Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కర్ణాటకపై బీజేపీలో కలవరం

అరుణ్‌ శ్రీవాత్సవ

రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ, జేడీ(ఎస్‌) మధ్య పోటీ ఉంటుంది. మొదటిసారిగా పోటీచేసేందుకు టిక్కెట్లకోసం పోటీ ఎక్కువగా ఉంది. ఈ విషయంలో బీజేప కంటే కాంగ్రెస్‌లో టిక్కెట్లకోసం పోటీ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ సభలకు జనం భారీగా వస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ముఠాతగాదాలతో సతమతమవు తోంది. ముఠాల నాయకులను పిలిపించి అమిత్‌ బహిరంగంగానే మందలించిన విషయం తెలిసిందే. పట్టణప్రాంతాల్లో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య గట్టిపోటీ ఉంటుంది. ఇక మాండ్య, హసన్‌, మైసూరు, తుమ్కూర్‌, కోలార్‌ జిల్లాల్లో జేడి(ఎస్‌) పట్ల ప్రజాదరణ ఉంది. అయితే ఈ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఆదరణ ఉందని చెప్పలేం.

రాహుల్‌గాంధీ భారత్‌ జోడోయాత్ర కర్ణాటకలో నిర్వహించేవరకు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయం అన్న విశ్వాసంతో బీజేపీ ఉంది. ఇప్పుడు పరిస్థితి మారింది. దాదాపు తొమ్మిదేళ్లపాటు విద్వేషపూరిత రాజకీయాలను బలోపేతంచేసిన బీజేపీ ఈసారి ఎన్నికల్లో బోల్తా పడవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాహుల్‌యాత్ర తర్వాత విద్వేషం, ముస్లింలపై వేధింపులు తగ్గుముఖం పట్టాయి. మారిన పరిస్థితులతో బీజేపీ అంతర్గత కుమ్ములాటలు కొంపముంచేట్టున్నాయి. ప్రధాని మోదీ ఇప్పటికే మూడుసార్లు కర్ణాటకలో పర్యటించారు. ఈసారి అభివృద్ధి, పురోగతి మంత్రాలను మోదీ జపిస్తున్నారు. ఇక హోం మంత్రి అమిత్‌షా ఇప్పటికే ఆరుసార్లకు తక్కువలేకుండా రాష్ట్రంలో పర్యటించి రాష్ట్ర బీజేపీ నాయకుల మధ్య కుమ్ములాటలను పరిష్కరించడానికి శాయశక్తులా ప్రయత్నించారు. రాష్ట్ర నాయకులు అంతర్గత తగాదాలను పక్కన బెట్టాలని లేకపోతే తగినమూల్యం చెల్లిస్తారని కూడా అమిత్‌ షా హెచ్చరించి వెళ్లారని వార్తలు వచ్చాయి. జోడోయాత్ర మత విద్వేషాన్ని తగ్గించి, అతివాద జాతీయతను మిళితంచేసే అభివృద్ధి ప్రచారంలాంటి క్రూర రాజకీయాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. రాహుల్‌ యాత్రకు మంచి స్పందన కనిపించింది. ఈ నేపధ్యంలో మరో 70 రోజుల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్‌ ఇప్పటికే రెండు బస్సుయాత్రలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకొనేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసింది. సిఎల్‌పి నాయకుడు సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు విడివిడిగా బస్సుయాత్రలు నిర్వహించారు.బీజేపీ పాలనలో విద్వేష రాజకీయాలు, హిజాబ్‌ సమస్య విషయంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్థలు సాగించిన విధ్వంసకాండ, ‘కమిషన్‌ ప్రభుత్వం’గా పేరుపొందినందున రాష్ట్ర ప్రజలు అధికారపార్టీ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులపై బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రత్యేకించి నరేంద్రమోదీ, అమిత్‌ షాలు కలవరపడుతున్నారు. అందువల్లనే అప్పర్‌ భద్ర ప్రాజెక్టును న్యాయ విరుద్ధంగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, బడ్జెట్‌లో 5వేల కోట్ల రూపాయలకుపైగా కేటాయించారు.
ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పల మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. అంతర్గతంగా రెండు గ్రూపులు ఒకరినొకరు దెబ్బతీయడానికి రెడీగా ఉంటారు. ఇప్పటి ప్రభుత్వం అవినీతి పాలనకు మారుపేరు అన్నది విస్తృతంగా ప్రచారమైంది. బొమ్మైపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోయిందని గ్రహించినందున ఎన్నికలలో పార్టీ వ్యవహారాల నిర్వహణకు ఇద్దరు కేంద్ర మంత్రులను రంగంలోకి దింపారు. అవినీతి, మత రాజకీయాలు విస్తృతమైన అభివృద్ధిని, ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోలేదన్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ నాయకత్వం ఎలాంటి వ్యూహాన్ని రూపొందించు కోలేదు. హుబ్బలిళో జాతీయ యూత్‌ఫెస్టివల్‌ను ప్రారంభించిన మోదీ లంబని తెగవారికి భూమిహక్కు పత్రాలు పంపిణీ చేశారు. బెంగళూరులో భారత ఇంధనవారోత్సవం 2023న ప్రారంభించారు. తముకూర్‌లో హెచ్‌ఏఎల్‌ హెలికాప్టర్‌ దిగేందుకు అవసరమైన సౌకర్యంకోసం, జల్‌జీవన్‌ మిషన్‌ తదితర కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటికి రూ.2750 కోట్లు ప్రకటించారు. ఈసారి ఎన్నికల కమిషన్‌ గోడలమీద ఎన్నికల చిహ్నాలు, బ్యానర్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయకుండా నిషేధించడం మంచి పరిణామంగా చెప్పవచ్చు. అలాగే లౌడ్‌స్పీకర్లు పెట్టి వాహనాల ద్వారా ప్రచారంపై కూడా ఆంక్షలు పెట్టారు. ఇది ప్రజలకు పెద్ద ఉపశమనమే.
రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ, జేడీ(ఎస్‌) మధ్య పోటీ ఉంటుంది. మొదటిసారిగా పోటీచేసేందుకు టిక్కెట్లకోసం పోటీ ఎక్కువగా ఉంది. ఈ విషయంలో బీజేప కంటే కాంగ్రెస్‌లో టిక్కెట్లకోసం పోటీ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ సభలకు జనం భారీగా వస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ముఠాతగాదాలతో సతమతమవు తోంది. ముఠాల నాయకులను పిలిపించి అమిత్‌ బహిరంగంగానే మందలించిన విషయం తెలిసిందే. పట్టణప్రాంతాల్లో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య గట్టిపోటీ ఉంటుంది. ఇక మాండ్య, హసన్‌, మైసూరు, తుమ్కూర్‌, కోలార్‌ జిల్లాల్లో జేడి(ఎస్‌) పట్ల ప్రజాదరణ ఉంది. అయితే ఈ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఆదరణ ఉందని చెప్పలేం. గత ఎన్నికల్లో గెలిచిన అన్ని నియోజకవర్గాల్లో జేడీ(ఎస్‌) అభ్యర్థులను నిలుపుతుంది. గతంలో ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 58సీట్లు గెలుచుకొంది. ఈ సారి 150 సీట్లకు పోటీ చేయాలని భావిస్తోంది. ఆ పార్టీ నాయకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ ఇంటనే కుటుంబసభ్యుల మధ్య తీవ్రమైన గొడవలు, చీలికలు ఉన్నాయి. దేవెగౌడ కుమారుడు, పార్టీ ప్రముఖ నాయకుడు కుమారస్వామితో కలిసి వచ్చేవారు తక్కువ. మళ్లీ మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందడానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థలు గట్టి ప్రయత్నమే చేశాయి, చేస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల పర్యవేక్షణకు ఇద్దరు కేంద్ర మంత్రులు విద్యాశాఖ సహాయమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌(ఇన్‌ఛార్జి) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, తమిళనాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.అన్నామలైలను ప్రకటించారు. ఈ సారి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు బొమ్మైకు అండగా నిలిచే అవకాశం లేదు. ఈ పరిస్థితులన్నీ ఎన్నికల్లో బీజేపీకి ప్రమాద సూచికలుగా కనిపిస్తున్నాయి. ఈసారి వెనుకబడిన తరగతులు, ముస్లింలు, ఎస్‌సీలు అత్యధికంగా కాంగ్రెస్‌పై సానుకూలంగా ఉన్నారు. గతంలో జేడీఎస్‌కు లభించిన ఓట్లలో గణనీయంగా కాంగ్రెస్‌కు బదిలీఅయ్యే అవకాశా లున్నాయి. గత ఎన్నికల్లో కనీసం 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను బీఎస్‌పీ దెబ్బతీసింది. ఈసారి అలాంటి పరిస్థితిలేదు. ఈసారి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం విశేషమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img