Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

సమస్యలపై గళమెత్తనున్న సీపీఐ బస్సుయాత్ర

డాక్టర్‌. సీఎన్‌. క్షేత్రపాల్‌ రెడ్డి 

‘రాష్ట్రాన్ని రక్షించుకుందాందేశాన్ని కాపాడుకుందాం’ అనేది భారత కమ్యూనిస్టు పార్టీ నినాదం. ఈ నినాదం కేంద్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక పాలనా విధానాలను ప్రజల మధ్య ఎండట్టాలని ఏపీ రాష్ట్ర సమితి నిర్ణయిచింది. దీంతో పాటు రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల్ని వివరిస్తూ ఈ నెల 17 నుంచి సెప్టెంబరు 8 వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ రంగంలోని నవరత్న సంస్థలలో కీలకమైన, నేడు కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టి విశాఖలోని ఉక్కు కర్మాగారం ప్రధాన ద్వారం నుంచే ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ‘విశాఖ ఉక్కుఆంధ్రుల హక్కు’ నినాదంతో 36 మంది విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న ఈ సంస్థను నష్టాలొస్తున్నాయనే సాకుతో మోదీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని కార్మికవర్గంతో కలసి సీపీఐ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఈ కుట్రలను తిప్పికొట్టడం కోసం ప్రజలను చైతన్యం చేసేందుకు బస్సుయాత్ర జరుగుతుంది. ఏటా నాణ్యమైన 73 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలోని అన్ని ఉక్కు కర్మాగారాలకన్నా ఉన్నతమైన కార్మాగారాన్ని కాపాడుకోవడం కోసం దిల్లీ సరిహద్దులను చుట్టుముట్టి సాగు చట్టాలను రద్దు చేయించిన అన్నదాతల పోరు ఆదర్శంగా తీసుకుని మరో మహత్తర పోరుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన పూర్తై తొమ్మిదేళ్లు గడచినా పార్లమెంటు వేదికగా లభించిన ప్రత్యేక హోదా హామీ అమలవలేదు.హోదాను గంగలో కలిపిన కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్రకు కూడా తీవ్రమైన అన్యాయమే చేసింది. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు అటకెక్కాయి. ఈ ప్రాంతంలోని ప్రాజక్టులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని స్థితి నెలకొంది. రాష్ట్రం విడిపోయినా ఇప్పటికి అదనంగా ఒక్క చుక్క నీరు కూడా లభ్యం కాలేదు. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు హామీగానే మిగిలింది. బుందేల్‌ఖండ్‌ తరహాలో ఉత్తరాంధ్రకు రూ.8 వేల కోట్ల రూపాయల మేర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు రావాల్సి ఉన్నా అవి దక్కలేదు. విశాఖ మెట్రో రైల్‌ ఊసే మరిచారు. గిరిజన యూనివర్సిటీ స్థల సేకరణ వివాదంలో పడిరది. ఐఐఎం నేటికీ తాత్కాలిక భవనాల నుండే నడుస్తోంది. విషపూరిత రసాయిన, ఫార్మా కర్మాగారాలన్నిటినీ ఉత్తరాంధ్రపైనే రుద్దుతున్నాయి. ప్రజల జీవితాలను పణంగా పెట్టి కొవ్వాడ అణు విద్యుత్‌ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర నెత్తిన రుద్దుతోంది. ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగు నీరు, 1200 గ్రామాలకు తాగు నీరందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజక్టు సహా వంశధార, నాగావళి నదులపై ప్రాజక్టు, శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలో మహేంద్ర తనయ నదిపై నిర్మించతలపెట్టిన ఆఫ్‌ షోర్‌ ప్రాజక్టు పనుల్లో పురోగతీ లేదు. పార్వతీపురం జిల్లాలోని జంరaావతి ప్రాజక్టు నేటికీ పూర్తికాలేదు. ఉత్తరాంధ్రకు స్వయం ప్రతిపత్తితో కూడిన ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు డిమాండును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పేరుతో తెచ్చిన పైడిభీమవరం ఇండస్ట్రియల్‌ పార్క్‌, దివిస్‌, పరవాడ ఫార్మా పార్క్‌, బ్రాండెక్స్‌, హెటిరో ఎస్‌ఇజెడ్‌, అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా పాలకులకు పట్టడం లేదనే అంశాలన్నీ సీపీఐ బస్సు యాత్రలో చర్చనియాంశం కానున్నాయి. ఉత్తరాంధ్రలోని పెండిరగ్‌లో ఉన్న నీటి ప్రాజక్టులు పూర్తి, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ద్వారా 30 వేల కోట్ల నిధులు, విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌గా మార్చడం తదితర డిమాండ్లను బస్సు యాత్రలో సీపీఐ ఎలుగెత్తనుంది.ఏపీకి సముద్రతీరం ఒక వరం. 970 కిలోమీటర్ల మేర విస్తరించిన తూర్పు తీరప్రాంతంలో ప్రభుత్వాలు కోస్టల్‌ కారిడార్‌ ప్రాజెక్టును రూపొందించాయి. ఇందులో షిప్పింగ్‌, ఎయిర్‌ కనెక్టివిటీని మెరుగుపరచడం అనే మిషతో పూర్తిగా పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. గడిచిన 20 ఏళ్లగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏపీ సెజ్‌ అచ్యుతాపురం, జెఎన్‌పీసీ పరవాడ, ఫార్మా పరవాడ, నక్కపల్లి క్లస్టర్‌, కోనా ల్యాండ్స్‌, తమ్మవరం కాకినాడ సెజ్‌ ల కోసం సుమారు 23,593 వేల ఎరకాలు ప్రజల నుంచి సేకరించారు. ఇందులో 19,436 వేల ఎకరాల్లో బ్లాకుల్ని ఏర్పాటు చేసినా వినియోగించుకుంది కేవలం 4,707 ఎకరాల్ని మాత్రమే. ఇప్పటికీ 14,729 వేల ఎకరాలు ఖాళీగానే ఉన్నాయి. ఈ భూములు ఇచ్చిన రైతులతో పాటు సుమారు రెండు కోట్ల మంది తమ జీవనాధారాన్ని కోల్పోయారు. ఏర్పాటైన వాటిలోనూ రసాయిన పరిశ్రమలే ఎక్కువ. ఆ పరిశ్రమల నుంచి వచ్చే విషపూరిత వ్యర్థాలు నేరుగా సముద్రంలోకి చేరుతుండడంతో సముద్ర జలాలు పూర్తిగా విషపూరితమై మత్య్స సంపద నాశనమవుతోంది. భూగర్భ జలాలు కలుషితమై సిరులు పండే భూముల్లో విషం చిందుతోంది. ఈ నేపథ్యంలో కోస్టల్‌ కారిడార్‌ను సీపీఐ వ్యతిరేకిస్తుంది. తూర్పు తీర ప్రాంతం అభివృద్ధిపై పాలకులకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే కోస్టల్‌ కారిడార్‌లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పర్యావరణ, పౌర, ప్రజాసంఘాలకు చెందిన వివిధ రంగాల నిపుణులతో చర్చించాల్సి ఉంటుంది. పర్యావరణాన్ని నాశనం చేస్తున్న కోస్టల్‌ కారిడార్‌ పనులను పున:సమీక్షించి పర్యావరణానికి నష్టం వాటిల్లని రీతిలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలనే చర్చను పెట్టనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల జనాభా ఎక్కువే. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్లతో పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఆవిర్భవించింది. ఉత్తరాంధ్రలోని చాలా మండలాలు పూర్తిగా అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. పాడేరు డివిజన్‌, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం డివిజన్‌ పూర్తిగా గిరిజన ప్రాంతాలే. గిరిజనులుండే ప్రాంతాల్లో సాగు, తాగునీరు, రహదారులు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. గిరిజనాభివృద్ధి మాటలకే పరిమితమవుతోంది. కనీసం వైద్య సదుపాయాలు లేక నిత్యం డోలీల్లో రోగులను తరలించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గిరిజన హక్కులు, చట్టాలు పకడ్బందీగా అమలవడం లేదు. అటవీ సంరక్షణ చర్యలు మృగ్యం అవుతున్నాయి. అభివృద్ధి ముసుగులో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా హైడ్రో పవర్‌ ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులిచ్చేసింది. పర్యాటకం పేరుతో గిరిజన ప్రాంతాల్లో చేస్తోన్న పనుల కారణంగా కాలుష్యం పెరుగుతున్నా నివారణ చర్యల్లేవు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురయ్యే గిరిజన ప్రాంతాల్లోని నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడంలేదు. పునరావాసం కల్పించలేదు. ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వమే పక్కా ఇల్లు నిర్మించాలి. పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రతి గిరిజన రైతుకు ఆ భూములపై హక్కులు కల్పించాలి. సాగుభూములు లేని గిరిజనులకు ప్రతి కుటుంబానికి 10 ఎకరాల సాగుభూమిని కేటాయించాలి. గిరిజనుల ఆవాసాలైన ప్రాంతాల్లో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇవ్వకుండా పటిష్ఠమైన చట్టం తీసుకురావాలి. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలి. జీవో నెంబరు 3 కి చట్టబద్దత కల్పించి నూరు శాతం ఉద్యోగాల్ని గిరిజనులకే కేటాయించాలి. ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను గిరిజన యువతీ, యువకులు కల్పించాలి. గిరిజనులకు నిత్యావసరాలను అందించే గిరిజనకార్పొరేషన్‌ను ప్రైవేటీకరించ కుండా ప్రభుత్వంరంగంలోనే నిర్వహించాలి. అటవీ హక్కుల చట్టాన్ని, 1`70 చట్టాన్ని పటిష్టంగా అమలుచేస్తూ స్థానికులు తప్ప ఇతర వ్యక్తులు గిరిజన ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయకుండా అడ్డుకట్ట వేయడం, పీ.సా (పిఈఎస్‌ఏ) చట్టాన్ని పటిష్టంగా అమలు తదితర అంశాలు సీపీఐ బస్సు యాత్ర అజెండాలో కీలకం కానున్నాయి.
సెల్‌: 9059837847

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img