Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఇజ్రాయిల్‌`పలస్తీనా శాంతికి చైనా మధ్యవర్తిత్వం

సాత్యకి చక్రవర్తి

అమెరికా మధ్యప్రాచ్యంలో తన దౌత్య పోరాటాన్ని క్రమంగా కోల్పోతోంది. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు, దేశాల మధ్య సంధానకర్తగా వ్యవహరించడానికి మధ్య ప్రాచ్య దేశాలు చైనా వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇరాన్‌సౌదీ అరేబియాల మధ్య శాంతి ఒప్పందం అమలు, ఇజ్రాయిల్‌పలస్తీనాల మధ్య శాంతి చేకూర్చేందుకు చైనా తనదైన పాత్ర పోషిస్తోంది. ఈ నేపధ్యంలో చైనా విదేశాంగ మంత్రి ఇజ్రాయిల్‌, పలస్తీనా విదేశాంగమంత్రులతో ఫోన్‌లో మాట్లాడుతూ రెండు దేశాలమధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశాల మధ్య శాంతిని చేకూర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సౌదీ అరేబియాఇరాన్‌ మధ్య 2016లో బెడిసికొట్టిన దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి గత నెలలో చైనా మధ్యవర్తిత్వంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం యెమెన్‌లో జరుగుతున్న యుద్ధంలో నూతన శాంతి ప్రక్రియకు దోహదపడిరది. ఇరాన్‌సౌదీ అరేబియాల మధ్య సంబంధాలను పునరుద్ధరణలో చైనా విజయం సాధించడం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దౌత్యపరంగా విఫలమయ్యారు. సౌదీ అరేబియా అమెరికాకు ప్రధాన మద్దతుదారు. ఇరాన్‌, పశ్చిమ ఆసియా దేశాలకు వ్యతిరేకంగా సౌదీ అరేబియాకు అమెరికా మద్దతిస్తూ వచ్చింది.
చర్చల ద్వారా సౌదీ అరేబియాఇరాన్‌ల మధ్య విభేదాలను పరిష్కరించడంపై ఇజ్రాయిల్‌్‌ విదేశాంగ మంత్రి ఎలికోహెన్‌తో చైనా విదేశాంగ మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్‌పలస్తీనియన్ల మధ్య శాంతి చర్చలను తిరిగి ప్రారంభించడానికి తాము సిద్ధమని పేర్కొన్నారు. వీరిమధ్య చర్చల సులభతరం చేసే మూడవదేశంగా తాము వ్యవహరిస్తామన్నారు. పలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్‌ అల్‌ మల్కీతో చైనా విదేశాంగమంత్రి మాట్లాడుతూ, శాంతి చర్చల పునరుద్ధరణలో చైనా క్రియాశీల పాత్రకు సిద్ధంగా ఉందని, పలస్తీనా కూడా ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతంలో సంయమనం పాటించాలని సూచించారు. సమస్యను స్వల్పకాలంలో పరిష్కరించడం కష్టమని, సానుకూల దౌత్య మార్గాల ద్వారా పశ్చిమాసియా దేశాలతో చైనా చర్చలు, లాటిన్‌ అమెరికా దేశాలతో చైనా సాధించిన విజయాలు అమెరికా నిరంకుశత్వం కింద మగ్గుతున్న దేశాలు చైనాతో సంబంధాల కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. ఉదాహరణకు తైవాన్‌తో అన్ని సంబంధాలను తెంచుకోవడంతో కొలంబియాను చైనాను గుర్తించింది. క్యూబా విప్లవవీరుడు కాస్ట్రో నేతృత్వంలో కొలంబియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లాటిన్‌ అమెరికాలో అమెరికా దౌత్యానికి పెద్ద షాక్‌ అయింది.
200 సంవత్సరాల క్రితం మన్రో సిద్ధాంతాన్ని ప్రకటించింది. అప్పటి నుండి లాటిన్‌ అమెరికన్‌, కరేబియన్‌ దేశాల వ్యవహారాలను అమెరికా తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది. లాటిన్‌ అమెరికా దేశాల్లో జాతీయ, ప్రాంతీయ స్వాతంత్య్రం కోసం పెద్ద ఎత్తున విప్లవాలు జరిగాయి. పేద, అట్టడుగు వర్గాలు అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటించాయి. చివరికి స్వదేశీ ఉద్యమాలు, కార్మిక సమీకరణలు, ప్రగతిశీల, సామ్యవాద ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు, క్యూబాలో వామపక్ష ప్రభుత్వం 63 సంవత్సరాలుగా కొనసాగింది. అమెరికా రాజకీయపట్టు లాటిన్‌ అమెరికా దేశాల్లో బలహీనపడి ఉండవచ్చు, కానీ ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థలపై అమెరికా నియంత్రణ తీవ్రంగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అది ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించింది. ప్రస్తుతం ఇప్పుడు, బీటలువారుతున్నది. ప్రత్యేకించి, అమెరికా డాలర్‌ బలహీనపడుతోంది.
1944లో, 44 మిత్రదేశాలు తమ తమ కరెన్సీ, బంగారం విలువకు బదులుగా అమెరికా డాలర్‌ విలువతో పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. అప్పటి నుండి ప్రపంచంలోని వివిధ దేశాలు తమ రిజర్వ్‌ కరెన్సీల కోసం, విదేశీ వాణిజ్యం, బ్యాంకింగ్‌ లావాదేవీల కోసం అమెరికా డాలర్‌పై ఆధారపడి ఉన్నాయి. కానీ ఇప్పుడు, లాటిన్‌ అమెరికా దేశాలు డాలర్‌తో పోలిస్తే చెనా కరెన్సీ యువాన్‌తో వర్తకం చేస్తున్నాయి. లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద జనాభా కలిగిన దేశం బ్రెజిల్‌, గత వారం డాలర్‌కు బదులుగా యువాన్‌ కరెన్సీగా ఉపయోగించాలని నిర్ణయించుకుంది. బ్రెజిల్‌ మాదిరిగా ఇతరదేశాలు త్వరలో చైనాతో మెరుగైన వాణిజ్య సంబంధాలను కొనసాగించే అవకాశం ఉంది. అమెరికా చైనాపై భౌగోళికంగా, వ్యూహాత్మకంగా వాణిజ్య యుద్ధం కొనసాగిస్తోంది, అమెరికామధ్యప్రాచ్యం, ఇజ్రాయిల్‌ పలస్తీనాల మధ్య శాంతి చర్చలకు, మధ్యవర్తిత్వానికి చైనా చేపట్టిన చర్యలు సఫలమైతే, అమెరికా ఆధిపత్యానికి చెక్‌ పడినట్లే…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img