Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

స్వాతంత్య్ర దినం – మోదీ వికసిత భారతం

డి.వి.వి.ఎస్‌. వర్మ

మోదీ ‘‘వికసిత భారత్‌’’ నినాదం కొత్తది కాదు. మోదీ రోజూ పాడుతున్న పాటే. ఇప్పుడు దానిని కొత్త మాటగా పైకి తీశారు. ఈ అగస్టు 15 న జరుపుకునే 78వ స్వాతంత్య్రదిన వేడుకలకు ‘‘వికసిత భారత్‌’’ను థీమ్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యగానంతో జరిగే స్వాతంత్య్ర వేడుకలతో ఈ నినాదానికి పునః ప్రాణ ప్రతిష్ట చెయ్యాలన్నది మోదీ లక్ష్యంగా కనిపిస్తున్నది. మోదీ మానస పుత్రికగా రూపుదిద్దుకున్న ‘‘వికసిత భారత్‌’’ కల సాకారం కావడం ఒక ఏడాదిలోనో ఐదేళ్లలోనో జరిగేది కాదు. దాని పూర్ణ దర్శనం 2047లో మనకి చూపిస్తామంటున్నారు. అప్పటి వరకూ తానే వుంటానని, ఇది దైవకార్యమనీ దానిని సాధించడానికే తాను దైవదూతగా వచ్చినట్లు గత ఎన్నికల నాడే ప్రకటించారు. ఈ స్వాతంత్య్ర వేడుకలతో ఈ మహత్తర దైవకార్యానికి ఆయన శ్రీకారం చుట్టబోయే దృశ్యాన్ని దేశ ప్రజలకు చూపించ తలచినట్లు కనిపిస్తున్నది. మోదీ దగ్గర ఒక ‘‘అద్భుతమైన కళ’’ వుంది. అది దృష్టి మళ్లింపు కళ. ప్రజలు తమ నిత్యజీవన సమస్యల మీద దృష్టి పెట్టకుండా దారి మళ్లించే కళ. గత పది సంత్సరాలపాలన మీద మోదీ మాట్లాడరు. ఎందుకంటే అది అత్యధిక ప్రజల జీవితాలను మెరుగు పర్చలేదు పైగా దుర్భరం చేసింది. ప్రస్తుత ప్రజల తక్షణ సమస్యల మీద మాట్లాడరు. ఎందుకంటే వాటిని ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించే మార్గాలు ఆయన వద్ద లేవు. అందుకే 2047లో సాకారమయ్యే దూరపు కొండలను చూపించి ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 2024-25 బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‘‘ వికసిత భారత్‌ ’’ ను సాధించే రోడ్‌ మ్యాప్‌లో 9 ప్రాధాన్యతా అంశాలను ప్రకటించారు. బడ్జెట్‌ ప్రసంగాలలో మాటల గారడీలు, అంకెల గారడీలు వుంటాయి. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి 500 భారీ కంపెనీలు 1 కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్‌ కల్పించడం ఘనకార్యంగా కని పిస్తోంది. ఇది 5 సంత్సరాల పథకం. ప్రస్తుతానికి కేటాయించింది కేవలం 10000 కోట్లు మాత్రమే. మరొకటి ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానికి 15000 కోట్లు సహాయం అందించే ప్రకటన వాస్తవానికి అప్పుగా సమకూర్చడం. దీనికి బడ్జెట్‌లో కేటాయింపులు వుండవు. ఇలా మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటని ప్రకటనలు చాలా కనిపిస్తాయి. పైగా బడ్జెట్‌లో ప్రాధాన్యతాంశాలుగా ప్రకటించిన వాటిలో నిజమైన సమస్యలను పక్కన పెట్టారు. వికసిత భారత్‌లో వ్యవసాయం ప్రాధాన్యత గల అంశం. కాని వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధర కావాలని, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేసి దానికి చట్టబద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్‌ను ఈ బడ్జెట్‌ పక్కన పెట్టింది. నిరుద్యోగ సమస్య సెగ గత ఎన్నికల్లో బీజేపీకి తగిలింది. ఈ బడ్జెట్‌లో దానికి కొన్ని పథకాలను ప్రకటించారు. బడా కంపెనీల ఇంటర్న్‌షిప్‌ పథకం అనేది పని నేర్పడం కోసం కాదు, ప్రభుత్వ సొమ్ముతో యజమానులు వారితో పని చేయించు కోవడం అన్నది బహిరంగ రహస్యం. కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా రిటైర్‌ అయిన ఉద్యోగుల ఖాళీలు భర్తీ చెయ్యకుండా ఇంటర్న్‌లను వాడుకోవడం జరుగుతుంది. వ్యవసాయ రంగానికి, గ్రామీణ పరిశ్రమలకు కేటాయింపులు గణనీయంగా పెంచకుండా అక్కడ 55 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నది కేవలం ప్రకటనగానే మిగిలిపోతుంది. విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు పెంచకుండా మానవాభివృద్ధిపై చెప్పిన మాటలు నీటిమూటలుగానే వుంటాయి. మాటల్లో సామాజిక న్యాయం తప్ప ఆచరణలో అదనపు సాయంలేదు. నిత్యావసరాలపై జీఎస్టీ మోతతో పెరిగిన ధరలతో సతమతమౌతున్న సామాన్యుల జీవన భారాన్ని తగ్గించే ప్రస్థావన లేదు. ఇదీ మోదీ బడ్జెట్‌ ద్వారా మనకి రుచి చూపించిన ‘‘వికసిత భారత్‌’’ ప్రపంచంలో అత్యధిక జీడీపీ (స్థూల జాతీయ ఉత్పత్తి) గల దేశాల్లో మనం 5వ స్థానంలో వున్న మాట నిజమే. మన దేశం త్వరలోనే జపాన్‌, జర్మనీని అధిగమించి మూడవ స్థానానికి చేరుకుంటా మనేది అంకెల్లో నిజం కావచ్చును. జపాన్‌, జర్మనీ జనాభా రీత్యా, వైశాల్యం రీత్యా చాలా చిన్న దేశాలు. వాటి జీడీపీని అధిగమించడం గొప్ప ఘనకార్యం మాత్రం కాదు. మొదటి స్థానంలో వున్న అమెరికా జీడీపీి 29000 బిలియన్‌ డాలర్లు, తలసరి ఆదాయం 85 వేల డాలర్లు, రెండవ స్థానంలో వున్న చైనా జీడీపీ 18000 బిలియన్‌ డాలర్లు, తలసరి ఆదాయం 13000 డాలర్లు, ప్రస్తుత భారత్‌ జీడీపీ 3,942 బిలియన్‌ డాలర్లు, తలసరి ఆదాయం 2730 డాలర్లు. మూడో స్థానంలోకి వచ్చినా జీడీపీలో, తలసరి ఆదాయంలో ఎంతో దిగువలోనే వుంటాం. యూఎన్‌డీపీి ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో మనం 134 వ స్థానంలో, ఆకలి సూచీలో 121 స్థానంలో వున్నాం. మోదీ ప్రభుత్వమే దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ పంపిణీ చేస్తున్నది. నిరుద్యోగం మునుపెన్నడూలేని స్థాయికి చేరుకుంది. గత 10 సంవత్సరాలుగా మోదీ దేశ ప్రజల్ని ‘‘ సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌’’ నినాదంతో మురిపించారు. ‘‘సబ్‌ కా వికాస్‌’’ లో రైతులు, యువత, పేదలు మాత్రంలేరు. కార్పొరేట్లు, బిలియనీర్లు ఇబ్బడి ముబ్బడిగా వికసించారు. కేవలం 169 మంది బిలియనీర్ల దగ్గర 78 లక్షల కోట్ల సంపద పోగుపడిరది. 10 శాతం కుబేరుల దగ్గర 78 శాతం దేశ సంపద గుట్టపడిరది. మొత్తం మీద మోదీ పాలన కార్పొరేట్ల చేత కార్పొరేట్ల కోసం సాగుతున్న పాలన అయింది. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తమ తమ బడ్జెట్‌ల పరిధిలో అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ముందుకు సాగించలేని స్థితికి చేరుకున్నాయి. ప్రత్యక్ష పన్నులు ఇప్పటికే తారాస్థాయిలో వున్నాయి. అదనపు పన్నులను ప్రజలు భరించే స్థితి లేదు. ఇప్పటికే అన్ని ప్రభుత్వాలు అప్పుల కుప్పలుగా మారాయి. వాటిమీద వడ్డీల చెల్లింపులకే అవి సతమత మౌతున్నాయి. రాబోయే కాలం సంక్షేమాన్ని పెంచేది కాదు, కత్తెరలు వేసేకాలం. మోదీ ప్రభుత్వం దేశ సంపదను దోచుకున్న కార్పొరేట్లపై పన్నులు వేసే ప్రభుత్వం కాదు. ఈ పదేళ్ల మోదీ ప్రభుత్వం గతంలో వున్న 35 శాతం కార్పొరేట్‌ పన్నును 22 శాతానికి తగ్గించింది. వారికి 20 లక్షల కోట్ల బాకీలను రద్దు చేసింది. 10 శాతం వున్న వారసత్వ పన్నును తొల గించింది. సంపద పన్ను ప్రస్తావనే లేదు. ఇవి జరగాలంటే ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. దేశంలో 10 శాతంగా వున్న కుబేరుల మీద కార్పొరేట్‌ పన్ను పెంచడం, సంపద పన్ను, వారసత్వ పన్ను విధిం చడం ద్వారా 20 లక్షల కోట్లకు మించి అదనపు ఆదాయం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మూడు పన్నుల ద్వారా కార్పొరేట్ల దగ్గర పోగుపడ్డ సంపదను పునఃపంపిణీ చేయడంతోనే శ్రమజీవులకు, పేదలకు మౌలిక ఆదాయాన్ని, హక్కుగా మంచి ప్రమాణాల విద్య, వైద్య సేవలు, నివాస వసతులను ఉచితంగా కల్పించవచ్చును. స్వామినాథన్‌ కమిషన్‌ సూచన మేరకు చట్టబద్ధంగా వ్యవసాయ పంటలన్నింటికీ లాభసాటి ధరలు అందించ వచ్చును. వేతన జీవులకు, ఉద్యోగులకు ఆదాయ పన్ను మినహాయింపు గణనీయంగా పెంచవచ్చును. దీనికి కార్పొరేట్లను కట్టడిచేసే విధానాలు కావాలి. మోదీ భారతంలో కార్పొరేట్‌లు వికసిస్తారు, జనజీవనం వికసించదు. ‘‘వికసిత భారత్‌’’ వంటి శుష్క నినాదాలు శూన్య హస్తాలే తప్ప స్వాతంత్య్ర ఫలాలు ప్రజలకు దక్కవు.
దారి దీపం సంపాదకులు
సెల్‌: 8500678977

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img