Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆరోగ్యంపైనా మోదీ ప్రభుత్వ బుకాయింపు

జ్ఞాన్‌ పాఠక్‌

ఆరోగ్య భద్రత విషయంలో తాము ఉత్తమమైన సేవలు అందించా మని మోదీ ప్రభుత్వం చెబుతున్నది. ఇదంతా కేవలం బూటకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరవ వార్షిక నివేదిక తెలిపింది. దక్షిణాసియా ప్రాంతంలో సార్వత్రిక ఆరోగ్య సేవలు, ఆరోగ్యానికి సంబంధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై ఈ సంస్థ ఇచ్చిన నివేదిక మోదీ ప్రభుత్వ బూటకాన్ని బట్టబయలు చేసింది. మోదీ చెప్తున్న దానికి వాస్తవం పూర్తి విరుద్ధంగా ఉంది. దక్షిణాసియాలో భారతదేశం మహిళల ఆయుః ప్రమాణం చాలా అధ్వాన్నంగా ఉన్నదనీ, పురుషుల విషయం కొంచెం మేలుగా ఉందని నివేదిక తెలిపింది. ఈ నివేదికలో ఆయా దేశాలు సాధిం చిన పురోగతిని వివరించారు. అన్ని దేశాల కంటే భారత్‌ వెనుకబడి ఉంది. 60.4 ఏళ్ల తర్వాత ఆరోగ్య జీవనమే లేదని మొత్తం పదకొండు దేశాల కంటే భారత్‌ వెనుకబడి ఉందని నివేదిక పేర్కొన్నది. థాయిలాండ్‌, ఇండోనేషియా, భారత్‌, మయన్మార్‌, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మాల్దీవులు, టిమోర్‌లెస్టి, ఉత్తర కొరియా దక్షిణాసియాలో ఉన్నాయి. భారతదేశంలో ఆయుః ప్రమాణం 60.3 ఏళ్లకు తక్కువగానే ఉంది. ఇతర దేశాల్లో మహిళలకు 61.9 ఏళ్లు, పురుషులకు 60.1 సంవత్సరాలుగా ఉన్నది. అలాగే ఐదేళ్లు లోపు పిల్లలలో అధిక మరణాలు మన దేశంలో ఉంటున్నాయి. మన దేశంలోనే ఆయుః ప్రమాణం ఎక్కువని అలాగే ఆరోగ్య జీవనం మెరుగ్గా ఉందని కొంతమంది చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య భద్రతా సూచి ప్రకారం ఆరు కేటగిరీలలో ఆరోగ్య భద్రత విషయంలో మన కంటే ఇతర దేశాలు మేలుగా ఉన్నాయి. రోగ నివారణ, రోగ నిర్థారణ, తగిన చికిత్స, నియమ నిబంధనలు, రిస్క్‌ విషయంలో భారతదేశం కంటే ఇతర కొన్ని దేశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఆరోగ్య సూచిలో థాయిలాండ్‌ 73.2 శాతం, ఇండోనేషియా 56.6 శాతం, భారతదేశం 46.5 శాతం సాధిం చాయి. వీటి మధ్య వ్యత్యాసాన్ని చూసినపుడు భారతదేశ స్థానం ఏమిటో స్పష్టమవుతుంది. ఈ ప్రాంతంలో శిశు మరణాలు, ప్రసూతి మరణాల విషయంలో అసమానతలను తొలగించటానికి గణనీయమైన కృషి జరిగిన ఫలితాలు మెరుగ్గా లేవు. ఆరోగ్య సేవలు అన్ని అవకాశాలు అందు బాటులో ఉన్నవారి కంటే అట్టడుగు వర్గాల ప్రజలకు అతి తక్కువగా అందుతున్నాయి. పేద వర్గాలలో కంటే సంపన్న వర్గాలలో ఆసుపత్రులలో ప్రసవాలు 39 శాతం అధికంగా ఉంటున్నాయి. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఈ సౌకర్యాలు ఎక్కువగా అందుబాటులో లేవు.తల్లుల విద్యలోను ప్రాంతానికి ప్రాంతానికి మధ్య ఎంతో తేడా ఉంది. 1549 ఏళ్ల పునరుత్పత్తి వయసులో ఉన్న మహిళలు జీవిత భాగ స్వామి హింసను ఎక్కువగా ఎదుర్కొంటున్నట్టు 2018 నివేదిక అంచనా వేసింది. స్త్రీ పురుషుల మధ్య అసమానతలోనే హింస మూలాలు ఉన్నాయి. ప్రపంచ సగటు హింస కేసులు 27 శాతం ఉండగా భారత దేశంలో 35 శాతం ఉన్నాయి. గత పన్నెండు మాసాల్లో చూసినప్పటికీ ప్రపంచ సగటు 13 శాతం కాగా, మన దేశంలో 18 శాతం నమోదై అధ్వాన్నంగా ఉన్నది. బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ కొంచెం మెరుగ్గా ఉంది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలకు ఆసుపత్రులలో ప్రసూతి సౌకర్యాలు చాలా తక్కువ. అలాగే పట్టణ ప్రాంతాలలో ఉన్న పేద వర్గాలకు సైతం ప్రసూతి సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. భారతదేశంలో గ్రామీణ ప్రాంత ప్రజలకే కాక పట్టణ ప్రాంతాల పేదలకు కూడా ఆరోగ్య సౌకర్యాలు అందుబాటు అతి తక్కువగా ఉంది. ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాల కంటే ప్రైవేటు ఆరోగ్య సౌకర్యాలు బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌, మయన్మార్‌లలో మేలుగా ఉన్నాయి. అత్యవసర మందుల అందు బాటు కూడా మేలుగా ఉంది. ఆరోగ్య సేవలకు చేసే ఖర్చు విషయంలో ఈ ప్రాంతంలోని అన్ని దేశాల కంటే మాల్దీవులు ఉత్తమమైన స్థానంలో ఉన్నాయి. మాల్దీవులలో ప్రభుత్వ వ్యయం జీడీపీలో 9.4 శాతం కాగా నేపాల్‌ 5.4, మయన్మార్‌లో 4.8, టిమోర్‌`లెస్టిలో 4.3 శాతం శ్రీలంక, థాయిలాండ్‌లలో 3.8 శాతం వ్యయం చేస్తున్నారు. అన్ని చోట్ల కంటే భారత్‌లో అతి తక్కువగా 3.5 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. భారత్‌ కంటే భూటాన్‌, ఇండోనేషియా, బంగ్లాదేశ్‌లలో తక్కువ ఖర్చు చేస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ ఆరోగ్య సేవలకే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం భారతదేశం జీడీపీలో 62.7 శాతం ఖర్చు చేస్తున్నది. తక్కిన దేశాలు తక్కువగానే ఖర్చు చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img