ఈ మధ్య ప్రధాని మోదీ కొత్తకొత్త రైళ్లను ప్రారంభిస్తున్నాడు .
సామాన్య ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు, అందుకోసం అనుకుంటే పొరపాటే !
అన్నీకూడా ఏసీ రైళ్ళే.
సామాన్యుడు వాటి దరిదాపులకు కూడా పోడు.
మరి ఎవరికోసం ఈ వందే భారత్ రైళ్ళు ?
ఎంపీలు, ఎమ్మెల్యేలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మాత్రమే ఎక్కతుంటారు.
వ్యాపారస్తులు తప్ప అందరు ఖర్చుపెట్టేది ప్రజాధనమే !
వ్యాపారస్తులకి డబ్బు లెక్కవుండదు.
మరి ఈ వందే బారత్ రైళ్ళు ఎవరికోసం వేస్తున్నట్లు ?
కరోనా వచ్చిందని పాసెంజర్ రైళ్లను అన్నింటిని రద్దుచేశాడు మోదీ.
పోనీ తరువాత వాటిని పునరుద్దరించాడా ! లేదు .
ఆ పాసెంజర్ రైళ్ల స్థానంలో స్పెషల్ రైళ్ళు అంటు కొత్తకొత్తపేర్లు తో రైళ్లువేసాడు.
కరోనా వచ్చింది, దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని, సీినియర్ సిటిజెన్స్‌కి రైళ్లలో ఇచ్చే 33శాతం రాయితీ తొలగించాడు.
మరి ఎంపీలకి, ఎమ్మెల్యేలకి రాయితీలు ఎందుకు తొలగించలేదు ?
తొలగిస్తే అందరికి తీసివెయ్యాలికదా !
సామాన్యుడి మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం జాలి దయలేదన్నది స్పష్టమౌతుంది.
పోనీ ఈ కొత్త రైళ్ళు అన్నీకూడా ఏసీ రైళ్ళు.
సామన్యుడు వీటి ముఖంకూడా చూడలేడు.
కనుక ఇప్పటికైనా సీనియర్ సిటిజెన్స్ కి రైళ్లలో ఇచ్చే 33 శాతం రాయితీ పునరుద్దరించాలి.
పాసెంజర్ రైళ్ళను కొనసాగించాలి.
ప్రతి ఎక్స్‌ప్రెస్ రైళ్లలోను సగం జెనరల్ బోగీలు తగిలించాలి.
అపుడు మాత్రమే సామన్యుడుకి రైళ్లవలన ప్రయోజనం ఉంటుంది.
నార్నె వెంకటసుబ్బయ్య