Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

అఫ్గాన్‌ కల్లోలం అమెరికా పాపమే

తాలిబన్లు అఫ్గాన్‌ను వశపరచుకోవటం మొదలైన నాటి నుండి పెట్టుబడిదారునికి పుట్టిన విష పత్రికలు, మీడియా తాలిబన్లకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. తన తప్పులు, పాపాలు కప్పిపుచ్చుకోవటానికి అమెరికా తన ఆధీనంలోని మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇదంతా నిజమని నమ్మే అవకాశం ఉంది. చాలా అవమానకరంగా తోక ముడిచి చావు తప్పి కన్ను లొట్టపోయి పారిపోయిన అమెరికా పన్నాగమే ఈ విష ప్రచారం.

సమీర్‌

అఫ్గానిస్థాన్‌ ఇప్పుడు ఓ శిథిల రాజ్యం. అక్కడి కల్లోలానికి కారణం అమెరికానే. మొత్తం మానవ జాతి విషాదానికి మూలం పెట్టుబడి, దాని అత్యున్నత రూపమైన సామ్రాజ్య వాదం. ఈ సామ్రాజ్య వాదానికి చిహ్నంగా నిలిచిన అమెరికా ఆర్థికంగా ఆధిపత్యం కలిగిన ఒక బలమైన దేశం. తమ దేశంలోని సంపన్నుల సంపదను పెంచటం కోసం వెనుకబడిన దేశాల భూమి, సహజ సంపదలు, ముడి పదార్థాలు, శ్రామిక శక్తి, ఇతర ఉత్పాదక వనరుల మార్కెట్లను బలవంతంగా తమ ఆధీనంలోనికి తీసుకొని దోచు కోవటం, భౌతికంగా ఆక్రమించుకోవటమే సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాద దేశాల దోపిడీ వలన ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. దోపిడీకి తాజా ఉదాహరణే అఫ్గానిస్థాన్‌ పరిణామాలు.
దక్షిణ మధ్య ఆసియా ఖండంలో చుట్టూ ఎత్తయిన పర్వత శ్రేణుల మధ్య దక్షిణం తూర్పున పాకిస్థాన్‌, పశ్చిమాన ఇరాన్‌, ఉత్తరం తుర్కమెనిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, తజికిస్తాన్‌ సుదూర ఈశాన్యంలో చైనా విశాల సరిహద్దులు గల దేశం అఫ్గానిస్థాన్‌. ఈ సరిహద్దు దేశాలతో జాతి, భాష, భౌగోళిక సంబం ధాలు ఉన్నాయి. భారత్‌, ఇరాన్‌, మధ్య ఆసియా చైనాను కలిపే మార్గాలన్నీ ఈ దేశం గుండానే వెళతాయి. విలువైన ఖనిజ నిక్షేపాలు, చమురు నిల్వలు, విలువైన రత్నాల గనులు ఉన్నాయి. వీటి కోసం బడా దేశాలు వెంపర్లాడు తున్నాయి. 1970 దశకం నుండి అఫ్గాన్‌ తీవ్రమైన అంతర్యుద్ధాలు, తీవ్రవాద కార్యకలాపాలు విదేశీ దాడులతో దారుణంగా నష్టపోయింది. 1919లో స్వాతంత్య్రం పొంది 1979లో సోవియట్‌ యూనియన్‌ సహకారంతో కమ్యూనిస్ట్‌ అనుకూల ప్రభుత్వం ఏర్పడిరది. చివరికి సోవియట్‌ యూనియన్‌ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలో సోవియట్‌ ప్రాబల్యం అఫ్గాన్‌లో పెరగటం గిట్టని అమెరికా రంగంలోకి దిగింది. 1981 నుండి అమెరికా పాకిస్థాన్‌ ద్వారా (ఐఎస్‌ఐ) అఫ్గాన్‌లోని ముజాహిద్దీన్‌లకు వేల కోట్ల డాలర్ల డబ్బు, ఆయుధాలు కుమ్మరించింది. 1980లో ఒసామా బిన్‌ లాడెన్‌ కూడా ఈ గెరిల్లా సైన్యంలో చేరాడు. అతను 28 ముస్లిం దేశాల నుండి సోవియట్‌ వ్యతిరేక యుద్ధంలో పాల్గొనటానికి యువతను చేరదీశాడు. 1986 నాటికి ఈ తిరుగుబాటు గ్రూపులు సోవియట్‌ రెడ్‌ ఆర్మీని ఎదిరించే దశకు చేరుకున్నాయి. అప్పటి రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్‌ 1989లో అఫ్గాన్‌ నుండి సోవియట్‌ దళాలను పూర్తిగా ఉపసంహరించాడు. దీనితో సాయుధ తిరుగుబాటు నేతలు యుద్ధాన్ని నేరుగా ప్రభుత్వం పైకి మళ్లించారు. 1992 దాకా రష్యా మద్దతుతో నజీబుల్లా వీరిని బాగానే ఎదుర్కొన్నాడు. 1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం అవటంతో నజీబుల్లా బాగా బలహీనపడి అధికారం తిరుగుబాటు నేతలకు అప్పగించాడు. ఈ గ్రూపుల మధ్య అంతర్గత కలహాలు మొదలై అంతర్యుద్ధానికి దారి తీసింది. అప్పటికే అఫ్గాన్‌ సర్వ నాశనం అయిపోయింది. దాదాపు 20 లక్షలు మంది ఆ దేశవాసులు మరణించారు. 50లక్షలకు పైగా ప్రజలు పొరుగుదేశాలకు శరణార్థులుగా పోయారు. చిన్నారులు, మహిళలు ఎంతోమంది గాయపడ్డారు, మరణించారు. ఈ టెర్రరిస్టు ముఠాలను తయారుచేసి, పెంచి పోషించింది అమెరికాయే.
తర్వాత తాలిబన్ల శకం మొదలైంది. పాకిస్థాన్‌ మదర్సాలలో శరణార్థు లుగా ఉన్న అఫ్గాన్‌ యువతకు అమెరికా సైనిక శిక్షణ ఇప్పించి, వారికి ఆయు ధాలు ఇచ్చింది. ఇలా శిక్షణ పొందిన వారే తాలిబన్లు. తాలిబన్‌ అంటే విద్యా ర్థులు అని అర్థం. వీరి ద్వారా అఫ్గాన్‌లో తమ కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ దేశ సంపదను దోచుకోవాలనేదే అమెరికా పన్నాగం. తాలిబన్లలో అత్యధికులు సీఐఎ మద్దతుతో సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాడిన వారే. 1996లో మూడు బలమైన దేశాలు, లాడెన్‌ ప్రత్యక్ష సహ కారంతో తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్నారు. మాజీ దేశాధ్యక్షుడు నజీబుల్లాను పట్టుకొని బహిరంగంగా ఉరి తీసి చంపారు. ఇస్లామిక్‌ చట్టాలు అమలు చేశారు. స్త్రీలకు చదువు, ఉద్యోగాలు నిషేధించారు. వీరి కాలంలో (1996`2001) మానవ హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు, ప్రజల జీవన విధానం బాగా దెబ్బతిన్నాయి. మత ఛాందస పాలన కొనసాగింది. వీరి నియ మాలు ఉల్లంఘించిన వారికి దారుణమైన శిక్షలు విధించారు. ఒసామా బిన్‌ లాడెన్‌, అప్పటి తాలిబన్‌ నేత ముల్లా ఉమర్‌లు అఫ్గాన్‌ను మత ఛాందస రాజ్యంగా మార్చేశారు. అల్‌ఖైదా ఇక్కడే తన బలం పెంచుకోవటానికి తగిన వాతావరణం ఏర్పడిరది. ఇంత జరుగుతున్నా అమెరికా తాలిబన్‌లు, ఆల్‌ ఖైదాలతో మంచి సంబంధం కొన సాగించింది. మరింత పెంచి పోషించింది. తద్వారా అక్కడి చమురు సంపదను, సహజ వనరులను కొల్లగొట్టే పనిలో పడిరది. తన కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. గత 20 ఏళ్ల్లుగా అమెరికా, నాటో సేనలు అక్కడ తిష్ట వేశాయి. ఈ 20 ఏళ్లలో అమెరికా అఫ్గాన్‌ మధ్య 5 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఇందులో సింహభాగం యుద్ధ సామాగ్రే. ఆధునిక మిలటరీ వాహనాలు, తుపాకులు, మందుగుండు సామగ్రి అఫ్గాన్‌కి అమ్మి లాభాలు గడిరచింది. అమెరికా సైనికులు ప్రజలపై దాడులు చేశారు. వారి ఆస్తుల్ని దోచుకున్నారు. మహిళలను చెరపట్టారు. మానభంగాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ వ్యవస్థలలో అవినీతి పెరిగిపోయింది. ఈ చర్యలతో అమెరికా, నాటో దళాలు అక్కడి ప్రజల మద్దతు కోల్పోయాయి. వ్యతిరేకత బాగా పెరిగింది. ఈ అంశాలు తాలిబన్‌లకు అనుకూలంగా మారి గ్రామీణ ప్రాంతాలలో వీరి పట్టు బిగించుకుంటూ వచ్చారు. ప్రపంచమంతా తమ ఆధీనంలో ఉండాలనే అమెరికా ఆధిపత్య వైఖరి, దోపిడీ విధానాలు నచ్చని తాలిబన్లు, అల్‌ఖైదాతో జత కలసి అమెరికాను ధిక్కరిస్తూ దాడులు మొదలుపెట్టారు. 2001 సెప్టెంబరు 11న అమెరికాలోని జంట భవనాలపై దాడులు చేయటంతో టెర్రరిజంపై యుద్ధం పేరిట ముడి చమురు, సహజ వనరులు కలిగిన ముస్లిం దేశాలపై యుద్ధం ప్రకటించింది. అమెరికా ఆయా దేశాలలో తమ కీలుబొమ్మ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి, ఆ దేశాలలోని సహజ సంపదను దోచుకుంది. విధ్వంసం సృష్టించింది.
అమెరికా సామ్రాజ్యవాదానికి యుద్ధం ఒక జీవన శైలిగా, ఒక పరి శ్రమగా మారిపోయింది. తమ దేశ బహుళ జాతి కంపెనీల లాభాల కోసం యుద్ధాలు చేయటం, దేశాల మధ్య తగాదాలు పెట్టటం, ఆయుధాలు అమ్ము కోవటం పనిగా పెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో సైనిక స్థావ రాలు ఏర్పాటు చేసింది. అమెరికా సైనిక వ్యయం ప్రపంచ సైనిక వ్యయంలో 50శాతం వరకు ఉంటుంది. ప్రపంచ జనాభాలో 6.4 శాతం జనాభా కలిగిన అమెరికా ప్రపంచ సహజ వనరులలో 40 శాతం వాడుకుంటుంది. మరో 40 శాతం మధ్యస్త దేశాలు వాడుకుంటున్నాయి. కేవలం 20 శాతం సంపద మాత్రమే 80శాతం జనాభా కలిగిన వెనుకబడిన దేశాలు వాడుకుంటు న్నాయి. కాబట్టే ఈ దేశాలు నిత్యం దారిద్య్రంతో కునారిల్లుతున్నాయి. ఇది అమెరికా తాలూకూ పచ్చి నిజం. ఇప్పుడు చెప్పండి ప్రపంచంలో ఉగ్రవాద దేశం ఏదో…? అసలు దోషి ఎవరో..?
తాలిబన్లు అఫ్గాన్‌ను వశపరచుకోవటం మొదలైన నాటి నుండి పెట్టుబడి దారునికి పుట్టిన విష పత్రికలు, మీడియా తాలిబన్లకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. తన తప్పులు, పాపాలు కప్పిపుచ్చుకోవటానికి అమె రికా తన ఆధీనంలోని మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇదంతా నిజమని నమ్మే అవకాశం ఉంది. చాలా అవమానకరంగా తోక ముడిచి చావు తప్పి కన్ను లొట్టపోయి పారిపోయిన అమెరికా పన్నాగమే ఈ విష ప్రచారం.
వ్యాస రచయిత ఉపాధ్యాయుడు, 9705450705

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img