Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

వికృత చేష్టలు

కూన అజయ్‌బాబు

నువ్వేం తినాలో నిర్ణయించుకునేది నువ్వే. నేను కాదు. నువ్వు కచ్చి తంగా ఇదే తినాలని చెప్పడం బలవంతమే అవుతుంది. నువ్వేం బట్టకట్టాలో కూడా నిర్ణయించుకునేది నువ్వే. నేను కాదు. నువ్వు ఇలాంటి బట్టలే కట్టాలని బలవంతం పెట్టడం కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం. వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతం త్య్రాలను హరించడమే అవుతుంది. ఇంకాస్త ముందుకెళితే, రాజ్యాంగం కల్పి స్తున్న మతస్వేచ్ఛ మరీ గొప్పది. మత విశ్వాసాలకు అనుగుణంగా వస్త్రధారణ వుంటుంది. ఈ దేశంలో డెబ్బై ఏళ్లుగా ఇదే సంప్రదాయం, చట్టబద్ధం. దీన్నెవ్వరూ అడ్డుకోవడానికి వీల్లేదు. మత విశ్వాసం వేరు, మూఢ విశ్వాసం వేరు. కానీ బీజేపీ పాలనలో రెండిరటి అర్థాలు ఒకటే. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కగానే ఏదో ఒక మత కల్లోలం జరుగుతుందని లౌకిక వాదులు ముందే ఊహించారు. అనుకున్నట్టుగానే అన్నంతపనీ అయింది. హిజాబ్‌ వివాదం మతోన్మాదుల దుశ్చర్యకు పరాకాష్ఠ. కాషాయ మూకల వికృత చేష్టలు శృతిమించి పోతున్నాయనడానికి ఇదొక నిదర్శనం. కర్నా టకలో తలెత్తిన హిజాబ్‌ వివాదం చినికిచినికి గాలివానలామారి చివరకు మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, రaార్ఖండ్‌లకూ పాకింది. గత డిసెం బరులో కర్నాటక రాష్ట్రంలోని ఉడుపి పీయూ కళాశాలలో హిజాబ్‌ (ముస్లిం మహిళలు తలకు చుట్టుకునేచున్నీ) వివాదం మొదలైంది. ఆ తర్వాత ఈనెల ఆరంభంలో కుందాపూర్‌ లోని భండార్కర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో హిజాబ్‌ తొలగించి, కాలేజీ లోపలికి రావాలని ముస్లిమ్‌ విద్యార్థినులను అడ్డు కోవడంతో గొడవ పెద్దదైంది. ఆఖరికి అమెరికా, పాకిస్థాన్‌దేశాలతోపాటు మలాలావంటి వ్యక్తులు వ్యాఖ్యానించే స్థాయికి ఇది చేరింది. సహజంగానే భారత ప్రతిష్టకు భంగం కలిగింది. అంతే సహజంగా మోదీగారు మౌనం వహించి, పరోక్షంగా కర్నాటక కాషాయమూకల దాడులను సమర్ధించారు.
విద్యాసంస్థల్లో ఏకరూప దుస్తులు (యూనిఫామ్‌) ధరించాలన్న నిబంధన వుంటుంది. కులమతాలకు అతీతంగా అందరూ పాటిస్తూ వుంటారు. ఇదెక్కడా వివాదంకాలేదు, కాబోదు. అయితేయూనిఫామ్‌ ధరించినప్పటికీ, సిక్కులు తల పాగాను, ముస్లింమహిళలు హిజాబ్‌ను ధరిస్తారు. తలపాగా, హిజాబ్‌ అనేది ఒక వ్యక్తికి అదనపుజోడిరపేతప్పవిద్యాసంస్థనిర్దేశించిన యూనిఫామ్‌ నిబంధనను ఉల్లంఘించడం కాదు. ఉడుపివివాదంలోకూడా అక్కడి విద్యార్థినులు కళాశాలకు సంబంధించిన ఏకరూప దుస్తులు ధరి స్తూనే, మతాచారం ప్రకారం హిజాబ్‌ ధరించారు. ఎన్నడూలేని అభ్యంతరం ఉన్నట్టుండి ఉద్భవించింది. అంటే పకడ్బంధీగా సంఫ్‌ుపరివార్‌శక్తులు పన్నినకుట్రఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అర్థమవుతోంది. ఈ ఘటన తర్వాత ఇంకొన్ని ప్రశ్నలు తలెత్తాయి. అసలు ఈ దేశంలో మైనారిటీలు బతకాలా? వద్దా? రాజ్యాంగం అమల్లో వున్నట్టా? లేనట్టా? భారత రాజ్యాంగం అధికరణ 12నుంచి35 వరకు ప్రాథమిక హక్కులను కల్పించింది. వీటిలో అధికరణ25,26 మతస్వేచ్ఛ గురించి చెపు తున్నాయి. 25వ అధికరణ ప్రకారం వ్యక్తులెవరైనా తమకు ఇష్టమొచ్చిన మతాన్ని ఎంచుకోవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. కాకపోతే దేశంలో శాంతికిభంగం కలగనంతవరకూ ఈ మతస్వేచ్ఛ వుంటుందని పేర్కొంది. హిజాబ్‌ ధరించడమనేది ముస్లిం మహిళల మతాచారం, సంప్ర దాయం. దీంట్లో ఎలాంటి అభ్యంతరంలేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి నప్పటి నుంచి ఏడుదశాబ్దాలుగా హిజాబ్‌ అనేది ఇసుమంత అశాంతిని కూడా కలిగించ లేదు. అందువల్ల అది భారతరాజ్యాంగానికి అనుగుణంగానే నడిచింది. ఎటొచ్చీ, ఆ విద్యార్థినుల మతస్వేచ్ఛ హక్కును కాలరాచిన కళాశాల యాజమాన్యం, అక్కడి కాషాయమూకలే రాజ్యాంగాన్ని ఉల్లంఘిం చాయి. పైగా ఈ హిజాబ్‌ వివాదం ఇతర బీజేపీ పాలితరాష్ట్రాల్లో మాత్రమే విస్తరిస్తూ వచ్చింది. దీన్ని అడ్డుకోవడంలో విఫలంకావడమేకాకుండా దాన్ని ప్రోత్పహిస్తున్న ఆయా రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలు రాజ్యాంగాన్నిఉల్లంఘించి నేరానికి పాల్పడుతున్నాయి. సమానత్వం, సమైక్యత, శాంతికిభంగం కలిగించే వేషధారణను నిషేధిస్తూ కర్నాటకప్రభుత్వం తీసుకువచ్చిన కొత్తఉత్తర్వులు రాజ్యాంగవిరుద్ధం. అంతే గాకుండా ఇంతవివాదం జరుగుతున్నా, మోదీ ప్రభుత్వం నోరెత్తకపోవడం మరో నేరపూరిత చర్య.
హిజాబ్‌ వివాదం వంటి ఘటనల వల్ల యువతరంలో మతోన్మాద, విష బీజాలు నాటుకుంటున్నాయి. ఇది భవిష్యత్‌ భారతావనికే పెను ముప్పు. ఇది సంఫ్‌ుపరివార్‌ శక్తులకు ఆహ్లాదం కలిగించవచ్చు. కానీ భిన్నత్వంలో ఏకత్వంతో సహజీవనం సాగిస్తున్న భారతీయ సమాజానికి ఇబ్బందికరం. మత స్వేచ్ఛను పక్కనపెడితే, అసలు హిజాబ్‌ పేరిట బాలికలు, యువతులను విద్యాసంస్థల నుంచి బయటకు పంపించడమనేది స్త్రీ వ్యతిరేకతను సూచిస్తు న్నది. అంతే గాకుండా, విద్యాసంస్థల నుంచి వారిని దూరం చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ, విద్యాహక్కు ఉల్లంఘనే. ఇది అప్రజాస్వామికం, నేర పూరితం. ఆర్‌ఎస్‌ఎస్‌ స్వామిభక్తిని చాటుకునే మౌఢ్యమతతత్వ సంఘాల ప్రామాణిక పని విధానానికి మచ్చుతునక, విద్యాసంస్థల విధ్వంసం, ముస్లిం అమ్మాయిల పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్‌కు నిప్పుపెట్టడం దురహంకార పూరిత చర్య. హిజాబ్‌ పేరుతో వస్త్రాలు ధరించనీయబోమంటూ ‘కల్చరల్‌ ధిక్కత్‌’ జారీ చేయడం ఆక్షేపణీయం, ఇదంతా చూస్తుంటే, ఇక్కడ సంఫ్‌ు పరి వార్‌ శక్తులకూ, ఆఫ్టన్‌ తాలిబాన్లకూ ఎలాంటి తేడాలేదని అన్పిస్తోంది. మహిళలపట్ల వివక్ష, అసమానత, స్త్రీ వ్యతిరేకత, మతస్వేచ్ఛ హరణకు పాల్పడుతున్న వారిపై తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img