Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

వేగం పెరిగిన భారత్‌`చైనా వాణిజ్యం

బుడ్డిగ జమిందార్‌

గల్వాన్‌ ఘటనల తర్వాత మనదేశంలో చైనా యాప్‌లను నిషేధించటం, చైనా అధ్య క్షుని దిష్టి బొమ్మలు దహనం చేయటం, 500 రకాల చైనా ఉత్పత్తులను బహిష్కరించ టం, అసలు చైనాతో వాణిజ్యమే నష్ట దాయకమని సంఫ్‌ుపరివారులు ప్రచారం చేయటం, ఆత్మ నిర్భర్‌ భారత్‌ పేరిట స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలని ముమ్మరంగా ప్రచారం గావించటం ఇవన్నీ మరిచిపోయిన చరిత్రగా నిలిచిపోయాయనిపిస్తుంది. పైకి భారత ప్రజలకు మాత్రం చైనా వ్యతిరేకతను ప్రచారం చేస్తూనే చైనాతో 2021 సంవత్సరంలో ఇప్పటివరకూ మనదేశం గణనీయమైన వాణిజ్యాన్ని చేసింది. ఈ సంవత్సరంలో సెప్టెంబరు 30 వరకూ జరిపిన 3 త్రైమాసాల వాణిజ్యం కోవిడ్‌ 2019 కంటే ముందున్న వాణి జ్యంతో పోలిస్తే ఇంచుమించు 30 శాతం ఎక్కువ. ఈ మొదటి 9 నెలల్లో 9000 కోట్ల డాలర్ల ఎగుమతులు దిగుమతులు చేసింది. ఈ సంవత్సరం చివరి నాటికి 10,000 కోట్ల డాలర్లకు పైగా వాణిజ్యం చేయటానికి రెండు దేశాలు పరు గులు పెడుతున్నాయి. ‘చైనా జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ కస్టమ్స్‌’ (జిఎసి) సంస్థ పొందుపరిచిన తన నివేదికలో క్రితం సంవత్సరంతో పోలిస్తే చైనా నుండి భారత్‌కు ఎగుమతులు 51.7 శాతం పెరిగాయని, అదే సమ యంలో భారత్‌ నుండి దిగుమతులు 42.5 శాతం పెరిగాయని తెలిపింది. చైనా ఎగుమతులు మన దేశానికి 6840 కోట్ల డాలర్లు ఉంటే మనదేశ ఎగుమతులు చైనాకు 2190 కోట్ల డాలర్లు జరిగాయి. వెరసి మొత్తం వాణిజ్యం 9037 కోట్ల డాలర్లు రికార్డు స్థాయిలో జరిగింది. చైనాతో వాణిజ్యాన్ని మనదేశం ఆపలేని స్థితిలో నిర్నిఘ్నంగా పుంజు కుంటోంది.
బజాజ్‌ ఆటో ఎండి రాజీవ్‌ బజాజ్‌ పూనేలో జరిగిన ఒక అంతర్జా తీయ సదస్సులో మాట్లాడుతూ చైనాతో వాణిజ్యాన్ని కొనసాగించాలనీ, ప్రపంచ మార్కెట్టులో అత్యంత పోటీతత్వంతో దొరికే వస్తువులు అందు బాటులో ఉన్న చోటు నుండి తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం మనదేశ వస్తువులు పోటీతత్వంతో తయారుకావటం లేదు గనుక విడి భాగాలను చైనా నుండి తెచ్చుకోవటం తప్పనిసరి అవు తుందని అన్నారు. ‘‘బజాజ్‌ కంపెనీ ఒక గ్లోబల్‌ కంపెనీగా ఎదగాలను కొంటోంది. కాబట్టి నా మనసులో, సాంస్కృతిక కార్యాచరణల కోణం నుండి చూసినా, ఉద్యోగాల కల్పనకు, డీలర్లను నియమించటానికి సంపూర్ణ సమగ్రతను కోరుకొంటున్నాను. కనుక ప్రపంచవ్యాపితంగా సంపూర్ణ పంపిణీదార్లు, సరఫరాదార్లు కావాలి. అందుకోసం అతి పెద్ద దేశమైన చైనా మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని చైనాతో వాణిజ్యాన్ని కొనసాగించాలని కోరు కొంటున్నాను. ఇటువంటి అతిపెద్ద మార్కెట్టు గల దేశాన్ని విస్మరిస్తే కాల క్రమేణా మనం పేదదేశంగానే ఉంటాం, అభివృద్ధి అనుభవాన్ని కోల్పో వద్దు’’ అని రాజీవ్‌ బజాజ్‌ అంటూ చైనాతో వాణిజ్య విశిష్టతను తెలియ జేసారు. వ్యాపారవాణిజ్యాలకు అనుకూలమైన భూమి, శ్రమశక్తి, విద్యుత్తు, రవాణా, న్యాయపర అంశాలు చైనా, వియత్నాం, ఇండోనేసియా, థాయ్‌ లాండ్‌, మలేషియా వంటి దేశాల్లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. చైనాతో వాణిజ్యానికి ఎన్ని అవరోధాలు కల్పించాలనుకొన్నా ప్రపంచ దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకొంటూ చైనా దూసుకుపోతోంది. ప్రపంచ వాణిజ్యాన్ని 27 శాతం పెంచుకోగల్గింది. ఆసియా దేశాలతో 21.9 శాతం, ఐరోపా యూనియన్‌లో 20.5 శాతం, అమెరికాతో 24.9 శాతం పెంచు కొంది. చైనా యంత్రాలు, విద్యుత్‌ పరికరాలు, వైద్య పరికరాలు మొదలగు ఎగుమతులు ఈ సంవత్సరంలో రెట్టింపుగా ఉన్నాయని జిఎసి తెలిపింది. గడచిన 10 సంవత్సరాలలో చైనాకు మనదేశానికి మధ్య జరిగిన వాణిజ్యం మిగతా దేశాలతో పోలిస్తే అగ్రస్థానంలో ఉన్నాం. 2020 సంవత్సరంలో 47,300 కోట్ల డాలర్ల విలువ చేసే వస్తూత్పత్తులను మనం దిగుమతి చేసు కొంటే వీటిలో 14 శాతం (సుమారు 6500 కోట్ల డాలర్లు) మనం చైనా నుండే దిగుమతి చేసుకొన్నాం. బహుదూరంలో ఇందులో సగం మాత్రమే అమెరికాతో 7.5 శాతంతో 3,560 కోట్ల డాలర్ల వాణిజ్యం చేసుకోగలి గాము. చైనాతో మన వాణిజ్యం అగ్రభాగాన ఉన్నప్పటికీ మనతో చైనా వాణిజ్యం కేవలం 7వ స్థానంలో మాత్రమే ఉంది. చైనా మొత్తం ప్రపంచ వాణిజ్యంలో మనభాగం చైనాకు కేవలం 3 శాతమే కావటం అంటే, వివిధ దేశాలతో చైనా నడుపుతున్న వర్తకవాణిజ్యాల నడవడిక స్పష్టంగా తెలుపు తుంది. గడిచిన 10 సంవత్సరాలలో చైనాతో మనకు గల వాణిజ్య లోటు (చైనాకు అనుకూలంగా) 153 శాతానికి పెరిగింది. 2010లో 1920 కోట్ల డాలర్లు మనదేశ వాణిజ్యలోటు ఉన్నప్పుడు 3000కోట్లడాలర్ల దిగుమతులు చేసుకొన్నాం. 2020 నాటికి 6500 కోట్ల డాలర్ల వస్తువుల దిగుమతికి పెరిగింది. అంటే సుమారు ఇంచుమించు రెట్టింపుదిగుమతులు పెరిగాయి. కానీ మన ఎగుమతులు ఆస్థాయిలో పెరగలేదు. మనం ఎగుమతి చేస్తున్నవి సింహభాగం ఆర్గానిక్‌ రసాయనాలు, ముడి ఇనుము ఖని జాలు, మినరల్స్‌ వంటివి కావటం వలన మనదేశ మాన్యుఫాక్చరీ రంగం వెనుకబాటుతో తయారీవస్తువులు ఎగుమతులు చేయలేకపోతున్నాము. మనదేశ ఫార్మా పరిశ్రమలు, ఎలక్ట్రానిక్‌పరిశ్రమలు చైనాపై ఆధారపడినడవటం గమనార్హం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చైనా నుండి ఏప్రిల్‌ 2020 తర్వాత 120 విదేశీ పెట్టుబడుల ద్వారా 163 కోట్ల డాలర్లు మన పరిశ్రమలకు పెట్టుబడులుగా వచ్చాయి. మొత్తం సింగపూరు, మారిషస్‌, నెదర్‌లాండ్స్‌, జపాన్‌, అమెరికాల నుండి వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే తక్కువయినప్పటికీ ఈ పెట్టుబడులు చాలా విలువై నవి. ప్రత్యక్షంగా పరిశ్రమలకు ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయి. అదే సింగపూర్‌ నుండి, మారిషస్‌ నుండి వచ్చిన పెట్టుబడులు మనదేశంలోని నల్లధనాన్ని విదేశాల్లోని ఆఫ్‌ షోర్‌ కంపెనీలకు పంపి మరలా మనదేశానికి పెట్టుబడులుగా డాలర్ల రూపంలో వస్తాయి. ఐతే ఈ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా మన ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుంది. దీనికి గల కారణం ఈ పెట్టుబడులన్నీ ఊహాజనిత ద్రవ్య పెట్టుబడులుగా జూద క్లబ్బులైన స్టాక్‌ మార్కెట్లోకి వచ్చినట్లుగా వచ్చి మన ప్రజలు ఆడిన జూదపు డబ్బును దోచు కొని పోతుంటాయి. కనుకనే అన్ని దేశాలతో వాణిజ్య లోటు ఉన్న అమెరికా తన వాల్‌స్ట్రీట్‌, డాలర్‌ ఎక్సేంజీలు, ప్రోపర్టీ రైట్స్‌ పేరిట చాలా దేశాల ప్రజా ధనాన్ని కొల్లగొడుతూ తన ఆర్థిక వ్యవస్థను పదిలపర్చుకొంటుంది. ఏమయినప్పటికీ భారత్‌చైనా సరిహద్దుల వివాదానికి ఒక పరిష్కార మార్గంగా పెరుగుతున్న వాణిజ్యం తోడ్పడుతుందని ఆర్థిక, మిలిటరీ నిపు ణులు అంటున్నారు. చైనా వాణిజ్య పురోభివృద్ధికి ఏ దేశం కూడా అడ్డు కాలేదని మరోసారి రుజువైంది.
వ్యాస రచయిత కె ఎల్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌,
సెల్‌ : 9849491969

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img