Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉక్రెయిన్‌లో అమెరికా, నాటో చిచ్చు

అజయ్‌ పట్నాయక్‌

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు యనుకోవిచ్‌ ప్రాణ భయంతో దేశం విడిచి పారిపోయే వరకు ఆయ నకు వ్యతిరేకంగా ప్రజలు హింసాయుత ఆందోళ నలు జరిపారు. 2013 చివరిలో ఒక విధమైన తిరుగుబాటే జరిగింది. ఈయూ, రష్యాల మధ్య వర్తిత్వంతో ప్రతిపక్షాలతో కుదిరిన ఒప్పందం మేరకు 2015 వరకు ఆగకుండా 2014 డిసెం బరులోనే ఎన్నికలు నిర్వహిస్తానని పార్లమెంటుకు గణనీయంగా అధికారాలను బదిలీ చేస్తానని యనుకోవిచ్‌ అంగీకరించి నప్పటికీ ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం యనుకోవిచ్‌ పారిపోయాక సద్దుమణి గింది. యనుకోవిచ్‌ను అధికారం నుండి దించివేయాలన్న పశ్చిమ దేశాల నిర్ణయాన్ని ప్రజాందోళన అమలు చేసింది. రష్యాకు దగ్గరగా ఉన్న ఏ ప్రభు త్వాన్ని పశ్చిమ దేశాలు అంగీకరించవు. చివరకు ప్రజలెన్నుకున్న ప్రభుత్వా లనూ దించేస్తాయి. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చ డానికి యనుకోవిచ్‌ను గద్దె దించారన్న ప్రచారాన్ని ప్రజలు విశ్వసించలేదు. 20102013 మధ్య కాలంలో యనుకోవిచ్‌ పశ్చిమ దేశాలకు దగ్గరగా ఉన్నాడు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) తో ఒప్పందం చేసుకోవ డానికీ అంగీకరించాడు. అయితే విల్నియస్‌లో ఈయూ తూర్పు భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు ఒప్పందం చేసుకోవడానికి యనుకోవిచ్‌ అంగీకరించలేదు. ఒప్పందం చేసుకొనే ముందు రష్యాను కూడా సంప్రదించా లని అన్నారు. ఈయూకు సన్నిహితం కావడానికి ముందు రష్యాను ఎట్టి పరిస్థితుల్లోనూ అలక్ష్యం చేయలేమన్నది యనుకోవిచ్‌ అభిప్రాయం. పశ్చిమ దేశాలకు అనుకూలుడైన యనుకోవిచ్‌ ఉక్రెయిన్‌ను విడిచిపెట్టే నాటికి బడ్జెట్‌లో 12 శాతం లోటు ఉంది. వేతనాలు, పెన్షన్లను అనేక నెలల నుండి చెల్లించలేదు. ఐఎంఎఫ్‌ రుణాలు ఇవ్వడానికి షరతులు పెట్టింది. ఈయూ అసోసియేషన్‌తో సన్నిహితంగా ఉంటేనే రుణాలు ఇస్తామని ఐఎం ఎఫ్‌ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌కు చౌకగా గ్యాస్‌ సరఫరా చేయాలని రష్యా మీద ఒత్తిడి చేస్తామని పశ్చిమ దేశాలు చెప్పాయి. అలాగే తాము 27 బిలి యన్‌ డాలర్ల రుణాన్ని కోరగా అవమానకరమైన షరతులతో 838 మిలియన్‌ డాలర్లను మాత్రమే ఇవ్వడానికి అంగీకరించాయి. దీనికి ఒక షతరు పెట్టాయి. ఐఎంఎఫ్‌తో కొత్త ఒప్పందం చేసుకుంటేనే ఇస్తామని పెట్టిన షరతు అంగీక రించదగింది కాదని యనుకోవిచ్‌ తెలిపారు. ఈ దశలో రష్యాతో మాట్లాడక తప్పలేదని వారు 15 బిలియన్‌ డాలర్ల దీర్ఘకాలిక రుణం, చౌకగా గ్యాస్‌ ఇవ్వడానికి అంగీకరించనట్టు ఆయన చెప్పారు. ప్రారంభంలో 3 బిలియన్‌ డాలర్ల ఉద్ధీపన రుణం ఇవ్వడానికి కూడా రష్యా అంగీకరించింది. అయితే ఉక్రెయిన్‌ నాయకత్వం మాత్రం ఈయూ నుంచి 800 మిలియన్‌ డాలర్లు మాత్రమే రుణం తీసుకోవడానికి సిద్ధపడ్డాయి. ఉక్రెయిన్‌ ఈయూ ఉచ్చులో పడకుండా చూడటమే రష్యా లక్ష్యం. ఈయూకు అనుకూలంగా ఉండటం పశ్చిమ దేశాలకు ఇష్టం లేదు. యనుకోవిచ్‌ పారిపోయిన తరవాత డాన్‌ బాస్‌లో అంతర్యుద్ధం జరుగుతున్న సందర్భంలో 2014లో ఎన్నికైన కొత్త అధ్యక్షుడు పురోషంకో రాజీ పడకుండా గట్టిగా నిలబడాలని అమెరికా, ఈయూ నాయకులు ఒత్తిడి చేశారు. ఉక్రెయిన్‌లో ప్రాంతాల విభజన ఉక్రెయిన్‌లో జాతీయవాదులు, పశ్చిమ దేశాలు కలిసి తూర్పు పశ్చిమ ప్రాంతాల విభజనకు పూనుకున్నారు. జాతీయవాదులు ఉక్రెయిన్‌లో రష్యన్‌ భాష మాట్లాడే ప్రాంతాన్ని గుప్పిట పెట్టుకున్నారు. వారి పట్ల వివక్ష చూపుతూ దాడులు చేశారు. జాతీయవాదులు, పశ్చిమ దేశాల అనుకూల శక్తుల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు అమెరికా తదితర దేశాలు పరోక్షంగా పనిచేశాయి. రష్యన్‌ భాష మాట్లాడే ప్రజలకు వ్యతిరేకంగా ప్రచారం సాగించారు. ఉక్రెయిన్‌ రాజకీయాలను ఐరోపాఅట్లాంటిక్‌ ప్రాంతం వైపు మళ్లించేందుకు పశ్చిమ దేశాలు జాతీయవాదులను ప్రోత్సహించాయి. అదే సమయంలో కీలకమైన యురేసియా ప్రాంతాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం కూడా పశ్చిమ దేశాల లక్ష్యం. ఈ ప్రాంతంలో రష్యా పలుకుబడిని నియంత్రించడమే పశ్చిమ దేశాల ప్రధాన లక్ష్యం. రష్యా పలుకుబడి పెరగకుండా ఆటంకపరి చేందుకే 1997 నుంచి అమెరికా తన విధానాలను రూపొందించుకుంది. అంతర్జాతీయంగా తనకు ఎదురు లేకుండా చేసుకోవాలన్నదే అమెరికా ఎత్తుగడ. అలాగే ఉక్రెయిన్‌, జార్జియాలలో ప్రభుత్వాలను మార్చివేయడం నాటో విస్తరణ అమెరికా దీర్ఘకాల వ్యూహం. 1997లో మాడ్రిడ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో తూర్పువైపు అంటే చెకోస్లోవేకియా, హంగెరి దేశాల వైపు విస్తరించాలని నాటో నిర్ణయించింది. ఆ నిర్ణయం ప్రకారమే ఇప్పుడు నాటో సభ్య దేశాల సంఖ్య 30కి పెంచుకున్నారు. ప్రపంచంపై పెత్తనం చేయాలన్న దుర్మార్గ ఆలోచనతో బెల్గ్రేడ్‌పై 78 రోజులు బాంబుల వర్షం కురిపించి 1999లో నాటో కొత్త సభ్యులను చేర్చు కొన్నది. ఐక్యరాజ్య సమితికి ఇచ్చిన హామీని సైతం ఉల్లంఘించి పశ్చిమ దేశాలు బెల్గ్రేడ్‌, అఫ్గానిస్తాన్‌, ఇరాక్‌, లిబియా, సిరియాలపై దాడులు చేశారు. సోవియట్‌ యూనియన్‌ సరిహద్దుల వరకు ఈయూ, నాటోలు విస్తరించాయి. 2007లో భద్రతపై జరిగిన మ్యూనిచ్‌ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడుతూ ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను కట్టడి చేయాలన్న ఆలోచనతోనే అమెరికా ఆ దిశగా అన్ని చర్యలు తీసుకొన్నది. మ్యూనిచ్‌ సదస్సులో చేసిన హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టి నాటోలో చేరవల సిందిగా జార్జియాను ఒత్తిడి చేశారు. ఇందుకు 2008లో ఆ దేశంలో ప్రజాభి ప్రాయాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చారు. 2019 ఫిబ్రవరి 7న ఉక్రెయిన్‌ రాజ్యాంగ సవరణకు ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపింది. నాటోలో చేరడం యూరోపియన్‌ యూనియన్‌ సభ్యత్వం తీసుకోవటం ఈ రాజ్యాంగ సవరణ లక్ష్యం. 2020 జూన్‌ 12న ఉక్రెయిన్‌ నాటోలో చేరేందుకు సిద్ధమయ్యింది. 2021 జూన్‌లో జరిగిన బ్రసెల్స్‌ శిఖరాగ్ర సమావేశంలో అంతక్రితం 2008లో బుకారెస్ట్‌ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాన్ని పున రుద్ఘాటిస్తూ ఉక్రెయిన్‌ తమ కూటమిలో భాగమవుతుందని నాటో నాయకులు ప్రకటించారు. 2021 సెప్టెంబరుఅక్టోబరు 1 మధ్య కాలంలో ఉక్రెయిన్‌ సైన్యం అమెరికా, నాటో దళాలతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించింది. రష్యాకు ఎట్టి పరిస్థితుల్లోను ఉక్రెయిన్‌ దగ్గర కాకూడదన్న పశ్చిమ దేశాల లక్ష్యం దాదాపు నెరవేరినట్టే.
తమకు ముందున్న ఎలిత్సిన్‌ వలె కాకుండా పుతిన్‌ యురేసియాను తమ దేశంలో భాగం చేసుకొని పశ్చిమ దేశాల ఎత్తుడగలను అరికట్టాలని నిర్ణయిం చారు. యురేసియా ఆర్థిక యూనియన్‌ (2015) సమష్టి భద్రతా ఒప్పంద సంస్థను (2002) ఏర్పాటు చేయడం ద్వారా యురేసియాతో సంబంధాలను పునఃస్థాపించారు. ఈ ప్రాంతంలో రష్యా తరవాత ఉక్రెయిన్‌ అత్యంత అభి వృద్ధి చెందిన దేశం. యురేసియా ఆర్థిక యూనియన్‌లోకి ఉక్రెయిన్‌ను తీసు కురావాలని రష్యా గట్టిగా ప్రయత్నించింది. యనుకోవిచ్‌ తటస్థ పాత్ర నిర్వ హించాలని భావించారు. రష్యా సరిహద్దుల్లోకి నాటోను విస్తరించాలని ప్రయ త్నించినపుడు వారి లక్ష్యాలను నెరవేర్చేందుకు చొరవ చూపలేదు. ఆయన దేశం విడిచి వెళ్లిపోయాక ఉక్రెయిన్‌ పశ్చిమ దేశాలకు దగ్గరయ్యింది. రష్యా సరిహద్దులకు నాటోను విస్తరించవచ్చునని పశ్చిమ దేశాలు భావించాయి. తొలి నుండి యురేసియాను తమ దేశ భూభాగంలో అంతర్భాగం చేసు కోవాలని రష్యా నిర్ణయించింది. అయితే ఆర్థిక, భద్రత సమస్యల వల్ల అస్థిరీ కరణ సమస్యలు ఎదురయ్యాయి. అలాగే మధ్య ఆసియా, అఫ్గానిస్తాన్‌లలో తీవ్రవాదం ముప్పు కారణం కూడా రష్యా ప్రయత్నాలకు ఆటంకమైంది. సోవి యట్‌ యూనియన్‌లో ఉన్న రిపబ్లిక్‌లను విలీనం చేయాలన్న రష్యా ప్రయత్నం ఫలించలేదు. పశ్చిమ దేశాలు జార్జియా, ఉక్రెయిన్‌లలో ప్రభుత్వాలను మార్చి వేయగలిగాయి. ఉక్రెయిన్‌లో రెండు ప్రాంతాల మధ్య ఘర్షణలు స్పష్టంగానే ఉన్నాయి. 2013 నవంబరులోనే నిరసనాందోళనలు ప్రారంభమయ్యాయి. అమెరికా తమ రాయబారి ద్వారా ఆందోళనకారులకు సహకరించింది.
2014లో జరిగిన సంఘటనలు ఉక్రెయిన్‌లో కీలక మార్పుకు నాంది పలికాయి. ఐరోపా అనుకూల శక్తులను పశ్చిమ దేశాలు ప్రోత్సహించడమే కాక హింసాత్మక మార్గాలను అవలంబించే కుహనా జాతీయవాదులకు కూడా సహాయం చేశాయి. ఈ దశలోనే రష్యా భాష మాట్లాడే ప్రజలను తమకు అనుకూలంగా మారవల్సిందిగా కుహనా జాతీయవాద శక్తులు తీవ్రంగా ఒత్తిడి చేశాయి. ఉక్రెయిన్‌లో పశ్చిమ దేశాలు, రష్యా జోక్యం చేసుకొన్న తరవాత రెండు ప్రాంతాల మధ్య తీవ్ర అగాధం ఏర్పడిరది. ఉక్రెయిన్‌లో యుద్ధం ముగిసినప్పటికీ రెండు ప్రాంతాల మధ్య విభేదాలు కొనసాగుతాయి.
వ్యాస రచయిత జెఎన్‌యు రిటైర్డ్‌ ప్రొఫెసర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img