Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

హర్యానలోనూ బీజేపీకి తీవ్ర కష్టాలు

డా॥ జ్ఞాన్‌ పాఠక్‌

హర్యాన అసెంబ్లీకి మరో పదినెలలకు ఎన్నికలు జరగవలసి ఉంది. 2024లో లోక్‌సభ ఎన్నికల తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. ఈలోపు హర్యానలో బీజేపీ తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నది. ఇక్కడ బీజేపీజెజెపీ సంకర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీల మధ్య పొసగడం లేదు. జెజెపీ తనదారి తాను చూసుకుంటానని కూడా హెచ్చరించింది. ముఖ్యమంత్రిగా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పని చేస్తున్నారు. 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడిన అనంతరం బీజేపీ జేజెపీతో పొత్తు కుదర్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జగన్నాయ్‌క్‌ జనతా పార్టీ(జెజెపీ) గాకుండా మరో ఏడుగురు ఇండిపెండెంట్లు సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటున్నారు. అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలుండగా బీజేపీ 40సీట్లలో గెలిచి అతిపెద్దపార్టీగా అవ తరించింది. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని పది ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ 40అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కడంతో తీవ్ర షాక్‌ తిన్నది. ఈ రెండు ఎన్నికలకు కేవలం 5 నెలలు మాత్రమే తేడా అయినా అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు గెలుచుకున్నది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 58.21 శాతం ఓట్లు రాగా అసెంబ్లీ ఎన్నికలకు 36.49 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే బీజేపీకి ఓటు శాతం తీవ్రంగా పడిపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది మూడోసారి ప్రధానిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆశిస్తున్న మోదీకి తాజా పరిణామం తీవ్రంగా కలవరపెడు తోంది. ఒక్క లోక్‌సభ సీటు తక్కువైనా ఆందోళన కల్గిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తప్పని సరిగా గెలవాలన్నది బీజేపీ ఆలోచన. అయితే తాజా పరిణామాలు ఆపార్టీకి ఆందోళన కలిగిస్తోంది. పొత్తు కుదిరి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి ఘర్షణ మొదలైంది. తాజాగా ఇది బహిరంగ మైంది. వారంక్రితం జెజెపీ ఎమ్మేల్యే (షహబాద్‌) రామ్‌కరణ్‌ కళ ‘షుగర్‌ షెడ్‌కు’ (హర్యాన చక్కెర మిల్లుల సహకార సమాఖ్యసంస్థకు రాజీనామా చేశారు. పొద్దు తిరుగుడు పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ నిరసన తెలిపిన రైతుల పై లాఠీ చేర్చి చేసి గాయపరిచినందుకు గాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ జెజెపి మధ్య ఒప్పందం కుదిరిందని ఎమ్మేల్యే రాజీనామా వెనక్కు తీసుకుంటారని రెండుపార్టీల నాయకులు ప్రకటించారు. అయితే రైతులు ఈసారి ఎన్నికల్లో పాలకులు తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. దీంతో రెండు పార్టీల మధ్య ఘర్షణ సమసిపోయే అవకాశం తక్కువే. క్షేత్రస్థాయిలో రెండు పార్టీలో మధ్య సంబంధాలు సక్రమంగా లేవు. రాజకీయంగా తాము దెబ్బతినడానికి సిద్ధంగాలేమని జెజెపీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్‌ను అధికారానికి దూరంగా ఉంచాలనుకుంటే బీజేపీజెజెపి మధ్య పొత్తు తప్పదని జెజెపీ నాయకుడు అజయ్‌ చౌతాలా అంటున్నారు. ఒప్పందం కుదరినట్లు ప్రకటించాక రెండు పార్టీల నాయకులు చేస్తున్న ప్రకటనలు కుదిరిన ఒప్పందం పనిచేయడం లేదని తెలియజేస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జీ విప్లవ కుమార్‌ దేవ్‌చర్యలు, ప్రకటనలు రెండు పార్టీలు మధ్య దూరాన్ని పెంచుతున్నాయని సృష్టమవుతోంది. జెజెపి నాయకులకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు. నిరాశకు లోనవుతున్న బీజేపీ నాయకులు జెజెపీ నాయకత్వానికి, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ అంశాన్ని అజయ్‌ చౌతాల నిజమేనని అంటూ బీజేపీ తమకు సహజమిత్రపార్టీ ఏమీ కాదని అన్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం కల్పిస్తున్నదని సూచనలు అందజేస్తున్నాయి. ఐఎన్‌ఎల్‌డిలో విభజన జరిగి జెజెపి పార్టీ ఏర్పడిరది. ఈ పార్టీ ఒక్క సీటులో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్‌ 31 సీట్లలో గెలుపొందింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 47 ఐఎన్‌ఎల్‌డి 19, కాంగ్రెస్‌ 15 సీట్లు గెలుచుకున్నాయి. 2014, 2019లలో జరిగిన ఎన్నికల మధ్యకాలంలో కాంగ్రెస్‌ బలం పెరిగింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ, జెజెపీల, రాజకీయ క్షేత్రస్థాయి మద్ధతు మరింత పడిపోతుందని అంచనా. రాష్ట్రంలో రైతులు బీజేపీపై మండిపడుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జెజెపీకి 14.84 శాతం ఓట్లు రాగా ఐఎన్‌ఎల్‌డికి 2.44 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలు విడిపోక ముందు ఐఎన్‌ఎల్‌డికి 24.11 శాతం ఓట్లున్నాయి. జెజెపీ మద్ధతు తమకేమీ అవసరం లేదనీ కొందరు బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు. జెజెపీకి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటైనా కేటాయించే అవకాశం లేదని చెప్తున్నారు. కొన్ని సీట్లలో పోటీ చేయాలని జెజెపి తలపెట్టింది. అందువల్ల రెండు పార్టీల మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండటంకష్టమే. ఈ నేపథ్యంలో జెజెపి, ఐఎన్‌ఎల్‌డిలు త్వరలో విలీనమవు తాయని ఈ దిశలో చర్చలు జరుగుతున్నాయని జెజెపి నాయకుడు అజయ్‌చౌతాలా, ఐఎన్‌ఎల్‌డి నాయకుడు ఓంప్రకాష్‌చౌతాలా తెలియ జేశారు. 2018 తర్వాత ఉపప్రధానిగా పనిచేసిన దేవీలాల్‌ మనవళ్లు అభయ్‌ చౌతాల, అజయ్‌ చౌతాల మధ్య అధికార పోరాటం జరిగి పార్టీ విడిపోయింది. వీరిరువురు పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాష్‌ కుమారులు అభయ్‌ చౌతాలకే తండ్రి ఓం ప్రకాష్‌ మద్దతు పలికారు. అప్పుడు జెజెపి పార్టీ ఏర్పడిరది. జైలు నుండి విడుదలైన ఓంప్రకాష్‌ చౌతాలా రెండు పార్టీల విలీనానికి కృషి చేస్తున్నారు. రకరకాల కారణాలతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి అస్పష్టంగా, అనిశ్చయంగా ఉంది. బీజేపీకి జాతీయ స్థానిక ప్రయోజనాలున్నాయి. అయితే ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు బీజేపీకి రాష్ట్రంలో రెట్టింపు వ్యతిరేకత నెలకొని ఉంది. భూపేందర్‌ సింగ్‌ హుడా నాయకత్వంలో కాంగ్రెస్‌ సమీపంలోని హిమాచల్‌ప్రదేశ్‌ విజయం పొందిన తర్వాత నూతన ఉత్తేజాన్ని పొందింది. లోక్‌సభ ఎన్నికల్లో గరిష్ఠ సంఖ్యలో సీట్లు గెలవాలని కాంగ్రెస్‌ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి అవకాశాలు దిగజారుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img