Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇంధన ధరలపై ఎన్నికల మాయాజాలం

కె. రవీంద్రన్‌

పెట్రోలియం ఉత్పత్తుల ధరల మార్పు ముఖ్యంగా మూడు రకాలుగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల అనంతరం. పెరుగుతున్న ధరాభారంపై ప్రజలెంత గగ్గోలు పెడుతున్నా ఈ ధోరణి ఇలా వికారంగా కొనసాగుతూనే ఉంటోంది. ఇంధన ధరల తీరు తెన్నులకు ప్రభుత్వానికి, ఉత్పాదక, మార్కెటింగ్‌ కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని, అందులో మా పాత్ర ఏమీ లేదని, ఇదంతా మార్కెట్‌ శక్తుల వల్లే జరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నదంతా శుద్ధ అబద్ధం.

దేశంలో ఇంధన ధరలు తరచుగా మారుతున్నాయి. ఇది అందరికీ తెలిసిందే. మరి ఈ మార్పు ఎన్నికల మాయాజాలంతో ముడివడి ఉందని ఎంత మందికి తెలుసు? అవును… పెట్రోలియం ఉత్పత్తుల ధరల హెచ్చుతగ్గులకు దేశంలో ఎన్నికలకు కనిపించని సంబంధం ఉంది. పువ్వుల్లో దాగి ఉన్న దారంలా ఇది వినియోగదారులను వికృతంగా వెక్కిరిస్తోంది. ప్రజానీకం జీవితంతో దోబూచులాడుతోంది.
పెట్రోలియం ఉత్పత్తుల ధరల మార్పు ముఖ్యంగా మూడు రకాలుగా కని పిస్తోంది. ఒకటి ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల అనంతరం. పెరుగుతున్న ధరాభారంపై ప్రజలెంత గగ్గోలు పెడుతున్నా ఈ ధోరణి ఇలా వికారంగా కొనసాగుతూనే ఉంటోంది. ఇంధన ధరల తీరు తెన్నులకు ప్రభుత్వానికి, ఉత్పాదక, మార్కెటింగ్‌ కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని, అందులో మా పాత్ర ఏమీ లేదని, ఇదంతా మార్కెట్‌ శక్తుల వల్లే జరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నదంతా శుద్ధ అబద్ధం.
ప్రస్తుత పరిస్థితులనే తీసుకుంటే 14 రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్‌తో సహా కొన్ని ప్రాధాన్యాతా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (వచ్చే ఏడాది) జరగనున్న కీలక తరుణం ఇది. ఇంకోవైపున అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు నిరంతరాయంగా పెరుగుతున్నాయి. అంటే ఇంధన ధరలకు సంబంధించినంత వరకూ ఎన్నికల ముందు ఆట (దశ) నడుస్తోంది. ఇకపై రెండో దశ రానుంది. ఈ రెండో దశలో కచ్చితంగా ప్రభుత్వం మాయోపాయం చేస్తుంది. ధరల్లో స్నేహ పూర్వక (ప్రజా హిత) సర్దుబాటు అంటూ నిజానిజాలు ప్రజలు గ్రహించకుండా వారిని వెర్రివాళ్ళను చేస్తుంది. ప్రజల ఆమోదయ్యోగంగా ఇవి ఉంటాయంటూ తిమ్మిని బమ్మి చేసే ట్రిక్కులతో భ్రమలు కల్పిస్తుంది. ప్రభుత్వం నుండి రిటెయిలింగ్‌ కంపెనీలకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలూ ఉండవు కానీ అది ఆదేశాలు ఇచ్చినట్టుగా… ప్రభుత్వం ఆశిస్తున్న మేరకు కంపెనీలు ఆ పని చేస్తాయి. ముడి చమురు ధరల్లో ఎలాంటి మార్పూ లేకపోయినా ఇక్కడ ధరలను పెంచకుండా ఆగుతాయి. మన గత అనుభవాలను గుర్తు చేసుకుంటే స్ఫురణకు వచ్చేది ఇదే. కంపెనీలు వినియోగదారుల కోసం ధరలు పెంచకుండా నిలువరించాయని మనం అనుకుంటే అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు. దాని తదనంతర పరిణామాలు ఎంత కఠినంగా ఉంటాయో మనకు అతి త్వరలోనే తెలిసివస్తాయి. ఇది కేవలం దాగుడుమూతలాట. చమురు కంపెనీలు, ప్రభుత్వం మధ్య నడిచే దోబూచులాట. ఆట ముగిసిందా ఇక అంతా మామూలే. ధరలు పెంచడం లేదన్న మిషతో కంపెనీలు మునుపు వదులుకున్నదాని కంటే కొన్నింతలు ఎక్కువ వసూలు చేసుకునేందుకు సిద్ధమైపోతాయి. ఇక్కడ మనకు అర్థం కావలసిన విషయం… ఈ ప్రక్రియలో అత్యధిక ప్రయోజనం పొందేది ఎవరంటే ప్రభుత్వం. ప్రజలను అనుకూలంగా మార్చుకునేందుకు, వాటిని ఓట్లుగా మలుచుకునేందుకు ప్రభుత్వం ఈ నాటకం అంతా అడుతుంది.
నిరంతరాయంగా నిత్యం పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాన్ని కలిగిస్తోంది. కొంతమంది అధికర పక్ష సభ్యుల్లోనూ అత్యధిక అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ఈ పరిణామాలు అత్యంత దారుణం. ప్రభుత్వం, పాలక పార్టీలకు గుణపాఠం చెప్పాలని రగిలిపోతున్న ప్రజల ముందుకు ఎలా వెళ్ళాలని వారు కల్లోలితమవుతున్నారు. కానీ చమురు కంపెనీల్లో మాత్రం ఏ కదలికా లేదు. చాలా కూల్‌గా ఎప్పటిమాదిరిగానే ఉన్నాయి. ఎందుకంటే అవి ఎప్పుడూ రెండు వైపుల నుండి అవి లాభపడుతూనే ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు ఏ మాత్రం ఆశాజనకంగా లేవన్న వార్తలు ఇంతకు ముందు మాదిరిగానే ఇప్పుడూ వినిపిస్తున్నాయి. రానున్న ఒపెక్‌ సమావేశాల్లోనూ చెప్పుకోదగిన విధానపరమైన మార్పులు వచ్చే సంకేతాలు ఏమీ లేనందున ఈ ధరలు ఎగబాకే అవకాశాలే అవకాశాలే కనిపిస్తున్నాయి. చైనా నుండి వచ్చే కొన్ని ఊహించని పరిణామాలను మార్కెట్‌ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వ నిల్వల నుండి చమురు ఉత్పత్తులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకోవడం లేదా యూరప్‌లో కొవిడ్‌ పరిస్థితులు మరింతగా కలవరపెడుతుండడం లాంటి వాటిని అంచనా వేయడం లేదు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమించి ఒపెక్‌ సమావేశాల విధానాల మేరకు ధరలు పెరుగుతూనే ఉంటాయని వాణిజ్యవేత్తలు భావిస్తున్నారు. ఒపెక్‌ తన ఇంధన సరఫరా విధానంలో ఎలాంటి మార్పూ చేయదని, ఈ వారంలో ఇది సమావేశమయ్యేనాటికి చమురు ధరలు ఆశించిన విధంగానే ఉంటాయని మార్కెట్‌ వర్గాలు ఊహిస్తున్నాయి. సరఫరా తగ్గితే ధరలు పెరుగుతాయని భావిస్తోంది. ఇవన్నీ ప్రజలకు నిరాశాజనకమైన వార్తలే. కానీ మార్కెట్టు, ప్రభుత్వం, చమురు కంపెనీలు ఇవేవీ కూడా ప్రజలకు మేలు చేసేవి కావు. జనం గురించి ఆలోచించేవి కావు. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఎన్నికలు జరిగే కొద్ది కాలంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రభుత్వం, కంపెనీలు కట్టకలిసి తమదైన క్రూరమైన క్రీడ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. వినియోగదారుల జేబులు ఖాళీ చేసేందుకు, ప్రజల బాధలు రెట్టింపు చేసేందుకు ఉద్యుక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మేల్కొనకపోతే రానున్న రోజులు మరింత భారం కానున్నాయనే విషయాన్ని దేశ ప్రజలంతా అర్థం చేసుకోవాలి.
పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలనే చర్చ, డిమాండ్‌ వినిపిస్తూనే ఉంది. ఇదే కనుక జరిగితే వినియోగదారులు చెల్లించే పన్నుశాతం భారీగా తగ్గుతుంది. కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారంలో ఉన్న పార్టీలు ఏవైనా కూడా ఇందుకు సుముఖంగా లేవు. ఈ పని చేసేందుకు సిద్ధంగా లేవు. ఇది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. వినియోగదారులను, ప్రజలను నిలువునా దోచుకునేందుకు, తమకు కావలసిన సొమ్మును నయానోభయానో ఏదోవిధంగా రాబట్టుకునే ఏ అవకాశాన్నీ ఈ ప్రభుత్వాలు వదులుకోవడం లేదనే వాస్తవాన్ని దేశ ప్రజలు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img