Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

స్వార్థ రాజకీయాలు

రా బావ ఏమిటి దేశం నాశనమై పోతుందంటూ వస్తున్నావు. ఈ రోజు ఏదైనా మీటింగుకెళ్లావా. అదేంలేదు తెల్లారితేచాలు పేపరు మడత విప్పితే అన్ని అరాచకాలు, అన్యాయాలు. ఇప్పుడు కొత్తగా ఏమైంది. ఏం కావాలి. కుల,మత,వర్గ రాహిత్య సమాజం కావాలని, రాజ్యాంగం ప్రకారం ప్రజలకు స్వేచ్ఛకావాలని, ప్రతి వ్యక్తికి ప్రశ్నించే హక్కు కావాలని కదా మనం కోరుకునేది. అవును ఇప్పుడు కొత్తగా నీకు వచ్చిన ఇబ్బందేమిటి. పేపరులో వార్తలు చూచి కూడ అలా అడుగుతావేంటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు తప్ప అధికారంలో ఉన్న నాయకులు తప్పులు చేయరా? రాజకీయాల్లో రోజురోజుకు విలువలు పతనమై రాజుల పాలన గుర్తుకొస్తున్నాయి. నాకు తెలియక అడుగుతాను ప్రస్తుతం బీజేపీ నాయకులు మెదిలితే రామనామస్మరణ చేస్తూ రామాలయాలు నిర్మిస్తున్నారు కదా. రాముడు ఇలాగే కక్ష పూరిత పాలన చేశాడా చెప్పు. నిజమే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం బలంగాఉండాలని తెలిసో తెలియకో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తే వాటిని నిలువరించి సరైన సూచనలిచ్చి ప్రజలకు అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రతి పక్షానిదే. కానీ ప్రస్తుతం ప్రతిపక్షాలు అలాకాకుండా అధికారంలో ఉన్న వారిని దించి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే తపన తప్ప ప్రజల గురించి వారు కూడా ఆలోచించడం లేదు. ప్రభుత్వం చేసేతప్పులను ప్రజలకు వివరించి వారినివెంటబెట్టుకుని అందోళనకు దిగాలి. అది నిజమే కానీ నాయకులు వారి అనుయాయులు తప్పు చేస్తే ఆందోళనలో ప్రజలు ఉండడంలేదు. అసలు నాకు తెలియక అడుగుతాను ప్రజలకు పార్టీలు అవసరమా అని. పార్టీలు పెట్టి అందులో ప్రజలను సభ్యులుగా చేర్చి తరువాత నాయకుడు ఒకడే కనబడుతాడు. పోరాటంలో నాయకులు వారి అనుయాయులుతప్ప ఎవరికోసమో పోరాటం ఆ ప్రజలు ఉండడం లేదు. అపుడా పోరాటానికి ఎలా న్యాయం జరుగుతుంది. ఆ నాయకులను జైల్లో పెడితే పోరాటం ఆగిపోతోంది. అదే వేలమంది ప్రజలు పాల్గొంటే అందరిని బంధించడానికి పభుత్వం వెనుకడగు వేస్తుంది. అందుకే ఎవరికోసం పోరాటమో వారు ఉద్యమంలో తప్పనిసరిగా పాల్గొనాలి. అలాకాని నాడు నాయకులు పక్కదారి పడితే పోరాటం ఇంటిదారి పడుతుంది. ప్రస్తుతం ఉద్యమాలు అలా జరగడంలేదు.
అధికారంలో ఉన్నవారు వారికోసం వారి అనుయాయులకోసం చట్టాలుచేస్తూ ప్రజలు ఆస్తులు కొల్లగొడుతున్నారు. కొంతమంది బడా పారిశ్రామిక వేత్తలనుండి వార్షిక ఎన్నికలకోసం నిధులు తీసుకున్న ఫలితంగా లక్షల కోట్లు వారికి పన్ను మినహాయింపు ద్వారానో, భూములు దారాదత్తం చేయడమో ప్రభుత్వం చేస్తోంది. ఇలా చేయడం ప్రజాప్రభుత్వంలో ప్రజలకుచెప్పి చేయడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ,షాలు ఇద్దరు 140కోట్ల జనాభాను రాజు,మంత్రిలాగ పాలిస్తున్నారనడంలో అతిశయోక్తిలేదు. అది సరే బావ రాష్ట్రాలపరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదుగ. అంతెందుకు మన ముఖ్యమంత్రి జగన్‌ కూడా వైజాగ్‌ స్టీలు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేపోతున్నారుగ. నిజమే ఈ మధ్య కాంగ్రెసు నాయకులే అన్నారుగా సోనియాగాంధీతో విభేదించక ముందు జగన్‌పై కేసులులేవని ఆ తరువాతనే పుట్టుకొచ్చాయని. అది నిజమే కాంగ్రెసు వ్యతిరేకమైన బీజేపీ ఆ కేసులు ఎత్తివేయవచ్చుకదా. అక్కడే ఉంది అసలు విషయం. ఏకంగా 22 మంది ఎంపీల ఓట్లు వాళ్లకు అవసరం కనుక కాంగ్రెసులానే ఈ బీజేపీ కూడా గుప్పిటలో పెట్టుకుంది. కేసులు ఎత్తివేసిననాడు కేసీఆర్‌లాగా ఎదురు తిరుగు తాడేమోనని భయం వారికి లేకపోలేదు. ఆ కేసుల్లో ఇరుక్కోబట్టి స్టీలు ఫ్యాక్టరీ విషయంలో నాన్చుడుధోరణి అనుభవిస్తున్నాడు. అది సరే ఒక పక్క అప్పులు పెరిగిపోతుంటే నర్సరీ నుండి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య అంటాడు. స్కూళ్ల బాగుచేతలకు నాడు నేడు పథకం అంటాడు. కొత్త మెడికల్‌ కేలేజీలంటాడు. ఈ రకంగా గతంలో లేనివితేవడం, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం మంచిదేకాని అప్పులు పెరుగుతున్న నేపధ్యంలో ఇవన్నీ సాధ్యమా లేక కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని చేసే ప్రకటనలేనా అని నా సందేహం. ఒకవేళ మధ్యలో ఆగిపోతే పెట్టిన ఖర్చు బూడిదలోపోసిన పన్నీరులా అవుతుంది కదా. ఆ మాట నిజమేగానీ ఇందులో ఒక నిగూఢమైంది ఏమంటే చేయగలిగితే నిలబడతాడు లేకపోతే కొత్త ప్రభుత్వానికి తలనొప్పిగ మారుతుంది. వచ్చినవారు చేయలేరు. ఎందరు అధికారంలోఉన్నా కేంద్రంపై ఆధారపడవలసిందే. అది సరేగానీ బావ ఈ మధ్య వైజాగ్‌సమ్మిట్‌ పేరిట ఏర్పాటైన సభలో ఏకంగా 13లక్షల కోట్లతో పెట్టుబడులు వస్తాయని 6లక్షల మందికి ఉచితంగా ఉద్యోగావకాశం ఉంటుందని ప్రకటనలిచ్చారు. అంతేకాక ఈ సదస్సు ద్వారా ప్రతిపక్ష ఆరోపణలకు చెక్‌ పెట్టినట్లయిందని వైసీపీ చెప్పుకొంటుండగా అవన్నీ జరగవని ప్రతిపక్షం అంటోంది. అదే బావ జరగవచ్చు జరగకపోవచ్చు కానీ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా జరగాలని అందరూ కోరుకోవాలి.
సెల్‌: 9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img