రాంత దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఆ దేశంతో చేసు కున్నాయి. మత్తుమందుల వ్యాపారం పైన పెరూ, మెక్సికో, కొలంబియా ప్రభుత్వాలు పెద్ద పోరాటమే చేశాయి. కొలంబియా అమెరికా పనుపున ఈ ప్రాంతంలో వామపక్ష ప్రభుత్వాలను అప్రతిష్ఠ పాల్చేసింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో కమ్యూనిజం వ్యతిరేక పోరాటం పేరుతో సాగుతున్న అణచివేత, హింసను తాజాగా ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాలు నిరోధించడంలో సమర్ధంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. ప్రజాస్వామ్య సమూహాలను ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలోకి తీసుకు రావటంలో వామపక్షాలు విజయం పొందాయి. ఈ నేపథ్యంలోనే కనీసం ఆరు దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రజానుకూలంగా మలుస్తున్నాయి. వాస్తవంగా 197080లలో మితవాద నియంతృత్వ ప్రభుత్వాలు పౌర, కార్మిక వామపక్ష ఉద్యమాలను నిర్దాక్షిణ్యంగా అణచివేశాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మితవాద ప్రభుత్వాలు ఘోరంగా ఓటమి పాలయ్యాయి. ప్రత్యామ్నాయంగా ప్రజలు వామపక్షాల వైపు మొగ్గు చూపారు. 2019 నుండి 2022 వరకు ఐఎంఎఫ్‌ ఆదేశాల మేరకు అమలు చేస్తున్న పొదుపు విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు సుస్థిరమైన ఉద్యమాలను నిర్వహించాయి. అర్జైంటైనా, చిలీ, కొలం బియా, ఈక్వెడార్‌లు రాడికల్‌ ఉద్యమాల ద్వారా వామపక్ష శక్తులను బలోపేతం చేసి నయా ఉదారవాద ప్రభుత్వాలను బలహీనపరిచాయి. అర్జైంటైనా, బొలీ వియా, బ్రెజిల్‌లో వామపక్షం బలహీనంగా ఉన్నదనిపించినప్పటికీ మితవాద ప్రభుత్వాన్ని ఎదుర్కొని నిలబడేందుకు తగిన శక్తిని సముపార్జించుకున్నది. బొలీ వియాలో జరిగిన ఉద్యమాలు సోషలిజం కోసం జరిగిన పోరాటాలకు పునా దులు వేసింది.
మొదటిసారి వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడిన దేశాలు సామాజిక ఉద్యమాల నిర్వహణకు భిన్నమైన పద్ధతులను అనుసరించాయి. 1990లలో, 2000లలో జరిగిన తీవ్రవాద పోరాటాలు నయా ఉదార ప్రభుత్వాలను అదుపులో పెట్టగలిగాయి. ఈ పరిణామమే వామపక్ష ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీసింది. చిలీలో విద్యార్థుల నిరసనలు, ఉపాధ్యాయుల సమ్మెలు, పింఛనుదారుల, మహిళా ఉద్యమాలు ఒక దశాబ్దిలో బలోపేతమయ్యాయి. ఇందుకు వామ పక్షాలు ప్రజా సమూహాలను సమీకరించే ప్రాథమిక బాధ్యతను సమర్ధంగా నిర్వ హించాయి. అలాగే కొలంబియాలో దాదాపు దశాబ్ది పాటు అంటే 2011 నుంచి 2018 వరకు విద్యార్థి ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగాయి. 2013, 2016లో రైతు ఉద్యమాలు తీవ్ర స్థాయిలో జరిగాయి. అనంతరం 2019 2021లలో జాతీయ స్థాయి సమ్మెలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ దశలో మితవాద ఉర్బిస్మో ప్రభుత్వం సంక్షోభంలోకి వెళ్లింది. 2016లో కొలంబియా ప్రభుత్వానికి, తీవ్రవాద ఉద్యమ సంస్థ ఎఫ్‌ఎఆర్‌సికి మధ్య ఒప్పందం కుదరడంతో రాజకీయ దృశ్యం తీవ్ర మార్పుకు గురైంది. ఇటీవల గుస్తావ్‌ పెట్రొ అధ్యక్షుడిగా గెలుపొందడం రెండు దశాబ్దాల పాటు జరిపిన ఉద్యమాల ఫలితమే. ఆయన బొగొటా మేయర్‌గా పనిచేసి నగర ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించారు. ఆయనను పదవి నుండి తప్పించేందుకు అటార్ని జనరల్‌ అలెగ్జాండ్రొ అర్డొనెజ్‌ తీవ్ర ప్రయత్నమే చేశారు.
హోండూరస్‌లో గ్జిఒమర కాస్ట్రో పార్టీ (లిబ్రి) ప్రజా ఉద్యమాల ద్వారా బల మైన ప్రతిపక్షంగా అవతరించింది. 2009లో మాన్యుయల్‌ జెలయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. నేషనల్‌ ఫ్రంట్‌ అధ్వర్యంలో మహిళలు, కార్మికులు దిగువ తరగతి ప్రజలు పెద్ద ఉద్యమాలు నడిపారు. దాని ఫలితమే వామపక్ష ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చింది. లాటిన్‌ అమెరికా దేశాలలో కొవిడ్‌ 19 మహమ్మారి అత్యంత తీవ్రంగా ప్రభావం చూపింది. గత ఏడాది జీడీపీ వృద్ధి ఆరు శాతం ఉన్నప్పటికీ 2020లో కుదేలైన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేంత పరిస్థితి లేకుండా పోయింది. బలమైన ప్రజా ఉద్యమాల ద్వారానే ఈ దేశాలలో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడ్డాయని విశ్లేషకులు అంచనా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img