Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆశ్రిత పెట్టుబడిదారులకు ప్రభుత్వ అండ

అరుణ్‌ శ్రీ వాత్సవ

మోదీతో అదానీకి అన్యోన్యమైన స్నేహమే ఉన్నదని అందరికీ తెలిసిందే. వ్యాపారవేత్తలకు సహాయపడడంలో మోదీ ప్రభుత్వం చట్టాలను, నియమనిబంధనలను ఖాతరు చేయలేదని కూడా తెలియనిది ఏమీకాదు. మోదీ ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ రాహుల్‌గాంధీ అదానీ, అంబానీలకు ఏయే విషయాల్లో సహాయం చేశారని ప్రశ్నించారు. అత్యధిక సంపదను పొందడానికి రాజకీయ అండలేనిదే సాధ్యం కాదని ధీరూబాయ్‌ అంబానీ కూడా భావించి ఆ విధంగానే నడుచుకున్నారు. మోదీ అధికారానికి వచ్చిన తర్వాత ‘‘నేను తినను..తినడానికి ఎవరినీ అనుమతించను’’ అని వాగ్దానం చేశాడు. పదవీవిరమణ చేసిన బ్యాంకర్లు జరిగిపోయిన దానిని తిరిగి గుర్తుకు తెచ్చుకోడానికి కూడా ప్రయత్నించడంలేదు. మోదీ అధికారంలో ఉన్నంతకాలం తమకేమీ కాదన్న ధీమాతోనే ఉన్నారు.

ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ కేంద్రప్రభుత్వ అండదండలతో వేగంగా విస్తరిస్తోంది. చరిత్రలో మొదటిసారిగా ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయాలను, హిందూత్వను ప్రచారంచేస్తూ పూర్తిగా ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయాలను, హిందుత్వను ప్రచారంచేస్తూ పూర్తిగా పెట్టుబడిదారీ వ్యవస్థకు పూర్తి అనుకూలంగా మారిపోయింది. దాని రాజకీయ అంగం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తోంది. అమెరికా అధ్యయన సంస్థ హిండెన్‌బర్గ్‌ కార్పొరేట్‌ దిగ్గజం గౌతం అదాని కుంభకోణాన్ని బైటపెట్టింది. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు అండగా నిలిచింది. బీజేపీ అధికారం కోల్పేతే ఆర్‌ఎస్‌ఎస్‌ మిగలదని మోహన్‌ భగవత్‌ అనుచర ముఠాకు స్పష్టంగా తెలుసు. అంతేకాదు, మోదీ పాలనాకాలంలో విచ్చిన్నకర రాజకీయాలు, విద్వేషం, దుష్ప్రభావాలు ఏమిటో ప్రజలందరికీ తెలుసు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేకుండా దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర ఫలించే అవకాశం లేదు. ఎవరోకాదు, మోహన్‌ భగవత్‌కు కూడా ఈ విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ సన్నిహిత స్నేహితుడుని కాపాడేందుకు భగవత్‌ వివిధ వ్యూహాలు కొనసాగించారు. అదానీ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన హిండెన్‌బర్గ్‌ కృషిని సైతం మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నిస్తారు. పైగా అదానీపై వచ్చిన ఆరోపణలన్నీ వామపక్ష పథకమేనంటూ ఆయన ఆరోపణలు చేశారు. భగవత్‌ ఆదేశం ప్రకారం సంఫ్‌ుపరివార్‌ అదానీకి అండగా నిలిచింది.
ఈ కుంభకోణం కేసు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మోదీపై అదరణ తగ్గిపోవడమేకాక, ప్రజలలో వ్యతిరేకత పెరగవచ్చు. దాదాపు ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ మళ్లీగెలవకపోతే సంఘపరివార్‌కి తీవ్రమైన దెబ్బతగులుతుంది. రాజకీయ చిత్రం నుండి అది అదృశ్యం కావచ్చు. మోదీ దేశానికి చేసిన మంచి పని ఏమంటే ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు రూపం బైటపడేందుకు దోహదం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద చర్యలు జనం తెలుసుకుంటున్నారు. దేశాన్ని ధ్వంసం చేసేందుకే అది కంకణం కట్టుకుంది. ఈ గుజరాత్‌ వ్యాపారికి నియమ నిబంధనలు, చట్టాలను సైతం ఖాతరు చేయకుండా మోదీ ప్రభుత్వం సహాయంచేసింది. అదానీ కుంభకోణానికి సంబంధించిన అన్ని వాస్తవాలు దేశప్రజలందరికీ వివరంగా తెలిపినట్లయితే అది తీవ్ర ప్రమాదకరమని బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు తెలుసు. అందుకనే రకరకాల ఎత్తుగడలు పన్నుతున్నాయి. అదానీ వ్యాపారసామ్రాజ్యం అనేక మోసాలకు పాల్పడటానికి మోదీ ఆయన వెనుకనిలిచి సహాయపడ్డారనేది ప్రజలందరికీ పూర్తిగా తెలిస్తే ఎన్నికల్లో ఓటమితప్పదని ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా భావిస్తున్నది. అందువల్ల ఈ ఆరోపణలను దాటవేసి ప్రజలను చీకట్లో ఉంచేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చాలా ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. పైగా వామపక్ష శక్తులు ఈ విషయంలో తమ మీద దాడిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయనేది కూడా ప్రచారం సాగిస్తోంది. చివరగా తానుఒక మితవాద శక్తినని ఆర్‌ఎస్‌ఎస్‌ నిరూపించుకుంది. సంప్రదాయాలు సాంస్కృతిక విలువలలో మతోన్మాదనమనేది లేదు. దేశం అధికంగా సెక్యులర్‌లక్షణాన్నే కలిగిఉంది.
కాంగ్రెస్‌, వామపక్షం తమ వ్యూహంలో భాగంగా మోదీకి వ్యతిరేకంగా ప్రచారం సాగించేందుకు అదానీ`హిండెన్‌బర్గ్‌ నివేదికను కూడా ఆసరా చేసుకున్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపణ చేస్తోంది. మోదీని రక్షించేందుకు గాను తాము జాతీయవాదులుగా ముద్ర వేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అదానీని సమర్థించే విషయంలో మితవాద శక్తులన్నీ ఒకే భావన కలిగినవి. వీరిలో ఒక గణనీయమైన విభాగం అదానీపై వచ్చిన ఆరోపణలు రుజువుకావని ఆయన నిరూపించవలసిన అవసరం ఉందని భావిస్తున్నారు. దేశప్రయోజనాల దిశగా ఆర్థిక కార్యకలాపాలు ఉండాలనేది ఈ విభాగం గట్టిగా కోరుకుంటున్నది. భారతదేశ ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉండటంకంటే అదానీ దుస్సాహసమోసాలను సంఫ్‌ుపరివార్‌ వ్యతిరేకించకపోవడం మరింత విభ్రాంతిని గొలుపుతున్నది. గతంలో దేవకాంత్‌ బారువా ఇందిరాయే భారతదేశం, ఇండియానే ఇందిర అని తన వినయ విధేయతలను వెలిబుచ్చుకున్నాడు. అదానీ విషయంలోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవహారం ఇలాగే ఉంది. అదానీ గ్రూపు స్టాక్‌ మార్కెట్‌లో అనేక అక్రమాలకు పాల్పడిరదని, ఎకౌంట్‌లు సూచించడంలో మోసాలు చేసిందని హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువరించింది. తననుతాను సమర్థించు కునేందుకు 413కేజీల సమాధానాన్ని వెలువరించి అసలు వాస్తవాలకు సంబంధించిన 88 ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా అదానీ గ్రూపు తప్పించుకుంది. కార్పొరేట్‌ గ్రూపు తమ వ్యాపారాభివృద్ధి, విస్తరణకు ప్రభుత్వ అండదండలు లేకుండా సాధ్యం కాదన్నది బహిరంగ రహస్యం.
మోదీతో అదానీకి అన్యోన్యమైన స్నేహమే ఉన్నదని అందరికీ తెలిసిందే. వ్యాపారవేత్తలకు సహాయపడడంలో మోదీ ప్రభుత్వం చట్టాలను, నియమనిబంధనలను ఖాతరు చేయలేదని కూడా తెలియనిది ఏమీకాదు. మోదీ ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ రాహుల్‌గాంధీ అదానీ, అంబానీలకు ఏయే విషయాల్లో సహాయం చేశారని ప్రశ్నించారు. అత్యధిక సంపదను పొందడానికి రాజకీయ అండలేనిదే సాధ్యం కాదని ధీరూబాయ్‌ అంబానీ కూడా భావించి ఆ విధంగానే నడుచుకున్నారు. మోదీ అధికారానికి వచ్చిన తర్వాత ‘‘నేను తినను..తినడానికి ఎవరినీ అనుమతించను’’ అని వాగ్దానం చేశాడు. పదవీవిరమణ చేసిన బ్యాంకర్లు జరిగిపోయిన దానిని తిరిగి గుర్తుకు తెచ్చుకోడానికి కూడా ప్రయత్నించడంలేదు. మోదీ అధికారంలో ఉన్నంతకాలం తమకేమీ కాదన్న ధీమాతోనే ఉన్నారు. అదానీపై వచ్చిన కుంభకోణంపై వచ్చిన ఆరోపణలు మోదీకి తీవ్రమైన మచ్చగా నిలిచిపోతుంది. బొగ్గు సరఫరా కేసు విషయంలో 2010లో అదానీకి చెందిన కంపెనీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. దిగుమతి చేసుకున్న బొగ్గును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యుత్‌ సంస్థకు సరఫరా చేసేందుకు కాంట్రాక్టును ఇవ్వడంలో జాతీయ సహకార వినిమయ ఫెడరేషన్‌ అవకతవకలకు పాల్పడిరదని ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. టెండర్‌ను దక్కించుకోవడంలో అదానీ సంస్థ అర్హత పొందకపోయినా ఆయనపై అసాధారణ ప్రేమ చూపి అడ్డగోలుగా ఆయన కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. ఇలా అనేక సందర్భాలలో అదానీ అక్రమాలకు, అవకతవకలకు పాల్పడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img