Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

స్వాతంత్య్ర పరిరక్షణ మన కర్తవ్యం

బ్రిటీష్‌ వలసపాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం భారతదేశ ప్రజలు సుదీర్ఘపోరాటం జరిపారు. అనంతరమే 1947 ఆగస్టు 15వ తేదీన దేశం స్వాతంత్య్రం పొందింది. స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టులు గొప్ప పాత్రను నిర్వహించారు. 20వ శతాబ్దం రెండవ దశాబ్దిలో దేశ వ్యాప్తంగా దేశభక్తియుత యువకులు, మేధావులు, పోరాటానికి అంకితమైన సమూహం ఒక్కటయ్యారు. 1920లో ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీయూసీ)ని స్థాపించడం ఒక పెద్ద విజయం. ఈ సంఘం ద్వారా ప్రగతిశీల జాతీయ భావాలు కలిగిన నాయకులు కార్మికవర్గాన్ని ఏకం చేశారు. బ్రిటీష్‌ పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలను ఏఐటీయూసీ సవాలుచేసింది. దీర్ఘకాలిక రాజకీయ డిమాండ్ల సాధనకు కార్మికులకు రాజకీయ పరిజ్ఞానం కల్పించింది. అలాగే స్వాతంత్య్ర సాధన లక్ష్యాన్ని బోధించింది. ఈ తరుణంలోనే రెండవ ప్రపంచయుద్ధం ముగియవచ్చింది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగానూ, దేశంలోనూ గణనీయమైన మధనం జరుగుతోంది. రష్యాలో గొప్ప పోరాటయోధుడు లెనిన్‌ నాయకత్వంలో బోల్షివిక్‌ విప్లవం విజయవంతమైంది. ఇదే సమయంలో భారతదేశ రాజకీయ రంగంలోకి మహాత్మాగాంధీ ప్రవేశించారు. స్వాతంత్ర ఉద్యమ అజెండాలో గొప్ప మార్పు తీసుకువచ్చే బాధ్యతను కమ్యూనిస్టులు చేపట్టారు. భారతజాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ)లోనూ, వెలుపల గణనీయమైన అజెండా మార్పు విజయవంతంగా జరిగింది.
కాన్పూర్‌లో 1925 డిసెంబరు 26న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థాపన జరిగింది. భారతదేశమంతటా కమ్యూనిస్టులు ఒక తాటిపైకి వచ్చారు. ప్రగతిశీలమైన డిమాండ్లను చేసేందుకు శక్తివంతమైన వేదిక ఏర్పడిరది. ఈ డిమాండ్లు స్వాతంత్య్రపోరాటంలో భాగమయ్యాయి. సీపీఐ కాన్పూర్‌ మహాసభలో ఆహ్వానకమిటీ చైర్మన్‌గా మౌలనా హస్రత్‌ మోహాని చైర్మన్‌గా బాధ్యత వహించారు. బ్రిటీష్‌ పాలకుల నుంచి సంపూర్ణ స్వాతంత్య్రం కోసం ఈ మహాసభ మొదటిసారిగా డిమాండ్‌ చేసింది. అంతక్రితం పరిమిత స్వయంప్రతిపత్తి డిమాండ్‌ ఉన్నది. దాని నుంచి గణనీయమైన సంపూర్ణ స్వాతంత్ర పోరాటం జరపాలని నిర్ణయం జరిగింది. దేశంలో రాజ్యాంగ అసెంబ్లీ ఏర్పాటు డిమాండ్‌ను మొదట కమ్యూనిస్టులే చేశారు.
1936లో ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) నెలకొల్పి రైతులను సమీకరించడంలో సీపీఐ ముందు పీఠిన నిలిచింది. 1936లోనే విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) , రచయితలు, మేధావులను సమీకరించేందుకు ప్రగతిశీల రచయితల సంఘం, కళాకారుల కోసం ఇండియన్‌ పీపుల్స్‌ ధియేటర్‌ అసోసియేషన్‌(ఇఫ్టా)ను 1943లో స్థాపించారు.
స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైన కమ్యూనిస్టులకు పెరుగుతున్న ఆదరణవల్ల వారు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే ప్రజల నుంచి కమ్యూనిస్టులకు లభిస్తున్న ఆదరణ కారణంగా అణచివేతకు చేసిన ప్రయత్నంలో వలస పాలకులు విఫలమయ్యారు. ఈ పోరాటాలన్నీ కలిసి ఉన్నత స్థాయికి చేరాయి. అప్పుడు ‘‘స్వాతంత్రానికి ఇది చివరి పోరాటం’’ అని పిలిచారు. 1946లో భారత నావికుల తిరుగుబాటు జరిగింది. దీన్ని స్పూర్తిగా తీసుకుని సీపీఐ మద్దతుతో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నాయకత్వంలో ‘అజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ను ఏర్పాటుచేశారు. నౌకా సిబ్బంది తమపైన బ్రిటీష్‌ సిబ్బంది జారీ చేసే ఉత్తర్వులను ధిక్కరించారు. బ్రిటీష్‌ పాలకులు చేసిన హింసాకాండను తిప్పికొట్టారు. భారతదేశంలో తమ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని విదేశీ పాలకులు గుర్తించారు. విదేశీ పాలనను ఎంతమాత్రం అంగీకరించబోమని ప్రజలు హెచ్చరించారు.
సమాజాన్ని అధ్యయనంచేసి అణగారిన వర్గాలను సమీకరించి భవిష్యత్తులో పోరాటం చేయాలన్న అజెండాను సీపీఐ నిర్థారించుకున్నది. పరిశ్రమలలోనూ, వ్యవసాయరంగంలోనూ జరుగుతున్న దోపిడీ స్వభావాన్ని సీపీఐ ప్రజలకు వివరించి వారిని సమీకరించింది. అమానవీయ అంటరానితనం ఆచరించడాన్ని కాన్పూర్‌ మహాసభలో ఎం.సింగారవేలు చెట్టియార్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. కుల వ్యవస్థను వ్యతిరేకించిన వారిలో సీపీఐ ముందున్నది. మార్క్సిజం,శాస్త్రీయ భావజాలాన్ని సంతరించుకున్న సీపీఐ సామాజిక సంస్కరణలకు ఎంతగానో దోహదంచేసింది. మహిళలను సమీకరించి పితృస్వామ్యానికి వ్యతిరేకంగా సీపీఐ ముందుగా పోరాటాన్ని సాధించింది. భారతదేశంలో స్వేచ్ఛ, సమసమాజం భావనను సీపీఐ విస్తరింపచేసింది. వర్గ, కుల, వారసత్వాలు, పితృస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేసేందుకు లక్షలాదిమంది ప్రజలను సీపీఐ సమీకరించింది. సమాజంలో న్యాయం, సమానత్వంకోసం పోరాటం నిర్వహించింది.
దేశ స్వాతంత్య్రం లభించి దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నది. ఇదే సమయంలో మన పార్టీ శతవార్షికోత్సవాలను జరుపుకోనున్నాం. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో పౌరులందరినీ భాగస్వాములనుచేసి సామాజిక న్యాయాన్ని సాధించేందుకు, కులరహిత దేశం కోసం మనం కలలుకన్న వర్గరహిత సమాజం కోసం గొప్ప విలువలను కాపాడు కునేందుకు రాజీలేని పోరాటాన్ని కొనసాగించే సవాళ్లు మన ముందు న్నాయి. ఇందుకోసం ప్రజలను సమీకరించేందుకు వారికి చేరువ కావాలి.
సీపీఐ స్థాపించిన 1925లోనే ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా ఏర్పడిరది. ఈ సంస్థ బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడేబదులు దేశంలో మైనారిటీలను, కమ్యూనిస్టులను తమ శత్రువులుగా భావించారు. శతాబ్దికాలంగా ప్రజానుకూల విలువలను నాశనం చేశారు. కమ్యూనిస్టులు స్వాతంత్య్ర పోరాటంలో గొప్ప త్యాగాలు చేయగా, ఆర్‌ఎస్‌ఎస్‌ దాని నాయకత్వం బ్రిటీష్‌ పాలకులకు సేవకులుగా పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో రాజకీయ వాతావరణాన్ని విషతుల్యంచేసి మహాత్మాగాంధీని కాల్చి చంపడానికి దోహదంచేసింది. ఈ దుర్మార్గానికి ఒడిగట్టినందున ఆనాటి హోం శాఖ మంత్రి వల్లభాయ్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధాన్ని తొలగించారు. రహస్యంగా మతాధిపతుల పాలన సాగించే హిందురాష్ట్రను ఏర్పాటుచేసే లక్ష్యంకోసం పనిచేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కి అనేక అనుబంధ సంస్థలున్నాయి. ఇవన్నీ ప్రజాధీనంలో పుట్టగొడుగుల్లాగా ఏర్పడి పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ కలిపి సంఫ్‌ుపరివార్‌ అంటున్నాం. కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆయుధమే. ఈ పార్టీ కూడా కులతత్వం, దోపిడీ స్వభావం కల దుష్ట భావజాలాన్ని అనుసరిస్తున్నది. ఈ భావజాలాన్నే సవాలుచేస్తూ సీపీఐ ప్రగతిశీల, సోషలిస్టు అజెండాకోసం పోరాటం చేయవలసి ఉంది. దేశంలో అత్యంత ముఖ్యమైన అంశం ఈ సవాలును అధిగమించేందుకు పోరాడాలి. బ్రిటీష్‌ పాలకులపైన గొప్ప పోరాటంచేసిన చరిత్ర మనకుంది. అలాగే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేందుకు మన పోరాటం గణనీయంగా దోహదంచేసింది. అదొక అవశేషంగా మిగిలిపోయేలా ఉండకూడదు. దీన్ని నిలుపుకునేందుకు మరింత బలమైన పోరాటం చేయాలి. దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మన పోరాటం ఉంటుంది. ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీ దుష్పరిపాలనలో మన ప్రజలు నలిగిపోతున్నారు. విచ్ఛిన్నకర మత భావజాలం మన సమాజాన్ని చీల్చేందుకు వెనుకాడటంలేదు. అందువల్ల మనం ప్రజలకు దగ్గరకావడానికి వారి నిత్యజీవితంలో మనం భాగస్వాములం కావాలి. ఇది స్వల్పమైన లక్ష్యమేమీ కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీ అధికారం చేజిక్కించుకున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వ యంత్రాంగంలోనూ, ప్రభుత్వంలోని అన్ని విభాగాలలోనూ చొరబడిరది. మన సెక్యులర్‌, ప్రజాస్వామ్య రిపబ్లిక్‌కు తీవ్ర ముప్పుగా ఏర్పడిరది. హిందూ రాష్ట్ర స్థాపనను లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ విపత్తు జరగకముందే మనం దేశ స్వాతంత్య్రాన్ని, సెక్యులర్‌ ప్రజస్వామ్య రిపబ్లిక్‌ను కాపాడుకోవాలని డాక్టర్‌ అంబేద్కర్‌ ఎప్పుడో హెచ్చరించారు. గొప్ప స్వాతంత్య్ర ఉద్యమం వారసత్వంగా లభించిన గొప్ప విలువలను పరిరక్షించుకునేందుకు నిత్యం జాగరూకతతో ఉండాలి. దేశంలో తక్షణ డిమాండ్ల కోసమే కాక సోషలిస్టు సమాజాన్ని నిర్మించడానికి పార్టీ తీవ్ర పోరాటాలను, ప్రచారాన్ని కొనసాగించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img