Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

అదృష్టంపై ఆధారపడిన ఆర్థికమంత్రి

అంజని రాయ్‌

ప్రస్తుత బడ్జెట్‌ ప్రవేశపెడుతూ ఆర్థికమంత్రి తన ప్రసంగంలో చేసిన ప్రతిపాదనలు, కేటాయింపుల ప్రకటన మధ్య పొందిక కనిపించదు. మంత్రి ప్రకటించిన ప్రాజెక్టుల్లో ఈ సంవత్సరం కూడా వ్యయం చేయవలసిన మొత్తాలు అధికంగానే ఉన్నాయి. అయితే ప్రజలను ఆకర్షించేందుకు మాత్రమే ప్రాజెక్టులు, కేటాయింపులు ఉంటాయని నేడున్న ఆర్థిక పరిస్థితి చెబుతోంది. మంత్రి నూతన కస్టమ్స్‌ సుంకాలు లేదా ఇతర పన్నులను ప్రకటించారు. మంత్రి చేసిన ఈ ప్రకటన దశాబ్దాల నుంచి ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లోవలే ఏసీలపైన ఎక్సైజ్‌ సుంకం పెరగవచ్చు తగ్గవచ్చు. అలాగే సిగరెట్టుపై పన్ను పెంచారు. సిమెంట్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించారు. ప్రస్తుతం మంత్రి ప్రకటించినవి కూడా ఇలాగే ఉంటాయి. అనేక వస్తువులకు ప్రకటించిన ఎక్సైజ్‌ సుంకాల రేట్లు జీఎస్‌టీపైన ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

వాణిజ్యరంగంలో అదానీ గ్రూపు మార్కెట్‌ విలువ అర్థికంగా కుదేలైపోయిన నేపధ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అదృష్టంపై ఆధారపడినట్లుగా ఉంది. పురాణాల్లో కల్పవృక్షం అందరికీ అన్నీ ఇస్తుందని చెప్పినట్లుగా మోదీ ప్రభుత్వ బడ్జెట్‌ ఉంది. మధ్యతరగతి ప్రజలకు పన్నురాయితీలను, వ్యవసాయ రుణాల పరిమితిని పెంచడం, వ్యవసాయరంగ పెట్టుబడి పథకం, మౌలిక సదుపాయాల కల్పనకు భారీ కేటాయింపు అలాగే రైల్వేలకు అధిక కేటాయింపులు చేశారు. చివరగా పరిశ్రమలకు కస్టమ్స్‌ సుంకాలను తగ్గించారు. సీనియర్‌ పౌరులు ఎప్పటినుంచే పోరుతున్న పెట్టుబడి పెంపు పథకాన్ని మంత్రి ఈ సారి ఆమోదించారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని ఆర్థికమంత్రి వాగ్దానాలను గుప్పించారు. బాగుంది అని చెప్పుకోడానికి బడ్జెట్‌ను కష్టపడి రూపొందించారు. ఆర్థికలోటును తగ్గించడానికి మంత్రి చేసిన వాగ్దానాల సాధన అత్యంత కష్టం. ఈ వాగ్దానాలన్నీ అభివృద్ధి ఊహల్లో ఇమిడిఉన్నాయి. ఒక మాదిరిగా పెరుగుతున్న ఆర్థికవ్యవస్థ అధిక ఆదాయాన్ని తీసుకువస్తుందని ఆశిస్తున్నారు. జీఎస్‌టీ తదితర పరోక్ష పన్నుల నుండి వచ్చే ఆదాయం మరింత పెరుగుతుందన్న ఆశాభావాన్ని ప్రకటించారు. నెలకు లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా జీఎస్‌టీ ఆదాయం వస్తున్నదని ప్రకటించిన ఆర్థికమంత్రి ఆర్థికవ్యవస్థ దుస్థితిని పట్టించుకున్నట్లు లేరు. ఆదాయాలు పెరిగినట్లయితే ఆర్థికమంత్రి చేసిన వాగ్దానాలు నెరవేర్చే అవకాశాలు ఉండవచ్చు. ఇది కూడా కచ్చితంగా ద్రవ్యపటిష్టతకు కృషిచేస్తేనే సాధ్యం కావచ్చు.
ఇక అభివృద్ధి విషయానికి వద్దాం. ప్రస్తుత పరిస్థితి అందుకు అనుగుణంగా ఏమాత్రంలేదు. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి జారుకున్నది. ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ సర్వేలు, విశ్లేషణలు దండిగానే వస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత ఎగుమతులు పెరిగే అవకాశాలు కనిపించడంలేదు. అపారమైన దేశీయ మార్కెట్‌ భారత ఆర్థికవ్యవస్థకు రక్షణ కల్పించవలసిందే. ఇందుకుకూడా మధ్యతరగతి ప్రజలే ప్రధానంగా కారణమవుతారు. బహుశా మార్కెట్‌ పుంజుకునేందుకు ఆదాయపు పన్నులో రాయితీలను ఇచ్చారు. దీనివల్ల మధ్యతరగతి వినియోగదారుల చేతుల్లో తగినంత డబ్బు ఉంటుంది. నిజంగా ఇదే జరిగితే, ఆర్థికవృద్ధి కలిగి జీడీపీ వృద్ధికి దోహదం చేస్తున్నది. అయితే ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో తీసుకుంటున్నది. జీఎస్‌టీ ద్వారా వచ్చే ఆదాయమే ఇందుకు మంచి ఉదాహరణ. జీఎస్‌టీ ద్వారా లభించే ప్రతి రూపాయి సామాన్యప్రజల జేబుల నుంచి వసూలు చేస్తున్నదే. జీఎస్‌టీ వసూళ్లు విస్తరిస్తూనే ఉంటాయి. ఇక్కడ రేట్లను గురించి పట్టింపు ఉండదు. మధ్యతరగతి ప్రజలు చేతిలో డబ్బు ఉన్నప్పుడు సాయంకాలం కుటుంబంతో సహా వెళ్లి హోటళ్లలో ఖర్చు పెడతారు.
మొత్తం ఆదాయంలో ఆదాయం పన్ను వాటా తక్కువే ఉంటుంది. కార్పొరేట్‌ పన్ను, కస్టమ్స్‌ సుంకాలు కొన్నింట్లో తగ్గించారు. మొత్తం ఆదాయంలో తగ్గింపులు తక్కువగానే ఉన్నాయి. అయితే వీటినేగొప్పగా ప్రకటించారు. మధ్య తరగతి ప్రజలకు ఇచ్చిన మినహాయింపులు, రాయితీలు మొత్తం బడ్జెట్‌లో స్వల్పమే. ఇది 38వేల కోట్లరూపాయలు మాత్రమే. కోవిడ్‌ మహమ్మారి గణనీయంగా తగ్గిపోయిన తర్వాత మొదటిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది. అందువల్ల ఇది ఆశాభావానికి అవకాశం కల్పించింది. గత కొద్ది సంవత్సరాలుగా మనం రాబోయేకాలం మెరుగ్గా ఉంటుందని ఆశిస్తూ జీవిస్తున్నాం. ఇప్పుడు కూడా అధికవ్యయం చేసే అవకాశాలు ఉన్నాయని అంచనావేస్తూ బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. వృద్ధిని పెంపొందించేందుకు గాను మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను బాగా పెంచి కేటాయించారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మౌలిక సదుపాయాల కల్పనరంగంలో పెట్టుబడులను గురించి మాట్లాడుతూనే ఉన్నాం. రైల్వేలలో భారీ పెట్టుబడులు ఈ రంగం అభివృద్ధికి ఎంతవరకు దోహదం చేస్తాయో చూడాలి. సామాజిక మూలధనం పెంపుదలకు భారీగా పెట్టుబడులు పెట్టినట్లయితే రెండు విధాలుగా ప్రభావం ఉంటుంది.ఒకటి ఆర్థిక కార్యకలాపాలు పెరిగేందుకు సౌకర్యాలను కల్పిస్తుంది. రెండవది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఏర్పాటైతే ఉద్యోగాలకల్పన జరిగి ఆదాయాలు పెరుగుతాయి. అయితే బడ్జెట్‌లో ఇందుకోసం ఉన్న పరిమితులవల్ల ఈ అంచనాలు జరగవచ్చు.. జరగకపోవచ్చు.
వార్షిక బడ్జెట్‌కు సంబంధించి అంచనాలు అధికంగా ఉంటాయి. బడ్జెట్‌లో కేటాయింపులు, వ్యయ ప్రతి పాదనలలో మార్పులు ఉంటాయి. ఫలితంగా ఆశించిన లక్ష్యాలు నెరవేరవు.
ప్రస్తుత బడ్జెట్‌ ప్రవేశపెడుతూ ఆర్థికమంత్రి తన ప్రసంగంలో చేసిన ప్రతిపాదనలు, కేటాయింపుల ప్రకటన మధ్య పొందిక కనిపించదు. మంత్రి ప్రకటించిన ప్రాజెక్టుల్లో ఈ సంవత్సరం కూడా వ్యయం చేయవలసిన మొత్తాలు అధికంగానే ఉన్నాయి. అయితే ప్రజలను ఆకర్షించేందుకు మాత్రమే ప్రాజెక్టులు, కేటాయింపులు ఉంటాయని నేడున్న ఆర్థిక పరిస్థితి చెబుతోంది. మంత్రి నూతన కస్టమ్స్‌ సుంకాలు లేదా ఇతర పన్నులను ప్రకటించారు. మంత్రి చేసిన ఈ ప్రకటన దశాబ్దాల నుంచి ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లోవలే ఏసీలపైన ఎక్సైజ్‌ సుంకం పెరగవచ్చు తగ్గవచ్చు. అలాగే సిగరెట్టుపై పన్ను పెంచారు. సిమెంట్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించారు. ప్రస్తుతం మంత్రి ప్రకటించినవి కూడా ఇలాగే ఉంటాయి. అనేక వస్తువులకు ప్రకటించిన ఎక్సైజ్‌ సుంకాల రేట్లు జీఎస్‌టీపైన ప్రతికూల ప్రభావం చూపవచ్చు. భారీ ఆర్థికవ్యవస్థలలో బడ్జెట్‌లు ఈ విధంగానే ఉంటాయి. అమెరికాలోనూ ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు తప్పనిసరిగా ఉంటాయి. బడ్జెట్‌ ప్రతిపాదనలో రహస్యానికి చాలా తక్కువ చోటు ఉంటోంది. ప్రతిపాదనలపై ముందుగానే చర్చ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా ఆర్థికవ్యవస్థ నిర్వహణపైనే ఆధారపడి ఉంటుంది. బడ్జెట్‌లో ప్రభుత్వపాత్ర ఒక డాక్టరు వలే రోగులకు సహాయకారిగా ఉండాలి. రోగులకు హానిజరగకుండా చూసుకోవాలి. అయితే ఈ ప్రభుత్వం సామాన్యప్రజలకు ప్రయోజనం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడంలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img